239 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 27
నానావిచార సుశ్రాన్తో ధీరో విశ్రాంతి మాగతః|
నా కల్పతే న జానాతి నా శృణోతి పశ్యతి||
మనోబుద్ధుల తాదాత్మ్యం నుండి విడిపడి తనలోని భావాలను సాక్షిగా చూస్తూ శాంత స్వరూపంగా జీవించే జ్ఞాని దీనిని ఆలోచించడు, తెలుసుకోడు, వినడు, చూడడు.
అనంతము దివ్యము అయిన ఆత్మానుభవం మనోబుద్దుల తర్కానికి అతీతమైనది. ఈస్థితి బుద్ధితో అర్థం చేసుకునే సిద్ధాంతము కాదు .ధ్యానములో బుద్ధుని అధిగమించినప్పుడు భావ రహిత నిశ్చల స్థితిలో అనుభవం అయ్యే పరమ సత్యం. పరిపూర్ణము ఆనందమయం అయిన స్తితిని చేరగలిగిన యోగి ఎన్నటికీ తిరిగి ద్వందాలతో పాపాలతో నిండిన మనః పరిధిలోనికి రాజాలడు.
అహంకారం అంతరించడంతో అతనిలో కర్తనని గాని భోక్తనని కానీ భావాలు ఉండవు. కాబట్టి అతడు ఆలోచించడు తెలుసుకోడు వినడు చూడడు. అహంకారము మాత్రమే మనోబుద్దులతో శరీరంతో తాదాత్మ్యం చెందుతూ వ్యక్తిగా కర్మలను ఆచరిస్తున్నాను అని, ఫలితాలను అనుభవిస్తున్నానని అనుకుంటుంది. అహంకార రూపమైన నేను ఉన్నప్పుడే ఆలోచించడము, తెలుసుకోవటం, చూడడం, వినడము సంభవం అవుతాయి. అహంకారం అంతరించటంతో ఈ కర్మలన్నీ అంతమైనట్లే .జ్ఞాని అనంతమైన ఆత్మ స్వరూపంగా పరిపూర్ణ శాంతితో నిత్యము కేవలుడై ఆనంద స్వరూపుడై ఉంటాడు.🙏🙏🙏
No comments:
Post a Comment