మళ్ళీ ఎప్పుడొస్తావ్...
విధి కొన్ని క్షణాల మీద ఆధారపడిఉంటుంది...
విధిని కాదనలేం,
విధిని అనివార్యంగానే ఆహ్వానించాలి.
లాటిన్ బాషలో “ఆమోర్ ఫాతీ” అంటారు..
విధిని ప్రేమించడం అన్నమాట!
జీవితంలోని ప్రతిదీ
కార్యకారణ సంబంధమే
బుద్ధుడు దాన్ని “ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం” అన్నాడు.
ఆ సిద్ధాంతం నుండే పుడుతుంది
ఒక మైండ్‌ఫుల్‌నెస్ భావన
ప్రతి క్షణంలో ఉన్న సాక్షిగా ఉండే అనుభూతి.
కాలం మరిపింపచేసిన స్మృతులు
మళ్ళీ చిగురిస్తే?
ప్రేమనో, దుఃఖమో కలిగించక మానవు...
అవి మనసును పరిపరివిధాలుగా వేదిస్తాయి...
మరి ఆ సతాయింపులోనే
దయతో వేడుకుంటుంటాను
మళ్ళీ ఎప్పుడొస్తావ్... అని!
నువ్వొచ్చినప్పుడు
ఒక నదిని,
ఒక పిట్ట గూడు,
ఒక కందిలి,
పిడికెడు జ్ఞాపకాల మూట,
ఒక కడ్డీ తంత్రిని తీసుకురా!
వెన్నెల తెరచాప మీద
అంతంలేని గీతం పాడుకుంటూ
తూలిపోదాం...
— డా. తుమ్మల దేవరావ్, నిర్మల్
నా జెన్ కవితలు నుండి 🌸
No comments:
Post a Comment