అందరూ సమానమే.. కానీ!
గుడి తలుపులు తెరుచుకున్నప్పుడు
అందరి కళ్ళలోనూ ఒకటే ఆశ..
అందరి చేతుల్లోనూ ఒకటే నమస్కారం..
దేవుడి దృష్టిలో మేమంతా మట్టి బొమ్మలమే
కానీ.. ఈ మనుషుల దృష్టిలోనే తేడా!
క్యూలైన్లో గంటల తరబడి
కాళ్ళ నొప్పులతో నిలబడే వాడు
సామాన్యుడైన భక్తుడు..
కారు దిగి మెట్లెక్కకుండానే
గర్భాలయం లోపలికి వెళ్లేవాడు
సెలబ్రిటీ అనే దేవుడు!
హారతి వెలుగులో..
ఆ దేవుడికి అందరి ముఖాలూ ఒకటేలా కనిపిస్తాయి.
కానీ అక్కడ పహారా కాసే మనుషులకు మాత్రం
సామాన్యుడు 'జనం'లా కనిపిస్తాడు..
సెలబ్రిటీ 'ధనం'లా కనిపిస్తాడు!
శాస్త్రాలు చెబుతాయి "సర్వం సమానం" అని
ధర్మం చెబుతుంది "అందరూ ఒకటే" అని
కానీ దేవుడి గడప దగ్గర మాత్రం..
అందరూ సమానమే..
కానీ ఆ 'సెలబ్రిటీలు' మాత్రం కొంచెం ఎక్కువ సమానం!
Bureddy blooms.
No comments:
Post a Comment