కన్యత్వం అమ్మాయి Purity కాదు మగాడి Ego | Exposed Telugu
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rPEG7bulXrI
Transcript:
(00:03) అసలు ఈ కన్యత్వం అనే పదం వెనకున్న అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా మనం ఒక సొసైటీగా ఎంత ఎదిగిపోయామ అని చెప్పుకుంటాం కానీ ఒక ఆడపిల్ల క్యారెక్టర్ ని ఒక అంగుళం కూడా లేని ఒక చిన్న టిష్యూ ముక్క డిసైడ్ చేస్తుందంటే మనం ఇంకా రాతి యుగంలోనే ఉన్నామ అని అర్థం. అసలు ఈ హైమెన్ అనేది ఒక స్త్రీకి ఉండే ఒక ఫిజికల్ పార్ట్ మాత్రమే.
(00:24) సైన్స్ చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది అది సైక్లింగ్ వలనో ఎక్సర్సైజ్ వలనో లేదా చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడడం వల్లనో కూడా చిరిగిపోవచ్చు అని కానీ మన ఊళ్ళల్లో మన ఇళ్లల్లో పెళ్లి చూపుల దగ్గర నుంచి శోభనం గది దాకా ప్రతి చోట ఆ ఒక్క చుక్క రక్తం కోసం వెతికే కళ్ళు ఉన్నాయి చూసారా అదే నిజమైన క్రూరత్వం.
(00:45) ఒక మనిషి మనసు ఎలా ఉంది ఆమె ఆలోచనలు ఏంటి ఆమె సంస్కారం ఏంటి అని చూడడం మానేసి కేవలం ఒక ఫిజికల్ మార్క్ ను బట్టి ఆమెను జడ్జ్ చేయడం అనేది పెద్ద మూర్ఖత్వం. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం స్త్రీని గౌరవిస్తామని కానీ నిజానికి మనం ఆమెను ఒక వస్తువులా చూస్తున్నాం. [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కారు కొన్నప్పుడు దాని సీట్లకున్న ప్లాస్టిక్ కవర్లు తీయకపోతే ఎలా ఉంటుందో అలా ఒక భ్రమలో బతుకుతున్నాం.
(01:11) ఆ ప్లాస్టిక్ కవర్ ఉంటేనే అది కొత్త కారు అన్నట్టు ఆ టిష్యూ ఉంటేనే ఆమె ప్యూర్ అని ఫిక్స్ అయిపోయాం. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. అసలు మగవాడికి ఇలాంటి ప్యూరిటీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? వాడు పెళ్లికి ముందు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా ఎంతమందితో తిరిగినా వాడికి ఏ టిష్యూ అడ్డు రాదు. ఎందుకంటే బయాలజీ వాడికి ఆ వెసులుబాటు ఇచ్చింది కనుక.
(01:34) మరి బయాలజీ ఇచ్చిన ఒక చిన్న శారీరక నిర్మాణాన్ని పట్టుకొని ఆడపిల్లని హింసించడం ఏ రకమైన న్యాయం? ఒక మగాడికి నేను కట్టుకున్న భార్య నాకంటే ముందు వేరేవాడికి దక్కలేదు అని గర్వంగా చెప్పుకోవాలనుకునే ఆ అహంకారం ఉంది చూశరా దానినుంచే ఈ కన్యత్వం అనే కాన్సెప్ట్ పుట్టింది. అంటే ఆమె ఒక మనిషి కాదు ఒక ఆస్తి ఆ ఆస్తికి సీలు ఉందా లేదా అని చూసే ఒక యజమాని మనస్తత్వం ఇది.
(01:56) మనం ఎంతసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం కానీ అసలు ఈ ప్యూరిటీ అనే పదానికి డెఫినిషన్ ఏంటి? ఆలోచనల్లో స్వచ్ఛత లేనివాడు ఎదుటి మనిషిని గౌరవించడం తెలియనివాడు కేవలం శరీరం మీద ఉండే ఒక పొరను బట్టి ప్యూరిటీని డిసైడ్ చేసేవాడు అసలు ప్యూర్ అని ఎలా అనిపించుకుంటాడు ఇక్కడ సమస్య హైమన్ కాదు సమస్య మన మెదళ్ళలో ఉన్న మురికి ఒక అమ్మాయి తన జీవితంలో ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు లేదా ఎవరినో ప్రేమించి ఉండొచ్చు లేదంటే కేవలం ఒక యాక్సిడెంట్ వల్ల ఆ పొర కోల్పోయి ఉండొచ్చు.
(02:26) దానికి ఆమె క్యారెక్టర్ కి సంబంధం ఏంటి? ఒకవేళ ఒక అమ్మాయికి ఆ పొర ఉండి ఆమె ఆలోచనలన్నీ కుళ్లిపోయి ఉంటే అప్పుడు ఆమెను గొప్పది అంటారా లేదు కదా మరి ఆ ఒక్క చిన్న విషయం దగ్గరే ఎందుకు ఆగిపోతున్నారు ఈ సమాజం ఎంత దారుణంగా ఉందంటే పెళ్లైన మొదటి రాత్రి బెడ్ షీట్ మీద రక్తం పడకపోతే ఆమెను అనుమానించే భర్తలు అత్తమామలు ఇంకా ఉన్నారు. ఆ రక్తం పడకపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు అని సైన్స్ నెత్తి నోరు మొత్తుకుంటున్న వీళ్ళు వినరు.
(02:52) ఎందుకంటే వీళ్ళకి సైన్స్ కంటే వాళ్ళ అహంకారమే ముఖ్యం. కన్యత్వం అనేది ఒక బహుమతి అది భర్తక ఇచ్చే గొప్ప కానుక అని సినిమా డైలాగులు రాస్తారు. అసలు ఒక మనిషి శరీరం ఇంకో మనిషికి కానుక ఎలా అవుతుంది? ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, తోడు ఉండాలి. ఇవి కదా అసలైన కానుకలు. కానీ మనం వీటిని వదిలేసి శరీరం చుట్టూ కథలు అల్లుతున్నాం. ఒక ఆడపిల్ల తన ప్రాణం కంటే ఎక్కువగా ఆ టిష్యూని కాపాడుకోవాలని చిన్నప్పటి నుంచి నూరి పోస్తాం.
(03:18) అంటే ఆమె ప్రాణం కంటే ఆ చర్మం ముక్కే ఎక్కువ అన్నమాట. దీనివల్ల ఆడపిల్లల్లో ఒక రకమైన భయం ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. రేపు పొద్దున పెళ్లయ్యాక నా భర్త ఏమనుకుంటాడో నా మీద ఏ ముద్ర వేస్తాడో అని భయపడే పరిస్థితి కల్పించాం. ఇది ఒక రకమైన మానసిక అత్యాచారం కూడా. ఈ భయం వల్లనే ఈ రోజుల్లో హైమెనోప్లాస్టీ లాంటి సర్జరీలు పెరిగిపోతున్నాయి.
(03:40) అంటే కేవలం సమాజాన్ని మోసం చేయడానికి ఆ [సంగీతం] ఒక్క రాత్రి రక్తం చిందించడానికి అమ్మాయిలు వేల రూపాయలు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకుంటున్నారు. అంటే మనం ఒక అబద్ధాన్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నామో చూడండి. మనం నిజాయితిని కోరుకోవడం లేదు మనం కేవలం మన కళ్ళకి కనిపించే ఒక భ్రమను కోరుకుంటున్నాం అంతే అది చాలు మగాడి ఈగోని సాటిస్ఫై చేయడానికి ఒక కామన్ మ్యాన్ గా నేను అడుగుతున్నాను.
(04:02) రేపు పొద్దున నీ కూతురికో లేదా నీ చెల్లికో ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏం చేస్తావ్ ఆమె క్యారెక్టర్ ని ఆ ఒక్క చుక్క రక్తం పెట్టి డిసైడ్ చేస్తావా లేదు కదా మరి ఇంకొకరి ఇంటి అమ్మాయి విషయంలో ఈ రూల్ ఎందుకు మారుతుంది? మనం ఎంతసేపు పక్కోడి పెళ్ళాం కన్యగా ఉందా లేదా అని చర్చలు పెట్టడం మానేసి మన ఆలోచనలు ఎంత కన్యగా అదే ఎంత ప్యూరిటీతో ఉన్నాయో చూసుకోవాలి.
(04:22) [సంగీతం] ఒక మనిషికి ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు ఉంది. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే ఆమె చెడిపోయినట్టు పాల్గొనకపోతే పవిత్రమైనట్టు సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం ఈ సమాజానికి ఎవరిఇచ్చారు? ఇదంతా మగవాడు రాసుకున్న స్క్రిప్ట్ తనకు కావాల్సినట్టు ఆడదాన్ని మలుచుకోవడానికి వాడు క్రియేట్ చేసిన ఒక పెద్ద ట్రాప్ ఇది. ఈ ట్రాప్ లో పడి ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి మానసికంగా మనం మారుతున్నామని అనుకుంటున్నాం కానీ ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనల దగ్గరే ఆగిపోయాం.
(04:52) ఒక అమ్మాయి మోడర్న్ బట్టలు వేసుకుంటే ఆమె విర్జిన్ కాదని చీర కట్టుకునే పద్ధతిగా ఉంటే ఆమె విర్జిన్ అని జడ్జ్ చేసే మనుషులు కూడా ఉన్నారు. బట్టలకి శరీరానికి క్యారెక్టర్ కి అస్సలు సంబంధం లేదు. ఇవన్నీ ఒకదానికిఒకటి లింక్ పెట్టి మనం ఒక కాంప్లెక్స్ ప్రపంచాన్ని సృష్టించాం. [సంగీతం] అసలు ఒక మనిషి తన శరీరంతో ఏం చేసుకోవాలి అనేది ఆమె ఇష్టం అది ఆమె ప్రైవసీ ఆ ప్రైవసీలోకి తొంగి చూడడం అనేది ఒక రకమైన సాడిజం ఈ కన్యత్వం అనే భ్రమ నుంచి మనం ఎప్పుడు బయట పడతామో అప్పుడే మనం నిజమైన మనుషులం అవుతాం.
(05:21) లేకపోతే మనం కేవలం మాంసపు ముద్దలని చూసే మృగాలం మాత్రమే ఈ సమాజం కళ్ళు తెరవాలి. ఒక చిన్న టిష్యూని పట్టుకొని వేలాడడం మానేసి ఒక మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి. అందరికీ ఫ్రెష్ గా ఉన్న అమ్మాయినే కావాలంటే నువ్వే అమ్మాయిగా మారిపోవాలి. ఇక్కడ ఏదైనా ముందు నేనే చేయాలి అనే కాన్సెప్ట్ ని కోడి బుర్రలో నుంచి తీసేస్తే అందరూ కన్యగానే కనిపిస్తారు.
(05:43) ఒకవేళ కన్యగా ఉన్న దాని వల్ల ఏమైనా వచ్చిందా నీకు లేదా ఏమైనా నష్టం జరిగిందా?
No comments:
Post a Comment