Tuesday, April 21, 2026

మఠంలో మళయాళ స్వామికి అవమానం? ఏం జరిగింది?#satyanandiraju #sanatandharma #hindu #ytviral #devotional

మఠంలో మళయాళ స్వామికి అవమానం? ఏం జరిగింది?#satyanandiraju #sanatandharma #hindu #ytviral #devotional

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_ijQeqrVc_g



Transcript:
(00:00) మలయాళ స్వామి వారు ఒకసారి గోగర్భంలో తపస్సు చేసుకుంటూ ఉంటే కుంభవృష్టి కురిసింది. అంటే తిరుమల లో ఉన్న అన్ని తీర్థాలు కూడా పొంగి పొర్లిపోయినాయి ఆ రోజుల్లో పుష్ప కైంకర్యం చేసే ఒక వ్యక్తి వచ్చి మలయాళ స్వామి వారికి ప్రసాదం ఇచ్చేవాడు అంటే భోజనంగా మరి ఇంత తీర్థాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటే ఎట్లా ఇస్తాడో ఆయన భోజనం ఇవ్వలేకపోయాడు.
(00:30) మలయాళ స్వామి వారికి ఒక్క గింజ కూడా లేదు తినడానికి అలా మూడు రోజులు కఠినమైనటువంటి ఉపవాసం ఉన్నారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఎట్లా ఆయన రక్షింపబడ్డారో తెలిసి మీ ఒళ్ళు జలధరిస్తుంది అలాగే మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా శశీరంతో లేని వారు ఎట్లా మనల్ని రక్షిస్తారు ఎట్లా మనల్ని కాపాడతారు ఎలా ఉద్ధరిస్తారు అని ఆ ప్రశ్నకు సమా సమాధానం మలయాళ స్వామి వారి జీవితంలో జరిగింది.
(01:03) అది కూడా తిరుమలాలోనే ఇలాంటివి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇవాళ వారి గురించి సత్సంగం చేసుకుందాం. అసలు వారి నిజమైన పేరు ఏమిటో నాకు నిన్నటిదాకా తెలియదు. వారి సన్యాస నామం కూడా మలయాళ స్వామి వారు కాదు మరి వారి అసలు పేరు ఏమిటి? అలాగే సన్యాసా ఆశ్రమం పేరు ఏమిటి? అవన్నీ కూడా ఇవాళ మనం ముచ్చటించుకుందాం. ఇక్కడ నాకు ఒక రెండు చిన్న మనవులు ఉన్నాయి ఏమిటంటే మన సత్సంగంలో పాల్గొన్న వారు దాదాపు 50 శాతం పైగా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు.
(01:40) వారికి నా మనవి ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నాకు ఇంకా చాలా వినూతనమైన సత్సంగాలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే టీవీలో కొంతమంది చూసేవారు ఉంటారు మన సత్సంగాలు అలాంటి వారు గబుక్కున లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం కష్టతరమైందే కానీ మీకు మొబైల్స్ లో ఖచ్చితంగా YouTube అకౌంట్ ఉంటుంది కాబట్టి టీవీలో ఎవరు చూస్తున్నారో మీ మొబైల్స్ లో మన సత్సంగాన్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి.
(02:18) సరేనా ఇవాళ సత్సంగంలో మలయాళ స్వామి వారి గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకుని వారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందేద్దాం సరేనా ఇంకెందుకు ఆలస్యం పదండి కేరళలో గురువాయూరు గురించి తెలియని వారు ఉంటే ఎవరు ఉండరు చిన్ని శ్రీకృష్ణుని దివ్య క్షేత్రం స్వామి వారు చాలా చాలా బాగుంటారు. అక్కడికి దగ్గరలోనే ఎంగంజూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది.
(02:49) పచ్చని పొలాలు చాలా బాగుంటుంది. ఆ గ్రామంలో కరియప్ప నొట్టి అమ్మ అని ఒక దంపతులు ఉండేవారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం అయినా కూడా ఈ సాధు సత్పురుషులని ఆదరించడం. రోజూ కూడా భారతం భాగవతాల్ని వల్లివేయడం. ఇటువంటి సదాచారమైనటువంటి కుటుంబం. వారికి అప్పటికే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నారు 1885 మార్చి 29 చైత్రసుద్ధ ఏకాదశి నాడు ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు ఎవరో కాదు మన మలయాళ స్వామి అసలు పేరు ఏమిటి అంటే వేలప్ప తల్లిదండ్రులు పెట్టిన పేరు వేలప్ప ఒక చిన్న విచిత్రం చెప్తాం
(03:39) మన ఇళ్లల్లో చూస్తూ ఉంటాం పసిపిల్లలు ఎవరైనా ఉంటే వారు పడుకోవడమే ఒక మనకి ఒక ఛాలెంజ్ ఆ పిల్లవాడికి లేదా పిల్లకి పక్క కుదరాలి ఇటు దొర్లుతారు అటు దొర్లుతారు ఎప్పటికో గాని పడుకోరు వారు పడుకున్నారు అంటే ఊరంతా పడుకున్నట్టే అది తల్లికి కానీ తండ్రికి కానీ ఒక పెద్ద అగ్ని పరీక్ష సరే ఈ వేలప్ప మెత్తటి పక్కమీద పడుకున్న కూడా నిద్రపోయేవాడు కాదు ఏడ్చేవాడు ఎవరైనా కూడా మెత్తటి పక్క లేకపోతే ఏడుస్తారు వేలప్ప విచిత్రంగా ఏమిటంటే ఈ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు మెత్తటి పక్క
(04:25) మీద పడుకోవడానికి ఇబ్బంది పడేవాడు అటు దొర్లేవాడు ఇటు దొర్లేవాడు ఏడ్చేవాడు ఆ దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి ఎప్పుడైతే కటిక నేల మీదకు చేరేవాడో అప్పుడు కునుకుపట్టి పడుకునేవాడు చూసేవారికి కి వింతగా ఉండేది ఇదెక్కడ పిల్లవాడుని ఒక బైరాగి ఇంటికి వచ్చినప్పుడు ఈ సంఘటనను గమనించి ఆనాడే చెప్పాడు తల్లిదండ్రులతో మీ పిల్లవాడు మామూలువాడు కాదు సర్వ సంఘ పరిత్యాగి అయ్యి తీరుతాడు అని చెప్పి ఆశీర్వదించాడు ఆఖరికి అదే నిజమే సరే ఐదేళ్లకి విద్యాభ్యాసం జరిగింది చక్కగా స్కూల్ కి వెళ్ళేవాడు బ్రహ్మాండంగా చదువుకునేవాడు ఏకసంతాగ్రహి మంచి తెలివితేటలు గల పిల్లవాడు వేలప్ప
(05:10) మనం కాసేపు వేలప్ప అని పిలుచుకుందాం మలయాళ స్వామి వారు ఎప్పుడు ఎవరు ఆ పేరు పెట్టారో ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పటి నుంచి పిలుచుకుందాం మళ్ళీ మలయాళ స్వామి వారు అని సరే ఒకసారి ఏం జరిగింది అంటే వింత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు దారిలో పక్షుల్ని అమ్మే ఒక వ్యక్తిని చూశాడు చూడంగానే ఆ స్కూల్ బ్యాగ్ అక్కడ పారేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు పక్షులు అమ్మే వ్యక్తికి అర్థం కాలా ఎందుకు నన్ను చూసాడు ఈ పిల్లవాడు పారిపోతున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి దగ్గర డబ్బులు అడిగి తీసుకుని తిరిగి వచ్చి ఆ పక్షులు అమ్మే వ్యక్తికి ఇచ్చేసి ఆ
(05:48) పక్షులన్నీ తాను తీసుకుని ఆకాశంలోకి విడుదల చేశాడు. అంతటి జీవకారుణ్యం చిన్నప్పటి నుంచే ఉంది వేలప్పకి ఒక్కోసారి ఏం చేసేవాడు అంటే తన తోటి పిల్లలతో ఆడుకునేవాడు కాదు పరధ్యానంగా ఎక్కడైనా మూల కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఒకసారి అలా ఒక మందిరంలో దూరంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇల్లంతా కూడా వెతుక్కుంటున్నారు ఇంట్లోని వారు అన్నగారు వచ్చి చూసి చాచి చెంప మీద కొట్టాడు ఎక్కడికి పోయావురా నీ గురించి అంతా వెతుక్కుంటున్నా ఊరంతా అని ఎంత ఏమిటంటే ఆ ఆలయం గుమ్మం ముందు ఒక పెద్ద నంది వచ్చి అడ్డంగా కూర్చుంది.
(06:30) అన్నగారిని బయటికి వెళ్ళనివ్వలే కాసేపు భయపెట్టింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటే చిన్నప్పటి నుంచే ప్రకృతి కొన్ని సూచనలు చేస్తుంది. ఈ వేలప్ప ముందు ముందు ఏమి కాబోతున్నాడు భవిష్యత్తులో అని తిరువనంతపురం దగ్గర అంటే ఒక 20 మైల దూరంలో శివగిరి అని చెప్పే ఒక గురుకులం ఉండేది ఆ ప్రాంతాన్ని వరకల అంటారు వరక గ్రామం దగ్గర ఈ గురుకులం ఉండేది.
(06:59) ఆనాటి కాలంలో కేరళాలో గొప్ప సామాజిక విప్లవకారుడు ఆధ్యాత్మిక గురువు ఉండేవారు ఆయన పేరు నారాయణ గురువులు ఇక్కడే మన వేలప్ప యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. ఎలాగు అంటే ఈ నారాయణ గురువులకి శివలింగ గురుస్వామి అని చెప్పి ఒక శిష్యుడు ఉండేవారు. నేను ఇందాక చెప్పినటువంటి ఆ శివగిరి గురుకులం వీరిదే వేలప్ప ఈ గురుకులంలోనే చేరి సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
(07:36) ఒకటి కాదు అసలు రోజు భగవద్గీత పారాయణ చేయడం అసలు రోజు గురుసేవ దైవ సేవ గురువు ఏం చెప్తే అదే నియమంగా పెట్టుకొని సాధన చేస్తూ ఉండేవాడు. గురువుగారు ముచ్చట పడిపోయి ఒకరోజు అతనికి మంత్రోపదేశం చేశారు. అప్పటినుంచి కూడా వేలప్ప యొక్క సాధన మరింత ముందుకు వెళ్ళిపోయింది. అద్భుతమైన అనుభవాలు అతనికి గోచరించాయి ఆ సాధనలో యమనియమాలు అలవడ్డాయి.
(08:06) పాతంజలి యోగశాస్త్ర రహస్యాలన్నీ కూడా కరతలామలకం అయిపోయినాయి. అసలు అతను చదవని సద్గ్రంథం లేదు. శంకరుని ఆత్మబోధ వివేక చూడామణి ఉపనిషత్తులు స్మృతులు అసలు ఒకటి కాదు చదవని సద్గ్రంధం లేదు చేయని సాధన లేదు ఇంకా గురువుగారు ముచ్చట పడిపోయి నాయనా నువ్వు అద్భుతమైన స్థితిలో ఉన్నావు నువ్వు ఇంకా నా గురువు నారాయణ గురువులను కలవాలని చెప్పి ఆశీర్వదించి వారి దగ్గరికి పంపారు వేలప్పని అంటే వేలప్పకు ఆయన పరమ గురువు అన్నమాట చూడంగానే అని కూడా ఆత్మీయంగా కౌగలించుకుని వేలప్పని నీకు ఆత్మానుభవం జరగక తప్పదు బ్రహ్మానుభవం
(08:52) నువ్వు పొంది తీరుతావు భవిష్యత్తులో అని చెప్పి ఆశీర్వదించారు నారాయణ గురువులు అప్పుడే వేలప్పకి కబురు వచ్చింది ఇంటి నుంచి తల్లి నొట్టిమ్మ గారు జబ్బు పడ్డారు అని చెప్పి వెంటనే స్వగ్రామం ఎన్గంజూరికి వేలప్ప వెళ్లి తల్లికి ఉపచారాలు చేయడం మొదలు పెట్టాడు ఎక్కడా కూడా తన బాధ్యతలను విస్మరించలేదు వేలప్ప నేను ఇందాకే చెప్పాను కదా వేలప్ప పుట్టకముందే వారి తల్లిదండ్రులకి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడబిడ్డ అని చెప్పాను కదా అంటే ఇద్దరు అన్నగార్లు ఉన్నారు అప్పటికీ వారిద్దరికీ కూడా వివాహం జరిగిపోయేది అందుకని ఏమనుకున్నారంటే తర్వాత ఇంకా ఈ వేలప్పే మిగిలాడు ఇతనికి
(09:33) కూడా వివాహం చేసే ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి ఇంట్లో వారు పట్టుపట్టారు. మన వేలప్ప మనసంతా కూడా ఆధ్యాత్మికం వైపు ఉంటే వివాహం వైపు ఎలా వెళుతుంది అందువల్ల ఇంకా మన వల్ల కాదు ఇదంతా కూడా అని చెప్పి ఒక ఉత్తరం రాసేసి దేశాటనకు బయలుదేరాడు మన వేలప్ప ఏదో దేశాటన అంటే సరుకులు డబ్బులు అన్ని కూడా సర్దుకొని బయలుదేరడం కాదు ఒక చిన్న జోలి సంచి అందులో భగవద్గీత కటోపనిషత్తు పాతంజలి యోగశాస్త్ర రహస్యాలు జప జపమాల విభూది చిన్న పాత్ర రాసుకోవడానికి పెన్సిల్ పేపర్లు ఇది వారి సరంజామ అంతే ఈ సంచితో ఆయన దేశాటనికి
(10:20) బయలుదేరారు మొదటగా ఉడిపి ధర్మస్థల కుక్కి, గోకర్ణం అక్కడి నుంచి పండరీపూర్ ఈ మార్గ మధ్యంలో ఏమైందంటే పాపం ఆయన డిసెంట్రీకి గురయ్యారు అంటే రక్త విరోచనాలతో బాధపడ్డారు. దారిలో తోటి యాత్రికులు అన్నారు ఎందుకయ్యా నీకు ఈ కష్టాలు ఈ అనారోగ్యం పెట్టుకుని నువ్వు దేశం మొత్తం ఏం తిరుగుతావు కానీ శుభ్రంగా ఇంటికి వెళ్ళు ఏదో పిల్లల్ని చూస్తా అన్నారు కదా ఇంట్లో వాళ్ళు హాయిగా వివాహం చేసుకుని ఉండగా ఎందుకు వచ్చింది తిప్పలని చెప్పి నిరుత్సాహపరిచారు కానీ వేలప్ప సేమిరా అన్నారు ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఏంటో ముందుగానే నిర్ణయింపబడింది దైవం చేత
(11:03) ఆ రాత్రి ఒక మింత జరిగింది ఆ రోజు రాత్రి స్వప్నంలో ఒక దివ్య పురుషుడు కనిపించి ఒక చిన్న మాత్ర నోట్లో వేసి వెలప ఇప్పుడే కాదు ఇక మిగిలిన జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా రోగగ్రస్తుడు కావు అని చెప్పి వరం ఇచ్చి మాయమైపోయాడు. దాని తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. అలా పండరీపూర్ అట్లా పంజాబ్ కాశ్మీర్ హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్ అట్లా హుషి కేసు వెళ్ళారు.
(11:34) మొట్టమొదటిసారిగా హుషి కేసులో ఆయన సమాధి స్థితిని పొందారు. దాని తర్వాత మళ్ళీ కిందకి దిగుతూ అయోధ్య బుద్ధగయ పూరి సింహాచలం భద్రాచలం శ్రీశైలం తిరుపతి తిరుమల పుష్కరుణంలో స్నానం చేశారు తిరుమలో పాపనాశనం ఆకాశ గంగను సేవించి అలా గోగర్భానికి చేరుకున్నారు అసలు ప్రాభం వారిది అక్కడి నుంచే మొదలయింది ముందు ముందు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది.
(12:05) ఎప్పుడైతే ఈ గూగర్భ క్షేత్రానికి చేరుకున్నారో అప్పుడు ఈ వేళప్పకి ఒక అనీర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగింది. అప్పుడు తన హృదయం చెప్పింది ఇదే నీ తపోక్షేత్రం అని దాని తర్వాత ఇంకా కొంచెం దక్షిణ దిక్కుగా ప్రయాణించడం మొదలు పెట్టారు అంటే అరుణాచలం కంచి చిదంబరం మధుర రామేశ్వరం, కన్యాకుమారి అట్లా మళ్ళీ ఈ కేరళాలోని వరకలా దగ్గరికి వచ్చారు అంటే వారి గురువు గారిని కలిశారు శివలింగ గురుస్వామి వారిని వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళారు దురదృష్టం ఏమిటంటే వారి తండ్రి కరియప్ప గారు అప్పటికే గతించారు తల్లిని ఓదార్చారు బంధువులను ఓదార్చారు
(12:49) అప్పటికీ వీరి వయసు ఎంత అయి ఉంటుందని చెప్పి మీరు ఊహిస్తున్నారు ఇదంతా కలిసి కూడా అప్పటికీ వేలప్ప వయసు కేవలం 29 సంవత్సరాలే ఇంత దేశాటన చేసి ఇంత కటినమైన సాధన చేసి అప్పటికి వేలప్ప వయసు 29 సంవత్సరాలు మాత్రమే దాని తర్వాత మళ్ళీ ఒక రాత్రి ఆయన చెప్పా పెట్టకుండా కుర్తాళం అక్కడి నుంచి మళ్ళీ తిరుత్తని మళ్ళీ ఘటికాచలం అంటే శివలింగర్ శ్రీకాళహస్తి మళ్ళీ తిరుమల గోగర్భ క్షేత్రానికి చేరుకున్నారు.
(13:29) ఎందుకంటే వారు మొదట్లోనే నిర్ణయించుకున్నారు కదా అది వారి యొక్క తపోక్షేత్రం అని చెప్పి అక్కడికి చేరుకొని తమ సాధన మొదలుపెట్టారు. ఎప్పుడైతే గోగర్భ క్షేత్రానికి చేరుకున్నారో కొద్ది రోజులకే తల్లి నోటి అమ్మగారు కూడా కాలం చేసేశారు. దాని తర్వాత ఆ గోగర్భ క్షేత్రంలో పాండవ గుహలో కూర్చుని తీవ్రమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెట్టారు.
(13:55) ఎంతలాగా అంటే పితృ దేవతలకి అక్కడికి వచ్చిన యాత్రికులు కానీ భక్తులు కానీ పిండి ప్రదానం చేసేవారు పచ్చి పిండిని వారు ఆహారంగా స్వీకరించేవారు ఒంటిపూట తిరుమల గ్రామంలోకి వెళ్ళి భిక్షు చేసుకునేవారు అంట అప్పట్లో తిరుమల చాలా చిన్న గ్రామం కదా అంటే నేను చెప్పేది 1913 ప్రాంతంలో తమాషాగా ఏం జరిగిందంటే ఈ గూగర్భ క్షేత్రంలో ఉన్నప్పుడు ఈ తిరుమలకు వచ్చే భక్తులు యాత్రికులంతా కూడా వీరు మలయాళ దేశం నుంచి వచ్చారు కాబట్టి వేలప్ప అని కాకుండా మలయాళ స్వామి వారు అని చెప్పి పిలుచుకోవడం మొదలు పెట్టారు.
(14:32) అట్లా వేలప్ప మలయాళ స్వామి వారుగా మారిపోయారు ఇక నుంచి మనం వీరిని మలయాళ స్వామి వారు అని పిలుచుకుందాం మనకు అదే కదా బాగా ఇష్టమైనటువంటి పేరు ఈ భూగర్భ క్షేత్రంలో ఉన్నప్పుడే ఒక వింత జరిగింది ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగింది ఏమిటి అంటే అప్పట్లో నిత్యం కూడా స్వామి వారికి పుష్పకైంకర్యం చేసే మైసూరు తిరువెంకటాచార్యులు అనేటువంటి ఒక పురోహితులు ఉండేవారు అంటే అర్చకులు ఉండేవారు వారు ఏం చేసేవారు అంటే రోజూ కూడా ఈ మలయాళ స్వామి వారికి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవారు ఆహారంగా సరే ఒకసారి ఏమైంది అంటే వర్షాకాలంలో తీవ్రమైనటువంటి కుంభవృష్టి కురిసి తీర్థాలన్నీ కూడా పొంగి పొర్లి ఈ భూగర్భ
(15:15) క్షేత్రం లోపలికి కూడా నీరు బాగా గూడా పారింది ఇప్పుడు స్వామి వారు అంటే మలయాళ స్వామి వారు బయటికి రావడం కుదరలేదు మరి వారు ఎట్లా ఆహారం తీసుకొస్తారు తిరువెంకటాచార్యులు మలయాళ స్వామి వారు ఎలా స్వీకరిస్తారో అలా కుదరల అలా ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజు మూడు రోజులు కుదరల అంటే ఆ మూడు రోజులు కూడా కఠినమైనటువంటి ఉపవాసం ఉండుకోవడానికి ఒక గింజ లేదు ఒకవేళ ఉన్నా కిందంతా నీళ్ళయితే నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వెలుగుతుంది వంట ఎలా చేసుకుంటారు ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష ఎవరికి అనుకుంటున్నారు మలయాళ స్వామి వారికి అనుకుంటున్నారా కాదు ఆయన నిశ్చింతగా గా
(15:59) ఉన్నారు ఆయనది ఏం పోయింది ఇప్పుడు వీన్నని కాపాడుకోకపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి కదా మరి కలియుగ దైవం స్వామి వారు ఎందుకు మౌనంగా ఉంటారు అప్పుడు ఈ దేవస్థానం అధికారి ఒకళ్ళు ఉన్నారు అప్పుడు ఏం జరిగిందంటే దేవస్థానం అధికారి సుబ్బరాయ శెట్టికి కల్లో కనిపించి వెంకటేశ్వర స్వామి వారు నా బిడ్డ మలయాళ స్వామి ఇట్లా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాడు భూగర్భ క్షేత్రంలో వెంటనే వెళ్లి రక్షించు అని చెప్పి ఆదేశించారు.
(16:35) ఇంకా ఆయన పరుగు పరుగున సిబ్బందితో వచ్చి ఒక పెద్ద వెదురుగడతో మలయాళ స్వామి వారిని అవతలి నుంచి ఇవతలికి లాగారు కష్టపడి ఎట్లా కొట్టలే దాని తర్వాత అప్పట్లో తిరుమలలో ఒక మహతి గారు ఉండేవారు వారి సోదరుడు రామలఖన్ దాస్ కి స్వామివారు మళ్ళీ కల్లో కనిపించి ఆదేశించారు ఏమిటి అంటే నా బిడ్డకి శాశ్వతమైన భోజన ఏర్పాట్లు చెయ్యి అని అప్పుడు మహంత్ మఠంలో మలయాళ స్వామి వారికి రోజూ కూడా భోజనం ఏర్పాటు జరిగేలాగా వారు ఏర్పాటు చేశారు రామ్ లఖన్ దాస్ సరే మలయాళ స్వామి వారు అంతా కూడా తీవ్రమైన సాధన
(17:19) తపశ్చర్యలో ఎక్కడో మునిగి ఉంటారు కదా ఒకసారి అట్లా ఉండి బాగా ఆలస్యం అయిపోయాను అంటే మఠానికి ఆలస్యంగా చేరుకున్నారు భోజన సమయం దాటిపోయింది. ఆ మటం వారు కొంచెం ఒక చిన్న చూపుతో మాట్లాడారు ఒక రకంగా అవమానించారు అప్పుడు మలయాళ స్వామి వారు ఒక ప్రతిజ్ఞ చేశారు ఇక నేను నా అంతట భోజనం దొరికే చోటికి రాను నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటాను అట్లా ఉన్నప్పుడు భోజనం నా దగ్గరికి వస్తేనే స్వీకరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు.
(17:57) అట్లా చేశారో లేదో తిరుపతి నుంచి ఒక దంపతులు వచ్చి స్వామివారికి భిక్ష చేసి వెళ్ళిపోయారు అట్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు మన మలయాళ స్వామి వారి జీవితంలో జరిగినాయి మలయాళ స్వామి వారు కేవలం ఒక ఆధ్యాత్మిక తపస్వి మాత్రమే కాదు ఒక గొప్ప సంఘ సంస్కర్త ఒక సామాజిక విప్లవకారులు ఎలాగంటే అప్పట్లో ఉన్నటువంటి కుల వివక్షిని జాతి వివక్షని లింగ వివ వివక్షని అస్పృశ్యతని కూడా దునుమాడారు పట్టించుకోలా ఎంతటి వారితో అయినా కూడా వారు రాజీ పడేవారు కాదు ఆ విషయాల్లో ఎంతో మంది స్త్రీలని వేదం చదువుకోవడానికి ప్రోత్సహించారు సామూహికంగా భగవద్గీత తరగతులను ఏర్పాటు చేశారు. కొంతమంది
(18:44) స్త్రీలకి మంత్రోపదేశం చేశారు సన్యాస దీక్షణ ఇచ్చారు. నిమ్న కులాలు అని అప్పట్లో పిలుచుకునే వారికి సంస్కృతం నేర్పించారు. తిరుమల వీధుల్లో ఎక్కడైనా కూడా యాచకుల పిల్లలు కనిపిస్తే వెంటనే తీసుకువెళ్లి పాఠశాలలో జర్పించేవారు సొంతంగా సంస్కృతం నేర్పించేవారు అటువంటి గొప్ప సామాజిక శాస్త్రవేత్త విప్లవకారులు మన మలయాళ స్వామివారు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న శరీరంతో లేనటువంటి యోగుల గురించి తపస్సుల గురించి తెలుసుకుని ఏమి ప్రయోజనం ఉంటుంది అనే కదా సరే ఈ సంఘటన వినండి మలయాళ స్వామి వారు గారు కేవలం భూగర్భ క్షేత్రంలోనే తపస్సు చేసుకోలేదు. తిరుమలలో చాలా తీర్థాలు
(19:28) ఉన్నాయి మనందరికీ తెలుసు కదా తుంబుర తీర్థం సనక సనందన తీర్థం రామకృష్ణ తీర్థం శ్రీవైకుంట తీర్థం కుమారధారా తీర్థం ఇలా ఎన్నో ఉన్నాయి కదా ఇటువంటి తీర్థాల్లో కూడా ఎన్నో గుహల్లో కూర్చుని స్వామి వారు ఎన్నో తీవ్రమైనటువంటి సాధనలు తపస్సు చేసుకున్నారు అట్లా వారు ఒకసారి తుంబుర తీర్థానికి వచ్చారు ఈ తుంబుర తీర్థంలో గతంలో సిద్ధి సిద్ధి పొందినటువంటి గొప్ప భక్తురాలు ఏమైనా గుర్తుకు వస్తున్నారా మీకు ఎవరో కాదు తరిగొండ వెంగమాంబ తల్లి ఎక్కడైతే ఈ తల్లి సిద్ధి పొందిందో ఆ దగ్గరలోనే ఒక చిన్న కుటీరం వేసుకొని మలయాళ స్వామి వారు తపస్సుకు కూర్చున్నారు.
(20:14) అలా కొన్ని నెలల తర్వాత సాక్షాత్తు ఆ తల్లి దర్శనం ఇచ్చి ఆశీర్వదించింది. ఈ తల్లి ఎప్పుడు శరీరాన్ని వదిలేసింది అంటే 1817 సుమారు వీరికి దర్శనం ఇచ్చింది ఎప్పుడు 100 సంవత్సరాల తర్వాత మరి మీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మీరే చెప్పండి మరి 100 సంవత్సరాల క్రితం శరీరాన్ని వదిలేసినటువంటి తరిగొండ వెంగమాంబ తల్లి మలయాళ స్వామి వారికి ఎలా దర్శనమిచ్చి ఆశీర్వదించింది నేను అందుకే చెప్తాను అటువంటి యోగులు అటువంటి తపస్సుల యొక్క శక్తి ఎక్కడికి పోదు అది అక్కడే నిక్షిప్తమై ఉంటుంది.
(20:55) దాని ద్వారా వారిని నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. అది పెనుమచ్చ సీతమ్మ తల్లి కావచ్చు అవధూత పిచ్చమ్మ తల్లి కావచ్చు అలాగే ఎంతో మందికి వారు కేవలం ఒక మాట మాత్రం చేత వ్యాధులు తగ్గించేవారు. ఎక్కడైనా కూడా కలర ఆ రోజుల్లో ఏ గ్రామంలో అయినా వస్తే స్వామి వారు అక్కడికి వెళ్లి తమ తపోశక్తితో ఆ వ్యాధిని నిర్మూలించేవారు కొంతమందికి స్వప్న దర్శనం ఇచ్చి మరీ కూడా వారి యొక్క వ్యాధుల్ని వారు తరిమివేసేవారు అంతటి తపోవశక్తి కలిగినవారు మలయాళ స్వామివారు అయినా కూడా ఆ యొక్క శక్తులు కానీ సిద్దులు కానీ వారి సొంత ప్రయోజనాలకి ఏనాడు కూడా
(21:34) వాడుకోలేదు వారు వారు ఈ భూగర్భ క్షేత్రంలో ఉన్నప్పుడే 1919 ఇందులో వారు శుష్క వేదాంత తమో భాస్కరం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. నేను ఇందాక చెప్పాను చూసారా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఆ దురాచారా ఆ అస్పృశిత భావాలని వారు ఖండిస్తూ బ్రహ్మ విద్య ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని నేర్చుకోవడానికి ఎటువంటి కుల వివక్ష కానీ జాతి వివక్ష కానీ లింగ వివక్ష కానీ ఉండకూడదు అని చెప్పి కుండ బద్దలు కొట్టారు ఆ గ్రంథం ద్వారా మీరు నమ్మండి నమ్మకపోండి ఆ ఒక్క గ్రంథం ద్వారా కొన్ని లక్షల మంది స్వామి వారికి శిష్యులుగా మారిపోయారు సరే అప్పటికి ఈ గోగర్భ క్షేత్రం వారు తపస్సు
(22:20) కూర్చుని తొమ్మిది ఏళ్లు అయింది అయినా కూడా ఆత్మ సాక్షాత్కారం కాలేదు వారికి ఒక రకంగా కూడా నిర్వేదం వచ్చింది. ఇంకా ఆత్మహత్య శరణ్యం అనుకున్నారు. అంత సాహసము చేయబోయారు. కానీ భగవంతుడు ఊరుకోడు కదా ఒక అంతర్వాణి వినిపించింది. నీకు బ్రహ్మానుభవం పొందాలి అంటే నీకు ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఇంకో మూడేళ్ళు నువ్వు తీవ్రమైన తపస్సు చేయాలి అని.
(22:53) అట్లా వారు ఇంకో మూడేళ్ళు అఖండమైనటువంటి తపస్సును చేసి మొత్తం 12 ఏళ్ళు అక్కడ తపస్సు చేసి ఆఖరికి వారు ఆత్మ సాక్షాత్కారాన్ని అక్కడే పొందారు. అప్పటికీ వారి వయసు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే అట్లా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు భక్తులు అంతా కూడా స్వామి వారి దగ్గర చేరేవారు అట్లా వీరి యొక్క భక్త బృందం శిష్య బృందం బాగా పెరిగిపోయింది.
(23:20) వీరి లక్ష్యం ఏమిటి ఇటువంటి వివక్షాలు అయినటువంటి ఆధ్యాత్మిక విద్యను అందరికీ అందించడం అది మరి తిరుమల లాంటి ప్రాంతంలో చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే అక్కడ అంతా కూడా ఒకరకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి కాబట్టి దాన్ని గౌరవిస్తూ స్వామి వారు కిందకు వచ్చారు వారు ఆ గోగర్భ క్షేత్రంలో సుమారు 12 సంవత్సరాల ఐదు నెలల 13 రోజులు ఉన్నారు.
(23:48) వారు కిందకి కాశీబుగ్గ తీర్థానికి వచ్చారు అంటే నేటి ఎయిర్పేడ్ ప్రాంతానికి వచ్చారు ఎప్పుడు జూన్ 3, 1926వ సంవత్సరంలో ఆనాటి శ్రీ కాళహస్తి పాలకులు కుమార వెంకట లింగమ్మ నాయనం గారు ఈనాటి ఏర్పేడు ఆశ్రమానికి ఆ ప్రదేశం అంతా కూడా కానుగగా ఇచ్చారు. ఆ ఏర్పేడు ప్రాంతంలో మొట్టమొదట ఒక చిన్న పురిపాక వేసుకున్నారు దాని తర్వాత క్రమంగా ఆశ్రమం ఎంతగానో విస్తరించింది అక్కడికి ఎంతోమంది వచ్చేవారు ఎన్నో కష్టాలతో అంటే తమకు సంసారం సరిగ్గా లేదని సంతానం లేదని లేకపోతే ఉద్యోగం లేదని అనారోగ్య సమస్యలు
(24:35) అని చెప్పి ఎంతో మంది వచ్చేవారు ప్రతి ఒక్కరిని కూడా తమ తపోశక్తితో స్వామివారు రక్షించేవారు వారి కోరికలను తీర్చేవారు అంతటి శక్తి ఇప్పటికీ కూడా ఆశ్రమంలో ఉంది తప్పకుండా దర్శించండి ఈనాటి పీఠాధిపతులైనటువంటి పరిపూర్ణానందగిరి స్వామి వారు ఇప్పటికీ కూడా ఆశ్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మీరు అడుగుతున్నారు కదా సజీవ మహాత్ముల గురించి ఇటువంటి సజీవ మహాత్ములను తప్పకుండా దర్శించుకోండి ఇటువంటి మఠాలకి ఆశ్రమానికి వారు అధిపతులుగా ఉన్నారంటే అది వారి యొక్క పూర్వజన్మ సుకృతం వారి యొక్క తపోబలం అటువంటి వారిని మీరు తప్పకుండా దర్శించుకొని తీరండి.
(25:14) దాని తర్వాత 1927 లో మలయాళ స్వామి వారు యదార్థ భారతి అయినటువంటి ఒక ఆధ్యాత్మిక మాస పత్రికను ప్రారంభించారు. అట్లా వారు ఎన్నో భక్తి విశేషాలు సమాజానికి తెలియపరచడం మొదలుపెట్టారు. 1935 లో ఇది నాకు బాగా నచ్చింది. కన్య గురుకులాన్ని స్థాపించారు. అంటే అది కేవలం బాలికల కొరకు మాత్రమే మొదలుపెట్టినటువంటి పాఠశాలలు. 1935 లో స్త్రీ విద్యను ప్రోత్సహించడం అంటే సమాజానికి ఎదురీదడమే ఇప్పటికీ మనం ఈనాటి సమాజంలో స్త్రీ వివక్ష ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నామ అంటే ఆనాటి కాలంలో స్త్రీ విద్యని ప్రోత్సహించడమే కాదు ఇందాక చెప్పాను
(25:59) చూసారా స్త్రీలకు మంత్రోపదేశం చేయడం స్త్రీలకి వారు సన్యాస దీక్షను ఇవ్వడం అవన్నీ కూడా మామూలు విశేషాలు కాదు ఆ రోజుల్లో ఏర్పేడు ఆశ్రమానికి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత అంటే అంటే జులై 2, 1936న వారు శాస్త్రోక్తంగా సన్యాస దీక్షను స్వీకరించారు. మలయాళ స్వామి వారే ప్రత్యేకించి సన్యాసి దీక్ష అవసరమా? వారు పుట్టడంతోనే ప్రకృతి సహజమైనటువంటి సన్యాసి ఒక యోగి.
(26:30) కానీ సమాజం కోసం శిష్యులు కోరిన మీదట వారు కాశీ నుంచి వచ్చినటువంటి శంకర యతేంద్రుల దగ్గర సన్యాసాన్ని స్వీకరించి. అసంగానందగిరి అనేటువంటి సన్యాస నామాన్ని స్వీకరించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో వేలప్ప మనం ప్రేమతో పిలుచుకునే పేరేమో మలయాళ స్వామి. సన్యాస నామమేమో అసంగానందగిరి. అసలు వారి రచనల గురించి మాట్లాడాలంటే ఒక పెద్ద సాహసం.
(27:05) నేను ఇందాక చెప్పాను చూసారా శుష్క వేదాంత తమోభాస్కరం దాని తర్వాత సుబోధ సుధాకరం స్తోత్ర మంజరి అలాగే ఆ గృహస్థాశ్రమ ధర్మాలు మండుక్యోపనిషత్తు మీద వ్యాఖ్యలు ఒకటి కాదు ఎన్నో రచనలు చేశారు ఆఖరికి 1960 నుంచి వారి యొక్క ఆరోగ్యం కొంచెం కొంచెంగా క్షీణించడం మొదలుపెట్టింది వయసురిచ్చా. 1962 ఏప్రిల్ మూడవ తారీఖున వారి చివరి వాక్యాలు ముందుగానే వ్రాయించారు.
(27:34) తమ వారసుడిని విమలానందగిరి స్వామి వారిని ముందుగానే వారు నిర్ణయించేశారు. అదే సంవత్సరం జులై 12వ తారీకు అంటే ఆషాడశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి నాడు వారు పొద్దున పూట చేయాల్సిన అన్ని దానాలు భిక్షలు అన్నీ కూడా పూర్తి చేసేసుకుని ఆ రాత్రి 12 గంటలకు వారు బ్రహ్మీభూతులు అయిపోయారు. అట్లా మలయాళ స్వామి వారు వారి యొక్క అవతార కార్యక్రమాన్ని ముగించారు ఆ రోజుతో ఈ సత్సంగం మీ అందరికీ నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ సత్సంగం ఎందుకు నచ్చింది మలయాళ స్వామి వారి గురించి మీరు ఎటువంటి కొత్త
(28:18) విశేషాలు ఈ సత్సంగంలో తెలుసుకున్నారో కామెంట్స్ లో పెట్టండి. అలాగే మీరు ఇప్పటికీ ఆ ఏర్పేడు ఆశ్రమానికి వెళ్లి ఉంటే ఆ అనుభవాల గురించి కూడా కామెంట్స్ లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు సరేనా ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ మలయాళ స్వామి వారి యొక్క దివ్యాశిస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మనందరం కలుద్దాం.
(28:48) శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు.

No comments:

Post a Comment