ఆరోగ్యకరమైన జీవితానికి 10 ఆయుర్వేద సూత్రాలు | 10 Health secrets from Ayurveda
Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cf191XC5r-Y
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే ఈరోజున మనం 10 అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలను చెప్పుకోబోతు ఉన్నామండి ఈ 10 కనుక మనం గుర్తుపెట్టుకొని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే ఆయురారోగ్యాలు మనకు సిద్ధిస్తాయి అని తప్పక చెప్పవచ్చు ఈ 10 అంత పెద్దవి చేయలేనివి లేకపోతే ఖర్చుతో కూడుకున్నవి శ్రమతో కూడుకున్నవి కాదండి రోజువారి మన యొక్క దినచర్యలో వీటిని చేర్చుకుంటే సరిపోతుంది మనకు మంచి ఆరోగ్యము అదేవిధంగా దీర్ఘాయుష్యు కూడా
(00:46) కలుగుతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందులో మొట్టమొదటిది ఆయుర్వేదం నుండి చూసుకుంటే అంభస ప్రసృతి రష్టౌ రవావనుదితే పిబేత్ వాతపిత్తకపాంజిత్వ జీవేద్వర్ష శతం సుఖీ అన్నారండి రాత్రి పడుకునే ముందు ఒక చెంబులో కానీ లేకపోతే ఒక గ్లాసులో కానీ నీటిని భద్రపరుచుకుని మూత పెట్టి ఉదయం లేచిన తర్వాత సూర్యోదయాని కంటే ముందు లేచిన వెంటనే తాగేసేటటువంటి పద్ధతి కొంతమంది అవలంబిస్తారు.
(01:19) శిష్టులు ఎవరైతే ఉంటారో లేచిన వెంటనే తాగరు కావున సూర్యోదయం లోపల తాగితే సరిపోతుంది లేచిన వెంటనే తాగి తీరాలని ఏమీ లేదు ఆ నియమం లేని వాళ్ళు లేచిన వెంటనే త్రాగవచ్చు చాలా మటుకు ఏం చేస్తారంటే రాగి చెంబలో కానీ రాగి గ్లాసులో కానీ రాత్రి నీటిని భద్రపరుచుకుని ఉదయం లేచిన తర్వాత సూర్యోదయం లోపల ఆ నీటిని త్రాగుతారు ఇది మొట్టమొదటి సూత్రం ఈ విధంగా కనుక నీటిని తాగితే రోజు ఉదయం పూట బాత పిత్త కఫాలను మనం జయించగలుగుతాం 100 సంవత్సరాల పాటు జీవించడానికి తగినటువంటి శక్తి మనకు కలుగుతుంది.
(01:57) భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం రోచనం దీపనం వన్నిహి జిహ్వాకంఠ విశోధనం అన్నారు. భోజనానికంటే ముందు అల్లము సైంధవ లవణము కలిపి నమిలి తింటే కనుక బాగా నమలాలి తినాలి అలా తింటే కనుక ఈ ప్రయోజనాలు కలుగుతాయి జీర్ణశక్తి వృద్ధి చెందడం మాత్రమే కాకుండా గొంతు పరిశుద్ధమవుతుంది నాలుక పరిశుద్ధం అవుతుంది అదేవిధంగా రుచి కలుగుతుంది మంచి రుచి కలుగుతుంది చాలామందికి రుచి తెలియటం లేదు అని కూడా అంటూ ఉంటారు అలాంటి వాళ్లకు కూడా రుచి మొగ్గలు మరింత ఉత్తేజభరితం అవుతాయి అభూత్వామల లకం పత్యం భుక్త్వాతో బదరీ ఫలం కపితం సర్వదా పత్యం కదళీన కదాచన మూడవ సూత్రాన్ని చెప్పేస్తున్నారు
(02:42) పరకడుపున ఎవరైనా సరే పెద్ద ఉసిరికాయ తినాలి అదేవిధంగా భోజనం చేసిన తర్వాత రేగుపండు తినాలి ఎల్లవేళలా కూడా వెలగపండు చాలా మంచిది అరటిపండు మాత్రం ఒక్కటే ఎప్పుడూ తినకూడదు ఏదో ఒక దానితో కలుపుకొని తినాలి అని చెబుతున్నారండి ఇప్పుడు మనం చెప్పుకున్నవి మంచి అలవాట్లు ఈ యొక్క మంచి అలవాట్లు ఏమిటి పరకడుపున ఉసిరికాయ తినడం ఎల్లప్పుడూ కూడా మనకు మంచి చేస్తుంది నిషేధ దినాలు పక్కన పెట్టేస్తే ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత రేగుపండు తినడం చాలా మంచిది ఎల్లవేళలా కూడా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా వెలగపండు పచ్చడి రూపంలో కానీ మరొక రూపంలో కానీ మరొక
(03:20) రూపంలో కానీ వెలగపండు కూడా తింటే మనకు పద్యం చాలా మంచిది. అరటిపండు మాత్రం ఒక్కటే వలుచుకొని తినేయవద్దు అని ఆయుర్వేద నియమం అండి అరటిపండును వేరే వేటితోనైనా కలుపుకొని తినాలి అని ఆయుర్వేదం చెబుతుంది ఇది మూడవ సూత్రం ఇక నాలుగవ సూత్రం యామధ్యే నభోక్తవ్యం యామయుగ్మ నలంయేత్ యామమధ్యే రసోత్పత్తిహి యామయుగ్మాత్ బలక్షయః అని స్పష్టంగా చెబుతున్నారు ఉదయం జాము లోపల జీర్ణ రసాద్యుత్పత్తి సమజం కావున భుజించకూడదు అన్నారండిసూ సూర్యోదయం తర్వాత జాము లోపల అంటే సూర్యోదయం ఎన్నింటికి అయితే అక్కడి నుండి కనీసం మూడు గంటల పాటు ఆ మూడు గంటల లోపల ఆహారం తీసుకోకూడదు. మూడు
(04:04) గంటల తరువాత ఆహారం తీసుకోవాలి సూర్యోదయం నుండి ఆ తర్వాత ఏం చెబుతున్నారు ఆ తర్వాత జా ముందు చూసారా ఉదాహరణకు ఉదయాన్నేఆరున్నరకు సూర్యోదయం అనుకుందాం. 9:30ర లోపల తినకూడదు 9:30ర తర్వాత టిఫిన్ అయినా ఏదైనా కూడా 9:30ర తర్వాత తీసుకోవాలి. 9:30ర నుండి 12న్నర లోపల అంటే రెండవ జాము దాటకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి తినేయాలట అలా తినకపోతే కనుక శక్తిహీనులు అయిపోతారు నీరసం వచ్చేస్తుంది అనారోగ్యం పెరిగిపోతుంది అని కూడా స్పష్టంగా చెబుతూఉన్నారు.
(04:37) ఇక ఐదవ సూత్రం హితం మితంచ భుంజీత నభుంజి తామితం హితం హితమిష్టంచ భుంజితేత్ ఏష ధర్మ సనాతనః అద్భుతమైనటువంటి సూత్రం అండి ఇది హితమైనటువంటి పదార్థాలనే తినాలి అవి కూడా మితంగానే తినాలి హితమైనటువంటి పదార్థాలు అంటే కనుక మనకు మంచి చేసేవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి మనకు మేలు చేసేటటువంటి ఆహార పదార్థాలే భుజించాలి మంచివే కదా అని చెప్పేసి వాటినైనా సరే ఎక్కువగా తినేయకండి అని చెప్పి చెబుతూ ఉన్నారండి హితమైనవే అయినప్పటికీ కూడా ఎక్కువగా తినేయొద్దు అన్లిమిటెడ్ గా తినేయద్దు అని చెబుతూ హితమైనవి కూడా ఇష్టంగా ఉన్నంతవరకే తినాలి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదయనప్పటికీ
(05:19) కూడా వాటి యందు మనకు కూడా ఇష్టం కలిగి ఉండాలి ఆ విధంగా హితం ఇష్టంచ అని చెబుతూ ఉన్నారు. మనకు మంచి చేసే ఆహారము మనకు నచ్చినటువంటి ఆహారము ఈ రెండు లక్షణాలు ఉండాలి ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి ఆహారం కూడా అమితంగా తినకూడదు మితంగానే తినాలి అని చెప్పేసి ఐదవ సూత్రం ఇక ఆరవ సూత్రం భుక్త్వా శతపథం గచ్చేత్ శనైస్తేనతు జాయతే అన్న సంఘాత శైతిల్యం గ్రీవాజాను కటి సుఖం భుక్తోపవిషతస్తుందం శయానస్యతు పుష్టత ఆయుషంక్రమమానస్య మృత్యుర్ధావతి ధాపతః భోజనం చేసిన తర్వాత 100 అడుగులు ఖచ్చితంగా వేయాలి.
(06:02) ఆ 100 అడుగులు కూడా మెల్లగా నడుస్తూ వేయాలి 100 అడుగులు వేసయమన్నారు కదా అని చెప్పేసి వేగంగా నడవకూడదు పరిగెత్తకూడదు అని స్పష్టంగా చెబుతూ దానివల్ల ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నారు భోజనం చేసిన తర్వాత 100 అడుగులు ఆ విధంగా నడిస్తే కనుక మనం తిన్నటువంటి ఆహారము ఎక్కడికి చేరాలో అక్కడకు చేరుతుంది యుక్త స్థానాలకు చేరుతుంది మెడ నడుము మోకాళ్ళు వీటి యందు సుఖం కలుగుతుంది అని చెబుతూ భుజించిన వెంటనే భోజనం చేసిన తర్వాత వాత కూర్చుంటే కనుక పొట్ట పెరుగుతుంది చాలామంది పొట్ట పెరిగిపోతుందండి అంటూ ఉంటారు ఇందుకే పెరుగుతుంది. పొట్ట ఎందుకు పెరుగుతుందో
(06:41) తెలుసుకోకుండా పొట్ట పెరిగిన తర్వాత దాన్ని కరిగించుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటు ఉన్నవాళ్ళకు పొట్ట పెరుగుతుంది. పడుకుంటే కొవ్వు పెరుగుతుంది అని చెబుతున్నారు. మెల్లగా అటు ఇటు తిరిగితే మాత్రం ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేసిన తర్వాత పరుగెత్తకూడదు ఆయు క్షీణము అని ఆయుర్వేదం చెబుతూ ఉన్నది.
(07:08) ఇక ఏడవ సూత్రం డాక్టర్లు చెప్పరు ఏమిటి ఆ సూత్రం ఈర్ష్యా భయ క్రోధ పరిప్లుతేన లుబ్దేన రుగ్ దైన్య నిపీడితేన విద్వేష యుక్తేనచ సేవ్యమానం అన్న సమ్య పరిపాకమేతి ఈర్ష్య భయం కోపం లోభం రోగం ధైన్యం ద్వేషం ఇవి ఏవి కూడా మనసులో భోజన సమయంలో లేకుండా చూసుకోవాలి వీటిలో ఏదైనా కనుక మనలో లో ఉండి మనం భోజనం చేస్తే కనుక తిన్నది సరిగ్గా జీర్ణం కాక విషుల్యం అయిపోతుంది.
(07:43) భయంగా ఎంతో భయంతో మీరు భోజనం చేశారు అనుకోండి అది మనకు మంచి చేయదు. అమితమైనటువంటి కోపంతో భోజనం చేసిన అనారోగ్యం బాగా ఉన్నప్పుడు భోజనం చేసిన ఈర్ష్యతో కడుపు కుతకుతలాడిపోతూ ఉండగా భోజనం చేసిన విపరీతమైన ద్వేషంతో భోజనం చేసినా వీటిలో ఏ లక్షణాలు ఉన్నా కూడా దానివల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది తిన్న ఆహారం జీర్ణం అవ్వదు విషతుల్యం అవుతుంది కావున నిర్మలమైనటువంటి మనసుతో నిశ్చింతగా సంతోషంగా భోజనం చేయాలి అని ఆయుర్వేదాచార్యుడు ఏడవ సూత్రంలో చెబుతూ ఎనిమిదవ సూత్రం అనాత్మవంత పశువత్ భుంజతేయే ప్రమాణతః రోగానీకస్యతే మూలం అజీర్ణం ప్రాప్నవంతిహి
(08:26) ఎవరైతే మితం అనేది లేకుండా అంటే ఒక పరిమితి లేకుండా ఎల్లప్పుడూ కూడా ఏదో ఒకటి నములుతూనే ఉంటారో పశువులాగా వారు అజీర్ణ వ్యాధికి గురవుతారు అని చెబుతూ ఉన్నారు అంటే పశువులాగా అని ఎందుకు అంటున్నామ అంటే కొన్ని జంతువులు ఉంటాయి అలాగా నెమరు వేస్తూనే ఉంటాయి మనిషి అలా చేయకూడదు అని శాస్త్రం కావున ఎవరైతే అసలు పరిమితి లేకుండా పద్ధతి లేకుండా ఎల్లప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారో వాళ్ళకు అజీర్ణ వ్యాధి వచ్చేస్తుందండి అజీర్ణమే సర్వ రోగాలకు మూలము అని చెబుతున్నారు అద్భుతమైనటువంటి సూత్రం చెప్పేసారు చూడండి మనకు అజీర్తి కలుగకుండా
(09:04) మనం జాగ్రత్త పడితే కనుక చాలా రోగాలు మన వద్దకు రావండి. జీర్ణ సమస్య రాకుండా చూసుకుంటే చాలు మనం చాలా మటుకు జీర్ణ సమస్యతోనే రోగాలు ప్రారంభం అవుతాయి. మీ శరీరంలో కనుక మీకు డైజెషన్ ప్రాబ్లం మొదలైంది అనింటే కనుక ఇక మీకు రోగాలు మొదలైపోయాయి అని అర్థం కావున డైజెషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవాలి ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి దృష్టిలో పెట్టుకోండి ఉంది కదా అని చెప్పేసి ఆకలి వేసినా వేయకపోయినా కూడా ఏదో డబ్బాలోని శెనగలో లేకపోతే మురుకులో ఏవో ఒకటి పెట్టుకొని అలా
(09:41) తింటూనే ఉండకూడదండి ఏదైనా మనం ఆహారం ఘనంగానో మితంగా తీసుకున్న తర్వాత నాలుగు గంటలు విరామం ఇచ్చేయాలి ఆ నాలుగు గంటలు ఏమి తినకూడదు నాలుగు గంటల తర్వాత మనకు ఆకలి వేస్తే మళ్ళీ ఏమైనా తీసుకోవాలి ఇది శాస్త్రం ఇక మన శరీరానికి ఏవేవి మంచివో చెబుతూ ముఖ్యమైనవి గృతేన వర్ధతే బుద్ధిహి క్షీరేనయుష్య వర్ధనం శాకేన వర్ధతే వ్యాధిహి మాంసం మాషేన వర్ధతే అన్నారండి గృతేన వర్ధతే బుద్ధిహి బుద్ధి శక్తి బాగా పెరగాలంటే నెయ్యి తినాలండి మంచి నెయ్యి నెయ్యి తినాలి మనం నాటావు నెయ్యి తినాలి దురదృష్టవశాత్తు ఒకటి రెండు తరాలు డాక్టర్లు ఏం చేశారంటే ఆవుపాల ఉత్పత్తులు
(10:23) అనిఅంటే హిందువులు భయపడేలాగా భయపెట్టేసారండి ఆవుపాలు తాగేస్తున్నారా అంతే మీ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది నెయ్యి తినేస్తున్నారా ఇంక అంతే సంగతులు ఈ విధంగా తెగ భయపెట్టేసి మన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆవుపాల ఉత్పత్తులకు దూరమయ్యేట్టు చేశారు దృష్టిలో పెట్టుకోండి దానివల్లే నేడు మనం చూస్తూ ఉన్నటువంటి అనేక రోగాలు ఇప్పుడు మన కళ్ళ ముందు తాళవిస్తూ ఉన్నాయండి.
(10:48) కావున శాస్త్రం ఏం చెబుతోంది గృతేన వర్ధతే బుద్ధిహి నెయ్యితో బుద్ధి శక్తి పెరుగుతుందయ్యా అని చెబితే నాకు నెయ్యి అంటే అలర్జీ అండి అని చెప్పేసి తెగ తిరిగిపోయేటటువంటి వాళ్ళు మన మధ్యనే ఉంటారండి చాలా దురదృష్టం నెయ్యి అస్సలు విడిచిపెట్టకండి నెయ్యి తినండి మంచి ఆవు నెయ్యి తినండి వాళ్ళు చెప్పినటువంటి దుష్ప్రయోజనాలు అన్నీ కూడా జరిసీ ఆవు పాలు జరిసీ ఆవు నెయ్యి వాటి నుండే ఉండవచ్చు అంతేకానీ నాటు ఆవుపాలు నాటు ఆవు పెరుగు నాటు ఆవు నెయ్యి నుండే మనకు మనకు ఏ విధమైనటువంటి హాని లేకపోగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది.
(11:22) కావున ఆవునెయ్యి లేకపోతే గేది నెయ్యి కూడా తీసుకుంటే గృతేన వర్ధతే బుద్ధిహి అన్నారు క్షీరేణ ఆయుష్య వర్ధనం ఆవుపాలు తీసుకుంటే కనుక ఆయుష్షు పెరుగుతుంది. శాకేన వర్ధతే వ్యాధిహి అన్నారండి కూరల వల్ల వ్యాధులు పెరుగుతాయి అనేటటువంటి సూత్రం ఆశ్చర్యం ఇది దీని గురించి కాస్త మరింత విశ్లేషించాలి నేను అనుకోవడం ఏమిటంటే పచ్చి కూరల వల్ల అని నేను కొంతమందిని అడగగా చెప్పడం జరిగిందండి ఆయుర్వేదం ప్రకారం పచ్చి కూరలు తీసుకోకూడదు ఉడికించి అంటే పక్వం చేసి మాత్రమే తీసుకోవాలి వండినటువంటి కూరలు మాత్రమే తీసుకోవాలి.
(12:00) అలా కాకుండా పచ్చికూరలు తినేస్తే కనుక దానివల్ల వ్యాధులు వస్తాయి అని ఆయుర్వేదం అభిప్రాయం కావచ్చు. మాంసం మాషేన వర్ధతే మీ ఇంట్లో ఎవరైనా సన్నగా ఉన్నారు అనుకోండి ఏంట్రా ఇంత బక్కగా ఉన్నావు అంటూ ఉంటారు ఏమిటా ఇంత బక్కగా ఉన్నావు అని చెప్పేసి వెక్కిరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు పుష్టిగా తయారవ్వాలంటే కనుక మినుము తినాలి బాగాను కండ పెరగాలి అనింటే కనుక ఒంట్లో మాంసం పెరగాలి అనిఅంటే కనుక మినుము తినాలి మాంసం మాషేన వర్ధతే మాషము అనిఅంటే కనుక మినుము మినుము తింటే కనుక ఒంట్లో మాంసం పెరుగుతుంది కండ పెరుగుతుంది తద్వారా మంచి పుష్టిగా కనిపిస్తారు సన్నగా ఉండరు అని
(12:39) చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మాంసం మాంసేన వర్ధతే అనేటటువంటి పాఠాంతరం కూడా ఉంది. ఎవరైతే మాంసాహారులు ఉంటారో ఆ కుటుంబాల్లో సన్నగా ఉంటే కనుక మాంసాహారం వల్ల కూడా మాంసం పెరుగుతుంది అని చెబుతోంది ఆయుర్వేదం ఇక చిట్ట చివరి సూత్రం అండి 10వ సూత్రం భోజనం ఏ విధంగా చేయాలని చెబుతూ భుంజానోన బహుబ్రూయాతు ననిందేదపి కంచన జుగుప్సిత కథాన్ నైవ శృణుయాదపివావదేతు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అధికంగా మాట్లాడరాదు అసలు మాట్లాడకపోతే మంచిది మాట్లాడకపోతే పితృ దేవతలు బాగా సంతోషపడతారు అని పరాశర స్మృతి చెబుతున్నది.
(13:19) భోజన సమయంలో ఎవరైతే మౌనంగా ఉంటారో మౌనంగా భోజనం చేసేస్తారో వాళ్ళకు పితృ దేవతల అనుగ్రహం ఉంటుంది ఇంట్లో కనుక పితృ దోషాలు ఉన్నాయి అని కనుక మీరు భావిస్తూ ఉన్నట్లయితే భోజన సమయంలో మౌనంగా ఉంటూ ఉండండి. భోజనం ప్రారంభించినప్పటి నుండి చేతులు కడుక్కునేంతవరకు మౌనంగా ఉండండి. అలా మీరు సంవత్సరం కనుక చేస్తే కనీసం పితృ దేవతల ఆశీస్సులు పొందుతారు. సరే పోన మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెబుతూ పరనిందా ప్రసంగం అసలే చేయకూడదు ఇంకొకళ్ళను నిందించేటటువంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉన్నారు.
(13:56) అసహ్యకరమైనటువంటి కథా ప్రసంగం కూడా చేయకూడదండి ఎట్టి పరిస్థితిలోనూ వినడం కూడా చేయకూడదు అని చెబుతున్నారు అంటే టీవీ సీరియల్లు సినిమాలు వాటిలో కనుక ఏమైనా అసభ్యకరమైనటువంటి సంభాషణలు అవి ఉంటే భోజన సమయంలో అవి కూడా వినకూడదు అసలు భోజన సమయంలో టీవీలు ఫోన్లు ఎందుకండి అవన్నీ పక్కన పెట్టి మనం చక్కగా మౌనంగా భోజనం చేయవచ్చు.
(14:19) ఇవి మనం నేడు చెప్పుకున్నటువంటి 10 ఆరోగ్య సూత్రాలుండి ఈ 10 ఆరోగ్య సూత్రాలు కూడా మనం పాటిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆయుస్సు పెరుగుతుంది చాలా వరకు రోగాలకు మనం దూరంగా ఉంటాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ 10 అంశాలు కూడా సులువుగా ప్రతి మనిషి కూడా పాటించదగినవే అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము పాటించి చూడండి ఒక్క సంవత్సరం పాటు మీ ఆరోగ్యంలో ఏదైనా అభివృద్ధి ఉంటే కనుక మరింతమందికి తెలియజేయండి అండి స్వస్తి
No comments:
Post a Comment