Thursday, May 14, 2026

మహామంత్ర యోగిని,దగ్గర ఈ రోజు జరిగే అద్భుతం సైన్స్ కి అందని అద్భుతం@nandurihemamalini

మహామంత్ర యోగిని,దగ్గర ఈ రోజు జరిగే అద్భుతం సైన్స్ కి అందని అద్భుతం@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mAZn6U7PaAM



Transcript:
(00:00) శ్రీమాత్రే నమః ఇప్పటికీ జరుగుతున్న ఒక అద్భుతం ఈ రోజుకి కూడా జరుగుతున్న అద్భుతం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సైన్స్ కి కూడా అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తే ఆ ముక్కలన్నీ అతుక్కొని మళ్ళీ ఆ వ్యక్తి ప్రాణంతో రావటం సాధ్యమేనా వినడానికి ఇదేదో ఫూలిష్నెస్ అనుకుంటారు కొంతమంది ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ అని అనుకుంటారు కొంతమంది కానీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన యథార్థ సంఘటన సాక్షాత్తు ఒక కానిస్టేబుల్ కళ్ళారా చూసిన ఈ అద్భుతం వెనక ఉన్నది ఎవరో కాదు ఆదోని
(00:43) మహాలక్ష్మమ్మ అవ్వ అసలు ఎవరి అవ్వ ఆవిడను జనం ఎందుకు రాళ్ళతో కొట్టారు ఆవిడ చూపిన మిరాకిల్స్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో ఆవిడ జీవిత విశేషాలను తెలుసుకుందాం. కర్నూలు జిల్లా మూసానపల్లి అనే ఒక చిన్న గ్రామంలో మంగమ్మ బండెప్ప అనే పుణ్య దంపతులకు లక్ష్మమ్మ జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆవిడ తీరు అందరిలా ఉండేది కాదు తోటే పిల్లలతో ఆడుకోవడం కంటే కూడా ఒంటరిగా కూర్చుని తనలో తాను నవ్వుకుంటూ ఏదో పరధ్యానంలో ఉండేవారు.
(01:14) పెళ్లి చేస్తే మారుతుందేమో అని తల్లితండ్రులు వివాహం చేశారు కానీ పెళ్లయిన మొదటి రోజే ఆ తల్లి తన భర్తకి తన అసలు స్వరూపాన్ని చూపించారు. ఆవిడలోని ఆ దివ్యకాంతిని చూసిన భర్త ఆవిడ సామాన్య స్త్రీ కాదు అని గ్రహించి దూరంగా ఉండిపోయారు. అలా సంసార బంధాన్ని తెంచుకొని అవ్వ ఆదోని చేరుకున్నారు. ఆదోని వచ్చిన కొత్తల్లో అవ్వ ఒక కుప్ప తొట్టి పక్కన మురికికాలవ దగ్గర కూర్చుని ఉండేవారు.
(01:44) ఒంటి మీద బట్టలు కూడా బరువుగా భావించి వాటిని కూడా వదిలేశారు. అది చూసిన జనం ఆవిడని పిచ్చిది అనుకున్నారు రాళ్లతో కొట్టారు అసహ్యంగా మాట్లాడారు కానీ ఆ తల్లి మాత్రం చిరునవ్వుతో అందరిని చూస్తూ ఉండేవారు అంతే ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడను ఎవరైతే రాళ్లతో కొట్టారో వాళ్ళు చిత్ర విచిత్రమైన రోగాలు పాలయ్యారు. ఎవరైతే ఆ తల్లిని వేడుకున్నారో వారి కష్టాలన్నీ మటుమాయం అయిపోయాయి.
(02:13) అలా ఆ కుప్ప తొట్టి పక్కన కూర్చునే పిచ్చి లక్ష్మమ్మ ఆదోని ప్రజల పాలెట మహాలక్ష్మిగా మారిపోయింది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించుకోవాలి ఎందుకంటే ఆవిడ మాట్లాడితే నిజమైపోతుందా ఎలా నిజమైపోతుందండి మూర్ఖత్వము మూఢత్వము నింపకండి అని అరుస్తూ ఉంటారు కదా అలా అరిచే వాళ్ళ కోసం అన్నమాట ఈ సమాధానం. ఎవరైతే తక్కువ మాట్లాడతారో శక్తిని ఆదా చేసుకుంటారో వారి మాటల్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది.
(02:39) దీన్నే మనం వాక్ శుద్ధి అంటాం. చూడండి మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారైనా మౌనోతం చేయమని చెప్పి చెప్పేవారు ఎందుకు శక్తిని ఆదా చేయడం అన్నమాట ఆవిడ నిరంతరము మౌనంగానే ఉండేవారు ఎప్పుడో ఒక మాట అనేవారు అంతే అది కూడా చాలా సాత్వికంగా ఉండేది ఆవిడలో ద్వేషము అవేమి లేవు కాబట్టి ఆవిడకి వాక్ శుద్ధి వచ్చేసింది అన్నమాట అలా వాక్శుద్ధి ఉన్నవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే అది ఎదుటివారి సబ్కాన్షియస్ మైండ్ మీద చాలా బలంగా పనిచేస్తుంది.
(03:03) ఇప్పుడు ఆవిడ ఎవ్వరిని ఏమి అనకుండా మౌనంగా ఉండి నవ్వేవారు కానీ ఆవిడని అన్నవాళ్ళు బాధపడేవాళ్ళు ఇది వెంటనే విని శాపాలు ఇచ్చేస్తారా మహాత్ములు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అది శాపం ఇవ్వడం కాదు ఇప్పుడు ఆవిడని తిట్టడం అంటే ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకున్న వాళ్లే కదా తిడుతూ ఉంటారు అలా తిడితే ఏంటి అవుతుంది ఆ తిట్టిన వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలాగే ఆ తిట్టిన వాళ్ళకి కూడా అపరాధ భావం మనసులో ఉంటుంది వాళ్ళని కృంగ తీసేస్తూ ఉంటుంది ఏదో వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం తిడతారు కానీ మనసులో మాత్రం అయ్యో నేను అనవసరంగా తిట్టానేమో
(03:38) అని మనసులో ఉంటుంది బయటికి చెప్పరు బయటికి చెప్పాలంటే ఈగో అడ్డు వస్తుంది అన్నమాట ఈ నెగిటివిటీయే ఎప్పుడూ మనల్ని దెబ్బ తీసేస్తుంది శారీరకంగాను మానసికంగాను రోగాలు రావడానికి కారణం మనలో ఉన్న నెగిటివిటీే ఎప్పుడు ఇంకొకళని ఆడిపోసుకోవడం అన్నమాట ఆవిడ ఎప్పుడు ఎవరిని ఆడిపోసుకునేవారు కాదు నిశ్చలంగా నిశశబ్దంగా ఉండేవారు కానీ ఆవిడని ఎవరైనా ఏదైనా అంటే ఆ నెగిటివ్ే ఎవరి నెగిటివిటీ వాళ్ళనే చంపేస్తుంది అంటారు చూసారా అలా వాళ్ళకి తగిలేవ అన్నమాట ఈవిడ ఎప్పుడూ నిశ్చలంగా ఉండడం వల్ల ఆవిడ చుట్టూ ఒక పాజిటివ్ ఆర ఉండేది.
(04:12) ఇక అవ్వ చేసిన ఖండయోగం గురించి తెలుసుకుందాం అది అంతు చిక్కని అద్భుతం. ఇది వింటే ఖచ్చితంగా ఒళ్ళు గగుర్పాటుకి గురవుతుంది. ఒకసారి ఆదోనిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. అవ్వ కూర్చున్న చోట అంతా కూడా మురికి నీటితో నిండిపోయింది. కానిస్టేబుల్ కంగారుగా అక్కడికి వెళ్లి చూశారు అక్కడ అతనికి కనిపించింది అవ్వ కాదు విడిపోయిన శరీర భాగాలు అంతే వణకిపోయాడు.
(04:39) అవ్వను ఎవరో ప్రాణాలు తీసేసారు అని ఊరంతా చాటింపు వేయించాడు. కానీ జనం అక్కడికి వచ్చి చూసేసరికి మళ్ళీ అవన్నీ అతుక్కుపోయాయి కనిపించాయి. యోగ ముద్రలో నిండు విగ్రహంలా కూర్చుని ఉన్నారు లక్ష్మమ్మ. ఇది చూసిన కానిస్టేబుల్ ఆ తల్లి పాదాల మీద పడిపోయాడు. ఇది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆ ఊరంతా చూసిన అద్భుతం అన్నమాట. ఖండయోగం [గొంతు సవరించుకోవడం] అంటే ఏంటో తెలుసా ప్రాణశక్తిని శరీరంలోని ప్రతి అణువులోనూ నింపి అవయవాలను విడదీసి మళ్ళీ జోడించగల అత్యున్నత యోగ స్థితి అన్నమాట ఆవిడ దగ్గరికి వచ్చిన అందరికీ ఆవిడ ఏం చెప్పేవారో తెలుసా ఎన్నో సమస్యలతో ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం
(05:22) పెట్టుకో నీకు మంచి జరుగుతుంది అని మాత్రమే చెప్పేవారు కానీ ఆ నమ్మకాన్నే మనం వదిలి పెట్టేసాం కదా కొంతమంది భక్తులు వాళ్ళ అనుభవాలని చెప్పేవారు అదేంటి ఏంటంటే ఆవిడ కొన్ని విషయాలు ముందే చెప్పేవారు ఆ తరువాత అవి నిజం అయ్యాయి అని అందుకే ఆవిడని సాధారణ మహిళగా కాకుండా దైవానుగ్రహం కలిగిన మహాత్మురాలిగా చూడటం మొదలు పెట్టారు.
(05:48) ఇంకొక అద్భుతం భక్తులు దశాబ్దాలుగా కళ్ళారా చూస్తున్న సైన్స్ కి కూడా అంతు చిక్కని అద్భుతం. మే నెలలో ఎండలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉంటుంది కదా అలాంటి సమయంలో మధ్యాహ్నం వేళ రథం కదిలే సమయానికి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయిపోతుంది. ఎండకి భక్తులు అల్లాడిపోతున్న సమయంలో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు గానీ నల్లని మేఘాలు మందిరం పైకి వస్తాయి.
(06:19) రథం చక్రం కదిలిన వెంటనే పలకరింపుగా చినుకులు రాలుతాయి. ఆ మండుటెండలో పడే ఆ చల్లని చినుకులు భక్తులు లక్ష్మమ్మ అవ్వ ఆశీస్సులుగా భావిస్తారు. ఈ రథోత్సవంలో ఇంకొక విశేషం ఏంటంటే వేల సంఖ్యలో స్త్రీలు తమ పుట్టింటి ఆడబడుచుకు సార తెచ్చినట్లుగా పసుపు కుంకుమ గాజులతో వచ్చి రథాన్ని లాగుతారు. ఆ సమయంలో ప్రకృతి కూడా కరుణించి చల్లటి గాలిని వర్షపు జల్లులను కురిపించటం అక్కడ ప్రతి ఏటా జరిగే ఒక అనుూహ్యమైన అద్భుతం.
(06:52) ఇది చెప్పగానే వెంటనే ఏమంటారో తెలుసా ఆ నిజంగా అలా జరుగుతుందా అలా చేసేస్తారా అంటారు. భక్త తుకారాం గారి చరిత్రలో కూడా ఈ రోజుకి తుకారామ గారు వైకుంఠానికి వెళ్ళిపోయిన రోజు ఎప్పుడో అయినా తుకారామ గారు వైకుంఠానికి వెళ్ళిపోతే ఇప్పటికీ దేహులో ఆ వైకుంఠానికి వెళ్ళిపోయిన రోజున ఆ చెట్టు కదులుతుంది. చుట్టూ అసలు గాలి ఏమి ఉండదు వాతావరణం స్తంభించిపోయిన ఆ స్థితిలో ఆ ఒక్క చెట్టు మాత్రము కదులుతూ ఉంటుంది దీని గురించి నేను వీడియో కూడా చేశాను మన ఛానల్ లో ఉంది ఒకసారి చూడండి అవ్వ జీవితం మనకి ఏం చెప్తుంది అంటే దైవం ఎక్కడో లేడు నిష్కల్మశమైన ప్రేమలో నిరంతర తపస్సులో
(07:33) ఉన్నాడు. లోకం మనల్ని చూసి నవ్విన అవమానించిన మన లక్ష్యం పట్ల మనకి నమ్మకం ఉంటే సాక్షాత్తు ఆ ప్రకృతి కూడా దాసోహం అంటుంది అని ఈవిడ జీవితం మనకి నేర్పిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆదోని వెళ్ళారా ఆవిడని దర్శించుకున్నారా అక్కడ మీకు కలిగిన అనుభూతిని నాతో కూడా పంచుకోండి అలాగే కామెంట్ లో మహాలక్ష్మమ్మ అవ్వ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.
(08:01) అవ్వ ఆశీసులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి లోకం మనల్ని ఎంత విమర్శించినా మన పని మీద మనకి నమ్మకం ఉంటే ఆ విమర్శలే రేపు మన విజయానికి పూల బాటలు అవుతాయి. అవ్వని కూడా పిచ్చిది అన్నారు. ఆ నోళ్లే మహాయోగిని అని కొలిచాయి. అవ్వ ఎప్పుడూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆవిడ కేవలం ప్రేమని పంచారు.
(08:28) ఎదుటివాళ్ళు మనల్ని ద్వేషించిన మనం ప్రేమతో ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే మనల్ని కాపాడుతుంది. మనం ఎలా కనిపిస్తున్నాం ఏ బట్టలు వేసుకున్నాం అన్నది ముఖ్యం కాదు మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అన్నదే ముఖ్యం. అవ్వ కుప్ప తొట్టి పక్కన కూర్చున్న ఆవిడలోని ఆధ్యాత్మికత తగ్గలేదు. మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయి. రథోత్సవం రోజు కురిసే ఆ వాన చినుకలే దానికి నిదర్శనం ఈరోజు ఆవిడ గురించి మనం తెలుసుకున్నాము అంటే కాసేపు సమయాన్ని ఆవిడతో పాటు అక్కడే సంచరించేలాగా చేసుకున్నాము అంటే ఆవిడ ఆశీసులు మనకి లేవంటారా ఏమంటారు చెప్పండి

No comments:

Post a Comment