Thursday, May 14, 2026

కర్మను వదలకు..కర్తాభావనను వదిలిపెట్టు🪷అష్టావక్ర టాక్86🪷kanthrisa

కర్మను వదలకు..కర్తాభావనను వదిలిపెట్టు🪷అష్టావక్ర టాక్86🪷kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5TPxQDu4C64



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 86 ఈ ప్రపంచంలో ఉన్న మనిషి క్లిష్టమైన వాటిని కఠినమైన వాటిని సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాడు అలా అర్థం చేసుకోవడానికి నిజంగానే సరిగ్గా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సులభమైన వాటిని పట్టుకోవడంలో అతను చాలా అవస్థ పడుతున్నాడు. అది మైండ్ యొక్క స్వభావం తక్షణం దొరికేదాన్ని అతను తప్పుగానే పట్టుకుంటాడు.
(00:34) కొంత కాలం తర్వాత దొరికేదాన్ని ప్రణాళిక వేసుకొని సరిగ్గానే పట్టుకుంటాడు. మనిషి ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని అతను ఎప్పుడు సరిగ్గానే దొరికించుకుంటున్నాడు తన ఇంట్లో కానీ అలవోకగా కొనుక్కున్న సూదిని అతను ఎప్పుడు మర్చిపోతున్నాడు. సో మనిషికి మనిషికి ఉన్న మనసుకున్న ఒక మూల స్వభావం అది ఈ క్షణం ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని చూడడంలో మనసు ఎప్పుడు విఫలం అవుతూనే ఉంటుంది.
(01:05) ఏదో చేస్తే తప్ప సాధించలేం అన్న ఒకానొక ధారణతో బంది అయిన మనిషి ఏమి చేయకుండా ఏదైనా వస్తుంది. చేయకుండానే అది అప్పటికే నీలో ఉంది అన్నప్పుడు నమ్మడానికి చాలా అవస్థ పడతాడు సో అష్టవక్రుడి యొక్క సూత్రాలు సాధనకు అతీతం ఈ చిన్న విషయం చాలామందికి అర్థం అయ్యే అవకాశం లేదు ఎందుకు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చేసే ప్రతి దాంట్లోనూ సాధన ఉంది ప్రయత్నం ఉంది సంఘర్షణ ఉంది చెమట ఉంది బాధ ఉంది అరుపులు ఉన్నాయి కేకలు ఉన్నాయి
(01:51) ఇవేవి లేకుండా నిశశబ్దంగా ఒక మనిషి ఆత్మానందాన్ని పొందుతాడా జీవితం యొక్క సారాంశాన్ని అతను అర్థం చేసుకోగలడా అనే విషయం మనిషి ఎప్పటికీ నమ్మలేడు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడు ట్రైనింగ్ అంతులేని ట్రైనింగ్ నడుస్తుంది. కానీ అష్టవక్రుడు జస్ట్ సరిగ్గా చూడు అంటున్నాడు పదే పదే చెప్తున్నాడు నువ్వు నిజంగా మోక్షాన్ని పొందాలనుకుంటే అష్టవక్రుడు మార్గం కలెక్టర్ అవ్వాలనుకున్నావు డాక్టర్ అవ్వాలనుకున్నావు ఒక సక్సెస్ఫుల్ ఆంట్ర్ప్రన్ అవ్వాలనుకున్నావు పొలిటిషియన్ అవ్వాలనుకున్నావు అష్టవక్రుడు ఉపయోగపడ
(02:37) ఎందుకంటే అతను చెప్పే ప్రతి మాటకి నువ్వు చాలా విపరీతంగా జీవిస్తున్నావు సో అష్టవక్రుడు దాని యొక్క సారము అష్టవక్ర సంహిత అష్టవక్రగీత ఏమిటది కర్మను వదిలిపెట్టకు కర్తను వదిలిపెట్టు కర్త భావన యొక్క అంతర్ధానమే ఆత్మజ్ఞానం మోక్షం కర్త భావన ఎప్పుడు వదిలేస్తావ్ అది సాధన వల్ల వదిలేయడం కాదు నేను చాలా మందికి నా దగ్గర వచ్చిన వాడిని ఎలా వదిలిపెట్టాలి అంటే ఒక పెన్ని ఇస్తాను వదిలి పెట్టంటే వదిలి పెట్టేస్తారు. అలా వదిలి పెట్టాలి.
(03:17) సరే ఫిజికల్ రియాలిటీలో ఉంది కాబట్టి అట్లా వదిలి పెట్టావు. మనసులో వదిలావు చూడు నువ్వు చేతిలో ఉన్నది వదిలేయాలన్న కూడా మనసులో ఉన్నది వదిలేయాలి. సో అష్టవక్రుడి యొక్క సూత్రాలు ఇప్పుడున్న ప్రపంచంలో రకరకాల సంఘర్షణల బారిన పడ్డ మనిషికి వరదాయిని కానీ ఆ విషయం మనిషి గుర్తించాలి కదా అంతెందుకు చెట్లు ఉన్నాయి ప్రశాంతత ఉంది చక్కటి గాలి ఉంది మనిషి దాన్ని వదిలేసి ఆఫీస్ లోనే గడుపుతున్నాడు.
(03:54) సరే అవసరం ఉంది కాదని ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండి నిశశబ్దంగా ఉండి ఏకాంతంగా ఉండే అవకాశం ఉన్నప్పటికిని రకరకాల విషయాల్లో తలదూర్చి పక్కవాళ్ళకి సలహాలు ఇచ్చి ముఖాలు మార్చుకొని ఛాలెంజ్లు చేసి ఇట్లా మనిషి తను తాను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి సో ఈరోజు అష్టవకుడు చెప్తున్న ఈ సూత్రాలు చాలా చాలా చాలా మహత్వపూర్ణమైనవి నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను దానికి కారణం ఉంది అత్యంత సులువైనవి అందుకే మహత్వ పూర్ణమైనవి ఎవడు ఆరోగ్యవంతుడు ఎవడు అసలు సులభంగా శ్వాసిస్తాడు ఎవడి శరీరం ఆరోగ్యంగా ఉంది
(04:35) ఎవడు అతి సులభంగా పద్మాసనం వేసుకుంటాడు ఎవడు ఆరోగ్యవంతుడు ఎవడు కూడా అతి సులభంగా ప్రయత్నం లేకుండా కష్టం లేకుండా నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలోకి పోవడానికి త్రీ అవర్స్ కష్టపడితే వాడు గ్రేట్ అని కాదు. అన్నం మరిగించుకోవడానికి 10 టాబ్లెట్లు మింగితే గ్రేట్ అని కాదు. శ్వాస వేరే ఒక ఎక్విప్మెంట్ తో అతన్ని పిలుస్తున్నాడు అనుకో అతను ధనికుడు గ్రేట్ అని కాదు అదిఒక విక్షిప్త అతనికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అట్లాగే జీవించడానికి ఎవరైతే కష్టపడుతున్నారో దేహవ్ ఆల్ మిస్అండర్స్డ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సో అష్టావక్రుడు ఈరోజు తన సూత్రంలో
(05:16) అద్భుతమైన కాంతి కుసుమాల మీద జల్లుతున్నాడు. అష్టవక్కుడు అంటున్నాడు నిర్ధ్యాతుం చేష్టితుం వాపి యచిత్తం న ప్రవర్తతే నిర్మితమిదం కింతు నిర్ధ్యాయతి విచేష్టతే అంటే జ్ఞాని అతని యొక్క చిత్తం నిష్క్రియ భావంతో సుస్థిత తంగా విరాజిలుతుంది. ఆ చిత్తం చేష్టలు చేయడానికి ప్రవృత్తం కాదు అది సంకల్ప రహితం నిశ్చలం సుస్థిరం కానీ సంకల్ప రహితంగా నిర్నిమిత్తంగా నానా
(06:01) ప్రకార చేష్టలు చేస్తూ ఉంటాడు. అతని చిత్తం పరమం పవిత్రం పరిశుద్ధం ఆ స్వరూపంలో అది సుస్థిరం సింపుల్ ప్లేన్ వాడుక భాష నిష్క్రియా భావంతో విరాజిల్లుతుంటుంది. ఆ తర్వాత సంకల్ప రహితంగా నిర్నిమిత్తంగా రకరకాల చేష్టలు చేస్తూ ఉంటాడు. దీని మధ్యన విరోధ భాష్యం చూడండి సో చేయడానికి ఏది లేదు అని తెలుసుకొని ఆ సందర్భంలో తనకి ఏది సాధ్యమో అది చేస్తూ
(06:47) ఉంటాడు. ఇక జీవితంలో నేను చేసేది ఏమీ లేదు అని యోగి ప్రకటిస్తే దాని అర్థం ఏమి చేయకుండా అట్లా ఉండిపోతున్నాడు కాదు అలా చెప్పిన మరుక్షణమే ఇంత గంజి కాసుకొని తాగొచ్చు అది చెప్పిన మరుక్షణమే ఎవరో అది ఎట్లా అండి అంటే ఒక గంట వ్యాఖ్య చేయవచ్చు కర్త లేడు కర్త భావన పోయింది. సో ఎవడైనా కర్మ చేస్తున్నాడు అంటే దానికి కారణం ద్వంద్వం అయితే ఒక విధంగా దానికి కారణం ద్వంద్వతీతం అయితే ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవడైనా ఒక వ్యక్తి ఏదో ఒక పూచికపు పుల్ల ఇటు తీసి అటు పెట్టాడు కర్మ
(07:32) చేశాడు దానికి కారణం ద్వంద్వ అయితే అతను ఆ ఆకాంక్ష వల్ల వేరేవాళ్ళు గుర్తించాలన్న కారణం వల్ల ఇలా చేస్తే అతని జీవితంలో ఎదుగుదల ఉంటుందన్న ఆలోచన వల్ల చేసి ఉండవచ్చు ఒకవేళ తను అనుకున్న దానికి విపరీతంగా గనుక జరిగిందనుకో అతను బాధపడే అవకాశం ఉంది. కానీ యోగి మానసిక స్థితి ద్వంద్వాతీతం ఇక్కడి నుంచి పూచిక పుల్ల అటుపక్క పెడితే ఆ సందర్భంలో అటుపక్క పెట్టవలసిన సందర్భం వచ్చింది సందర్భ జ్ఞానంలో నుంచి ఒక నిశ్చయ జ్ఞానంలో నుంచి అట్లా పెడతాడు అంతే సో ఏది అవ్వాలని అనుకోని స్థితి ఆత్మజ్ఞానం అక్కడి నుంచి నువ్వు మాట్లాడే మాట జ్ఞానం
(08:17) అక్కడి నుంచి నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్తే ప్రవచనం పాండిత్యం కాదు ప్రవచనం ప్రవచనం అంటే జస్ట్ పుస్తకాల్లో ఉన్నది చెప్పడమే అని అందరూ అనుకుంటున్నారు. నీ అనుభవాన్ని చెప్పడం నిజమైన ప్రవచనం సో ఏదో అవ్వాలని ఆకాంక్ష ఉంటే నువ్వు ద్వంద్వంలో ఉన్నావు ఎందుకంటే అవ్వాలనుకున్న స్థితి ఉంది నువ్వు ఉన్నావు ఏది అవ్వాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నాను.
(08:50) నేను చెడుగా ఉండి మంచిగా అవ్వాలని ప్రయత్నం చేయడం లేదు నేను మంచిగా ఉండి ఆ మంచి స్థితిలో నుంచి ఆ మంచి స్థితి నుంచి కదులుతూ ఇంకొక మంచి స్థితికి చేరుకుంటున్నాను. ఓ కొండ ఎక్కుతున్నావ అనుకో ఎక్కడ ఎక్కినా కొండ ఎక్కినట్టే ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కుతున్న అనుకున్నావా కర్త భావన వచ్చేసింది ఎక్కడున్నా కొండ మీద ఉన్నట్టే అనుకున్నావా దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తున్నాను అనుకున్నావా కర్త భావన వచ్చింది ద్వంద్వం వచ్చింది నేను భూమి మీద కదులుతున్నాను అని తెలుసుకున్నావా ద్వంద్వం పోయింది ఎక్కడున్నా భూమి మీద ఉన్నట్టే
(09:25) సో ఏది అవ్వాలని లేని స్థితి ఆత్మజ్ఞానం ఇది రాసి పెట్టుకోండి సో అష్టవక్రుడు చెప్తున్నాడు నిర్ధ్యాతుం చేష్టితుంవాపి యచిత్తం న ప్రవర్తే ధ్యానరహితంగా రకరకాల పనులు చేస్తున్నట్టు కనిపించినప్పటికిని అతని కర్తా భావన లేకుండా అట్లా కదులుతున్నాడు నిర్నిమిత్త మిదం కింతు నిర్ధ్యాయతి విచేష్టతే సో అందరి మధ్యనే ఉంటాడు సంకల్పాలు వికల్పాలు ఏమి చేయడు.
(10:08) ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి చిన్న పిల్లవాడితో సహా కింద మా మిత్రుడు రావచ్చాడు. చిన్న పిల్లవాడు వాళ్ళకి సైకిల్ తెచ్చుకున్నాడు ఇద్దరం తొక్కుతున్నాం అతని మనసులో ఒకటే ఆలోచన ఆ పిల్లవాడి మనసులో నాకంటే ఫాస్ట్ గా తొక్కాలని నేను మధ్యన ఒక చోట ఆపి చెప్పాను ఇద్దరం కలిసి తొక్కుదాం కదా ఆ లేదు నిన్ను ఓడగొట్టాలంటున్నాడు.
(10:37) సో ఇలా ఆకాంక్ష మొదలవుతది దాని వల్ల ఏమ వస్తుంది ఆ రసం వాట్ ఇస్ ఇట్ ఏ పర్సన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఇట్ బై డిఫీటింగ్ సంబడీ ఏమిటది ఏదో తెలియని కిక్ వస్తుందిన్నమాట ఇది నిరంతరం కొనసాగుతుంది డే ఇన్ డే అవుట్ తర్వాత కార్ తీసి సైకిల్ అందులో పెట్టాలి తనకు తెలుసు తను పెట్టలేదడని కానీ ఛాలెంజ్ గా తీసుకున్నాడు నేను పెడతా అంటాడు.
(11:01) ట్రై చేశాడు నేను చెప్పాను పెట్టని పక్కకు జరగండి అతను పెట్టలేకపోతున్నాడు ఎవరనా హెల్ప్ చేస్తారా అని అడిగాడు హెల్ప్ చేసి కొంచెం కార్లో పెట్టిన తర్వాత మీ అందరూ పక్కకు జరగండి నేనే లోపటికి తోస్తా అంటున్నాడు. సో అది తెలియని వయసు కాబట్టి అదంతా అందం కానీ మనిషి తెలిసి చేస్తాడు చూడు నేనే చేస్తాను నేనే పెడతాను నేనే మొదట ఇది చేయాలి.
(11:30) నేను చేసిందే కరెక్ట్ నేను ఒక్కడినే కరెక్ట్ చెప్తాను నేనే సలహా ఇస్తాను ఏ సినిమాకి వెళ్ళాలో నేనే చెప్తాను. ఏ బట్టలు కొనుక్కోవాలో నేనే చెప్తాను. ఈ నేను నేను నేను నేను నేను నేను నేను దానివల్ల నీ అహంకారం యొక్క పరిపుష్టి జరుగుతుంది. ఏదో చేస్తున్నా అన్న భావన కలుగుతుంది ఏదో చేస్తున్నావ అన్న భావన కలిగినందుకు ఏదో పొందుతున్నావ అన్న భావన కలుగుతుంది ఏదో పొందుతున్నావ అన్న భావన కలిగినందుకు యస్ ఇఫ్ యు ఎగజస్ట్ ఈ భూమి మీద నువ్వు ఉన్నావ అన్న భావన కలుగుతుంది.
(12:02) కానీ జ్ఞాని అంటాడు ఏమి చేయలేదు ఒకసారి బొకోజోని ఎవరో అడిగారు మీరు ఎన్లైటన్డ్ అవునా ఆ అంటే నువ్వు ఏ పరిభాషలో అడిగావో తెలియదు బట్ ఎస్ మరి ఎన్లైటన్డ్ మన్ అయిన మీరు ఏం చేస్తారు అసలు త్రూఅట్ ద డే అంటే అతని ఉద్దేశం ఏమిటి ఏమైనా గొప్ప పనులు చేస్తారా రకరకాల కర్మకాండలు ఒక పెద్ద రాయి చెట్టు పెట్టడం ఎవ్వరికి పట్టు ఎవ్వరికీ సాధ్యంగా జ్ఞానతం చేయడము ఇదే కదా ఇప్పుడు ఎవరైనా ఒక ఉన్నత హోదా ఇచ్చాడంటే సామాన్య మానవుడు చేసింది అతను ఎందుకు చేస్తాడు ఒక పెద్ద దేవాలయంలో పూజారి అందరి పూజారిలాగా ఎందుకు చేస్తాడు అతని కర్మ వేరే ఉంటుంది. అందులో ఒక స్పెషాలిటీ
(12:49) ఉంటుంది దానికి ఒక నియమిత నియమావళి ఉంటుంది. దానికంటూ ఒక ప్రత్యేకమైన పూజ సామాగ్రి ఉంటుంది. దాని ఒక ప్రత్యేక వేషధారణ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత తుడకసలాడుతూ ఉండాలి. అప్పుడు కదా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి ఉదాహరణకు పెళ్లికొడుకున్నాడు, పెళ్లికూతురు ఉంది ప్రత్యేకమైన వ్యక్తి ఎలా అయ్యాడు.
(13:09) ప్రత్యేకమైన వ్యక్తి ఎలా అయింది? ప్రత్యేకమైన చీర కట్టబడ్డది, ప్రత్యేకమైన నగలు వేయబడ్డాయి, ప్రత్యేకంగా మధుపరకాలు కట్టబడ్డాయి, ప్రత్యేకంగా పీఠ వేయబడ్డది, ప్రత్యేకమైన ఆసనంలో కూర్చుపెట్టారు, ప్రత్యేకమైన ఒక తిధి పెట్టారు, ఒక వారం పెట్టారు. ఇవన్నీ రకరకాల ప్రత్యేకతల కలయికలు ఆ వ్యక్తి ప్రత్యేకం అనిపిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి పడుకున్నప్పుడు ఎలాంటి నగ్న శరీరము పడుకున్నప్పుడు ఎలాంటి మనసు ఉందో మెలకోలు అంతే దేర్ ఇస్ నో డిఫరెన్స్ కానీ మనం ప్రత్యేకత ఇస్తున్నాం తద్వారా అతను ప్రత్యేకంగా ఉన్నట్టు అనుకుంటున్నాడు.
(13:42) సో బొక్కుజు చెప్పాడు నేను జ్ఞానోదయం పొందిన వ్యక్తినే దాని అర్థం నా జీవితం పట్ల సంశయాలు పోయాయి ప్రత్యేకతలు పోయాయి ఇది సాధించాలన్న లక్ష్యం పోయింది తద్వారా అక్కడి నుంచి నేను చెప్తున్నాను నీ జ్ఞానోదయం ఏమిటో మాకు తెలియదు. ఒక పిట్టఎంతో ఒక చీమ ఎంతో ఒక చెట్టుఎంతో నేను అంతే వాటికి సాధ్యమైనవి అవి నాకు సాధ్యమైనవి నేను ఏవి నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనవో అవి సహజంగా చేస్తాను సచ్ యస్ ఆకలితే తింటాను నిద్ర వస్తే పడుకుంటాను నడవాలనిపిస్తే నడుస్తాను మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు
(14:26) ప్రాబబ్లీ ఏ పొలిటీషియన్ ఇదేమంత పెద్ద పని ఎవడనా చేస్తాడు బొక్కుజు అన్నాడు [గొంతు సవరించుకోవడం] అలా అనిపిస్తుంది మీకు నిజంగా ఇవి చేస్తే మీ జీవితం పరివర్తన జరుగుతుంది. సో అర్థం చేసుకోవడం కష్టం. నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు చాలా ధ్యానాలు చెప్పతపాదులు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి బట్ లోపట ఏదో వాక్యం నా దగ్గరికి రాగానే అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు నేను చిన్న చిటికేశ ఎందుకు అట్లా కూర్చున్నారు మీరేదో భావనతో వచ్చారు.
(15:06) అన్ని భావనలు అన్ని ధారణలు వదిలేసి ఊరికే కూర్చోండి లూస్ అండ్ నాచురల్ గా కూర్చోండి శరీరాన్ని స్టిఫ్ గా ఎంతసేపు పెడతారు మీరు మీ అహంకారం వల్ల అట్లా పెడుతున్నారు అంతే శరీరాన్ని వదులుగా ఉంచండి నేను వదులుగానే ఉంచుతాను అన్ని వదులుగానే ఉన్నాయి ఇప్పుడు మీ కాళలో బొక్క ఉంటది అది స్టిఫ్ గానే ఉంటది.
(15:28) మీ జుట్టు లూజు గానే ఉంటది ఓవరాల్ గా వదులుగా ఉండవలసింది. అట్లా కూర్చున్న తర్వాత చిన్న చర్చ వచ్చింది. ఏమిటి విషయం అంటే చెప్పాడు నేను కొన్నేళ్లుగా ప్రతిరోజు గంట సేపు మెడిటేషన్ చేస్తాను నా యంబిషన్ టూ అవర్స్ చేయడం మా గురువు గారు అట్లా చెప్పారు. నా చుట్టుపక్కల ఉన్న సత్సంగంలో అందరూ అదే చెప్తున్నారు ఎంతసేపు మెడిటేషన్ చేశవ్ కానీ మీ టాక్స్ విన్న తర్వాత ఎంతసేపు అన్నదే ప్రారబ్ధం ఎంతసేపు అన్నదే సమస్య ఎంతసేపు అన్నది అహంకారం అని నాకు అర్థమైంది.
(16:01) నేను ఏం చేయాలో చెప్పండి అరే బాబు చిన్నప్పటి నుంచి నువ్వు ఏ ధ్యానాలు చేశవ్ ఎంత చక్కగా ఉన్నావ్ ఎంత చక్కగా ఆడుకున్నావ్ నీ నా బేధాలు లేని స్థితిలో ఉన్నావ్ చక్కగా నిద్రపోయావ్ మళ్ళీ ఒక్కసారి ఆ స్థితిని అనుభవించరాదు. ఒక్క నాకోసం ఒక మూడు నెలలు అన్ని పనులు ఆపేసేయి ఆపేయ అంటే ఆపేయమని కాదు ప్రత్యేకంగా చేస్తున్నాయి ఇట్లాంటి పనులన్నీ ఊరికే నిద్రవస్తే పడుకో ఆకలైతే తిను నడవాలనిపిస్తే నడువు టెక్నాలజీ అట్లాంటివన్నీ అవసరం మీరకు వాడికి ఫోన్ వస్తే ఒక్క సెకండ్ మాట్లాడి పక్కన పెట్టేసేయ్ నీతో నీవు ఉండు నీతో నీవు భ్రమించు నీలో నీవు ఉండు నీవై ఉండు నిన్న వచ్చాడు అది ఒక రికార్డింగ్ కూడా
(16:48) చేసి పెట్టామ అది అసలు ఎంత హాయిగా ఉంది నా మనసులో ఉన్న సంఘర్షణ అంతా పోయింది నా కదలికలో ఒక నిందిమ్మత్తన వచ్చింది. నా శ్వాసలో ఒక సహజత్వం వచ్చింది ఇలా ఎన్ని చెప్పాడు ఏ ఇది ప్రవచనం నువ్వు అనుభవించి చెప్తున్నావ్ దట్ ఇస్ ఏ బ్యూటీ ఆఫ్ లైఫ్ సో చేసి మనిషి చేస్తే తప్ప ఏది జరగదని నమ్ముకున్న మనిషి కొంతకాలం అన్ని పనులు ఆపి చూడాలి.
(17:20) ఆ తర్వాత స్టావకడు అంటున్నాడు తత్వం యదార్థమాకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతా అధవాయాతి సంకోచ మమూడః కోపిమూడవత్ ఈ సూత్రం చాలా ప్రమాణం కలిగిన సూత్రం ఇందులో ఒక రహస్యం ఉంది ఈ సూత్రం సూత్రంలో మందుడైన అజ్ఞాని మూడుడైన అజ్ఞాని ఆత్మతత్వంలోని రహస్య ప్రబోధాన్ని ఉపనిషత్తుల ద్వారా రకరకాల గురువుల ద్వారా శాస్త్రుల ద్వారా విన్నప్పటికిని సంశయం మూఢత్వాన్ని అవివేకాన్ని వదులుకోలేడు. అజ్ఞానంతోనే
(18:06) జీవిస్తాడు. జ్ఞాని పైకి మూడులా నటించినప్పటికిని సంచరించినప్పటికిని అంతరంగంలో అంతులంద ప్రశాంతత అనుభవిస్తాడు ఈ సూత్రం చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ ఇస్ వాట్ హాపెన్స్ సో సూక్ష్మమైన విషయాలని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కఠినమైన విషయాలని తప్పుగా అర్థం చేసుకోడు మనిషి సో ఎవడు అష్టవక్రుడిని వింటే రెండు రకాల మనుషులు మనకు తగులుతారు.
(18:50) అష్టవక్రుడిని తప్పుగా అర్థం చేసుకుంటే కర్మను వదిలేస్తారు. ఎందుకు అష్టమగుడు చెప్తున్న నిష్క్రియ కర్తా భావన వదిలేయి లేకపోతే ధ్యానము లేదు ఏకాగ్రత లేదు నువ్వు సాధించేది లేదు సంకల్ప వికల్పాలు వదిలేయి నువ్వు ఏమీ చేయకుండానే సాధించబడ్డది మోక్షం నీ సహజ స్వభావం నిరంజనుడిగా ఉండు జస్ట్ సాక్షిగా ఉండిపో విశ్వ సాక్షి సుఖం సుఖీభవ ఇవన్నీ విన్న తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నవాడు పని వదిలేస్తాడు కర్మను వదిలేస్తాడు ఇంక ఏం లైఫ్ లో ఏం సారం లేదని చెప్తున్నాడు ఎందుకు చేయాలి కానీ అష్టముఖుడు సరిగ్గా అర్థం చేసుకుంటే అతను కర్మను వదిలిపెట్టడు కర్తను వదిలేస్తాడు.
(19:30) సో ఎవడైతే కర్మను వదిలేశాడో ఆ కర్మను వదిలేశను అన్న కర్త భావన మిగిలింది చూడు వాడు మూడుడు వాడు అజ్ఞాని సో అష్టవకుడు చెప్తున్నాడు ఈ వస్తువుల్లోపట ఈ పదవుల లోపట ఈ మనుషులతో ఉన్న సంబంధాల లోపట ఎలాంటి సారము లేదు. అందుకే నేను నా రూములో ఉంటున్నా బయటికి వస్తలేను ఇది మూర్ఖత్వం నేను నా చుట్టుపక్కల ఉన్న చాలా మందికి చెప్తాను మాట్లాడుకోవద్దు ఎక్కువ అంటే గంభీరంగా మారిపోతారు మొహం మాడుచుకుంటారు.
(20:02) మాట్లాడమంటే అతిగా మాట్లాడేస్తారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దని కాదు ఎంత అవసరమో అంత మాట్లాడుకో అని ఎంత అవసరమో తెలిస్తే కదా మొదట సో ఎవడు మూడుడు అంటే విషయాన్ని తప్పుగా పట్టుకునేవాడు తప్పుగా అర్థం చేసుకునేవాడు అక్కడితో ఆగకుండా అదే నిజమని నమ్మేవాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు ఒక ఆశ్రమంలో పడుతున్నాడు.
(20:31) పెద్ద పెద్ద పొద్దున్నే కూర్చుని పేపర్స్ రాస్తాడు దేహాభిమానం పోవాలి దేహాభిమానం పోవాలి దేహాభిమానం పోవాలి దేహాభిమానం పోవాలి మధ్య మధ్యలో వెళ్లి చలనీల స్నానం చేస్తాడు సెక్స్ తాట ఏదో వచ్చినట్టు ఉంది. అమ్మాయిల వైపు తలెత్తు కూడా చూడ్డు ఎంత రుగ్మత ఏర్పడ్డది చివరికి చెల్లెల వైపు కూడా చూడడంలే అమ్మాయి కదా విక్షిప్తత తప్పుగా అర్థం చేసుకున్నట్టు దేహాభిమానం పోవాలని దేహము గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాడు.
(21:04) దేహాన్ని ఎంత అవసరమో అంత వాడుకో అదే దేహాభిమానం లేని స్థితి. వ్యామోహం లేని స్థితి అంటే ఎంత అవసరం అంతా వాడుకుంటున్నావు వాసన లేని స్థితి చక్కటి ఎగ్జాంపుల్ నువ్వు తింటున్నావు తినడం చాల అనిపించింది ఆపేసావు నీకు వాసన రహితుడివి. కానీ సరిపోయినా తింటున్నావు చూడు అక్కడ నీకు వాసన పట్టుకుంది అని సో మూర్ఖుడు మూడుడు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు అదే నిజం అనుకుంటాడు అందరికీ అదే చెప్తాడు వాడు గంగలో దుంపుతాడు అందరిని గంగలో నింపుతాడు.
(21:37) ముక్తి కోసం కాదు కొట్టుకపోయేటట్టు చేస్తాడు. సో అష్టవక్రుడు చెప్తున్నాడు మందుడైన అజ్ఞాని రకరకాల రహస్యాలు ఆత్మ ప్రబోధాన్ని గురువుల ద్వారా విని పుస్తకాల ద్వారా చదివినప్పటికిని అతని యొక్క అవివేకాన్ని వదులుకోలేడు. అతను తప్పుగానే వ్యాఖ్య చేస్తాడు. కానీ జ్ఞాని పైకి మూడుడిడులా కనిపిస్తాడు. కానీ లోపట చాలా ప్రశాంతతని అనుభవిస్తాడు తనకి ఏ కర్మ సాధ్యమో అవన్నీ చేస్తూ ఉంటాడు.
(22:17) సో మూడుడికి ఒక జ్ఞానికి చిన్న బైఫర్కేషన్ ఉంది. అంటే ప్రశాంతంగా నిద్రించే వ్యక్తి జ్ఞాని కోమాలు ఉన్న వ్యక్తి వేరు నేను మూడుడు అనను ఎగ్జాంపుల్ గా చెప్పాను. మూడుడు తనకు తెలుసని ప్రవర్తిస్తాడు పై పైన కానీ లోపట ఏమి తెలియదు. అందరి ముందు తను మెచ్చుకోబడాలని ప్రయత్నం చేస్తాడు మూడుడి మనసులో ద్వంద్వం ఉంది ద్వైతం ఉంది జ్ఞానికి ద్వంద్వము ద్వైతం లేదు తనకి ఏది సాధ్యమో అది చేస్తాడు చుప్చాప్ కూర్చుంటాడు అంతే అతనిలో ఎలాంటి విక్షిప్తత లేదు అలాంటి స్థితి ఉంది సమస్య అంతా ఏమిటి అసలు ఇలా ఉండడం ఏదో పుస్తకాల్లో ఒక క్యారెక్టర్ కి సాధ్యం
(22:55) అనుకుంటారు లేదు నేను నా అనుభవంగా చెప్తున్నాను. నా గది నుంచి బయటికి వెళ్ళక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడనా మరీ అవసరమైతే ఎవరనా పదే పదే ఫోన్ చేస్తే ఒకసారి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకొని వస్తాను అక్కడికి వెళ్ళిన నా గదికి వెళ్ళినట్టే ఏ వస్తువు ముట్టుకోను ఏ వస్తువుని చూడను ఏ పర్సనల్ విషయాలు మాట్లాడను ఇక్కడ ఏం చేశనో అక్కడ అదే చేస్తాను నా వైలుని తీసుకొని వెళ్తాను అక్కడ కూడా ఊరికే రెండు పాటలు వాయిస్తాను.
(23:20) అందుకే మెల్లమెల్లగా నన్ను పిలవడం మానేస్తారు. కానీ కొందరు గుర్తిస్తారు వాళ్ళు మాత్రం పదే పదే పిలుస్తారు నేను వెళ్తాను దానికి కారణం ఏమిటి వెళ్ళినా వెళ్ళనట్టే వాళ్ళు పిలిచినా పిలువనట్టే అక్కడ ఉన్నా లేనట్టే అక్కడ నేను ఉన్న వాళ్ళు నాకు ప్రత్యేకంగా పోగానే నీళ్లు ఇవ్వడం కానీ ఏమీ ఉండదు నన్ను మర్చేపోవాలి సో విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం చాలా ప్రమాదం అష్టవక్రుడు తప్పుగా అర్థం చేసుకుని ఒక అవకాశాన్ని పదే పదే ఇస్తాడు.
(23:57) నిన్ననే ఎవరో ఒక మిత్రురాలు ఫోన్ చేసింది అష్టావక్రుని పరిపూర్ణంగా తప్పుగా అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఒక 100 ప్రశ్నలు వేసింది నేను ఆశ్చర్యపోయాను ఇలా ఎలా అర్థం చేసుకున్నాం ఇప్పుడు సర్వ సాక్షి సుఖీభవ విశ్వ సాక్షి సుఖంచర్ అని చెప్పాడు కదా ఇప్పుడు మా పిల్లవాడు పొయలో వేలు పెడుతున్నాడు సాక్షిగా ఉండమంటారా అండి అని అడిగింది.
(24:19) నేను నిజంగా జరిగిందా ఇది దయ్యం పోయి అతనికి ప్రమాదం జరుగుతుంటే ఆపు మరి సాక్షిగా ఉండమన్నారు కదా తప్పుగా అర్థం చేసుకుందాం సాక్షిగా ఉండడం అంటే ఏమి చేయకుండా ఉండేవాడిని కాదు సో సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేర్ ఈస్ ఏ ప్రాబ్లం నీ యొక్క మైండ్ పాటర్న్ అర్థం చేసుకోవడానికి కొంతకాలం సాక్షిగా ఉండు ఆ తర్వాత మరి తిరిగి కర్మలోకి రావలసింది ఎవరెస్ట్ శిఖరం మీద ఎవడు ఎల్లకాలం ఉండిపోడు ఎవరెస్ట్ శిఖరాన్ని అర్థం చేసుకొని మళ్ళీ నీళ్ల మీదకి రావలసిందే ఈత నేర్చుకోవాలంటే నీళ్లలో దిగవలసింద కానీ ఈత వచ్చిన తర్వాత నిరంతరం నీళ్లలో ఉండక్కర్లేదు. అట్లాగే సాక్షి భావన మనసు
(25:01) యొక్క చరమ స్థితిని అర్థం చేసుకోవడానికి ధ్యానం యొక్క చరమ స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రగాడ అనుభూతి సాక్షి భావన వేరేవాళ్ళు ఏం చేస్తున్నాో చూడమని కాదు వేరేవాళ్ళు ఏమన్నా చేస్తున్నప్పుడు నీ వస్తువో నీ మనిషో ఏదో పగిలినప్పుడో విడిపోయినప్పుడో నీ మనసులో జరిగే సంవేదనలు చూడమని దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అష్టవకుడు ఏమి చేయొద్దు అన్నాడు నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అరే బాపురే అష్టవకుడు అట్లా చెప్పలేదు తల్లి ఏది అత్యంత అవసరమో గుర్తించు ఆ మాత్రం కర్తాభావ నేను జాబ్ చేస్తున్నాను నేను మాత్రమే జాబ్ చేస్తున్నా కుటుంబాన్ని
(25:36) పోషిస్తున్నాను నేను తోపు ఇట్లాంటి ఆలోచనలు వదిలేయ్ ఎవ్రీడే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు ప్రతి హాఫ్ నర ఒక చిన్న ప్రశ్న అన్ని తప్పు నేను చెప్పాను దయచేసి తిరిగి విను సో మూర్ఖుడు ఏ విషయాన్ని పట్టుకున్నా అందులో మూర్ఖత్వమే చూస్తాడు. చేతికి బురద అంటినవాడు బంగారం పట్టుకున్న సరే దానికి బురద అంటిస్తాడు.
(26:02) సో సరిగ్గా అర్థం చేసుకో ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు ఏకాగ్రత నిరోధోవ మూడై అభ్యాసతే భృషం ధీరాహ కృత్యం నపశ్యంతి సుప్తవత్ స్వాసదేసిత రమణ మహర్షి చెప్పిన సారమంతా ఇందులో ఉంది నిద్రలో సుషుప్తిలో నువ్వు అనుభవిస్తున్న పరమ సుఖం ఏదైతే ఉందో అది నీ నిజ స్వభావం అదే మోక్షము అదే ముక్తి అదే జ్ఞానము అదే చైతన్యము అదే ఎరుక అన్ని అదే కానీ అక్కడ నీవు లేవు సో మెలకోవలో ఆ స్థితి నువ్వు
(26:47) అనుభవిస్తే అదే మోక్షం అదే ముక్తి అదే జ్ఞానం అని చెప్పాడు ఇది సౌప్రతిషత్ సత్యం అది నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవా ఇర్రెలవెంట్ సో ఏకాగ్రత నిరోధావ మూడై అంటే ఎవడైతే విషయాన్ని అర్థం చేసుకోలేదో అట్లాంటివాడు ఏకాగ్రతను ఆశ్రయిస్తాడు. సమస్తాన్ని శత్రువు చేసుకుంటాడు ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసా సమస్తాన్ని నువ్వు శత్రువు చేసుకొని సమస్తంతో పోరాడుతూ ఒక్క విషయం మీదకి మనసు లగ్నం చేయడం ఏకాగ్రత ఎక్కువసేపు పనికి రాదు. ఎందుకంటే
(27:32) ఏకాగ్రతలో అహంకారం యొక్క పరిపుష్టి ఉంది. సో అజ్ఞాని ఎవడు నిరంతరం ఏకాగ్రమై ఉండే ప్రయత్నం చేస్తాడు. అతని మనసు ఏకాగ్రం అవ్వట్లేదు అతని మనసు నిలబడట్లేదు కాబట్టి ఏకాగ్ర ఉదాహరణకి కాళ్ళు సరిగ్గా లేనివాడే సరిగ్గా నిలబడే ప్రయత్నం చేస్తాడు తాగుబోతు మాత్రమే సరిగ్గా మాట్లాడాలని ట్రై చేస్తాడు సరిగ్గా మాట్లాడేవాడు ప్రయత్నమే చేయడు మాట్లాడతాడు.
(27:56) సో సహజంగా మనసు కూర్చున్న వాడికి ఏకాగ్రత ఎందుకు బాయసాబ్ సో ఏకాగ్రత మొండిపట్టు హటం ఇదంతా అహంకారం యొక్క చేష్ట ధీరః కృత్యం నపశ్యంతి కానీ ఎవడు ధీర పురుషుడు ఎవడు జ్ఞాని అంటే [గురకలు] నిద్రలో సుషుప్తిని అనుభవించినంత అలవోకగా మెలుకోవలోనూ ఉంటాడు ఇప్పుడే నిద్ర లేచి కూర్చున్నట్టు హాయిగా ఉంటాడు నిరంతరం ఇది నిజంగా నా అనుభవంగా చెప్తున్నా మా శేఖర్ విన్సి అని ఎప్పుడు ఈ మాట చెప్తాడు అన్నా నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు
(28:42) మాట్లాడిన నీ వాయిస్ ఒకేలా ఉంటది. ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటిది చూడలేదు అంటాడు నేను అన్నా నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. బికాజ నా మనసులో కొన్ని సంవత్సరాలుగా ఏ బరువు లేదు లక్ష్యము లేదు వేరేవాడిని మోయడం లేదు సాధించేది లేదు కోల్పోయేది లేదు నా కులము లేదు మతం లేదు నిద్రలో ఏవేవి లేవో మెలుకులో అవన్నీ లేకుండా చూసుకుంటే గనుక అంతకుమించిన గొప్ప సాధన లేదు.
(29:07) దయచేసి ఈ విషయాన్ని మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి గోడ మీద రాసి పెట్టుకోండి వీళ్ళతే టాటూ వేయించ నిద్రలో సుశుక్తిలో ఎలా ఉన్నాను మెలుకోలో అలా ఉంటాను ఎలా దానికి మార్గం ఏమిటి నిద్రలో కులం లేదు నిద్రలో మతం లేదు నిద్రలో నువ్వు లేవు ఆడ లేదు మొగ లేదు నిద్రలో నీ బంగారం లేదు దాని అర్థం లేదని కాదు నీకు దానికి సంబంధం లేదని సో నిద్రలో ఒక్కొకసారి దుప్పటి కప్పుకుంటావ్ అది అవసరం ఉంది కాబట్టి నిద్రలో ముఖం మీద ఏదైనా వాళ్ళతే పక్కక జరుపుతా అవసరం ఉంది కాబట్టి నిద్రలో ఎవరిదైనా చేయ తగిలితే తీసి పక్కకేస్తా సో ఏదైతే అత్యయితే ఆవశకం ఉందో అది ఉంటుంది
(29:45) అంతే మిగతావన్నీ పక్కక జరుగుతాయి సో మెలుకువలో కూడా ఇప్పుడు నువ్వు చాలా ధ్యానాలు గటరా చేస్తున్నావు మెలుకువలో నీ కులం నీ మతం నీకు గుర్తుకు ఉందనుకో ప్రపంచంలో అవన్నీ అవసరం కాదను కానీ దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావ అనుకో నీకు ఏమి అర్థం కాలేదుఅన్న విషయం రాసి పెట్టుకో సో మెలుకువలో నిద్రా స్థితి సుషుప్తిని అనుభవిస్తాడు జ్ఞాని అష్టవకుడు చెప్తున్నాడు నిద్రలో ఏ ఏకాగ్రత ఉందబ్బా మెలుకులో ఏకాగ్రత ఏకాగ్రమయ్యేటువంటి మనసు అట్లా ఏకాగ్రం చేసేవాడే అహంకారి ద్వంద్వము ఏకాగ్రత తెలుసా మీకు ఏకాగ్రంగా ఒకటి చేస్తున్నావ అంటే దానికి
(30:31) విపరీతంగా ఇంకేదో బయట ఉంది దానినుంచి మనసు తప్పించడానికి నువ్వు ఏకాగ్రం చేస్తున్నావ్ దేని పట్ల వ్యామోహం లేకపోతే ఏకాగ్రత ఎందుకు దీనికి ప్రత్యేకత ఇవ్వకపోతే ఏకాగ్రత ఎందుకు జస్ట్ నీ పని నువ్వు చేస్తున్నావు సాధించాలన్న లక్ష్యం లేకపోతే ఏకాగ్రత ఎందుకు ఏకాగ్రత రెండు రకాలు ద్వంద్వం వల్ల వచ్చే ఏకాగ్రతలో ఒక రకమైన స్ట్రెస్ ఉంటది.
(30:57) సో అది ఏకాగ్రత ఆగ్రహం ఉంది అందులో నిజానికి ఏక ఉగ్రత అనాలి దాన్ని ఇక్కడ ఏకాగ్రత చల్లగా అంటే అందులో వేరే దాని మీద ఫోకస్ తీసేసి దీని మీద పెట్టాలన్న ఆలోచన లేదు ఏ పని చేస్తున్నాం అక్కడ మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉంది. సో ఇది ఏకాగ్రత అనే పదం వాడడానికి వీలు లేదు అయినప్పటికిని మనకి పదాల అభావం ఉంది కాబట్టి ఆ పదం వాడుతున్నాం.
(31:26) సో ఇతరుల చింత లేకుండా లక్ష్యం ఒక్కదాన్ని ధ్యానించడం ఏకాగ్రత ఏకాగ్రత గాని చిత్త నిరోధం గాని ఒకవేళ చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుందని భావించిన వాళ్ళు కొంతకాలం ఏకాగ్రతని అలవరచుకోవడం మంచిదే ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నావ్ కాస్త ఏకాగ్రత అవసరం ఎందుకంటే సైకిల్ ఇంకా నీకు చిక్కలేదు సైకిల్ నీకు చిక్కిన మరక్షణం ఏకాగ్రత అంతమైంది ఒక సహజ ధ్యాస ఉంటుంది ధ్యాస అన్నిటి మీద ఉంటుంది నీ సైకిల్ మీద ఎంత ఉందో రోడ్డు మీద అంతే ఉంటుంది ఎదురుగా వచ్చే వాహనం మీద అందుకే అనేకాగ్రత అనేకాగ్రతతో పాటు సర్వం మీద ఎరుక విస్తరిస్తుంది ఒక రకమైన
(32:13) సహజమైన అప్రమత్తత ఏర్పడుతుంది. జాగరూకత ఏర్పడుతుంది అంతే సో జ్ఞాని నిద్రలో ఎంత హాయిని అనుభవిస్తాడో మెలుకువలోనూ అంత హాయిని అనుభవిస్తాడు. ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇది నిజంగా సత్యం ఈ క్షణం అది అనుభవిస్తే మీకు చెప్తున్నాను మీరు నమ్ముతే నమ్మండి లేకపోతే లేదు నేను సాధించేది లేదు కోల్పోయేది లేదు. వేరేవాడు ఉంటే కదా ఇప్పుడు సాధించావు ఎవ్వరు మెచ్చుకోకపోతే ఏమనా సాధిస్తావా నువ్వు ఒక వ్యక్తి బిల్లు ఎక్కువ పెట్టి ఒలంపిక్స్ లో బాణం వేస్తున్నాడు.
(32:59) హటాతగా తెలిసింది ఒలంపిక్స్ లో ఆ స్పోర్ట్స్ తీసేశారని అతని పరిస్థితి ఏమిటి బాణం వేస్తాడా గుర్తింపు కోసం చేయడం అనేది ఒక రుగ్మత ప్రపంచంలో దానికి చాలా విలువ ఉంది నేనే చెప్తున్నా అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు అట్లాంటి వాళ్ళని నేను అభినందిస్తాను టెక్స్ట్ మెసేజ్ కూడా పెడతాను విష్ యు ఆల్ ద బెస్ట్ ఐ యమ సో ప్రౌడ్ ఆఫ్ యు ఊరికే పెడతాను అంతే ఎందుకంటే ఇప్పుడు సత్యం చెప్తే జీవితాలు ఉల్టా పల్టా అయిపోతాయి సత్యం చెప్పనా నిన్ను గుర్తించేవాడు లేకపోతే అసలు నువ్వు సాధించాలన్న ఆశనే పోతది.
(33:40) నిజం [నవ్వు] గుర్తించేవాళ్ళు ఎంత ఎక్కువమంది ఉంటే అంత సాధించాలన్న ఒక కాంక్ష పుడుతది. నువ్వు చాలా పెద్ద అవార్డు తెచ్చుకున్నావు ఎవ్వడు అప్రిషియేట్ చేయలేదు అనుకో ఎవ్వడు తలెత్తి కూడా చూడలేదుఅనుకో నీకు ఇంట్రెస్ట్ పోతది కానీ అష్టవకుడు చెప్తున్న పద్ధతిలో ఒకవేళ అది అతనికి ఆసక్తి గనుక ఉంటే అదే స్వభావం అయితే ఎవ్వరు చూసినా చూడకపోయినా అతను కొనసాగిస్తాడు.
(34:08) అష్టవక్రుడు సరిగ్గా అర్థం కాకపోతే నువ్వు నిష్క్రియాపరుడుగా మారే ప్రమాదం ఉంది కర్త భావను వదిలిపెట్టకుండా అష్టవక్రుడు సరిగ్గా అర్థమైతే అన్ని పనులు చేస్తాం. ఎంత అద్భుతమైన విషయం తెలుసా పని అంటే ఒక సహజ సామరస్య పూర్వకమైన కదలిక అందులో జయాజయాలకు అస్సలు తావు లేదు. నువ్వు ఒక సరితలా మారిపోతావ్ నువ్వు ఒక సహజ నది ప్రవాహంలా మారిపోతావ్ ఒక పిల్ల గాలిలా మారిపోతావ్ మారిపో అప్రయత్నతలోకి రా అక్కడి నుంచి ఒక్కడు ముందుకి ఇక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూన్నాను.
(34:55) రిసరసవైస మీ అందరూ నిద్రలో అనుభవించే ఆ సుషుప్తిని మెలుకువలో కూడా అనుభవించడానికి చేసే చిన్న ప్రయత్నమే ఆధ్యాత్మికత అని చెబుతూ ఇక్కడి నుంచే మీ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరసువైస

No comments:

Post a Comment