J. Krishnamurti చెప్పిన 6 భయంకరమైన నిజాలు | Life Changing Philosophy Telugu Geeks
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aYsY5EgJTUo
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? 2015 హైటెక్ సిటీ గ్లాస్ బిల్డింగ్స్ వెనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు. అందరికీ అదొక అందమైన సాయంత్రం కానీ నాకు మాత్రం అదొక ఊపిరాడని స్టేట్ అన్నమాట. నా క్యాబిన్ లో నేను కూర్చుని స్క్రీన్ వైపు చూస్తున్నా. కోడ్ రన్ అవుతుంది. ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి.
(00:21) ప్రతి నెల అకౌంట్ లోకి శాలరీ క్రెడిట్ అవుతుంది. బయట ప్రపంచానికి నేను సెటిల్ అయిపోయాను సక్సెస్ఫుల్ అయిపోయాను అనిపిస్తుంది. కానీ లోపల అంటే నా లోపల ఒక నిశబ్దం ఉంది ఆ నిశబ్దంలో నుంచి ఒక అరుపు కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం ఆఫీస్ క్యాబ్ ఎక్కగానే నా మనసు అడిగేది సందీప్ నువ్వు బ్రతుకుతున్నావా లేక కేవలం పని చేస్తున్నావా అని ఒక రోబోట్ లాగా రోజుని గడపడం నచ్చకపోయినా నవ్వుతూ బాస్ కి విష్ చేయడం వీకెండ్స్ లో ఆ స్ట్రెస్ ని మర్చిపోవడానికి పబ్బుల్లోనో లేకపోతే ఏదైనా సినిమాల్లోనో ఫ్రెండ్స్ తోనో కనుమరుగైపోవడం నా కళ్ళ ముందే నా యూత్ నా డ్రీమ్స్ నా ఎనర్జీ నా ఉత్సాహం
(00:58) ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. అప్పుడే నాకు అర్థమయింది నేను ఒక బంగారు పంజరంలో ఉన్నాను. ఆ పంజరం పేరే ఈ సొసైటీ ఇచ్చిన సెక్యూరిటీ అలాంటి ఒక చీకటి రోజున నా టేబుల్ మీద ఒక పుస్తకం పడింది అదే వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ లైఫ్ ఈ పుస్తకం జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన చాలా మాటల నుంచి వారి శిష్యులు ఆయన ఫౌండేషన్ లో పని చేసే వాళ్ళందరూ కొన్ని మంచి మంచి మాటల్ని ఈ పుస్తకం రూపంలోకి తీసుకొచ్చారు.
(01:27) అండ్ నేను చదివిన పుస్తకం 2001 ఎడిషన్ అది ఇంకొంచెం బ్లండ్ గా ఉంటుంది. ఇది 2017 ఎడిషన్ ఆ మాటలు చదువుతుంటే ఎవరో నా మొహం మీద ఒక చన్నీళ్లు చల్లినట్టు అనిపించింది. ఆయన నా హోదాను చూడలేదు నా బ్యాంక్ బ్యాలెన్స్ ని చూడలేదు ఆయన నేరుగా జిడ్డు కృష్ణమూర్తి గారు నా ఆత్మను నిలదీశారు. ఆ క్షణం నుంచి నా లైఫ్ లో ఎర్రర్ 404 రావడం మొదలైంది.
(01:54) ఆ ఎర్రర్ లో నుంచే నా అసలైన ప్రయాణం మొదలైంది. సో ఒక నార్మల్ జాబ్ లైఫ్ నుండి బయటిక వచ్చి ఇప్పుడు ఈ కెమెరా ముందు కూర్చుని మీతో మాట్లాడుతున్నాను. అండ్ దానికి కారణం ఈ పుస్తకం ఒకటే అన్నాను చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ అందులో నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకం అయితే ఇది. అండ్ ఈ పుస్తకంలో నేను నేర్చుకున్న చాలా విషయాలని మీతో రెండు మూడు వీడియోల్లో షేర్ చేసుకున్నాను.
(02:16) ఈ వీడియోలో ఇంకొన్ని భయంకరమైన నిజాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇది విన్నాక మీ లైఫ్ ని చూసే ఆ యాంగిల్ కొంచెం మారుతుంది అందులో సందేహమే లేదు నాది ప్రామిస్ సో ఆర్ యు రెడీ టు బ్రేక్ ద స్క్రిప్ట్ నిజం చెప్పాలంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన బ్రెయిన్ లోకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉంటారు. మన పేరెంట్స్ మన టీచర్స్ మన చుట్టూ ఉండే సొసైటీ అందరూ కలిసి మనకి కొన్ని రూల్స్ నేర్పించారు.
(02:55) ఇలా ఉంటేనే నువ్వు మంచి పిల్లోడివి ఇలాంటి జాబ్ వస్తేనే నువ్వు సక్సెస్ అయ్యావు లేకపోతే ఇవన్నీ అవ్వకపోతే నువ్వు వేస్ట్ అని మనల్ని ఒక పద్ధతిలో పెంచారు. అలాగే నేను కూడా జాబ్ లో ఉన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించారు. పక్కవాడికి అంత ప్యాకేజ్ వచ్చింది మరి నాకు ఎప్పుడు వస్తుంది వాడు కారు కొన్నాడు నేను ఎప్పుడు కొంటాను అని ఎప్పుడు ఒక కంపారిజన్ లో ఉండేవాడిని కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే నీ ఆలోచనలు అసలు నీవి కావు అంటే నీకు వస్తున్న ఏ థాట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నీవి కావు నీ బ్రెయిన్ లో ఉన్న ప్రతి నమ్మకం ప్రతి భయం అన్ని నీ మీద రుద్దబడ్డ
(03:28) ప్రోగ్రామింగ్ మాత్రమే నువ్వు ఒక జాబ్ చేయాలి అని నీకంటే ఎక్కువగా నీ చుట్టూ ఉన్నవాళ్లే కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు ఆ రూట్లోకి వెళ్ళవు ఎప్పుడైతే నువ్వు వాళ్ళఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నావో అక్కడే నీ ఒరిజినాలిటీ చనిపోతుంది అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంటే దానికి కారణం నీకు ఆ పని మీద ఇష్టం ఉండి కాదు కేవలం బయట ప్రపంచం నిన్ను ఒక సక్సెస్ లా చూడాలి అనే ఆశ నీకు ఉంది.
(03:53) ఈ కండిషనింగ్ అనే వలలో నుంచి నువ్వు బయటికి రానంతవరకు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అది సంపాదించినట్టే అవుతుంది తప్ప బ్రతికినట్టు కాదు. సొసైటీ నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ని చదవడం మానే నీ సొంత ఆలోచన ఏంటో గుర్తుపట్టడమే నువ్వు నీ లైఫ్ కి ఇచ్చే అసలైన గౌరవం. అలాగే ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారి ఉద్దేశం ఏంటంటే నువ్వు జాబ్ మానే ఒంటరిగా కూర్చో అని కాదు ఏం చేసినా జాబ్ లో ఉన్న బిజినెస్ లో ఉన్న బ్రతకాలి.
(04:20) బ్రతుకుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే నెక్స్ట్ పాయింట్ లో అర్థంయపోతుంది. మనందరం దేనికోసం పరిగెడుతున్నాం ఒకటే మాట లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే కదా ఒక సేఫ్ జాబ్ ఉండాలి నెలాకరికి జీతం రావాలి మనల్ని ఎవరు వదిలి వెళ్ళని రిలేషన్స్ మనకు ఉండాలి. అంటే అంతా మన కంట్రోల్ లో ఉండాలి రేపు ఏం జరుగుతుందో మనకు ముందే తెలియాలి. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే లైఫ్ లో సెక్యూరిటీ అనేది అసలు లేదు అది నువ్వు ఆలోచిస్తున్నావ అంటే అది ఒక పెద్ద అబద్ధం సో ఇది నిజమా కాదా అనేది పక్కన పెట్టి ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం మీరు చేస్తున్న జాబ్ రేపు ఎలా ఉంటుందో
(04:58) మీకు తెలుసా లేదు మీ రిలేషన్షిప్స్ రేపు ఎలా ఉంటాయో మీకు తెలుసా అసలు గ్యారెంటీ ఉందా లేదు కానీ మనం ఆ లేని సెక్యూరిటీని పట్టుకొని వేలాడుతున్నాం. ఈ భద్రత కోసం మనం చేసే అతి పెద్ద త్యాగం ఏంటంటే మన ఫ్రీడమ మన స్వేచ్ఛని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. నేను కూడా అలాగే ఆలోచించేవాడిని ఈ కంపెనీలో ఉంటే చాలు లైఫ్ సేఫ్ అనుకునేవాడిని కానీ ఆ సేఫ్టీ లో నుంచి పుట్టింది భయం మీరే ఆలోచించండి మనం ఒక పాయింట్ లో సేఫ్ ఉంది ఇక్కడ సేఫ్టీ ఉంది అని అనుకుంటున్నావ అంటే అది లేకపోతే భయం ఉంటుంది అని మనకి తెలుసు నువ్వు దేన్నైతే సేఫ్ అనుకుంటున్నావో అది ఎక్కడ
(05:34) పోతుందో అని నీలో ఒక అభద్రత భావం ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. జాబ్ పోతే ఎలా జాబ్ ఉంది కాబట్టి సేఫ్టీ ఉందని అనుకుంటాం కానీ జాబ్ పోతే ఎలా అని భయపడతాం. ఆ భయంతో ఏం చేస్తాం అనవసరంగా బాస్ కి ఆయన చెప్పింది ఏదో తలవంచుతా ఉంటాం. ఇప్పుడు రిలేషన్షిప్ ఉంది మనతో పాటు వీళ్ళు ఉన్నారు అని సేఫ్టీ ఫీల్ అవుతాం.
(05:56) కానీ అదే టైంలో ఈ రిలేషన్షిప్ పోతే ఏంటి అని భయపడి మీ వ్యక్తిత్వాన్ని మీరు చంపేసుకుంటున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పే ఒక వింతైన నిజం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు లైఫ్ అంటేనే ఒక అన్సర్టెనిటీ అని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నీలో ఉన్న భయం చచ్చిపోతుంది. ఏది పర్మనెంట్ కాదు అని తెలిసినప్పుడు నువ్వు ఈ క్షణాన్ని నిండుగా బ్రతకడం మొదలు పెడతావ్.
(06:19) సెక్యూరిటీ కోసం వెతికేవాడు ఒక డెడ్ పర్సన్ లాంటోడు ఇన్సెక్యూరిటీని ఎంజాయ్ చేసేవాడే అసలైన జీవం ఉన్న మనిషి నీ లైఫ్ ని సేఫ్ గా మార్చుకోవాలని చూడకు నీ లైఫ్ ని సజీవంగా మార్చుకోవాలని చూడు అగైన్ పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నా జాబ్ చేస్తున్నా లేకపోతే జాబ్ మానేసి బిజినెస్ చేస్తున్నా ఎప్పుడు ఏమవుతుందో అనే భయంలో ఉండటం మానేసి లైఫ్ అంటే అదే కదా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కదా మనం దాన్ని కంట్రోల్ చేయలేం కదా అని గ్రహించి దాన్ని దాన్ని ఒప్పుకుంటే ఆ క్షణం నుంచే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అర్థం అవుతుంది.
(06:52) ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఏ వల్ల చాలా అన్సర్టనిటీ అమ్మో ఏ వల్ల కాంటెంట్ క్రియేటర్స్ జాబ్స్ ఎలా ఉంటాయి ఏ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయి ఏ వల్ల ఎడిటర్ జాబ్ ఎలా ఉంటుంది ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి. ఈ ఏ వల్ల ఈ ఛానల్ వీడియోస్ ఎలా చేయాలని ఆలోచించేవాడిని కానీ ఆ టైంలో నేను మళ్ళీ ఆ ఆలోచనని పక్కకు పెట్టి లెట్స్ స్టార్ట్ సంథింగ్ న్యూ అని ఆలోచించి నేను చదివిన పుస్తకాల నుంచి నేను నేర్చుకున్న విషయాల్ని తెలుగు గీక్స్ అకాడమీలో పెట్టడం మొదలు పెట్టాం.
(07:20) అండ్ తెలుగు గీక్స్ అకాడమీకి కూడా ఒక రకంగా ఈ పుస్తకమే హెల్ప్ చేశం. ఫస్ట్ డైలీ ఇంప్రూవ్మెంట్ అని ఒక లైఫ్ గురించి కంప్లీట్ 360 వ్యూ ఉండే కోర్స్ ని క్రియేట్ చేశం. నెక్స్ట్ కమ్యూనికేషన్ మీద చేశం. నెక్స్ట్ ఇప్పుడు టైం మాస్ట్రీ ఎవరిని ఫాలో అవ్వకుండా మనకి కుదిరే ఒక సిస్టం ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఈ కోర్సు లో చెప్తున్నాను. ఇది 15 మే నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ చాలా మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు ఎర్లీ బోర్డ్ యక్సెస్ కూడా తీసుకున్నారు.
(07:43) సో మీలో ఇంకా ఎవరైనా ఈ ప్రోగ్రాం్ ని స్టార్ట్ చేయాలి మీరు కూడా మే 15 నుంచి ఈ ప్రోగ్రాం చూడాలి అని అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే 2499 ఉన్న కోర్స్ ని 999 కే అందిస్తున్నాం. అండ్ లాంచ్ 15 మే నుంచి సో 16 నుంచి ప్రైసెస్ పెరుగుతాయి. అండ్ ఇందులో మీకు వచ్చేవి ఏంటంటే ఒకటి లైఫ్ టైం యక్సెస్ టు ద కోర్స్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ డౌన్లోడబుల్ వర్క్ షీట్స్ అఫర్మేషన్స్ అండ్ గైడెడ్ మెడిటేషన్స్ ఇలా ఇంకా చాలా ఉంటాయి.
(08:11) దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిండు కామెంట్ లో ఉంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణమూర్తి గారు ఒక ప్రైమరీ క్వశ్చన్ అడుగుతారు అదేంటంటే నువ్వు ఎప్పుడైనా నిన్ను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూశవా లేక ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకుంటూనే ఉన్నావా ఆయన దృష్టిలో పోలిక అనేది నీ మీద నువ్వు చేసుకునే దౌర్జన్యం మనం చిన్నప్పటి నుండి వాడిలా అవ్వాలి వీడిలా ఉండాలని నేర్చుకున్నావ్ కానీ ఇంకొకరిలా అవ్వాలని ప్రయత్నించిన క్షణమే నీలో ఉన్న ఆ ప్యూరిటీని నువ్వు చంపేసుకుంటున్నావ్ ఒక గులాబీ పువ్వు ఎప్పుడైనా మల్లె పువ్వులా అవ్వాలని ప్రయత్నిస్తుందా లేదు అది తనలా
(08:51) తాను ఉండటంతోనే దాని పరిమలం ఉంది అని దానికి తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం వాడు నాకంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదిస్తున్నాడు వాడు నాకంటే హ్యాపీగా ఉన్నాడు అని నిరంతరం మనల్ని మనం హింసించుకుంటున్నాం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే కంపారిజన్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నువ్వు ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతావో నీ తెలివి తేటలు అక్కడితో ఆగిపోతాయి ఎందుకంటే నీ ఫోకస్ నీ మీద లేదు పక్కవాడి మీద ఉంది.
(09:18) నా జాబ్ డేస్ లో నేను కూడా ఇదే ట్రాప్ లో పడ్డా నా పక్క క్యూబికల్ లో ఉండేవాడికి ప్రమోషన్ వస్తే నా లోపల ఏదో తెలియని బాధ కలిగేది. వాడితో పోల్చుకొని నేను ఫెయిల్యూర్ ఏమో అని భయపడేవాడిని కానీ ఈ పుస్తకం చదివాక నాకు అర్థమయింది నేను వాడితో పోటీ పడట్లేదు నాతో నేనే యుద్ధం చేస్తున్నాను అని మనందరం కూడా ఒక రేస్ లో పరిగెడుతున్నాం అని అనుకుంటాం కానీ మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే అసలు అక్కడ రేసే లేదు.
(09:45) ఎవరి దారి వాళ్ళది నువ్వు ఎప్పుడైతే నేను నేనుగా ఉంటాను ఎవరితోనూ నాకేం సంబంధం లేదు అని ఆ పోలికను ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడే నీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. పక్కవాడి మెప్పు కోసం కాకుండా నీ పనిలో ఉన్న ఆ ఆనందం కోసం నువ్వు పని చేయడం మొదలు పెడతావ్. మనం పుట్టినప్పటి నుంచి మనకి నూరుపోసిన ఒక మాట ఏంటంటే లైఫ్ లో ఒక గోల్ ఉండాలి ఒక యంబిషన్ ఉండాలి.
(10:11) ఏదో ఒకటి సాధించారు కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే యంబిషన్ ఇస్ ద ఫామ్ ఆఫ్ వైలెన్స్ ఆశయం అనేది ఒక రకమైన హింస నీ మీద నువ్వు చేసుకునే హింస ఇది మనకు కొంచెం షాకింగ్ గా అనిపించొచ్చు ఎందుకంటే యంబిషన్ లేకుండా ఎవడు ఉంటాడు చెప్పండి యంబిషన్ లేకపోతే మనం ముందుకు ఎలా వెళ్తాం కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఇది కరెక్టా కాదా అనే జడ్జ్మెంట్ లేకుండా అసలు ఆలోచిద్దాం యంబిషన్ ఉన్న మనిషి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు భవిష్యత్తులో ఉంటాడు అంటే ఫ్యూచర్ లో ఉంటాడు వాడు ఈ రోజుని ఎంజాయ్ చేయలేడు వాడు ఈ రోజు చేసే ప్రతి పనిని రేపు రాబోయే ఏదో ఒక రిజల్ట్ కోసం వాడుకుంటాడు. అంటే వాడు
(10:43) రేపు అనే మాయ కోసం తన దగ్గర ఉన్న ఏకైక నిజాన్ని ఈ రోజుని బలి చేస్తున్నాడు. అలాగే నా జాబ్ డేస్ లో కూడా నేను ఇలాగే ఆలోచించేవాడి నెక్స్ట్ ప్రమోషన్ రావాలి వచ్చే ఏడాదిగా ఆన్ సైట్ వెళ్ళాలి ఇలా ఎప్పుడు నా మైండ్ లో ఒక పరుగు బంధం ఉండేది. ఆ పరుగులో పడి ఆఫీస్ పక్కన ఉన్న ఆ చెట్టుని చూడలేదు నా పక్కన ఉన్న మనిషి బాధను వినలేదు కనీసం నేను తినే అన్నం ఆ రుచిని కూడా ఆస్వాదించలేదు.
(11:07) ఎందుకంటే నా మైండ్ ఎప్పుడూ కూడా రేపటి మీద ఉండేది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఆశయం ఉన్నవాడు ఎప్పుడూ భయంలో ఉంటాడు ఆ గోల్ రీచ్ అవ్వకపోతే ఏంటి అని వాడు పక్కవాడిని తొక్కేయడానికి కూడా వెనకాడడు. వాడు ప్రేమించలేడు వాడు దయ చూపించలేడు వాడు కేవలం ఒక అచీవింగ్ మెషిన్ లా మారిపోతాడు. ఆయన ఏమంటారంటే ఏదో సాధించాలి అనే తాపత్రయంతో పని చేయకు ఆ పని మీద ఉన్న ప్రేమతో పని చెయ్ నువ్వు చేసే పనిని నువ్వు ప్రేమిస్తే అక్కడ ఆశయం ఉండదు అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది.
(11:40) ఆనందంతో చేసే పని అది ఇచ్చే రిజల్ట్ ఆశయంతో చేసే పని ఎప్పటికీ ఇవ్వలేదు. రేపటి విజయం కోసం ఈ రోజుని చంపేసుకోకు పని చెయ్ కానీ ఆ పనిలో నిన్ను నువ్వు మారిపోయేలా చెయ్ అండ్ ఎగజాక్ట్ గా ఇదే రీజన్ తో 2017లో తెలుగు గిక్స్ మా అన్నయ్య నేను కలిసి స్టార్ట్ చేశను కాంటెంట్ చేయాలి కానీ ఏదో చేసేసామ అని కాకుండా అందరికీ ఉపయోగపడుతుంది అనే సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉండాలి అని మా అన్నయ్య చెప్తూ ఉండేవాడు.
(12:07) అందుకే ఈ ఛానల్లో ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగం లేనిది అంటూ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పటి దాకా అయితే అదే ప్రయత్నం కొనసాగుతుంది. మనందరం చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా ఆనందాన్ని ఒక టార్గెట్ లా చూస్తాం నేను ఆ కారు కొంటే హ్యాపీగా ఉంటాను ఆ అమ్మాయితో పెళ్లి అయితే హ్యాపీగా ఉంటాను ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాం కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తారు ద మూమెంట్ యు సీక్ హ్యాపీనెస్ యు ఆర్ అన్హ్యాపీ అంటే నువ్వు ఆనందం కోసం వెతుకుతున్నావ అంటేనే ప్రస్తుతం నువ్వు ఆనందంగా లేవని అర్థం ఆయన దృష్టిలో ఆనందం
(12:43) అనేది నువ్వు మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు అది ఒక బై ప్రొడక్ట్ అంటే నువ్వు చేసే పనికి వచ్చే బై ప్రొడక్ట్ ఆనందం అది దానంతట అదే రావాలి నువ్వు ఎప్పుడైతే ఒక పనిలో పూర్తిగా లీనమైపోతావో అంటే అక్కడ నేను అనే ఆలోచన లేకుండా కేవలం ఆ పని మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు కలిగే ఆ ఫీలింగ్ పేరే ఆనందం ఆనందాన్ని వెతకడం మాని నువ్వు చేస్తున్న పనిని నువ్వు చూస్తున్న మనిషిని నువ్వు తింటున్న ఆ అన్నాన్ని ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఏ రిజల్ట్ ఆశించకుండా పూర్ పూర్తి అటెన్షన్తో గమనించు అప్పుడు నీకు తెలియకుండానే నీ లోపల ఒక ప్రశాంతత పుడుతుంది. ఆ ప్రశాంతతే
(13:20) అసలైన ఆనందం అది దేని మీద ఆధారపడదు అందుకే దాన్ని ఎవ్వరూ దొంగలించలేరు. మనందరం మనల్ని మనం మార్చుకోవాలి అని అనుకుంటాం. నాకు కోపం తగ్గాలి నాకు బద్ధకం పోవాలి నేను ఇంకా డిసిప్లిన్డ్ గా ఉండాలి అని మనతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ద అబ్జర్వర్ ఇస్ ద అబ్సర్వ్డ్ అని అంటారు అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించకు జస్ట్ నిన్ను నువ్వు గమనించడం మాత్రం నేర్చుకో అంతే గమనించడం అంటే ఏంటి నీకు కోపం వచ్చినప్పుడు అయ్యో నాకు కోపం వచ్చింది ఇది తప్పు నేను ప్రశాంతంగా ఉండాలి అని నీకు నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చుకోకు అలా చేస్తే నువ్వు నీ కోపాన్ని
(14:02) అనిచి వేస్తున్నావ్ అని అర్థం దానికి మళ్ళీ బయటికి రావాలనే ఉంటుంది ఆ కోపానికి సో దానికి బదులుగా ఆ కోపం నీ బాడీలో ఎక్కడ పుట్టింది అంటే మీకు కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు అది ఎక్కడ పుడుతుంది నీ శ్వాస ఎలా మారుతుంది నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీ కోపం వల్ల అని ఒక మూడో వ్యక్తి లాగా ఒక విట్నెస్ లాగా ఒక సైలెంట్ సాక్షి లాగా గమనించు నాకు కూడా చాలా భయంకరమైన కోపం ఉండేది నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలియక కుర్చీలు టేబుల్లు ఇరకొట్టేసిన రోజులు కూడా ఉన్నాయి అలా చేసినా కూడా అది ఇంకా పెరిగేది అండ్ ఈ
(14:35) బుక్ చదివాక నేను ఒక పని చేశాను నాకు చిరాకు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి ట్రై చేయకుండా జస్ట్ గమనించ గమనించడం మొదలు పెట్టాను విచిత్రం ఏంటో తెలుసా నువ్వు దేన్నైతే జడ్జ్మెంట్ లేకుండా గమనిస్తావో అది నీ మీద తన పట్టును కోలిపోతుంది. ఆ కోపం ఆ భయం దానంతట అదే కరిగిపోతాయి. దీన్నే ఆయన మన జెడ్డు కృష్ణమూర్తి గారు ఛాయిస్లెస్ అవేర్నెస్ అని అంటారు.
(14:58) ఏది మంచో ఏది చెడో అని డిసైడ్ చేయకుండా నీ మైండ్ లో కలిగే ప్రతి అలజడిడ్ని ఒక అద్దం లాగా గమనించు ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావో అప్పుడు మార్పు అనేది నీలో మొదలవుతుంది. అది దానంతటా అదే ఒక విస్ఫోటనం లాగా నీ జీవితంలోకి వస్తుంది. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం వీడియోలో చెప్పుకున్న అన్ని పాయింట్స్ ని ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం.
(15:22) ముందుగా ద ట్రాప్ ఆఫ్ కండిషనింగ్ సొసైటీ రాసిన స్క్రిప్ట్ ప్రకారం బ్రతకడం అంటే నీ ఒరిజినాలిటీని చంపుకోవడం నీ ఆలోచనలు నీవి కావని గుర్తించినప్పుడే నువ్వు ఈ కండిషనింగ్ వల నుండి బయటపడతావ్ చాప్టర్ 2 ద ఇల్యూషన్ ఆఫ్ సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం వెతకడం వల్ల భయం పుడుతుంది. అంతే తప్ప నిజమైన స్వేచ్ఛ దొరకదు జీవితం అంటేనే ఒక అనిశ్చితి అని ఒప్పుకున్నప్పుడే నువ్వు ఈ క్షణాన్ని సజీవంగా బతుకుతావు.
(15:48) చాప్టర్ 3 ద డిసీస్ ఆఫ్ కంపారిజన్ పోలిక అనేది నీతో నువ్వు చేసుకునే దౌర్జన్యం అది నీ తెలివి తేటల్ని నాశనం చేస్తుంది ఎవరితోను పోటీ పడకుండా నువ్వు నీలా ఉన్నప్పుడే నీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. చాప్టర్ఫోర్ యంబిషన్ ఇస్ ఏ డిసీస్ ఆశయం ఉన్నవాడు రేపటి కోసం ఈ రోజుని బలి ఇచ్చి ఒక మెషిన్ లా మారిపోతాడు. రిజల్ట్ కోసం కాకుండా చేసే పనిని ప్రేమిస్తే అక్కడ ఆశయం ఉండదు కేవలం ఆనందమే ఉంటుంది.
(16:14) చాప్టర్ఫైవ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఏ గోల్. ఆనందం కోసం వెతకడం అంటే ప్రస్తుతం నువ్వు ఆనందంగా లేవని ఒప్పుకోవడమే ప్రతి పనిని పూర్తి అటెన్షన్ తో గమనించినప్పుడు పుట్టే ఆ ప్రశాంతతే అసలైన ఆనందం చాప్టర్సిక్స్ ద పవర్ ఆఫ్ అబ్సర్వేషన్ నిన్ను నువ్వు మార్చుకోవాలని యుద్ధం చేయకుండా ఒక సాక్షిలా నిన్ను నువ్వు గమనించు జడ్జ్మెంట్ లేకుండా గమనించినప్పుడు నీలోని భయాలు కోపాలు దానంతటా అవే కరిగిపోతాయి.
(16:40) సో ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే అలాగే తెలుగు గిక్స్ అకాడమీ ని ఒకసారి చెక్ చేయండి ఇది తెలుగు గిక్స్ కి చాలా సపోర్ట్ గా ఉంటుంది. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.
No comments:
Post a Comment