"యోగులు"
Author Name:Mystic Bloom Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@Mysticbloom-w7p
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lp8HKMFVXVs
Transcript:
(00:00) నమస్కారం అందరికీ మన భారతదేశంలో ఎంతో మంది యోగులు ఉన్నారు. ఎంతో కాలం జీవించిన యోగులు ఉన్నారు. మనకి సుప్రసిద్ధమైనటువంటి యోగి త్రైలింగ స్వామి ఆయన 280 సంవత్సరాలు జీవించారు. ఇది ఏదో ఎవరో కల్పించిన బూటకం అయితే కాదు దీనికి సంబంధించి రుజువుగా సాధికారికమైన ప్రమాణాలు కూడా మనకి ఇప్పటికీ దొరుకుతున్నాయి. యోగుల చరిత్ర తెలిసినవారు యోగశాస్త్రం చదివినవారు ఈ విషయాలకు ఆశ్చర్యపోరు ఎందుకంటే వేల ఏళ్ల గల యోగులు హిమాలయాలు వంటి సిద్ధభూముల్లో నేటికి ఉన్నారు.
(00:40) మనకు ఒక యోగి గురించి తెలిసింది అంటే వెనక ఇంకా కొన్ని వేల మంది యోగులు ఉన్నారు. కానీ అందరి గురించి మనకు తెలియదు అంతే. ఈ జగతిని తరింపజేయడం కోసం నాస్తికతతో ప్రపంచం నిండిపోయి ఉన్నప్పుడు అలాగే ఆస్తికత ఆధ్యాత్మికత దెబ్బ తింటూ ఉన్నప్పుడు నిష్కామమైన యోగి సమాజంలోకి వస్తాడు. పతాంజలి యోగశాస్త్రంలో రకరకాల సిద్ధుల గురించి చెబుతారు.
(01:12) ఆ సిద్ధులలో బహుకాల జీవనం అంతరిక్ష గమనం ఇక్కడ ఉంటూనే మరొక చోట ఉండడం వంటి యోగులకు గల సిద్ధులను గూర్చి చెబుతారు. [గురకలు] పతాంజలి యోగశాస్త్రం ముఖ్యంగా రాజయోగాన్ని తెలియజేస్తుంది. మంత్ర యోగం, నాగయోగం, లయ యోగం, హటయోగం వంటి మరిన్ని యోగాలు కూడా ఉంటాయి. ఏ యోగమైనప్పటికీ ఎంతో కఠినమైన సాధనతో శ్రద్ధతో చేసినవారు ఎన్నో అద్భుతాలను సాధిస్తారు.
(01:46) అందరూ మహిమలు అనేది ఏదో ఒక ప్రాచూర్యం గురించి చేస్తారేమో అని భ్రమలో ఉంటారు. యోగులు నిష్కామమైన యోగులు గొప్ప గొప్ప సిద్ధపురుషులు వారు చేసే ఏ మహిమ కూడా ప్రాచుర్యం కోసం కాదు కచ్చితంగా అది ఒకరిని అనుగ్రహించడానికి మాత్రమే చేస్తారు. శంకర భగవత్పాదులు ఆ కంచి పరమాచార్య కంచి పరమాచార్య వంటివారు కూడా ఈ యొక్క మహిమల ద్వారా వీరు చేసినటువంటి మహిమల ద్వారా ఎంతోమంది ఫలితం పొందిన వారు కూడా ఉన్నారు.
(02:25) వారి యొక్క కరుణే మనకి ఆ మహిమగా తోస్తుంది.
No comments:
Post a Comment