Friday, May 15, 2026

The Psychology of Fear: How Your Brain Creates the Illusion of Fear | JK philosophy

The Psychology of Fear: How Your Brain Creates the Illusion of Fear | JK philosophy

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2ASJGF6HfX4



Transcript:
(00:06) మనం బ్రతికినన్ని రోజులు దేనికో దానికి భయపడుతూనే చస్తున్నాం. చిన్నప్పుడు చీకటి అంటే భయం యవ్వనంలో ఆ చెత్త భవిష్యత్తు గురించి భయం ఆ పైన ఎవడో ఏదో అనుకుంటాడనే సోషల్ భయం ముసలితనంలో చావు అంటే భయం అంటే మన లైఫ్ మొత్తం ఒక భయం నీడలోనే చస్తుంది. అటు యుద్ధాల కోసం ఆయుధాల తయారీ కోసం మన బుర్రని పిండి పారేస్తున్నాం.
(00:34) వేల మంది జనరల్స్ సైంటిస్టులు కలిసి వినాశకరమైన ఆయుధాలు చేయడానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అంటే ఒక మనిషి తన బ్రెయిన్ ను బయటి ప్రపంచంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లేదా తన పవర్ చూపించడానికి ఎక్స్ట్రార్డినరీగా వాడుతున్నాడు. కానీ అదే బ్రెయిన్ ను తన లోపలున్న భయాన్ని చంపడానికి ఎందుకు వాడటం లేదు.
(00:59) ఆకలి వేస్తే అన్నం కోసం ఎంతలా కొట్టుకుంటామో డబ్బు కోసం ఎంతలా కష్టపడతామో అంత సీరియస్ గా మనలోని భయాన్ని ఎందుకు ఫేస్ చేయడం లేదు ఈ సైకాలజిస్ట్ులు భయానికి 100 కారణాలు చెప్పొచ్చు. కానీ నిజానికి వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ లో భయపడేవారే అంటే ఆకలి గురించి 100 పుస్తకాలు చదివితే ఆకలి తీరదు అలాగే భయం గురించి వేల సిద్ధాంతాలు వింటే భయం పోదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం భయం అనే చెట్టు కొమ్మల్ని కత్తిరిస్తున్నామా లేక వేర్లనే తీసేస్తున్నామా అని కొమ్మలు అంటే బయటికి కనిపించే భయాలు అవి కత్తిరిస్తే మళ్ళీ వస్తాయి కానీ వేరుని పట్టుకుంటే ఇక చెట్టే ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకడు రాత్రి
(01:43) అడవిలో వెళ్తున్నాడు. దూరంగా ఒక వంకర ఆకారం కనిపిస్తుంది. వెంటనే వాడి బ్రెయిన్ అది పాము అని ఫిక్స్ అయిపోతుంది. వెంటనే గుండె వేగం పెరిగి చెమటలు పట్టి శరీరం గడ్డకట్టుకుపోతుంది. ఇక్కడ భయం కలిగింది ఆ వస్తువు వల్ల కాదు ఆ వస్తువుని చూడగానే బ్రెయిన్ క్రియేట్ చేసిన పాము అనే థాట్ వల్ల తీరా దగ్గరికి వెళ్లి చూస్తే అదిఒక తాడు ఆ సెకండ్ లో భయం గాయబ్ అంటే నిజం తెలియగానే భయం పోయింది.
(02:15) మరి కానీ ఫ్యూచర్ గురించి ఒంటరితనం గురించి వచ్చే భయాలు ఎందుకు పోవట్లేదు? ఎందుకంటే మనం ఆ భయాన్ని కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయకుండా దాని నుండి పారిపోవాలని చూస్తున్నాం. భయం వేయగానే టీవీ చూడడం ఎవరితోనో మాట్లాడడం, గుడికి వెళ్ళడం లేదా మందు కొట్టడం ఇవన్నీ భయం నుండి తప్పించుకోవడానికి మనం వేసుకునే చీప్ ముసుగులే.
(02:40) జేకే చెప్పినట్లు భయానికి మెయిన్ కారణం ఆలోచన మరియు కాలం రేపు ఉద్యోగం పోతుందేమో అనే థాట్ భయాన్ని ఇస్తుంది. ఇక్కడ రేపు అనేది కాలం జాబ్ పోవడం అనేది థాట్ ఈ రెండు కలిస్తేనే భయం పుడుతుంది. ప్రెసెంట్ మూమెంట్ లో అసలు భయమే ఉండదు. లేదు కూడా అది ఎప్పుడూ పాస్ట్ లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడే వస్తుంది. నీ మైండ్ ఒక ల్ాబ్ అనుకుంటే నువ్వు అక్కడ ఒక అబ్సర్వర్ లా ఉండాలి.
(03:09) నీ ఒంటరితనాన్ని తీసుకో మనం దానికి విపరీతంగా భయపడతాం. అందుకే ఫ్రెండ్స్ ని వెతుక్కుంటాం, పెళ్లిళ్లుు చేసుకుంటాం, గ్రూపుల్లో చేరుతాం. ఇవన్నీ ఆ ఒంటరితనం అనే హోల్ ని కప్పి పుచ్చుకోవడానికే. ఒకవేళ ఆ మనుషులందరూ నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ శూన్యంలో పడతావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నీలోని ఆ ఎంటీని నేరుగా ఫేస్ చేయలేదు గనుక కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఆ ఒంటరితనాన్ని ఒంటరితనం అనే పేరు పెట్టకుండా చూడు అని ఎప్పుడైతే నువ్వు ఒక ఫీలింగ్ కి పేరు పడతావో ఆ పేరుతో పాటు పాత చెత్త జ్ఞాపకాలు భయాలు అటాచ్ అయి వస్తాయి. పేరు పెట్టకుండా ఆ
(03:48) ఫీలింగ్ తో నిశ్చలంగా ఉండగలిగితే అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. మనం ఎప్పుడూ మనల్ని ఒక సెంటర్ లా చూసుకుంటాం. నా డబ్బు నా ఇల్లు నా పరువు ఈ నా అనే ఫీలింగే అన్ని భయాలకి రూట్ కాస్ ఈ సెంటర్ నుంచి బయట పడాలంటే నిన్ను నువ్వు అబ్సర్వ్ చేసుకోవాలి. దీన్నే జేకే అవేర్నెస్ అంటారు. ఇది ఒక దేగ తన ఎర కోసం చూస్తున్నట్టు ఉండాలి.
(04:16) నీ బ్రెయిన్ లోకి భయం ఎంట్రీ ఇచ్చే ప్రతిసారి అది ఎక్కడి నుంచి వస్తుందో గమనించు థాట్ ఎప్పుడు కాలంతో మిక్స్ అవుతుందో చూడు. ఫిజికల్ వరల్డ్ లో టైం అవసరమే వంట చేయాలన్నా ఊరెళ్ళాలన్నా టైం కావాలి. కానీ సైకలాజికల్ వరల్డ్ లో రేపు నేను తోపు అవుతాను లేదా రేపు నా భయం పోతుంది అనుకోవడం ఒక భ్రమ. రేపు అనేది రాదు. ఏదైనా ఇప్పుడే జరగాలి. పక్కవాడి ఐడియాలజీలు గురువుల సోది మాటలు నమ్మడం ఆపేయ్ ఎందుకంటే అవి వాళ్ళ నమ్మకాలు నీవి కావు వేరొకరి దారిలో వెళ్తే నువ్వు కేవలం ఒక కాపీవి అవుతావు తప్ప నీకు నువ్వుగా ఏమీ తెలుసుకోలేవు.
(04:56) భయం నుంచి ఫ్రీడమ అంటే అర్థం లోపల ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకపోవడం ఏది పర్మనెంట్ కాదని నీ చుట్టూ ఉన్న రిలేషన్స్ ఆస్తులు అన్నీ ఏదో ఒక రోజు పోయేవే అని క్లారిటీ వచ్చినప్పుడు భయం చస్తుంది. కానీ ఇది మాటల్లో కాదు నీ అనుభవంలోకి రావాలి. మనం మన లైఫ్ ని చాలా చీప్ గా పై పైన బ్రతికేస్తున్నాం. లోతైన ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రమే నీ బుర్ర పని చేస్తుంది.
(05:25) భయం లేని వాడికి దేవుళ్ళతో పని లేదు. ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదు వాడే రియల్ స్వేచ్ఛాజీవి ఆ స్వేచ్ఛ కావాలంటే భయం వేర్ల లోపలికి వెళ్ళాలి. అది కష్టంగా ఉండొచ్చు కానీ అదిఒక కిక్ ఇచ్చే జర్నీ నీ భయాన్ని శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్ లా చూడడం స్టార్ట్ చెయ్. అప్పుడు దాని సీక్రెట్ రివీల్ అవుతుంది. భయం అనేది ఒక చీకటి గది అందులోకి విశ్లేషణ అనే వెలుగుని తీసుకెళ్తే అక్కడ భయపడడానికి ఏమీ లేదని అర్థమవుతుంది.
(05:55) నీ ఆలోచనే ఆ చీకటిని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఆ ఆలోచనే వెలుగు కోసం ఏడుస్తుంది. ఈ లాజిక్ అర్థమైన రోజు నువ్వు అన్ని భయాల నుండి ముక్తుడవ అవుతావు. అదే రియల్ లైఫ్ ఆ స్టేజ్ లో నీకు ఒంటరితనం ఉండదు. కేవలం ఏకాంతం మాత్రమే ఉంటుంది. అందులో ఉండే పీస్ మామూలుగా ఉండదు. ఆ శాంతిని అనుభవించడమే లైఫ్ కి ఉన్న ఒకే ఒక్క మీనింగ్ అందుకే భయం అనే కొమ్మల్ని కోయడం ఆపి దాని వేర్లైన థాట్స్ అండ్ టైం మీద అటాక్ చెయ్ అప్పుడే నీలో ఒక కొత్త పవర్ వస్తుంది.
(06:30) అదే నిన్ను భయం లేని లోకానికి బాస్ ని చేస్తుంది. ఇదంతా జరగాలంటే నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఒక శిష్యుడిలా ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటూ పాస్ట్ ని మోయకుండా ప్రెసెంట్ లో బ్రతకాలి. అప్పుడే మనిషికి ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడే ఆందోళనలు లేని మైండ్సెట్ వస్తుంది. ఇదేదో ఆశ కాదు ఇట్స్ ఏ రియాలిటీ దీనికోసం నిన్ను నువ్వు లోతుగా క్వశ్చన్ చేసుకో లేదంటే ఒక దద్దమ్మల ఎప్పుడూ భయపడుతూనే బ్రతుకు

No comments:

Post a Comment