Monday, December 30, 2024

 రమణ బోధ

🍁🍁🍁🍁

‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్యమైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు. ఆ అనంత మౌనంలో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించు’ అని భగవాన్‌ రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి దిశానిర్దేశం చేశారు.

‘నిన్ను నువ్వు తెలుసుకో’- ఆధ్యాత్మిక చింతనకు ఇదే ప్రథమ సోపానం. అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.’ అంటూ రమణులు ప్రబోధించారు. 

అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మహాయోగి భగవాన్‌ రమణ మహర్షి. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలలోని మార్మికతను, అంతర్లీన భావగరిమను రమణలు ఏకోన్ముఖంగా అందించారు.

‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనేది ఉపనిషద్వాక్యం. ప్రజ్ఞ ద్వారా అన్నింటినీ తెలుసుకునే నేర్పు అలవడుతుంది.

 ‘నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. 

‘ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. 

ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.

అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహంతో రమణులు అతులితమైన యోగశక్తిని అందుకున్నారు.

 అరుణాచలాన్ని తన ఆశ్రమంగా మార్చుకుని, అరుణగిరిపై జ్ఞాన భాస్కరుడై వెలుగొందారు. నమశ్శివాయ అనేది మహా యోగ పంచాక్షరీ మంత్రమైతే, ‘అరుణాచల’ అనేది దివ్యజీవన జ్ఞాన పంచాక్షరీ మంత్రంగా రమణులు అభివర్ణించారు. భగవంతుని సాన్నిధ్యానికి, ఆత్మ సామీప్యానికి ఏది తీసుకుని వెళ్తుందో అదే ఉపదేశం. దక్షిణామూర్తిగా రుషులకు బోధించిన జ్ఞానోపదేశాన్ని, తత్త్వమార్గాల్ని, యోగసూత్రాల్ని ‘ఉపదేశసారం’గా రమణులు ఆవిష్కరించారు.

‘ఆనందమే నా స్వరూపం’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ‘నేను దీనుణ్ని, నాకు ఆనందం లేదు. నా జీవితం నిస్సారం. నాకు ఉన్నతి లేదు’ అని భావించేవారికి ఆధ్యాత్మిక అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రతికూల భావాలనే చీకట్ల నుంచి సానుకూల భావాలే ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరోహించడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుంది.

 ‘ఒక్క ఆధ్యాత్మిక దీపశిఖ నీలో వెలుగుతుంటే చాలు- నువ్వు అఖండ తేజోపుంజమై వెలుగు పువ్వుల్ని వెదజల్లుతావు’ అని రమణులు పేర్కొన్నారు.

 ‘భగవంతుడనే సంపూర్ణ, సమున్నత స్థితికి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నంత వరకే! నేను, నాది, నాకు అనే వ్యక్తిగతమైన అహాల్ని నిర్మూలించుకుంటే పరమ పూజ్యుడైన పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశించారు. పరబ్రహ్మ  తత్త్వానికి మౌనమే భాష్యం. మౌనం మహా శక్తిమంతమైన ఆయుధం.

 శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయడమే నేనందించే ప్రబోధ సారాంశం- అని ప్రవచించిన రమణుల సందేశ వైభవం... స్ఫూర్తిమంతం... స్ఫూర్తి మంత్రం!




🍁🍁🍁🍁
 అబద్దాల మధ్య 
ఆరితేరిన మనకు 
నిజాలు రుచించవు
నాలుగు గోడల మధ్య బందీ అయిన  మనకు 
స్వేచ్ఛ కు బొత్తిగా అర్ధం తెలియదు 

కాంక్రీట్ జంగల్ లో 
తప్పిపోయిన నిన్ను   
ప్రకృతి పచ్చదనము గుర్తుపట్టలేవు 
నీ రూపు రేఖలను నయా అవతారాన్ని 
విధ్వంసక  వికృత చేష్టలకు మనుషులు హర్షిస్తారు 
మట్టి కాదు  

ఇంటి దగ్గర మొదలై 
ఆఫీస్ గెట్ ముందర ఆగి పోయిన 
దారి 
ఉరుకులు పరుగులే తప్పా 
నిన్ను ఊపిరి తీసుకొనివ్వదు  

సంపాదించడం కోసమే బతుకుతున్నావా 
బతకడం కోసమే సంపాదిస్తున్నావా

అర్థం కాని అర్థం లేని ఆరాటంలో
పోరాటం శూన్యం 
అంచలంచలుగా నీ ఆశలకు ఆనందాలకు 
తూట్లు పడుతుంటే
రెండు కన్నీటి బొట్లతో వాటిని పరామర్శించడమే తప్పా
నిష్ప్రయోజనమైన చేతులతో 
నిండు నూరేళ్లు బతకాలనే బలమైన వాంఛ తప్పా 
మరొకటి లేని గుడ్డితనం  

ఏ ఆలోచన మొలకెత్తని 
మెదడులో గుడ్డితనం 
ఏ ప్రశ్న చిగురించని 
గుండెల్లో గుడ్డితనం 

నిస్సారంగా బతుకుతూ 
బతకాలనిపించినప్పుడల్లా గతాన్ని వెతుకుతూ

కోల్పోయింది ఏదీ 
కోటి సార్లు దుఃఖించినా రాదు 
మనం కాపాడుకోవాల్సింది ఆస్తులను ఆరోగ్యాన్నే కాదు 
ఆలోచనలను ఆనందాన్ని కూడా..!!
 1955లో డాక్టర్ అంబేద్కర్ మరణించినప్పుడు, అతని మృతదేహాన్ని ఢిల్లీ నుండి ముంబైకి విమానంలో తీసుకురావడానికి రూ. 5000 అవసరమైంది. అంబేద్కర్ ఇంట్లో 2000 రూపాయలు కూడా లేవు. 

కానీ నెహ్రూ ట్రిపుల్ ఫైవ్ బ్రాండ్ సిగరెట్లను ఎంతగానో ఇష్టపడేవారు, వాటిని తీసుకోవడానికి మాత్రమే ప్రత్యేక విమానం భోపాల్ నుండి ఇండోర్‌కు వెళ్లింది. 

ఇప్పుడు కాంగ్రెస్ నేతలు డాక్టర్ అంబేద్కర్ చిత్రంతో పోజులిచ్చి ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఈ సత్యాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.
 *ధ్యాన మార్గ*
ఎక్కువగా భుజించేవాడు యోగికాదు. ఉపవాసముండేవాడు యోగికాదు.  అన్నo తినడం, ఎక్కువ కాలం ఉపవాసాలుండే వ్యక్తి యోగి కాలేడు. అదే విధంగా, ఎక్కువగా నిదురించే వారు, ఎప్పుడూ పగటికలలుకంటూ ఉండేవారు. ఎప్పుడూ మేలుకొని వుండేవాడు యోగి కాలేడు.
❤️🕉️❤️
దుఃఖంతో ఏకమయి పోక దాని నుంచి దూరం కావాడాన్నే' విద్య అంటారు. దుఃఖాలు, బాధలు కలిగినా వాటికి ఏమి సంబంధం లేకుండా ఉండడం యోగం.
❤️🕉️❤️
యః మామ్ పశ్యతి సర్వత్ర.. ఎవరైతే అన్నిటియందు నన్నే చూస్తారో,
అవతారపురుషుడు, దైవం రెండూ ఒక్కటే. వేరు వేరు కాదని, కృష్ణ, విష్ణువు,
ఒక్కరేనని భావిస్తారో తస్యాహం న ప్రణశ్యామి' వారిని నేను ఎప్పుడూ వదలను.
'సః చ మే న ప్రణశ్యతి' వారూ నన్ను ఎప్పుడూ వదలరు.
🕉️❤️🕉️
భయం మరియు దురాశ మనస్సును దుర్వినియోగం చేస్తాయి. మనస్సు యొక్క సరైన ఉపయోగం ప్రేమ, జీవితం, సత్యం, అందం యొక్క సేవలో ఉంది.      
 నీకోసమె నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో..
నీకోసమె నే జీవించునది

వెన్నెల కూడా చీకటియైనా
మనసున వెలుగే లేక పోయినా..
నీకోసమె నే జీవించునది

విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా ...
నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో నా మనస్సులో
నీరూపమె నే ధ్యానించునది

హృదయము నీతో వెడలిపోయినా..
మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి
తలచి ప్రాణము నిలుపుకొనీ...
నీకోసమె నే జీవించునది...

మెలకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా ఇక నా దానవెగా..
నీ రూపమెనే ధ్యానించునది...
ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె నే జీవించునది
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


59. కృణ్వన్తో విశ్వమార్యమ్

 విశ్వమును ఆర్యముగా చేయుదముగాక (ఋగ్వేదం)

'ఆర్య' అనే శబ్దానికి 'పూజ్యత' అని అర్థం. అంటే - గౌరవించబడే ఉత్తమస్థాయి...అని భావం. అంతేగానీ 'ఆర్యులు' అనే ఒక 'తెగ' ఎక్కడా లేదు. 'ఆర్య-ద్రావిడ' విభజన ఒక అజ్ఞాన జనిత కల్పన. దానిని చరిత్రగా చూపించడంతో మనం నమ్ముతూ వస్తున్నాం. 'ద్రవిడ' అనేది అంగ, వంగ, కళింగ.... అనే దేశాల వలె ప్రాంత విభజన వాచకం. అది తెగనీ, జాతినీ సూచించేది కాదు.

భారతీయమైన వేద సంస్కృతి 'ఆర్యత్వాన్ని' ఆదర్శంగా చూపించింది. 'ఆర్య' భావన మతానికి సంబంధించినది కాదు. వేద మతస్థులు 'ఆర్యు'లనీ, అవైదికులు 'ద్రావిడు'లనీ, వీరిని వారు జయించేవారనే కల్పనలు మనల్ని విభజించడానికి విదేశీ ఎత్తుగడలలో భాగాలు. ఈ విషయం అనేక మంది చారిత్రక పరిశోధకులు (వారిలో ఇప్పుడు విదేశీమేధావులు కూడా) ఇప్పుడు అంగీకరిస్తున్నారు. కానీ మన చరిత్ర పాఠాలు వాటిని గమనించడం లేదు.

ప్రపంచమంతా 'ఆర్య' కావాలి. ఆర్యులతో నిండాలి... అనే మాట “నా మతమే విశ్వమంతా పాటించాలి" అనే ఆక్రమణల మనస్తత్వం గల దుర్మతాల సూక్తులు వంటిది కాదు.

ప్రపంచంలో అందరూ పూజ్యస్థానాన్ని, గౌరవనీయులైన స్థాయిని సాధించాలి అనే శుభాకాంక్ష ఇది.

గౌరవం దేనివల్ల లభిస్తుంది? సత్యం, జ్ఞానం, ధర్మాచరణ, విద్య, త్యాగశీలత, పరోపకార స్వభావం మొదలైన ఉత్తమ సంపదల వల్ల లభిస్తాయి. ఇలా అందరిచేత గౌరవించబడే భౌతిక సంపదతో, సద్గుణ సంపత్తితో ప్రపంచమంతా నిండిపోవాలి. ఒకరినొకరు గౌరవించుకొనే స్థితిని అందరూ పొందాలి అనే అద్భుతమైన విశాల భావన ఇందులో ఉంది.

సర్వే భద్రాణి పశ్యన్తు - అందరూ శుభాలనే అనుభవించాలని ఆకాంక్షించే విశాల వైదిక తత్త్వం ఈ శుభాకాంక్షలలోనూ పల్లవించింది. కేవలం భౌతికాభివృద్ధి 
ఆర్యత్వాన్నివ్వదు. తపస్సు, ఇంద్రియనిగ్రహం, శౌచం, మైత్రీభావం, సడలని ధర్మనిష్ఠ- ఇవి ఆర్యజీవన లక్షణాలు.

ఈ లక్షణాలే ప్రపంచమంతా నిండితే భువియే స్వర్గమౌతుంది కదా! ఇంతకంటే విశ్వకళ్యాణ కాంక్ష ఉంటుందా! వసుధైవ కుటుంబమనే గొప్ప భావనని యుగాలనాడే ఆవిష్కరించిన ఋషిపీఠం - ఈ భారతదేశం ఆ భావనని విశ్వవ్యాప్తం చేసే ఆకాంక్షలలో ఈ ఆర్యభావన ఒకటి.

భూమిని మాత్రమే కాక, అంతరిక్షమూ, గ్రహనక్షత్రాలు అన్నీ శాంతంగా ఉండాలని శాంతి మాత్రమే హృదయనాదంగా కలిగిన భారతీయాత్మ విశ్వానికి ఆదర్శప్రాయం. 

ఆర్యత్వాన్ని సాధించడానికి ఆచరణాత్మకమైన విధానాలనీ, వ్యవస్థను కూడా ఏనాడో సుస్థిరంగా ఏర్పరచుకున్న గొప్ప నాగరికత మనకుంది. మన అత్యంత ప్రాచీన గ్రంథాలైన రామాయణ, భారతాలు పరిశీలిస్తే అద్భుతమైన నాగరికత విరాట్ స్వరూపంతో సాక్షాత్కరిస్తుంది.

మాటలో సంస్కారం, ఆహారంలో నియమపాలన, సాటి వ్యక్తిని మన్నన చేయడంలో ఆతిథేయ సత్కారాలు, కుటుంబ సంబంధాలలో మర్యాదల పద్ధతులు, కట్టు బొట్టులో ఒద్దికా అణకువా, ప్రకృతి పరిసరాలను సైతం నొప్పించని సున్నితమైన అనుబంధాలు, విజ్ఞానవంతమైన ఆచార వ్యవహారాలు - మన ప్రాచీన గ్రంథాలలో కాళిదాసాది కవులు కావ్యాలలో కనిపిస్తాయి.

ఈ ప్రాచీన వ్యవస్థనీ, ఈ విద్యలనీ నిశితంగా అధ్యయనం చేసి తిరిగి ఆత్మగౌరవాన్ని పుంజుకుని 'పూజ్యత్వాన్ని' పొందగలిగే విధంగా మన భారతభూమిని తీర్చిదిద్దే కృషిని చేద్దాం. ఈ ఆర్యధర్మాన్ని ప్రపంచానికి నేర్పుదాం. ఆచరించి ఆచరింపచేద్దాం. 

ఆర్యధర్మమే ఆర్ష (ఋషి) ధర్మం.
ఆ ధర్మానికి పీఠం ఈ భారతదేశం.

ముందు ఈ వేదభూమిలో ఆర్యత్వాన్ని సుప్రతిష్ఠితం చేసి, క్రమంగా విశ్వవ్యాప్తం చేయాలి. మరొకమారు దృఢంగా గ్రహించుదాం. 'ఆర్యధర్మం' ఒక మతం కాదు. ఒక ఉత్తమ మానవధర్మం.      
 *తీర్థయాత్రలు.....*

తీర్థయాత్రలకు బయలుదేరుముందు పఠించవలసిన శ్లోకాలు.....

1) యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!

2) ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!

3) తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!! 

4) యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!

5) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!

ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. (యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతినిత్యము ఉదయం ఇంట్లోనుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటినుండి  బయలుదేరినా అంతటా జయం కలుగుతుంది).

మరికొని ధర్మాలు.....

ధర్మమార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్థయాత్రలు చేయవలెనని శాస్త్రం నిర్ధేశించింది.

ఇంటినుండి బయలుదేరునప్పుడు ఇలవేల్పును, కులదేవతలను గ్రామదేవతల అనుమతి తీసుకొని, తల్లిదండ్రుల పెద్దల అనుమతి తీసుకొని బయలుదేరాలి(శ్రీరామచంద్ర స్వామి వారు  అరణ్యవాసానికి బయలుదేరునప్పుడు కూడా అయోధ్యానగరి దేవత అనుమతి తీసుకొనే బయలుదేరి సనాతన ధర్మాచరణ విషయంలో ఆచరించవలసిన ఆదర్శాన్ని మనకు చూపించారు.

తీర్థయాత్రలయందు అసత్య భాషణము, దంబ భాషణము చేయరాదు. బ్రహ్మచర్యవ్రతులై క్షేత్రాలను సేవించాలి.

యాత్రలకు బయలుదేరి వెళ్ళి మరల ఇంటికి తిరిగివచ్చునంతవరకును కూడా తలనీలాలు సమర్పించే విషయంలో తప్ప, అన్యప్రదేశాలలో క్షౌరాది కర్మలు చేసుకొనరాదు.

తీర్థాలయందు సంకల్పం చెప్పుకొని స్నానం  చేయాలి, అవకాశం లేని సమయంలో భగవన్నామాన్ని తలుస్తూ చేయవలెను. 

పుష్కరిణులయందును, నదులయందును, సరోవరాలయందును, సముద్రాలయందును, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానమాచరించడం మహాపరాధం. అంతేకాక వాటియందు మల,మూత్ర,వీర్య విసర్జనం చేయడం చాలా పెద్ద దోషం. 

అంతేకాకుండా చీరలు-జాకెట్లు, పంచెలు-ఉత్తరీయాలు వంటివాటిని నదీదేవతలకు సమర్పించదలుచుకొంటే మానసికంగా నదీమతల్లికి అర్పిస్తూ దగ్గరలోని  ముత్తయిదువులకో, బ్రాహ్మణోత్తములకో, లేక అభాగ్యులకో ఇవ్వడం వలన పుణ్యము మరియు పురుషార్థము సిద్ధిస్తాయి. 

స్త్రీలు జడముడి విడతీసుకొని క్రిందభాగమున ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. జుట్టు విరబూసుకొని నిత్యజీవితంలోనే ఉండరాదు. అటువంటిది పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అసలు ఉండకూడదు. దంపతులు వెళ్ళినప్పుడు ఇరువురు కూడా ఉత్తరీయ్యానికి చీరకు కలిపి ముడివేసుకొని సంకల్ప స్నానం చేయాలి. స్త్రీలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి. 

వీలయినంతవరకు అల్ప భాషణము చేస్తూ, మనస్సునందు ఎల్లప్పుడు భగవన్నామము జపిస్తూ ఉండాలి. 

తీర్థస్థాలాలలోను, క్షేత్రాలలోను మనం ఆచరించిన జప, తప, స్నాన, హోమ, అనుష్ఠాన, ధర్మాచరణ, దానాదుల పుణ్యము ఒకటికి వందలరెట్లు, వేలరెట్లు కలుగుతుంది. అదేవిధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే పలితము కలుగుతుంది. కావున జాగరూకులమై వర్తించాలి. 

పుణ్య తీర్థాలయందు  గతించిన తల్లిదండ్రులకు పెద్దలకు పిండప్రధాన, తర్పణాదులు తప్పకుండా చేయవలెను. వారి ఆశీస్సులే మనకు మన కుటుంబాలకీ శ్రీరామరక్ష.

 *Who is the best of the yogis?*

The Blessed Lord said: With mind established in Me, ever steadfast in their devotion, endowed with the highest faith, those who worship Me, they are in my opinion, the best of yogis.

~ Gita 12.2

The Lord declares that whoever worships Him with supreme faith and single-minded concentration, he is the best of yogis. 

Three aspects of spiritual practice are mentioned here.

1- Establishing the mind in the Lord,

2- Ever thinking of Him,

3- Having firm faith in him.

Whoever possesses these three qualities is the best of yogis. Whether he is a sannyasi or house-holder these distinctions have no significance at all. 

The Lord’s amazing insight into spiritual Truth is revealed here. Devotion, faith, and concentrated effort- these are emphasised as the final determining factors in spiritual life.
యోగులలో ఉత్తముడు ఎవరు?

 భగవంతుడు ఇలా అన్నాడు: నాలో స్థిరమైన మనస్సుతో, వారి భక్తిలో ఎప్పుడూ స్థిరంగా ఉండి, అత్యున్నత విశ్వాసంతో, నన్ను పూజించే వారు, నా అభిప్రాయం ప్రకారం, యోగులలో ఉత్తములు.

 ~ గీత 12.2

 ఎవరైతే పరమ విశ్వాసంతో, ఏకాగ్రతతో తనను ఆరాధిస్తారో, అతడే యోగులలో ఉత్తముడని భగవంతుడు ప్రకటించాడు. 

 ఆధ్యాత్మిక సాధనలో మూడు అంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.

 1- మనస్సును ప్రభువులో స్థిరపరచుట,

 2- ఎప్పుడూ అతని గురించి ఆలోచిస్తూ,

 3- అతనిపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండటం.

 ఎవరైతే ఈ మూడు గుణాలను కలిగి ఉంటారో వారే యోగులలో ఉత్తములు.  అతను సన్యాసి అయినా లేదా ఇంటి యజమాని అయినా ఈ వ్యత్యాసాలకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. 

 ఆధ్యాత్మిక సత్యంలో ప్రభువు యొక్క అద్భుతమైన అంతర్దృష్టి ఇక్కడ వెల్లడైంది.  భక్తి, విశ్వాసం మరియు ఏకాగ్రతతో కూడిన కృషి- ఇవి ఆధ్యాత్మిక జీవితంలో చివరి నిర్ణయాత్మక కారకాలుగా నొక్కి చెప్పబడ్డాయి.

 Vedantha panchadasi:
ఆనందమయ ఈశోఽయం 
బహు స్యామిత్యవైక్షత  ౹
హిరణ్యగర్భరూపోభూత్సుప్తిః స్వప్నో యథా భవేత్ ౹౹198౹౹

198.  సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు,
ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు,
హిరణ్యగర్భుడగును.దాని వలన సకల సూక్ష్మశరీరములతో సంబంధపడును.

క్రమేణ యుగపద్వైషా 
సృష్టిర్ జ్ఞేయా యథాశ్రుతి ౹
ద్వివిధశ్రుతి సద్భావాత్ 
ద్వివిధ స్వప్నదర్శనాత్ ౹౹199౹౹

199. శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమముగ జరిగినదనీ, హఠాత్తుగ , ఒక్కసారిగ జరిగినదనీ తెలియవలెను.
ఈ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.
అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగును.

తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1;
బృహదారణ్యక ఉప. 1.2.5.
వ్యాఖ్య:-  సర్వత్మ స్వరూపుడైన నారాయణుడు అనేక రూపాల్లో ఉంటాడు అనే సిద్ధాంతం శ్రుతి సమ్మతమైనదే.

సర్వాత్మ భావం ఈశావాస్యోపనిషత్తు నందు,
పరమేశ్వరుడు విశ్వరూపి స్వేచ్ఛగా సర్వప్రాణులలోను సంచరిస్తూ వుంటాడని
 -శాం.ప 353.5 నందు వర్ణింపబడినది.

శ్రుత్యాధారిత జ్ఞానసాధన సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.

శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమము జరిగినదనీ, హఠాత్తుగ - ఒక్కసారిగ జరిగినదనీ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.

అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగునని తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1
బృహదారణ్యక ఉప.1.2.5  
ఉపనిషత్ వాఖ్యలు.

సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు హిరణ్యగర్భుడగును.

దాని వలన సకల సూక్ష్మశరీరముతో సంబంధపడును.ఆ విధముగా అఖండ బ్రహ్మము తన అవిభక్త స్థితిలో సమస్తమునందు వ్యాపించును గనుక సమస్తము అవిభక్త స్థితిలో నున్నది.

అది తనంతటతాను ఘనీభవించినప్పుడు విశ్వమనస్సు  ఉదయించును.
విభిన్న భూతములు అత్యంతసూక్ష్మదశలో ఉన్నవను ఉద్దేశము ఆ మనస్సులో ఆవిర్భవించును.

వీని అన్నిటి సమిష్టియే తైజస విరాట్పురుషుడు.ఆయనను సృష్టికర్తయగు బ్రహ్మ అందురు. కావున,ఈ సృష్టికర్త విశ్వవ్యాప్త మనస్సుకంటె వేరేదియుగాడు.

విశ్వములో విభేదమును కల్పించు తత్త్వమగు ఈ అవిద్యలో ఉండవలెనని కోరుకొన్నవాడు ఈయననే.దీని వలన వ్యక్తి ఆత్మను అనాత్మగా భ్రమించును.

మరియు ఈ అవిద్యా ప్రభావమువలననే స్రష్ట ఈ విశ్వమును విభిన్న ప్రాణులతో గూడినదిగా అగుపించునట్లు చేసాడు.దీని వలననే సమస్తవిశ్వము అనంత చైతన్యము తప్ప వేరేదియు కాకపోయినను - అణులేశములవలనను పరమాణువుల వలనను జనించిన ప్రాణులుగానున్నట్లు అగుపించుచున్నవి.
అన్ని ప్రాణులు తన ఆత్మకంటే భిన్నములు కావనీ,తన ఆత్మయే అన్ని జీవులలో నున్న ఆత్మ యనీ దర్శించే జ్ఞాని ఆ దర్శన వివేకము చేత దేనినీ ద్వేషింపక దేవతాస్వరూప భావము నొందును.

సూత్రాత్మా సూక్ష్మదేహాఖ్యః సర్వజీవఘనాత్మకః ౹
సర్వహంమానధారిత్వా త్ర్కియాజ్ఞానాది శక్తిమాన్ ౹౹ 200 ౹౹

200. సూత్రాత్మ,సూక్ష్మశరీరి అనబడు హిరణ్యగర్భుడు సకల జీవుల సూక్ష్మశరీరముల సమిష్టి వస్త్రమునందు అంతటా అనుస్యుతమై ఉన్న తంతువు వలె అన్ని జీవులయందు ఉన్న 
"అహం" భావన అతడే.కనుకనే అతనికి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు గలవని చెప్పబడుచున్నదవి.
వ్యాఖ్య:- హిరణ్యగర్భ స్వరూపం ఏమిటి?  అంటే సమిష్టి లింగశరీరాభిమానియైనట్టి,
మాయను ఉపాధిగా కలిగినట్టి ఈశ్వరునే హిరణ్యగర్భుడంటారు.

తార్కికులు ఈశ్వరునియందు మూడు గుణాలు
జ్ఞానం,ప్రయత్నం,ఇచ్ఛ అనేవి సత్యమైనవని అంటారు. ఎందుచేతనంటే, కేవలం అసంగుడైనవానికి నియంతృత్వం వుండదు కాబట్టి!

జీవుడు కూడా సంగరహితుడే అయినందునను,చిద్రూపుడే అయినందునను క్లేశకర్మాదులు ఉండరాదు,ఉండవు.అయితే జీవుడు వివేకంతో ప్రకృతి పురుషుల భేదాన్ని తెలుసుకోలేక పోతున్నందువల్ల క్లేశ కర్మవిపాకాదులు సంభవిస్తున్నాయి

కాని నైయాయికులు,
అసంగుడు చిద్రూపుడు అయినవానిని నియంతగా అంగీకరించరు. అందుచేత జీవేశ్వర భేదాన్ని చూపటానికై 
జ్ఞానం ప్రయత్నం ఇచ్ఛ అనే మూడు గుణాలు ఈశ్వరునియందు నిత్యమైనవి అటువంటి ఈశ్వరుని అంగీకరిస్తారు అని చెపుతున్నారు.

అసంగుడు,చిద్రూపుడు అయిన ఈశ్వరుడు నియామకుడు ఎట్లా అవుతాడు?అని ఆక్షేపం.

ఈశ్వరుడు అసంగుడైనందున నియామకుడు కాజాలకపోయినప్పటికీ జీవులకంటే విలక్షణ స్వభావం కలవాడైనందున ఈశ్వరునికి నియమన 
కర్తృత్వం-నియమించే పని-ఉండవచ్చు.

చిద్రూపుడైన ఈశ్వరుని ప్రకృతి నియామకునిగాను,జీవుడిని నియమింపబడేవానిగానూ అంగీకరించకపోతే ఈ జీవజగత్తులో బంధమోక్ష వ్యవహారమంతా అస్తవ్యస్తమైపోతుంది.

అంటే ,ప్రకృతి అనేది ముక్తులైైనవారిని సైతం బంధిస్తుంది.కాబట్టి ఈశ్వరుని ప్రకృతి నియంత అని అంగీకరించాలి.
సకల జీవుల యందూ వస్త్రమునందు ఉన్న తంతువు వలె అన్ని జీవులయందు ఉన్న"అహం"అతడే.
కనుకనే అతనికి 
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు గలవని చెప్పబడుచున్నవి.
 *సోమావతి అమావాస్య,*

🌸కార్తీక సోమావతి అమావాస్య..ఈ రోజున అమావాస్య పూజ ఇంట ముగించి.. శివాలయాన్ని సందర్శించాలి. అలాగే శివాలయంలో వుండే.. రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

🌿సోమవారం వచ్చే ఈ అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అదీ కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

🌸అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం.

🌿ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి.

🌸కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది. 

🌿సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి..

🌸సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్యను మౌని అమావాస్య , శని అమావాస్య అని కూడా పిలుస్తారు.

🌿సోమావతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

🌹సోమావతి కథ🌹

🌸ఒకానొక ఊరిలో.. ఒక సాదువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తు వుండే వాడు అయన ఒకనాడు వచ్చినప్పుడు ఆమె ముఖం చూసి దీవించకుండానే వెళ్ళిపోయాడు ఆ సాదువు దివించకుండా వెళ్లాడానికి కారణం తెలియక అ కుటుంబం చాల బాధపడింది.

🌿చివరికి పురోహితున్ని పిలిచి కారణం అడుగగా ఈమెకు జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అనతికాలం లోనే మరణిస్తాడు అని అన్నాడు.

🌸ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు అది విని దిగ్బ్రాంతి చెందిన కుటుంబ సబ్యులు పరిష్కారం చెప్పమని పురోహితున్ని అడిగారు అయన శిన్కలి ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని అయన చెప్పారు.

🌿వర్తకుడు ఆ అనివయతమైన కన్యను తన చిన్న కొడుకుని అక్కడికి పంపుతారు. మార్గ మద్యం లో ఒక నదిని దాటాబోతుండగా వారికీ ఒక దృశ్యం కనిపించింది. అప్ప్పుడే పుట్టిన గ్రద్ద పిల్లల్ని ఒక పెద్ద పాము చంపుకు తినడానికి చూస్తుంది.

🌸నిత్యం అక్కడ అదే జరుగుతుంది గ్రద్ద పిల్లలు పుట్టగానే వచ్చి తిని వెళ్లి పోయేది ఆరోజు అదే జరుగుతుంది కానీ ఆరోజు ఆ యువతీ దైర్యంగా అ పాముని చంపి అ గ్రద్ద పిల్లలని కాపాడింది.

🌿తన పిల్లలను కాపాడినందుకు ఆ గ్రద్ద ఆ చాకలి స్త్రీ ఇంటికి దరి చూపిస్తుంది. కొన్ని నెలల పాటు అ చాకలామెకు సేవలు చేయగా ఒకానొక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమని ఇచ్చింది.

🌸ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షణలు చేసింది ఆమె జాతక దోషం అంతటి తో తొలిగి పోయింది అలాగే సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివున్ని ప్రార్థిస్తే..

🌿రావి చెట్టుకు ప్రదక్షణలు చేసి ఈ కధను ఒక సారి గుర్తుకు చేసుకుంటే ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలిగి పోతాయి అని పండితులు వినిపిస్తున్నారు.

🌹సోమవతి అమావాస్య అంటే ఆ రోజు ఏం చేయాలి🌹

🌸శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. 

🌿శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…

🌸దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే ! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది.

🌿సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

🌸సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు.

🌿అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.

🌸అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

🌿నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు.    

Sunday, December 29, 2024

****Spirituality || ఆధ్యాత్మికత అన్నిటికంటే గొప్పది ఎందుకంటే - రజనీకాంత్ || Rajinikanth Excellent Speech

 Spirituality || ఆధ్యాత్మికత అన్నిటికంటే గొప్పది ఎందుకంటే - రజనీకాంత్ || Rajinikanth Excellent Speech



 
 అమ్మను
నిజంగా ప్రేమించే వారు
ఏం జేస్తారు 

నిత్యం ఆమెతో మాట్లాడతారు
ఆమె చెప్పేది శ్రద్దాసక్తులతో వింటారు
అనునిత్యం ఆమెకు అందుబాటులో ఉంటూ
ఆమె బాగోగులు జాగురుకతతో పట్టించుకుంటారు 
అంతేనా 

లేక ...
ఏడాదికోమారు 
ఆమె జన్మదినం నాడు
ఆమె మెడలో పూలమాలలు వేసి
మంగళ హారతులు పట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి
ఆ ఒక్కరోజూ ఆర్భాటం చేసి ప్రేమను చాటుకుంటారా

వీటిలో ఏది నిజమైన ప్రేమా గౌరవం భక్తీ 

********

భాషను
నిజంగా ప్రేమించేవాడు 
సత్యంగా అభిమానించే వాడూ
ఏం జేస్తారు

తన బిడ్డను
ఒడిలో కూర్చుండ బెట్టుకుని
అ ఆ ... ఇ ఈ .... ఉ ఊ ... లు దిద్దిస్తాడు 
గుణింతాలూ ఒత్తులూ పదాలు పంక్తులూ నేర్పిస్తాడు
నుడులూ నానుడులూ జాతీయాలూ సామెతలూ పొడుపు కథలూ మనస్సుకు పట్టిస్తాడు 
కవులను రచయితలను కళాకారులను ఆత్మబంధువులను చేస్తాడు
తన భాష అందచందాలనూ వన్నెచిన్నెలనూ ప్రత్యేకతలనూ విసదీకరిస్తాడు 
అంతేనా....

లేక... అదిగదిగో 
ఆమే మన తెలుగు తల్లి
అని ఓ విగ్రహాన్ని చూపి చేతులు జోడించమనీ 

మా తెలుగు తల్లికీ....
అంటూ మెడలో మల్లె పూదండ వేయమనీ 

మా కన్న తల్లికి....
అంటూ కర్పూర హారతి పట్టమనీ 

కడుపులో బంగారు
కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు అని
పరవశించిపోతూ పొర్లు దండాలు పెట్టమనీ

ఇదే ఇదే మాతృ భాషను సంరక్షించుకునే ఎఫెక్టివ్ పద్ధతి... అని మీ బిడ్డలకు నూరిపోస్తారా 

************

వివేకంతో నూ
విచక్షణతో నూ
తరచి తరచి చూసినపుడు
ఒక విషయం సుస్పష్టంగా బోధపడుతుంది

ఎవరైనా 
జన సామాన్యానికి
భాషను దూరం చేయాలనుకున్నపుడూ
భాషను మృత భాషగా మార్చేయాలనుకున్నపుడూ

ముందుగా 
భాషకు పవిత్రతను అంటగడతారు
అటు తరువాత మాతృమూర్తి అంటూ విగ్రహాన్ని చేస్తారు
ఆమె చుట్టూ పూజాదికాది క్రతువులను చక్కగా అల్లేస్తారు

తద్వారా
భాషకు అలౌకికతను చేకూరుస్తారు 
'భాష్యతి ఇతి భాష (భాషింపబడేది భాష) అనే వాస్తవాన్ని మెరుగుపరిచే సత్తారు
'పూజ్యతి ఇతి భాష (పూజింపదగినది భాష) అని
జనాన్ని భ్రమింపజేస్తారు

*********

భాషాభిమాని అయిన వాడు

గిడుగు పిడుగులా 
జనసామాన్యపు భాషను అందలమెక్కిస్తారు

అడుగుజాడ గురజాడలా 
జనసామాన్యపు భాషతో మానవీయతను చాటుతాడు 

సంస్కరణ కేతనం కందుకూరిలా 
జనసామాన్యపు భాషతో మూఢచారాల వెన్ను విరుస్తాడు 

అంతే తప్ప తిరోగమనాన్నీ మూఢత్వాన్నీ మూర్ఖత్వాన్నీ మహోన్నత ఆదర్శంగా నమ్మబలకడు

కాబట్టి ....
భాష పట్ల నిజమైన ప్రేమ
ఉన్న వారంతా
అటువంటి భ్రమల్లో కొట్టుకుపోవద్దని మనవి

*******

PS... భాష స్థానంలో సంస్కృతి, విలువలు, దేశం, సమాజం ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. లాజిక్ మాత్రం ఇదే.l

- రత్నాజేయ్ (పెద్దాపురం)

('ఎవరు సంరక్షకులు? భాషకు' అన్న నా పోస్ట్ కు మనోభావాలు గాయ పరచుకున్న ఓ సున్నిత మనస్కుడైన మాతృ భాషా ప్రేమికుడైన మిత్రునికి .... ప్రేమతో)
 😌 *ధ్యానమార్గ*
నా పూర్వజన్మ గురించి నాకేమీ జ్ఞప్తి లేకుండడానికి కారణమేమిటి? మానస సాగరానికి కేవలం ఉపరి భాగమనీ, మన ఆ సాగర గర్భంలో ఉన్నాయని దీని వల్ల తెలుస్తుంది. తీవ్రంగా ప్రయత్నిస్తే అవి పైకి రావడంతోపాటు మీ పూర్వజన్మను కూడా మీరు తెలుసుకోగలరు. (లేవండి మేల్కోనండి,  Vol. 1, Pg. 45)

శక్తి ఉన్నప్పుడు చెడ్డపనులకు దానిని వెచ్చించితే చాలా దారుణమైన బాధలకు లోనుకావలసి ఉంటుంది. ఉన్నతమైనవి ఏమి సాధించలేరు. అదేశక్తిని తనకు తానుగా శిక్షణను ఇచ్చుకొని, మానవునిలోని ఆరు శత్రువులను జయించాలి.

ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టే అలవాటు చాలా
హీనమయింది. చాలా మంది దానిని, దీనిని, వీడిని, వాడిని ఎప్పుడూ తప్పు పడుతుంటారు. దానివల్ల వారు, కోపంగాను, ఇతరులపట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నీ అయిష్టాన్ని ప్రకటిస్తూ పోవడమే అలవాటు అయినట్లయితే మనస్సు అంతా అయిష్టంగానే మారి తనకు తానే పెద్ద శత్రువవుతాడు. ఎందుకు అయిష్టాలన్నీ పోగుచేసుకొని మనస్సులో పెట్టుకుంటావు? అప్పటికప్పుడే పరిశీలించుకొని పారవెయ్యవచ్చుకదా! అయితే మరి శత్రువు ఎవరు నీకు ? నీకు నీవే శత్రువువి.

ఇంద్రియాల బానిసత్వాన్ని దాటినవాడు యోగి. అతని వస్తు పరిజ్ఞానం,మన వస్తు పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసంగా ఉన్నట్లు ఉంటుంది. సహజంగా మనం వస్తువుల విలువను ఇంద్రియ ఆకర్షణనుంచి, ఇంద్రియ తృప్తి నుంచి లెక్కకడుతుంటాం. కానీ యోగికి ఇంద్రియ ఆకర్షణ లేని కారణంగా అతని వస్తు అవగాహన వేరుగా ఉంటుంది. 'సమలోష్టాశ్మకాఇ్చనః' అతనికి రాయి, మన్ను, బంగారం అన్నీ ఒకేవిధంగా కనిపిస్తాయి. అది అతని మనోవైఖరి. ఇంద్రియా అన్నీ వాటి కోర్కెలను తృప్తి పరచుకోవడమే గొప్పగా భావిస్తాయి. కానీ వాటినిదాటి వెళ్ళగలిగినప్పుడే సమత్వబుద్ధి వస్తుంది.            
 👆 *🕉️🙏పుస్తకం 🕉️🙏*

*పుస్తకం అనేది నోరు తెరవని*
*ఓ 'గొప్ప ఉపన్యాసకుడు'.* 🕉️🙏

*🕉️🙏'మౌనం' వహించిన 'మహాకవి'.*🕉️🙏

*🕉️🙏'ఒంటరి తనాన్ని' పోగొట్టే* *'గొప్ప స్నేహితుడు'.*
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

58. శివా నః సన్తు వార్షికీః

ప్రతి ఏడాది కురిసే వర్షములు మనకు శుభములుగా నగుగాక (అథర్వవేదం)

ఋతుచక్రం ఏడాది కొకమారు మారుతూంటుంది. ఒకొక్క ఋతువుకీ ఒక్కో ప్రత్యేకత. ఈ మార్పులన్నీ ప్రకృతి ద్వారా పరమేశ్వరుడు ప్రసరించే కరుణకు
ప్రతిరూపాలే. ఆ మార్పులు మనకు క్షేమం కలిగించాలని పై శ్రుతివాక్యంలోని భావన.

'వార్షికం' అంటే ఏడాదికి (సంవత్సరాది) సంబంధించినది, 'వర్షం' అంటేనే సంవత్సరమని అర్థం.

ఋతుపవనాల కారణంగానూ, తదితర హేతువుల ద్వారాను భూమికి వృష్టి లభిస్తుంది. ఇది సకాలంలో, సమృద్ధిగా లభించాలని అందరూ కోరుకుంటారు.

అనావృష్టి, అతివృష్టీ - - రెండూ బాధా హేతువులే. ఈ అవస్థలు లేకుండా సస్యకారిణిగా,నదీ తటాకాదులు జలసమృద్ధిగా ఉండే విధంగా వృష్టి అనుగ్రహించాలనే శుభాకాంక్ష
వైదికధర్మంలో గోచరిస్తుంది.

ఏడాదిలో కొంతకాలం ప్రకృతిధర్మంగా కురిసే వానల్ని ఎలా పదిలపరచుకోవాలో,ఎలా వినియోగించుకోవాలో ప్రాచీన శాస్త్రగ్రంథాలు వివరించాయి. తటాక నిర్మాణాలు, సరస్సుల వ్యవస్థ, కాలువలు ఇవన్నీ జల వినియోగంలోని మెలకువల్ని
తెలియజేస్తాయి.
-
కురిసిన వర్షం భూగర్భంలో పదిలపడే విధంగా నగరాదులలో అభివృద్ధి
కార్యక్రమాలుండాలి. తత్కాల ప్రయోజనాలను నెరవెర్చుకొనే తొందరలో, దీర్ఘకాలిక
ప్రయోజనాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృక్షసమృద్ధి, వాపీకూపతటాక నిర్మాణం- ఇవన్నీ పుణ్యకార్యాలుగా ప్రాచీన పాలకులు చేపట్టేవారు. వీటి
ద్వారా ఏడాదికి నియమితంగా కురిసే వానలు ఏడాది పొడుగునా
అందుబాటులో ఉండేలా చేయడమే కాక, సక్రమ వినియోగం ఉండేది.

వర్ష సమృద్ధిని కోరుకొనడమే కాక, అది లభించే ప్రయత్నాలు కూడా చిత్తశుద్ధితో చేయాలి. అందుకు వృక్షారోపణల్ని (చెట్లను నాటుట) ప్రోత్సహించారు. వృక్షాలను నరకడం ప్రాణివధతో సమాన పాపంగానే భావించారు. తప్పనిసరై ఒక వృక్షాన్ని
నరికితే ప్రత్యామ్నాయంగా ఇంకొన్నిటిని నాటి, మరికొన్ని ప్రాయశ్చిత్త క్రియలు చెప్పారు. అలాగే యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్దేశించారు.

ఇవి ఏవో నమ్మకాల క్రింద మనం కొట్టిపారేస్తాం. ప్రకృతిని జడపదార్థంగా భావించే ఆధునిక అజ్ఞానం వల్ల వచ్చిన వైపరీత్యమిది. ప్రకృతిలోని సూక్ష్మశక్తుల్ని గమనించిన
మన ప్రాచీన తపస్వులు వాటిలోని దేవతాస్వరూపాల్ని దర్శించారు. ప్రకృతి చైతన్యవంతమైనదని, భావస్పందనల్ని గ్రహించి స్పందించే లక్షణమున్నదని ప్రాచీన
ఋషిభావన.

శబ్ద ప్రకంపనలతో ప్రకృతిని స్పందింపజేయడం వేదమంత్రాల పనియైతే, ఆ మంత్రశక్తితో అనుసంధానించే యజ్ఞాది ప్రక్రియలలోని వినియోగ ద్రవ్యాలు, అవి వాయుమండలంలో కలిశాక జరిగే పరిణామాలు, వర్షాదుల్ని పృథ్వికి సమృద్ధిగా అందజేస్తాయని వైదిక విజ్ఞానం. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, ప్రాచీన భారత విజ్ఞానాన్ని ఔన్నత్యాన్ని అంగీకరించక తప్పనిస్థితికి వస్తున్న ఆధునికత కూడా వాటిని కాదనలేకపోతోంది.

‘వార్షికీః' - అనే మాట వర్షాలను ప్రత్యేకంగా పేర్కొన్నా, ఏడాదిలో వచ్చే ఋతువుల మార్పులన్నీ మనకు మంగళకరములుగా పరిణమించాలనే అర్థాన్ని కూడా గ్రహించాలి.

వర్షకారక మార్గాలలో 'ధర్మాన్ని' ప్రధానంగా పేర్కొన్నాయి సనాతన గ్రంథాలు. ధర్మపాలన వల్లనే చక్కని వృష్టి లభిస్తుందని ప్రధాన సిద్ధాంతం. భగవచ్చైతన్యభరితమైన
ప్రకృతిలో ప్రత్యణువూ ధర్మం వలన సంతోషించి శాంతమై, శుభకరంగా పరిణమిస్తుంది.అధర్మం వల్ల సంక్షోభాలు కలుగుతాయి.

వర్షకారకమైన ధర్మపాలన ఆ కురిసే వర్షం కూడా శుభంగా పరిణమించేలా
చేయగలదు.

“కాలే వర్షతు పర్జన్యః” అని మనసారా వేదమార్గాన్ని అనుసరించి పరమేశ్వరుని ప్రార్థిద్దాం.             
 తనకు లేనినాడు దైవంబు దూరును
 తనకు గల్గెనేమి దైవమేల,
 తనకు దైవమునకు దగులాట మెట్టిదో
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!

 మాటలాడు నొకటి మనసులోన నొకటి
 ఒడలి గుణము వేరె యోచన వేరె
 ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసులో ఉన్నది ఒకటి, పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.

 మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని
 పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు
 కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.

 అంతరంగమందు సపరాధములు చేసి
 మంచివానివలెను మనుజు డుండు
 ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.

 వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
 గట్టగానె ముక్తి గలుగబోదు
 తలలు బోడులైన తలుపులు బోడులా
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!         
 Vedantha panchadasi:
సత్యం జ్ఞాన మనంతం చేత్యుపక్రమ్యోప సంహృతమ్౹
యతో వాచో నివర్తన్త ఇత్యసఙ్గత్వ నిర్ణయః ౹౹196౹౹

196. ఆదియందూ, అంతమునందూ బ్రహ్మము సత్యము జ్ఞానము అనంత మనీ,వాక్కు తదితర ఇంద్రియములకు అది అగ్రాహ్యమనీ శ్రుతి చెప్పును.
దీని వలన బ్రహ్మము సంగరహితమని నిర్ణయింపబడుచున్నది.

తైత్తిరీయ ఉప.2.1.1,  2.4.1;
కేన ఉప.1.5,8;
బృహదారణ్యక ఉప.4.3.15,
     4.4.22.
వ్యాఖ్య:- వస్తువు శాశ్వతమైనప్పుడే దాని నుండి శాశ్వతానందము లభ్యము కాగలదు.వస్తువు శాశ్వతముగా ఉండవలెనన్న అట్టి వస్తువు దేశ కాలాదులచేత పరిచ్ఛిన్నమై ఉండకూడదు.

ఇట్టి శాశ్వత వస్తువేదో దాని వలననే నిత్యానందము చేకూరును.మరి అట్టి శాశ్వతమై ఆనందరూపమై యుండు వస్తువేది?

దీనిని గూర్చి తైత్తరీయోపనిషత్తు
"సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ"
సత్యమై జ్ఞాన స్వరూపమై అనంతమై యుండు వస్తువేదో అది బ్రహ్మ.

ఇట్టి బ్రహ్మము అనంతమై యుండుటచే ఇదే శృతి.
"ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్".
బ్రహ్మము ఆనందరూపమని నిర్దేశించినది.

మానవుడు పరిమితమైన ఆనందముతో సుఖించలేక,పరిమితము లేని ఆనందాన్ని పదే పదే వాంఛిస్తున్నాడు.తాను పదే పదే వాంఛించే అపరిమిత ఆనందము సాక్షాత్ బ్రహ్మమేనని వేదాంత శాస్త్రము దృఢపరిచినది.

ఇట్టి ఆనంద రూపము బ్రహ్మమేనని తెలియక దానిని ప్రపంచ సంబంధ వస్తువుల యందు వెదుకుచున్నాడు.

బ్రహ్మమునందు ఆనందము లేదు. బ్రహ్మము ఆనందరూపమే.అయితే ఆనందరూపమయిన బ్రహ్మమును గ్రహించి ఆనందపడవచ్చుననిన అట్లు వీలుకాదు.

ఏలనగా పరిమితమైన మనోబుద్ధులతో అపరిమితమైన ఆనందమును గ్రహించుటకు వీలులేదు.జీవ బ్రహ్మలకు సంబంధించిన జ్ఞాన మంతయూ వేదములయందు,ఉపనిషత్తులయందు,భగవద్గీతాది స్మృతుల యందు ప్రతిపాదింప బడినది.

బ్రహ్మము సంగరహితమని నిర్ణయింపబడుచున్నది.
పరబ్రహ్మమును నేత్రములతో,వాక్కుతో,మనస్సుతో చింతించుటకు వీలుకాదు.అట్టి ఆత్మను భోధించుట ఎట్లు?

తెలియు వాటికి,తెలియబడని వాటికి అతీతముగా నున్నది.ఏ ఆత్మ వాగీంద్రియము చేత గ్రహింపబడదో,దేని శక్తి చేత పని చేయుచున్నదో ఆ ఆత్మయే పరమాత్మయని తెలిసికొనుము. దీనికి అన్యమైనది బ్రహ్మము కాదు.

ఈ ప్రకారము దేహత్రయము,పంచకోశములు,
అవస్థాత్రయము మొదలగునవి నాకు దృశ్యములై యుండుటచే అసజ్జడ దుఃఖాత్మకములనియు,నా స్వరూపము వీటికి విలక్షణము అసంగమునైన సాక్షిరూపమేననియు నిశ్చయించుకొన వలయును.

ఇట్లు దృగ్దృశ్య వివేకమును ఆశ్రయించి 
"దేహత్రయ విలక్షణమును",
"పంచకోశ వ్యతిరిక్తమును",
"అవస్థాత్రయ సాక్షియునై"యుండు
"సచ్చిదానంద రూపాత్మయే"
తన స్వత రూపమని శృత్యుక్త్యాను భవముల ద్వారా నిశ్చయించుకోవాలి.

మాయీ సృజతి విశ్వం సన్నిరుద్ధస్తత్ర మాయయా ౹
అన్య ఇత్యపరా బ్రూతే శ్రుతిస్తే నేశ్వరః సృజేత్ ౹౹197౹౹

197. మరొక శ్రుతి మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ చెప్పును.కనుక మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త. 

శ్వేతాశ్వర ఉప 4-9.
వ్యాఖ్య:-ఈ ప్రపంచమునకు కారణము బ్రహ్మమా?లేక కాలమా?లేక బ్రహ్మము ఈ సృష్టికి ఉపాదాన కారణమా?
మనము దేని వలన జన్మించితిమి?సృష్టింపబడిన మనము దేనిచేత జీవించుచున్నాము?
ప్రళయ సమయములో మనమెచ్చట నున్నాము?
మన మనుభవించుచున్న సుఖదుఃఖములు ఎవరి అధికారముతో అనుభవించుచున్నాము?

జగత్తునకు కారణము కాలమే అని కాలవేత్తలు చెప్పుచున్నారు. స్వభావము కారణమని లోకాయతికులు చెప్పుచున్నారు. కర్మ కారణమని మీమాంసకులు భావించుచున్నారు.

యదృచ్ఛచేతనే ప్రపంచము సృష్టింపబడుచున్నదని నిరీశ్వరవాదులు పలుకుచున్నారు. పంచభూతములే సృష్టికి కారణమని జగన్నిత్యత్వవాదులు చెప్పుచున్నారు.ప్రకృతియే కారణమని శాక్తేయులు చెప్పుచున్నారు.

జీవుడు లేక హిరణ్యగర్భుడు కారణమని యోగులు తలంచుచున్నారు.సంయోగము కారణమని కొందరు భావించుచున్నారు.

ఆత్మభావన కలదగుట వలన పైన చెప్పిన 7 వస్తువుల సమూహము కూడ జగత్కారణము కాలేదు. జీవుడు కూడా సుఖదుఃఖభూతమగు జగత్తునకు కారణము కాలేడు.
(కాలస్వభావో...అను మంత్రము నుండి 10 మంత్రములు నారద పరివ్రాజకోపనిషత్ 9.ఉ.లో గూడ కలవు.)

మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ,మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త యనీ శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పుచున్నది.

వికారసహిత క్షర జగత్తు, వికారరహితాక్షర బ్రహ్మము - ఈ రెంటిలో ఒకటి నశించునదిగాను, మరొకటి నాశరహితముగాను నున్నది.

ఈ క్షరాక్షరములు రెండును కలిసియున్న జగత్తును స్వతంత్రుడగు ఈశ్వరుడును, అస్వతంత్రుడగు జీవుడును ఇద్దరును భరించుచున్నారు.

వ్యక్తా వ్యక్తములను  క్షరము అక్షరముగా చెప్పెదరు.ఈశ్వరుడు పరస్పరము కూడుకొని యున్న విశ్వమును భరించుచున్నాడు.

జన్మయే లేని మాయ,భోక్తృ భోగ్య వస్తువులతో కూడియున్నది.
జీవేశ్వరులను కల్పించుచున్న మాయ అనిర్వచనీయమై ఈశ్వర సన్నిధానమునందున్నది.

జన్మరహితులగు జీవేశ్వరు లిరువురును క్రమముగా అనంతుడగు ఈశ్వరుడుగాను అసమర్థుడగు జీవుడుగాను అగుచున్నారు.

ఈ జీవేవేశ్వరు లిద్దరును అజులు,జన్మాదివికారములు లేనివారలే.

కర్తృత్వ  భోక్తృత్వ భావము వలన జీవుడు బంధింపబడుచున్నాడు. అయినను ఆ జీవుడే తాను నిరుపాధిక పరమాత్మయని గ్రహించినప్పుడు విముక్తుడగుచున్నాడు.

ఈశ్వర-జీవ-మాయ=ఈ మూడడింటిని 
బ్రహ్మ స్వరూపముగా తెలిసికొన్నప్పుడు జీవుడు గూడా విశ్వరూపుడుగా నగుచున్నాడు.

మాయ క్షరము.అవిద్యాదులను నశింపజేయు పరమేశ్వరుడు అక్షరుడు,అద్వితీయుడు,స్వయం ప్రకాశుడు,పరమాత్మ.
క్షరమైన(నశించునది)
మాయను,అవిద్యను హరించువాడు కావున పరమేశ్వరుడు.

బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.అట్టి పరమాత్మ ధ్యానము వలనను, జీవపరమాతల సంయోజనము వలనను,నిరంతర తత్త్వచింతనము వలనను విశ్వమాయా నివృత్తి కలుగుచున్నది.     

Saturday, December 28, 2024

వాళ్ళు ప్యాలస్ ల్లో.. మీరు మురికి వాడల్లో..! A Common Man Letter to Fans of Movie Heroes

 వాళ్ళు ప్యాలస్ ల్లో.. మీరు మురికి వాడల్లో..! A Common Man Letter to Fans of Movie Heroes 





[సంగీతం] ఓ వెర్రి అభిమానికి సామాన్యుడి లేఖ డియర్ ఫ్యాన్స్ ఓ అభిమాన దేవుళ్ళలారా హీరోల కోసం పడి చచ్చే హీరోలే జీవితంగా బతికే ఆ హీరోల కోసం కంఠాలను కూడా కోసుకునే అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఆరాధ్య దైవాలకు పాలాభిషేకాలు చేసి బుర్రలేని వెర్రి అభిమానులకు ఓ సామాన్యుడి లేఖ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఆడియో ఫంక్షన్ లో మన హీరోలు మీరంతా ఉబ్బి తబ్బి అయిపోయే స్టేట్మెంట్ ఇస్తుంటారు ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢం అయినటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో ఎప్పుడూ నా వెన్నంటే ఉండి ఎప్పుడూ నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సులను అందజేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను నా ఫ్యాన్స్ నా బలం వాళ్ళు లేకపోతే నేను లేను వాళ్లే నా జీవితం ప్రేక్షక దేవుళ్ళ వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాం ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొందరు హీరోలు అయితే రెండు అడుగులు ముందుకేసి మిమ్మల్ని వాళ్ళ ఆర్మీ తో పోలుస్తారు అంటుంటారు నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను థాంక్యూ మరికొందరు డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు రకరకాలుగా పొగుడుతూ ఉంటారు మీరంతా చెలరేగిపోయి చొక్కాలు చింపుకొని వందకు ₹1000 రూపాయలు పెట్టి టికెట్లు కొని మళ్ళీ మళ్ళీ హీరో గారి సినిమాలు చూసి వాటిని హిట్ చేస్తూ ఉంటారు బొమ్మ 100 రోజులు ఆడించడానికి నానా తంటాలు పడుతుంటారు టికెట్లు మీరే కొని పంచి పెడుతుంటారు ఇక కటౌట్లకు పాలాభిషేకాలు రక్త తిలకాలు ఇవన్నీ ఇప్పటివి కాదులే 40 50 ఏళ్ల నుంచి తెలుగునాటి సినిమా పిచ్చోళ్ళ హంగామా జనానికి తెలిసిందే అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబులకు అభిమానులు మాత్రమే ఉండేవారు ఇప్పుడు హీరోలకు ఆర్మీలు తయారయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అనబడే మీరు హీరోలకు చీప్ లేబర్ లాంటి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ కోసం ప్రచారం చేసే వాళ్ళు మీరే హీరోల్ని దేవుళ్ళలా చూస్తూ వాళ్ళ కోసం ఎగబడిపోయే వాళ్ళు మీరే హీరోలు మీకు అప్పుడప్పుడు సెల్ఫీలు ఇస్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ రెచ్చగొడితే చాలు గుడ్డలు చింపుకొని హీరోల కోసం వాళ్ళ సినిమాల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం గొంతులు కోసుకోవడం కూడా మీరు వెనుకాడరు ఒకప్పటితో పోలిస్తే ఈ పిచ్చ ఈ సైకో ఫ్యాన్సీ ఇంకా పెరిగింది హీరోల్ని భగవత్ స్వరూపుల్లాగా చూడడం హీరోలు ఎక్కడికి వస్తే అక్కడ వేలకొద్దీ పోగుబడిపోవడం హీరోల కోసం అన్నదానాలు రక్తదానాలు నిర్వహించడం మొదటి రోజు టికెట్లు బ్లాక్ లో కొని చూడటం రిలీజ్ రోజున వేటపోతులు బలి ఇవ్వడం క్షీరాభిషేకాలు కటౌట్లు బొమ్మ 50 రోజులు 100 రోజులు ఆడించడానికి చేతి నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్స్ చేసే అరాచకాలు ఇవి కేవలం హీరోల వ్యామోహంలో పడి సంసారం గుల్ల చేసుకోవడం చదువుల్ని గాలి వదిలేయడం చివరికి కూలీలుగా ఆటో డ్రైవర్లుగా మెకానిక్కులుగా మిగిలిపోవడం ఏ సినిమా హీరో ఫ్యాన్ జీవితం చూసినా ఇదే కథ సెలబ్రిటీస్ కోసం ఎగబడిపోయి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు కోకొల్లలుగా వింటుంటాం సినిమా మాయలో హీరోల పిచ్చిలో ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడం అందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేయడం ఇల్లు వాకిలి అమ్ముకోవడం చివరికి బికారులుగా మారడం ఇలా ఎంతో మంది అభిమానులు జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు హీరోలు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనూ బంజారా హిల్స్ లోనే ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం మురికి వాడల్లో గుడిసెల్లో మెకానిక్ షెడ్లలో సింగిల్ రూమ్ గదుల్లో బతుకు వెళ్లదీస్తూ ఉంటారు ఒక సినిమాకి హీరో ఇవాళ వంద కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు కానీ ఒక అభిమాని రోజుకి ₹100 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు ఫ్యాన్స్ ని ఉద్దేశించి వాళ్ళ వల్లనే బతికి బట్ట కడుతున్నామని వాళ్ళ అభిమానమే తమను బ్రతికిస్తుందని వాళ్ళు మా ఆర్మీ అని మా డై హార్ట్ ఫ్యాన్స్ అని ఇన్ని కబుర్లు చెప్పే హీరోలు ఫ్యాన్స్ కోసం ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెడతారా వాళ్లకు వచ్చిన వందల కోట్ల రూపాయల ఆదాయంలో 30% సొమ్ము ఫ్యాన్స్ కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఇస్తారా ఒక్క విషయం మర్చిపోకండి వాళ్ళు నటులు మాత్రమే వాళ్ళని మనం హీరోలుగా మారుస్తాం ఆరాధ్య దైవాలను చేస్తాం అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తాము సినిమాల్లో ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలని ఊహించుకుంటారు అక్కడే దెబ్బ తింటారు ఒక సినిమా హీరోని ఎందుకు అభిమానించాలి సినిమా హీరో ఒక పాత్రలో మాత్రమే జీవిస్తాడు ఆ పాత్ర ముగిసిపోగానే తన బతికేదో తను బతుకుతాడు పాత్రను అభిమానించాలి తప్పించి ఆ పాత్ర చేసిన నటులను నిజంగానే హీరోలు అనుకుంటే మాత్రం ప్రతి ఫ్యాన్ కు చివరికి చెప్పే మిగులుతుంది ఇండియాలో పేదరికం నిరక్షరా ప్రజల్లో బానిస మనస్తత్వం ఇవన్నీ సినిమా వాళ్లకు బాగా కలిసి వస్తున్నాయి సినిమా హీరోలు కూడా తమను తాము దైవాంశ సంభూతులుగానే భావిస్తున్నారు లేకపోతే రెండున్నర గంటల సినిమాలో నలుగురిని కొట్టే ఒక హీరో కనిపించగానే వేల మంది జనం ఇలా పిచ్చెక్కిపోయి మీద పడిపోతుంటే మనలో ఎంత బానిస మనస్తత్వం ఉందో అర్థమవుతోంది ఒక యాక్టర్ నటిస్తే ఒక హీరోయిన్ అందచందాలను చూపిస్తే ₹100 మన డబ్బులు పడేసి చూసి వచ్చే సినిమాకి మనం బానిసలుగా మారిపోతున్నాం ఇదేం ఘోరం ఇదేం అరాచకం సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో చూడటానికి అల్లు అర్జున్ వస్తే అతగాడిని చూడటానికి వేల మంది తరలి వచ్చారు బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరు ₹3000 టికెట్ పెట్టుకొని అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు ఆ తొక్కిసలాటలో ఒక కుటుంబంలో తల్లి చనిపోయింది ఆమె కొడుకు 14 ఏళ్ల శ్రీతేజ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఇందుకు కారణమైన అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లో 500 కోట్ల విలువ చేసే తన ఇంట్లో విలాసంగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు భార్య పిల్లలతో కులాసాగా దిలాసాగా బతుకుతున్నాడు నిజానికి సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఆ తల్లిదండ్రులది కూడా పొరపాటే పిల్లల్ని వెంటపెట్టుకొని సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో సమయం లో అల్లు అర్జున్ చూడాలని కుటుంబం మొత్తం ఎగబడటం ఎంత సైకో ఫ్యాన్సీ మనస్తత్వం ఇదా మీరు పిల్లల్లో చూడాల్సింది వాడెవడో ఆవరా హీరో గాడిని చూడడానికి ప్రాణాలకు తెగించి జనంలో నలిగిపోతున్నారంటే ఈ జనరేషన్ ఎంతగా వెనకబడిందో అర్థమవుతోంది అందుకే ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోల దృష్టిలో నిజానికి ఒక వెర్రి పుష్పాలు మీరే మాకు దిక్కు మీ వల్లే మేము ఇలా ఉన్నాం మీరు మా ఆర్మీ అని అనగానే వీళ్ళంతా గుడ్డలు చింపుకొని ఇంట్లో చెంబులు ముంతలు కూడా అమ్ముకుని హీరోల కోసం సినిమాలు చూస్తుంటారు వీళ్ళ రక్తం చెమట టికెట్ల రూపంలో పిండుకు ఉంటారు నిర్మాతలు హీరోలు ఏ హీరో అయినా ఎన్నడైనా ఒక్క సినిమా అభిమాని గురించి ఆలోచించాడా హీరోలు హీరోయిన్స్ నిర్మాతలు కోట్ల రూపాయల విలువైన ఇళ్లలో ఎందుకు ఉంటారు మనం ఎందుకు మురికి వాడల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో పూరి గుడిసెల్లో బతకాలి మన బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా జనం డబ్బు మీద సినిమా వాళ్ళు వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు వాళ్ళని అభిమానించి మీ జీవితాలను భవిష్యత్తును ఆగమ్య గోచరం చేసుకుంటున్నారు నీ అభిమానం సినిమా వరకే ఉండాలి తప్ప హీరో పై కాదు హీరోల పిల్లలు మళ్ళీ హీరోలు అవుతున్నారు కానీ అభిమానుల పిల్లలు మాత్రం ఆటో డ్రైవర్లుగా రిక్షా పుల్లర్లుగా మెకానిక్కులుగా తాపి మేస్త్రులుగా మిగిలిపోతున్నారు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా సినిమా హీరో కటౌట్ కి క్షీరాభిషేకం చేస్తే మీ కొరిగేది ఏంట్రా పిచ్చి వేధవలారా పెళ్ళాం పుస్తల తాడు కూడా మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున వేటపోతుల్ని బలిస్తున్నామని సంబరపడిపోతున్నారు తప్ప ఈ మత్తులో మీ కుటుంబాన్ని బలి చేసుకుంటున్నామని ఎన్నడైనా ఆలోచించారా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ అల్లు అర్జున్ రామ్చరణ్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి హీరోలకు మీరు ఎవరో తెలుసా అసలు మీరు ఎవరో వాళ్ళు గుర్తుపట్టి పెడతారా మీలో ఒక్కరినైనా ఒక హీరో గుర్తుపట్టి పేరుతో పిలవగలడా ఇంట్లో పూట తిండి లేకపోతే ఏ హీరో అయినా వచ్చి మీకు అన్నం పెడతాడా మీ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక బడి మానిపించి కూలి పనులకు పంపుతుంటే ఏ ఒక్క హీరో అయినా వచ్చి మీ బతుకులు బాగు చేస్తాడా మరి ఆ హీరో కోసం మీరు ఎందుకు ఎగబడాలి మీకు వ్యక్తిగత జీవితాలు లేవా మీ జీవితం మీద మీకు గౌరవం లేదా మీ బతుకులు మీరు బాగు చేసుకోరా హీరో గాడి సినిమా థియేటర్ కి వెళ్లి ఒకసారి చూడండి బాగుంటే మరోసారి చూడండి అంతేగాని చేతి వాచీలు తాకట్లు పెట్టి హీరో గాడి కోసం సంబరాలు చేయకండి మీ పిల్లల బతుకులు నాశనం చేయకండి మీ భార్యలకు కన్నీళ్లు మిగల్చకండి హీరోని నమ్ముకుని బాగుపడిన ఒక్క అభిమాని కూడా చరిత్రలో లేడు కానీ అభిమానుల్ని నమ్ముకుని వేల కోట్లకు ఎదిగిన హీరోలు చాలా మంది చరిత్రలో ఉన్నారు సినిమాను సినిమాలో చూడండి వాళ్ళు తెరపై మాత్రమే హీరోలు నిజ జీవితంలో జీరోలు సినిమాలో పోలీస్ స్టేషన్ కొనేసిన పుష్ప ఇప్పుడు అన్ని మూసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బెంచ్ మీద కూర్చున్నాడు తగ్గేదేలే అంటే పోలీసులు తోలు తీస్తారు కొన్ని గంటల పాటు అల్లు అర్జున్ అనే వాడిని జైల్లో పెడితే వాడికి ప్యాంట్ తడిసిపోయింది అది అతగాడి హీరోయిజం అంత పెద్ద హీరోయిన్ ఓదార్చడానికి టాలీవుడ్ అంతా కదిలి రావాల్సి వచ్చింది అల్లు అర్జున్ ని చూడటానికి ఎగబడి బౌన్సర్ల కాళ్ళ కింద నలిగిపోయి చనిపోయిన రేవతి అనే మహిళ కుటుంబాన్ని అల్లు అర్జున్ ని పరామర్శించిన హీరోల్లో ఒక్కడు కూడా వెళ్లి పరామర్శించలేదు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పడి ఉన్న శ్రీతేజను ఈ హీరోల్లో ఒక్కడు వెళ్లి ఎలా ఉన్నావని అడగలేదు ఆ కుటుంబానికి ₹10 కూడా చేతిలో పెట్టలేదు ఇది వీళ్ళ నిజాయితీ అల్లు అర్జున్ అనే ఐదు అడుగుల అతిగాడిని చూడడానికి ఇద్దరు పిల్లల్ని అనారోగ్యంతో ఉన్న మొగుడిని వెంటపెట్టుకుని సంధ్య థియేటర్ కి వెళ్ళింది ఆ మహా తల్లి చివరికి ఆ కుటుంబం దిక్కు లేనిది అయిపోయింది ఇప్పుడు నిర్మాతలు హీరోలు వందల కోట్లు లెక్క పెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు మహా అయితే పాతిక లక్షలు ఆ కుటుంబం మొహాను విసురుతారు రేపటి నుంచి వాళ్ళని ఎవరూ పట్టించుకోరు ఇలాంటి రేవతి కథలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వందలు ఉన్నాయి హీరోల మాయలో సినిమాల పిచ్చిలో బ్రష్టు పట్టిపోయిన జీవితాలు కోకొల్లలు ఉన్నాయి ఒక సినిమాతో ఒక పాత్ర అయిపోతుంది మరో సినిమాలో మరో పాత్రలకు వెళ్ళిపోతాడు హీరో మూడు నెలలకు ఒక పాత్ర వేసుకుంటూ నిత్యం నటిస్తూ బతికే వాళ్ళ కోసం మీ జీవితాలు ఎందుకు నాశనం చేస్తాయి చేసుకుంటారు మీ పెళ్ళం పిల్లల కన్నీళ్లు ఆకలితో వాళ్ళు పెట్టే ఆక్రందనలు మీకు వినిపించడం లేదా ఏ హీరో అయినా తన అభిమానిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయా అలాంటి అరుదైన ఘటన మీరు ఎప్పుడైనా చూసారా మరి ఎందుకు ఈ హీరో కానీ జీరోల కోసం మీ తపన ఎందుకు వీళ్ళ కోసం మీ జీవితాలు తగలబెట్టుకుంటారు మీ భార్య పిల్లల కోసం ఆలోచించండి మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి మీ చదువుల కోసం కష్టపడండి మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోండి విలువైన సమయాన్ని రేపటి కోసం ఆయుధంగా మార్చుకోండి ఈ పనికిమాలిన హీరోలు మీరు ఎవరో తెలియని సెలబ్రిటీస్ కోసం మీరెందుకు జీవితాన్ని హారతి కర్పూరం చేసుకుంటారు ఎందుకు ఇలా తొక్కిసలాటలో నలిగిపోతారు చివరికి ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు అభిమానుల పైన ఫ్యాన్స్ పైన ఈ హీరోలకి అంత ప్రేమ ఉంటే వాళ్ళు సంపాదించిన వందల కోట్ల పారితోషకాల్లో సగం ఫ్యాన్స్ కోసం ఖర్చు పెట్టమనండి ఆ వందల కోట్ల డబ్బుని ఫ్యాన్స్ కుటుంబాలు పిల్లల బాగు కోసం వెచ్చించమని చెప్పండి అప్పుడు వీళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తాయి అంతేగాని ఎవడో హీరో కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక హీరో రెమునరేషన్ 100 కోట్లు అవుతుంది మీరు మాత్రం సింగిల్ రూమ్ ఇంట్లోనే ఉంటారు అదే సైకిల్ అదే బైక్ నడుపుతుంటారు మొదటి సినిమాకి టేబుల్ ఫ్యాన్ ని రెమునరేషన్ గా తీసుకున్న చిరంజీవి ఈరోజు మీ పుణ్యాన వేల కోట్ల రూపాయలు సంపాదించాడు తొలి సినిమాలో ట్రాన్స్ జెండర్ లా మనకు కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా పుష్ప కి 300 కోట్ల రూపాయలు వాటాగా తీసుకున్నాడట వీళ్ళని పిచ్చిగా ఆరాధించి వాళ్ళ కోసమే బతికే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి సినిమాను సినిమాలో చూడండి అంతేగాని సైకో ఫ్యాన్సీ మత్తులో హీరోలను దేవుళ్ళుగా చూస్తే మీరు దరిద్రులుగా మిగిలిపోవడం కాయం ఇట్లు మీ సామాన్యుడు [సంగీతం] [సంగీతం] 
 *మానవుని యొక్క నడవడిక.....*

శాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనేవాడు మనిషి..
శాస్త్రాన్ని అనుసరించకుండా స్వేచ్ఛగా నడుచుకొనేవాడు పశువు...

అందుకే పెద్దలంటారు.....

శ్లో॥  శ్రుతయో యత్ర వర్తంతే - తత్ర తిష్టంతి వైనరాః । 
మతయో యత్రవర్తంతే - తత్ర తిష్టంతి వానరాః ॥

శ్రుతిని అనుసరించేవాడు నరుడు..
మతిని అనుసరించేవాడు వానరుడు...

౧. శ్రుతి తప్పి పాడరాదు.
౨. తాళం తప్పి ఆడరాదు. 
౩. శాస్త్రం తప్పి నడవరాదు. 

శాస్త్రం తప్పినడిచే వాడికి ఇహంలేదు - పరం లేదు. 

అందుకే నసిద్ధిం, నసుఖం, నపరాంగతిం అవాప్నోతి:.....

కార్యసిద్ధి లేదు, సుఖం లేదు. మోక్షం లేదు, అని చెబుతున్నారు. 

ఎవరైతే శాస్త్ర విధిని తప్పి నడుస్తున్నారో అట్టి వారికి లక్ష్యం సిద్ధించదు, సుఖం కలగదు, పరమగతిని పొందలేరు అని స్పష్టం చేస్తున్నారు. 

శాస్త్రం చెప్పినట్లు నడుచుకోక పోవటానికి కారణం ఏమిటి? కామమే. కోరికలే, ఆశలే, స్వార్థమే.

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

57. నమః పృథివ్యై నమ ఓషధీభ్యః

భూమికి నమస్కారము, ఓషధులకు నమస్కారము(శ్రుతివాక్యం)

పంచభూతాలను జడప్రకృతిగా కాక, ఈశ్వరుని కరుణకు సాకారాలుగా, ఈశ్వర చైతన్య స్వరూపాలుగా ఆరాధించమని వేదమాత ప్రబోధం. ఈ భావన వేదంతో మొదలై భారతీయ పురాణేతిహాసాలలో, స్మృతులలో, కావ్యాలలో విస్తృతమై
గోచరిస్తోంది. 'ఈశావాస్య మిదం సర్వం' అనే ఉపనిషత్ తాత్పర్యం ఇదే.

'జననీ పృథివీ కామదుఘాస్తే' - తల్లి భూమి అన్ని కోరికలను తీర్చే కామధేనువై ఉన్నది' అని కంచిమహాస్వామి శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామి వారు పలికారు.

భూమిని ధేనువుగా ఆరాధించి సస్యారణ్య నదీనదాది సంపత్ప్రదాయినిగా కీర్తించి
జగన్మాతగా శ్లాఘించారు మహర్షులు. లక్ష్మీనామాలు, లలితానామాలు కూడా భూమాతగా జగదంబను దర్శింపజేస్తున్నాయి.

మాతృస్తన్యంతో శిశువు పాలింపబడినట్లుగా, భూమాత సంపదలు మనకు పోషక,రక్షకాలు. ఈ పృథివి ఇచ్చే సంపదలలో ఓషధులు అత్యంత ప్రధానం. అందుకే
ఓషధుల్ని దేవతలుగా దర్శించారు. ఇది 'దర్శనం'. అంతేగానీ 'భావన' కాదు.దేవతాశక్తులు ఓషధులుగా వ్యక్తమవుతాయి. ఆ సూక్ష్మతేజో విశేషాలను దర్శించారు ఋషులు.

ఆ ఓషధుల అద్భుత శక్తులను ఎలా గ్రహించాలో, ఎలా ఔషధాలుగా మలచాలో,ఎలా వినియోగించాలో వేదర్షులు అనేక శాస్త్రాలుగా ఆవిష్కరించారు.

ఓషధులు ప్రాణవంతాలు. తాము సంకల్పించుకుంటేనే సాక్షాత్కరించే దివ్యౌషధులు కూడా చాలా ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని తెచ్చేటప్పుడు,
ఆ పర్వతశిఖరమంతా స్వామి హస్తాలకు రావాలని - ఓషధులు అదృశ్యరూపంగా మారాయని వాల్మీకి అభివర్ణించారు.

మానవులలో ధార్మికశక్తి క్షీణిస్తే కొన్ని ఓషధులు లభించవని పురాణాలు వర్ణించాయి.
మన ప్రాచీన వైద్యగ్రంథాలు వర్ణించిన అనేక ఓషధులలో ఇప్పుడు కొన్ని అలభ్యాలు.అరణ్యాలను విచక్షణ రహితంగా నరికి వేయడం, మన శాస్త్రాలను మనం నిర్లక్ష్యం చేయడం వంటివి ఇందుకు కారణాలు.

ఆయుర్వేద విద్యపై తగినంత ప్రోత్సాహకర అధ్యయన కేంద్రాలు మన దేశంలోనే లేవు. మరోవైపు భయంకరమైన కాలుష్యాలు, కృత్రిమ ఔషధాలపైననే ఆధారపడి,
సహజత్వానికి దూరమై పోతున్నాం.

తులసి, పసుపు, మారేడు లాంటి ఓషధీ విలువలున్న వృక్షాలను జీవన విధానంలో కలిపిన మన సంస్కృతినే కోల్పోతున్నాం.

లక్షలాది ధనాన్ని ఖర్చుపెట్టినా తొలగని రోగాలను, అతితక్కువ ఖర్చుతో చిన్నపాటి ఓషధీ మూలికతోనో, పత్రంతోనో తొలగించగలిగే అద్భుత విద్యపట్ల మనమే అనాదర భావాన్ని అభివృద్ధి చేసుకొని వ్యాధిగ్రస్త జీవితాలను నెట్టుకొస్తున్నాం.

ఇప్పటికైనా మేలుకొని ప్రాచీన భారతీయ గ్రంథాలను పరిశీలించి ఆ ఓషధీ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకతని గుర్తించాలి. ఓషధుల గురించి
కేవలం ఆయుర్వేద గ్రంథాలలోనేకాక, పురాణాలలో, స్మృతుల ఆచారాలలో,
జానపదుల జీవితాలలో బోలెడంత సమాచారముంది.

గిరిజనులు, పల్లీయులు, ఆటవికులు ఎంతో అనుభవంతో స్వాభావికమైన సత్యాన్ని కలిగి, ఎంతో ఓషధీ విజ్ఞానాన్ని గడించారు. కానీ ఆధునిక విజ్ఞానం లేకపోవడం మూఢత్వం క్రింద గణించి, వారి స్వాభావిక విద్యని సైతం వారి నుండి దూరం చేస్తున్నారు. దానితో వారిలో ఉన్న ప్రాచీన విద్య కూడా హరించుకుపోతోం(యిం)ది!
తగిన పరిశోధన లేకుండా పాశ్చాత్య వైద్యశాస్త్రం ఆర్షమైన ఓషధీ విజ్ఞానాన్ని మొదటి నుండి నిరసిస్తూనే ఉంది.

ఈ నిరసన వైఖరినీ, నిర్లక్ష్య ధోరణినీ ఇప్పటికైనా వదలుకోవాలి. ప్రభుత్వాన్ని కదిలించడం ఎలా ఉన్నా, స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమపీఠాలు స్వయంగా వివిధ ఓషధీ వృక్షాలను పెంచి పోషించి, ఆ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యం.

ఆ విధంగా మన బుద్ధుల్ని ప్రేరేపించవలసిందిగా 'ఓషధీనాం పతయే నమః”అంటూ పరమేశ్వరుని ప్రార్థిద్దాం.          
 *ధ్యానమార్గ* 
చిన్న బ్యాంకు పైననే అందరూ ఆధారపడిత
త్వరలోనే విఫలమవుతుంది కానీ దాని వెనుక రిజర్వు బ్యాంకు ఉన్నప్పుడు, చిన్న
బ్యాంకు విఫలమయ్యే ప్రశ్నేలేదు. అదేవిధంగా మన బలహీనతల వెనుక మనకు గొప్ప ఆధారముందన్న గట్టినమ్మకం, అంతేకాక అతను చాలా దగ్గరవాడని,
ఆప్తుడని, నాస్వంత ఆత్మ అని, ఎప్పుడూ సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉందన్న మనోవైఖరి చాలా శాంతినిస్తుంది. అన్ని ఒత్తిడుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.

నా పూర్వజన్మ గురించి నాకేమీ జ్ఞప్తి లేకుండడానికి కారణమేమిటి? మానస సాగరానికి కేవలం ఉపరి భాగమనీ, మన ఆ సాగర గర్భంలో ఉన్నాయని దీని వల్ల తెలుస్తుంది. తీవ్రంగా ప్రయత్నిస్తే అవి పైకి రావడంతోపాటు మీ పూర్వజన్మను కూడా మీరు తెలుసుకోగలరు. (లేవండి మేల్కోనండి,  Vol. 1, Pg. 45)

శక్తి ఉన్నప్పుడు చెడ్డపనులకు దానిని వెచ్చించితే చాలా దారుణమైన బాధలకు లోనుకావలసి ఉంటుంది. ఉన్నతమైనవి ఏమి సాధించలేరు. అదేశక్తిని తనకు తానుగా శిక్షణను ఇచ్చుకొని, మానవునిలోని ఆరు శత్రువులను జయించాలి.

ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టే అలవాటు చాలా
హీనమయింది. చాలా మంది దానిని, దీనిని, వీడిని, వాడిని ఎప్పుడూ తప్పు పడుతుంటారు. దానివల్ల వారు, కోపంగాను, ఇతరులపట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నీ అయిష్టాన్ని ప్రకటిస్తూ పోవడమే అలవాటు అయినట్లయితే మనస్సు అంతా అయిష్టంగానే మారి తనకు తానే పెద్ద శత్రువవుతాడు. ఎందుకు అయిష్టాలన్నీ పోగుచేసుకొని మనస్సులో పెట్టుకుంటావు? అప్పటికప్పుడే పరిశీలించుకొని పారవెయ్యవచ్చుకదా! అయితే మరి శత్రువు ఎవరు నీకు ? నీకు నీవే శత్రువువి.ఆధారపడితే
త్వరలోనే విఫలమవుతుంది కానీ దాని వెనుక రిజర్వు బ్యాంకు ఉన్నప్పుడు, చిన్న
బ్యాంకు విఫలమయ్యే ప్రశ్నేలేదు. అదేవిధంగా మన బలహీనతల వెనుక మనకు గొప్ప ఆధారముందన్న గట్టినమ్మకం, అంతేకాక అతను చాలా దగ్గరవాడని,
ఆప్తుడని, నాస్వంత ఆత్మ అని, ఎప్పుడూ సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉందన్న మనోవైఖరి చాలా శాంతినిస్తుంది. అన్ని ఒత్తిడుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
❤️🕉️❤️
నా పూర్వజన్మ గురించి నాకేమీ జ్ఞప్తి లేకుండడానికి కారణమేమిటి? మానస సాగరానికి కేవలం ఉపరి భాగమనీ, మన ఆ సాగర గర్భంలో ఉన్నాయని దీని వల్ల తెలుస్తుంది. తీవ్రంగా ప్రయత్నిస్తే అవి పైకి రావడంతోపాటు మీ పూర్వజన్మను కూడా మీరు తెలుసుకోగలరు. (లేవండి మేల్కోనండి,  Vol. 1, Pg. 45)
❤️🕉️❤️
శక్తి ఉన్నప్పుడు చెడ్డపనులకు దానిని వెచ్చించితే చాలా దారుణమైన బాధలకు లోనుకావలసి ఉంటుంది. ఉన్నతమైనవి ఏమి సాధించలేరు. అదేశక్తిని తనకు తానుగా శిక్షణను ఇచ్చుకొని, మానవునిలోని ఆరు శత్రువులను జయించాలి.
🕉️❤️🕉️
ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టే అలవాటు చాలా
హీనమయింది. చాలా మంది దానిని, దీనిని, వీడిని, వాడిని ఎప్పుడూ తప్పు పడుతుంటారు. దానివల్ల వారు, కోపంగాను, ఇతరులపట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నీ అయిష్టాన్ని ప్రకటిస్తూ పోవడమే అలవాటు అయినట్లయితే మనస్సు అంతా అయిష్టంగానే మారి తనకు తానే పెద్ద శత్రువవుతాడు. ఎందుకు అయిష్టాలన్నీ పోగుచేసుకొని మనస్సులో పెట్టుకుంటావు? అప్పటికప్పుడే పరిశీలించుకొని పారవెయ్యవచ్చుకదా! అయితే మరి శత్రువు ఎవరు నీకు ? నీకు నీవే శత్రువువి.          
 Vedantha panchadasi:
 మేఘాకాశమహాకాశౌ వివిచ్యేతే న పామరైః ౹
తద్వద్ర్బహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాత దర్శినః ౹౹195౹౹

194.మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము అసలు ఆకాశము ఒకటే అని పామరజనులు భావింతురు. అట్లే పైపైన మాత్రము చూచేవారు బ్రహ్మము ఈశ్వరుడు ఒకటే అని చూతురు.
వ్యాఖ్య:- ఈ అజ్ఞానమును సావధానముగా నిశితముగా పరిశీలించినప్పుడు 
అది కనిపించదు 
అది అదృశ్యమగును.

అసత్యమయినది అసత్యత్వములో నెలకొనియున్నది.ఎండమావిలోని నీరు అసత్యము గనుక ఎప్పుడును ఎంత మాత్రము నీరు కాదు.సత్యసహాయముతో అన్ని విషయముల సత్యత్వము అభివ్యక్తమయి భ్రాంతి లేక మాయామయ దర్శనము(దృష్టి) 
అదృశ్యమగును.

ఆత్మ సత్యము.
చైతన్యము జీవస్వభావమును ధరించినట్లుగానుండి తన నిజ స్వభావమును విస్మరించి ఉన్నదని తాను తలచుదానినంతటిని అనుభవగోచరము గావించుకొనును. 

జీవుడు పంచభూతములను తనకు వెలుపలనున్నట్లు జూచును.
కొన్ని తన లోపలనున్నట్లు మరికొన్ని వెలుపలనున్నట్లు భావించును.అందువలన వానిని అనుభవించును.

జడమగు ఆకాశము(అంతఃకరణ) తన లోపల తనను ప్రతిఫలించజేయజాలదు.
చైతన్యము తన అంతర్గత జ్ఞానముతో నానావిధ ప్రాణులను ఊహించును.దాని శక్తి అట్టిది.దానిని ఎవ్వరు కాదన జాలరు(ఆక్షేపింపజాలరు).

తన స్వభావము అపరిచ్ఛిన్న చైతన్యము,దేహరహితమయినను తనలోపల తనను ప్రతిఫలింపజేసి తనను ద్వైతముగా ఊహించును. తలచిన దానినంతటినీ ఉన్నదానినిగా చూచును.

బంగరుకడియమునందు బంగారము,కడియము రెండున్నవి.వీనిలో 
బంగారము సత్యము,రెండవది కడియ రూపము.అదేవిధముగా ఆత్మయందు చైతన్యము, భౌతిక(జడ)పదార్థత్వభావన గూడా ఉన్నవి.

నిన్నటి తప్పును నేటి స్వప్రయత్నముతో సరిదిద్ది మంచి కార్యముగా మార్చుకొనగలిగినట్లే, పూర్వాభ్యాసములను గూడ తగిన స్వప్రయత్నముతో అతిక్రమింపగలము.

ఈ సంసారము(ప్రపంచదృశ్యము)
అనునది జీవుని
(ప్రథమవ్యక్తి-హిరణ్యగర్భుని) ఆద్యస్వప్నమే.

ఎక్కడ ప్రపంచము కనిపించిననూ అది మాయామయమయిన  ప్రపంచదృశ్యము.ఈ భ్రాంతి మానసిక పరిమితితో(వాసనతో)
పోషింపబడుతున్నది.

దాని పరిత్యాగము "విముక్తి".
సమస్త విశ్వము చైతన్యశక్తియొక్క ఆవిర్భావమే.
 ఉపక్రమాదిభిర్లిజ్గైస్తాత్పర్యస్య
విచారణాత్ ౹
అసఙ్గం బ్రహ్మ మాయావీ సృజత్యేష మహేశ్వరః ౹౹195౹౹

195.  శ్రుతివాఖ్యముల తాత్పర్య నిర్ణయమునకు సూచింపబడిన ఆరు నియమములను ఉపయోగించి విచారించినచో బ్రహ్మము అసంగమనీ మాయతో కూడిన మహేశ్వరుడు సృష్టికర్తయనీ తేటపడును.
వ్యాఖ్య:- ఉపక్రమ ఉపసంహారములు, అభ్యాసము,
అపూర్వత, ఫలము, అర్థవాదము ఉపపత్తి అనునవి షడ్లింగములు.

1.  ఆదియందూ అంతమునందూ ఛాందోగ్యపనిషత్తు బ్రహ్మమును గూర్చి చెప్పును 

2. అభ్యాసమనగా మరలమరల చెప్పుట.
"తత్త్వమసి"అనే వాక్యము తొమ్మిది పర్యాయములు చెప్పబడినది.

3.  అపూర్వత అనగా ఇతర ప్రమాణముల వలన తెలియకుండుట.బ్రహ్మము యొక్క లక్షణములు శ్రుతి ప్రమాణముచే తప్ప ప్రత్యక్షానుమానాది ఇతర ప్రమాణముల వలన తెలియబడవు.

4.  శ్రుతివాక్యములు ఫలవంతముగ ఉండాలి. బ్రహ్మజ్ఞానము యొక్క ఫలము ఆత్యంతిక దుఃఖనివృత్తి పరమానంద ప్రాప్తి.

5.  అర్థవాదము అనగా ప్రశంస,బ్రహ్మేతరముల నింద,ఇదీ శ్రుతి వాక్యాలలో లభించును.

6 .  ఉపపత్తి అనగా తగిన హేతువాదములు ఉదాహరణములు.ఇవి కూడా ఉపనిషత్తులలో విస్తారముగ లభించును.

ఇట్లు ఈ ఆరు నియమములను అనుసరించి శ్రుతివాక్యములను సమన్వయించి విచారించినచో బ్రహ్మము ఈశ్వరుల తత్త్వము చక్కగా అర్థమగును.

అన్యోన్యా ధ్యాస తేటపడును.        
 *నారీ శిరోమణి కణ్ణకి..*

🌸తమిళ సాహిత్యం లో సంగం కాలంనాటి 'శిలప్పదికారం' కావ్యానికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ కావ్య నాయిక కణ్ణకి అంటే తమిళనాట విపరీతంగా గౌరవించి ఆరాధిస్తారు.

🌿అలాటి కణ్ణకి కి పశ్చిమకనుమలలో తమిళనాడు.. కేరళ సరిహద్దుల్లో విణ్ణేట్రిపారై శిఖరాన ఒక ఆలయం కూడా నిర్మించారు.
సముద్ర మట్టానికి 5,500 అడుగుల ఎత్తున ప్రకృతి సౌందర్యాలతో అలరారే కొండలమధ్య 
దర్శనమిస్తుంది యీ ఆలయం.

🌸ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమినాడు
కణ్ణకి దేవికి ప్రత్యేక పూజలు జరుపుతారు.

🌿మదురై రాజాస్థానంలో తనకు జరిగిన అవమానానికి తీవ్ర ఆగ్రహం చెందిన కణ్ణకి మదురైని భస్మీపటలం చేసిన కణ్ణకి యీ అడవీ ప్రాంతానికి వచ్చి చేరింది.

🌸అక్కడ ఒక వేంగై చెట్టు  (Pterocarpus  marsupium, ఏగిస) కింద కూర్చుని తనకి కలిగిన కష్టానికి దుఃఖిస్తూ కూర్చుంది. ఈవిధంగా 14 రోజులు విచారంగా, అన్యాక్రాంతంగా గడిపిన కణ్ణకిని యీ ప్రాంతంలో నివసించే కోయవారి ఆదరాభిమానాలు, ఆటపాటలు కణ్ణకి 
దుఃఖాన్ని మరిపించాయి.

🌿14వ రోజున సాయంకాలం గగనవీధుల నుండి పుష్పక విమానంలో కణ్ణకి భర్తయైన కోవలన్ మరల మంగళ సూత్రం కట్టి తనతోపాటు తీసుకుని వెళ్ళేడు.

🌸అందుకే కావ్యరచయిత ఇళంగోవడిగళ్
కణ్ణకిని "సుమంగళి" గా వర్ణించారు.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆ ప్రాంత
ప్రజలు కణ్ణకి పాతివ్రత్య మహిమకు ఆశ్చర్యపోయారు.

🌿ఈ అపూర్వ సంఘటనను చేరన్ చక్రవర్తి శెంగుట్టవన్ కి తెలియజేశారు. కణ్ణకి పాతివ్రత్య మహిమ, సౌశీల్యం, కీర్తిప్రతిష్టలు కలకాలం మహిళలందరికీ ఆదర్శప్రాయం కావాలనే ఆశయంతో..

🌸ఆ చక్రవర్తి ఉత్తరదేశం నుండి ప్రత్యేకమైన శిలలను తెప్పించి ఇప్పుడు ఆలయమున్న చోట కణ్ణకి దేవికి ఒక ఆలయం నిర్మించాడు. ఈ ఆలయంలోని కణ్ణకి మూర్తికి మంగళదేవి అని పేరు.

ఇది కణ్ణికి ఆలయ స్థల చరిత్ర...!!

🌿బ్రిటీష్ వారి కాలంలో  మంగళ దేవి కణ్ణకి 
ఆలయంలో పౌర్ణమి, నవరాత్రి, శివరాత్రి, తమిళ సంవత్సరాది, కేరళ సంవత్సరాది మొదలైన  24 ఉత్సవాలు జరిగేవి.

🌸ఇప్పుడు కేవలం చైత్రపౌర్ణమినాడు మాత్రమే అక్కడికి వెళ్లి యీ ఉత్సవం జరపడానికి భక్తులకు అనుమతి లభించింది. ఈ ఉత్సవాలకి రెండు రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు వస్తారు.

🌿శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై మార్గాలగుండా
సుమారు 40,000వేల మంది భక్తులకు
పైగా వచ్చి యీ మంగళ దేవిని దర్శించి
పూజిస్తారు.

🌸ఆ పర్వదినాన కణ్ణకిదేవి ఆకుపచ్చని పట్టు చీర ధరించి, చల్లని కృపా వీక్షణాలతో  భక్తులకు
దర్శనాన్ని అనుగ్రహాన్నిస్తున్నది.

🌿మంగళాదేవి ధర్మసంస్థ ద్వారా వచ్చిన
భక్తులకు  ఉచిత భోజన ఏర్పాట్లు జరుపుతున్నారు. ఒక కావ్యనాయికకు ఇంతటి విశిష్ట గౌరవం, మర్యాద దక్కడం అపూర్వం...        
 *పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్బు అవసరం..!!*


🌸ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..

🌷నేను ఎందుకు పేదవాడను?

🌿బుద్ధుడు సమాధానం చెప్పాడు..

🌸మీరు ఎందుకు పేదవారు అంటే మీరు  ఎటువంటి ఔదార్యము కలిగి లేరు, మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు.

🌿నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..

🌸అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు..

🌿మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా..!?

🌸మొదట మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ...ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది..

🌿రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. ఇది నిజం... మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు ... వాటిని మంచి అనుభూతితో చేయండి...

🌸మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు... మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి... వాటిని విలువైనదిగా భావించండి..దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ...

🌿నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది.. మీ దయగల హృదయంతో, భగవంతున్ని ప్రార్థిస్తూ... మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు.. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు...

🌸మీరు కలిగి ఉన్న చివరి ఐదవ సంపద మీ శరీరం... ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు.. అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు...

🌿సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..

🌸ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు... భగవంతుడు మనకిచ్చిన జీవితం.. కలకానిదీ! విలువైనదీ!! సర్వోత్తమమైనదీ !!!

🌿మిత్రులారా! కావున ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాం..      
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

56. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితా.

ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే పరిస్థితిలో శాస్త్రమే ప్రమాణం(భగవద్గీత)

ఇది శ్రీకృష్ణపరమాత్మ వచనం. ఈ సృష్టి రచనకు గాను సృష్టికర్త అయిన బ్రహ్మకు పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. ఆ వేదవిజ్ఞానాన్ని అనుసరించి విధాత విశ్వనిర్మాణాన్ని సాగించాడు. అంటే విశ్వనిర్మాణ సూత్రాలు వేదాలలో దాగి ఉన్నాయి.(ఈ దృష్టితో వేదాలను అధ్యయనం చేయవలసిన అవసరముంది). అవి శ్రుతులు.ఆ వేదధర్మాలను మహర్షులు స్మరిస్తూ అందించినవే స్మృతులు. ఇవి ధర్మశాస్త్రాలు,శ్రుతుల అర్థాలను విస్తృతంగా వ్యవహారంలో వినియోగించేందుకు విధానాలను పురాణేతిహాసాలు ఆచరణాత్మకంగా అందించాయి. భారతీయ వ్యవస్థ అంతా వీటిని ప్రాతిపదికగా తీసుకొని పటిష్టమయ్యింది.

ఆ పురాణేతిహాసాలు కూడా 'స్మృతులు' గానే పరిగణింపబడతాయి. ఇలా
'శ్రుతిస్మృతులు' మనకి ప్రమాణగ్రంథాలు. వీటిని శాస్త్రాలు అంటారు. కర్తవ్య విషయంలో సందేహం ఏర్పడినప్పుడు ఇవే ప్రమాణాలు. కొన్ని పరస్పర విరుద్ధంగా
కనబడినా, సందర్భానుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అవే శాస్త్రాలలో కొన్ని చోట్ల సంఘటనా రూపంగానో, ఉపదేశరూపంగానో చెప్పబడి
ఉంటాయి. 

స్థూలంగా, అర్థరహితంగా కనిపించే శాస్త్రాంశాలు, సూక్ష్మంగా ఎంతో అర్థవంతంగా సత్ ప్రభావాన్ని కలిగిస్తాయి. వ్యక్తి నేటి జన్మకి సుఖభోగాలే కాక, ఆ జీవునికి శాశ్వత సుస్థితి, సుగతి కలిగేలా శాస్త్రాలూ నిర్మించబడ్డాయి. తపశ్శక్తితో అతీంద్రియ దృష్టిని పొందిన మహర్షులు విశ్వహితాన్ని ఆకాంక్షించి ఏర్పరచినవే శాస్త్రాలు. శాస్త్రము ద్వారానే పరమార్థ జ్ఞానానికి అవసరమైన సాధనా సూత్రాలు, అవగాహనా మార్గాలు ప్రస్ఫుటమవుతాయి. అందుకే బ్రహ్మసూత్రాలు సైతం "శాస్త్రయోనిత్వాత్" అని ప్రకటించాయి.

తాత్కాలికంగా వ్యక్తి స్వార్థానికి, పరమితదృష్టికి ఆటంకాలగానూ, మామూలు విషయాలు గానూ కొన్ని శాస్త్రవిషయాలు గోచరించినా, పరిణామంలో శాశ్వతమైన క్షేమాన్ని, వ్యవస్థకు ధర్మబలాన్ని సమకూర్చడంలో అవి సఫలీకృతమవుతాయి.

వ్యక్తి నిర్ణయాలు అనేక మానసిక వికారాలతో కూడుకొని ఉంటాయి. నియమబద్ధమైన జీవనసరళి, లోతైన అధ్యయనం వంటివి లేక, మానసికోద్రేకాలను సవరించుకోలేని
మానవులు, తమకు తోచినట్లుగా ప్రవర్తిస్తూ పోతే శాశ్వత క్షేమానికే భంగం కలిగే ప్రమాదముంది. అది సామాజిక భద్రతని దెబ్బతీసి, విచ్చలవిడితనానికి దారితీస్తాయి
కూడా. అందుకే నిత్యభద్రత కోసం మనిషి స్వార్థాన్ని నియంత్రించే విషయమై, సూక్ష్మతమమైన రహస్యవిజ్ఞానంతో శాస్త్రాలు ఏర్పడ్డాయి.

 ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణాల కన్నా శాస్త్ర ప్రమాణానికే ప్రాధాన్యమిచ్చారు మనవారు. తమకంటూ ఏ స్వార్థమూ లేక కేవలం లోకహితైషులైనవారు ఋషులు.
వ్యక్తి, చుట్టూ ఉన్న పరిసరాలు, అనంత విశ్వం - ఈ మూడింటినీ సమన్వయించుతూ ఆ మహర్షులు కేవలం మన క్షేమం కోసమే చెప్పినవి శాస్త్రాలు. ఆ ఋషులకన్నా
మనకు ఆప్తులెవరుంటారు? అందుకే వాటిని 'ఆప్తవాక్యాలు' అంటారు.

శాస్త్రాలను ప్రమాణాలుగా గ్రహించి జీవితాన్ని మలచుకోవాలని పరమాత్మ
గీతాదుల ద్వారా నిర్దేశించాడు.
-
యత్ శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః।
న చ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం ||

- "శాస్త్ర విధులను వదలి, ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తించే వానికి ఇహ సుఖమూ,పరగతీ రెండు ఉండవు. సిద్ధి లభించదు" అని గీతలోనే జగద్గురువైన పరమాత్మ
బోధించాడు.

“శ్రుతిస్మృతీమమైవాజ్ఞా...” అనే వాక్యం ద్వారా “శ్రుతిస్మృతులు జగన్నిర్వాహకుడైన ఈశ్వరుని ఆజ్ఞలనీ, వాటిని ఉల్లంఘించేవారు శాశ్వత ప్రకృతి నియమాల ననుసరించి శిక్షను అనుభవించి తీరతారని పురాణాదులు చాటుతున్నాయి.

అహంకారంతో, వితండవాదంతో శాస్త్రాలను తారుమారు చేసి 'అవిధి పూర్వకం'గా ప్రవర్తించే వారికి గతులుండవని శ్రీకృష్ణపరమాత్మ గీతాశాస్త్రంలో హెచ్చరించాడు.
శాస్త్రప్రమాణ బుద్ధిని దైవీగుణంగా అభివర్ణించాడు కూడా.             
 .           పోయినోళ్లు అందరూ మంచోళ్ళే 
.                             అయితే మరి 
.    రావణాసురుడు మరియు నరకాసురుడునో !?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చూసారా ?!
.       ఈ గుంటనక్క... వగలమారి కాంగ్రెస్ పార్టీ మరో నిజస్వరూపం... 

.      అప్పుడు మాజీ ప్రధాన మంత్రి PV నర్సింహారావు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి చేసి, కనీసం దేశరాజధాని ఢిల్లీలో దహన సంస్కారాలు కూడా చేయనివ్వకుండ ఆయన పార్తివ శరీరాన్ని అతి బలవంతంగా హైదరాబాదుకు పంపేసి అవమానించిన సోనియా గాంధీ ఆధ్వర్యంలోని ఆనాటి ఇదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం...

ఇవ్వాళ్ల అదే అప్పుడు ఆఁ సమయంలో ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ చనిపోతే, ఇవ్వాళ్ల ఆయన అంత్యక్రియల కోసం అదే ఢిల్లీలో యమున నది ఒడ్డున "ప్రత్యేక స్మృతి వనం" కేటాయించాలని కోరుతున్నది అదే కాంగ్రెస్ పార్టీ.

.        ఇక ఇప్పటికే నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ & రాజీవ్ గాంధీ వగైరాల కేవలం వాళ్ళ కుటుంబం కోసం "స్మృతి వనం"ల కోసం "#వందలాది_ఎకరాల_ప్రభుత్వ_స్థలం" కేటాయించుకొని, అదే PV నర్సింహారావు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందుకు నిర్ద్వందంగా నిరాకరించి, ఇవ్వాళ్ల మళ్ళీ మన్మోహన్ సింగ్ కోసం మళ్ళీ స్థలం అడుకుంటున్న ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని నాటి UPA ప్రభుత్వంనే గతంలో 2013లో ఇకనుండి జాతీయ స్థాయి నాయకులకు "ఉమ్మడి స్మారక స్థలం-రాష్ట్రీయ స్మృతి స్థల్" అంటూ ఓ చట్టం తేవడం గమనార్హం. 

.        అయినా 10 సంవత్సరాల అవినీతిమయ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఈ మన్మోహన్ సింగ్ ఆఁ PV నర్సింహారావు కంటే ఏ రకంగా గొప్పోడు !?
No...
Never...

ఇక 
.    పోయినోళ్లు అందరూ గొప్పోళ్ళే అయితే మరి!! రావణాసురుడు పోయిన రోజున "దసరా" పండుగ చేసుకోవడం...
నరకాసురుడు పోయిన రోజున "దీపావళి" పండుగ చేసుకోవడం ఎందుకో మరి !!??
 *_మనకు ఏనుగు, ముసలి గురించి తెలుసు కదా.! భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు. పెద్ద పెద్ద చెట్లను నేలకూల్చ గలదు._*

*_అది దాని స్థాన బలిమి. మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా.? అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతుంది. మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా.?ఆలోచించండి._*

*_ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన, నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు._*

*_ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు. అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు._*

*_మూర్ఖుడు మంచి వినడు. పైపెచ్చు అవమానిస్తాడు. ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు. కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది... అనీ..._*

*_అంత మాత్రాన అది చిన్నదై పోతుందా.? అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు..._*

*_ఒకరికి చాలా ఉంది. మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు. మనం తినేదే... ఏదైనా ఆకలి తీరడానికే..._*

*_నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే. అంతే. అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు._*

*_సంతోషం ప్రధానం. అది ఉంటే ఇంద్రుడే... అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే. నీవు దిగులు పడుతూ ఉండాల్సిందే..._*

*_కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు...☝️_*

*_ఈ మంచి సందేశం ఒక ఆత్మీయుడు... 'రాము ' పంపించిన మంచి మాటలు మీతో పంచుకుంటున్నా..._* 

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇‍♂️🪷 🌺🌺🌺

****50 నిజాలు

 Venkata ravi Botcha:
♦️       *50 నిజాలు*        ♦️ 👇:

1)ఈ ప్రపంచంలో దాదాపు 57 ముస్లిం దేశాలు ఉన్నాయి ! వాటిలో *"హజ్ సబ్సిడి(Haj subsidy)" ఇచ్చే ఒక్క దేశాన్ని చూపించండి*?

2)భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్టుగా *ఏ ఒక్క ముస్లిం దేశం అయినా హిందువులకు ప్రత్యేక హక్కులు కలిపిస్తుందో చుపించండి*?

3)హిందువు ప్రధాన మంత్రి లేక అధ్యక్షుడుగా ఉండే ఒక్క ముస్లిం దేశం చూపించండి?

♦️4)80% మెజారిటి 18% మైనారిటీ దయతో - బతికే ఒక్క దేశాన్ని చుపించండి?

5) ఉగ్రవాదుల మీద ఫత్వా జారీ చేసిన ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి?

6) హిందూ మెజారిటీ  వున్న రాష్ట్రాలు గతంలో ముస్లిం ను -  ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. *అదే ముస్లిం మెజారిటీ అయిన జమ్మూ కాశ్మీర్ లో గానీ , క్రైస్తవ మెజరిటీ ఉన్న నాగాలాండ్ లోగానీ -  *ఒక హిందువు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతాడా*?

7) ఈరోజు భారత్ లో హిందువులు 80% శాతం ఉన్నారు. *నిజంగా హిందువులు అసహనపరులు, చాంధసవాదులు అయితే ( ముస్లిమ్స్ దోష పూరితంగా ఆరోపిస్తున్నట్లు ) మసీదులు, మదరసాలు వేల సంఖ్య లో ఎలా ఉన్నాయి?- ఈ హిందూ దేశంలో- మరియు, అవి నాటి నాటికి పెరుగుతున్నాయి కూడా? ముస్లింలు స్వేచ్చగా రోడ్ల మీద నమాజ్ ఎలా చేసుకోగలుగుతు న్నారు? అల్లహ్ తప్ప వేరే దేవుడే లేనట్టు రోజుకి ఐదు సార్లు మైకు పెట్టి ప్రార్థనలు ఎల చేసుకోగలుగు తున్నారు*?

8)హిందువులు 30% శాతం భూమిని ముస్లింలకు ఇచ్చినపుడు, *హిందువులు అయోధ్య, మథుర, కాశి కోసం వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి*? - దీన్ని ప్రజాస్వామ్యం అంటారా?(  *ప్రజాస్వామ్యం అంటే - ఎక్కువ జనాభా మాటలు లెక్క లోకి, పాలనలోకి, ప్రజాభి ప్రాయం లోకి రావాలిగా? - వస్తుందా?*)

9)హిందు ఆలయాలకు వచ్చే నిధులు ముస్లింల, క్రైస్తవుల సంక్షేమం కోసం - *ఈ దేశం లో*- ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అదే వాళ్ళ మసీదులకు, చర్చ్ లకు వచ్చే నిధులు వాళ్ళయిష్టం వచ్చినట్టు  వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చునా? *ఇదెక్కడి న్యాయం*?

10) 1947లో భారతదేశం విభజించబడ్డపుడు, అక్కడ ( పాకిస్తాన్ లో హిదువులు 24% ఉన్నారు)! *ఈరోజు 1% కూడా లేరు* !!! బాంగ్లాదేశ్ లో 30% శాతం ఉండే హిందువులు ఈ రోజున 7% ఉన్నారు, *ఎందుకు*? వాళ్లంతా ఏమైపోయారు? *అసలు హిందువులకు మానవ హక్కులు లేవా*?

11) 1951 లో 10.4% ఉండే ముస్లింల జనాభా 2001 నాటికి - భారత్ లో 14% పెరిగింది. అది యిప్పుడు ~ 25% కు చేరింది.అదే హిందువుల జనాభా 87.1% నుండి 79% కు పడిపోయింది. ఏ రాజకీయనాయకుడికైనా ముస్లింలను - *కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించమని అడిగే దమ్ము, ధైర్యం ఉన్నాయా*?  ఇదేమి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే - ఇదేనా? *ప్రజాశ్వామ్యనిర్వచనానికే సిగ్గు చేటు*.

♦️12) సంస్కృతం ఏమో చాంధసం, ఉర్దూ ఏమో లౌకికం| మందిరం చాంధసం, మసీదు లౌకికం | సాధు చాంధసం, ఇమాం లౌకికం | బీజేపి మతతత్వ పార్టీ, ముస్లిం లీగ్ మాత్రం లౌకిక పార్టీ | డా. ప్రవీన్ భాయ్ తొగాడియా (విస్వ హిందు పరిషద్ - VHP ) చాంధసవాది, బుకారి (వందేమాతరం ఇస్లాం కి వ్యతిరేకం అని  - దాని మీద ఫత్వా జారి చేసాడు) - అతను మాత్రం జాతియవాది | "వందే మాతరం" చాంధసం, "అల్లహు అక్బర్" అనేది మాత్రం లౌకికం | శ్రీమాన్ అంటే చాంధసం, మియాన్ అంటే లౌకికం | సనాతన ధర్మం అంటే చాంధసం, ఇస్లాం అంటే లౌకికం |హిందుత్వ వాది అంటే చాంధసం, జిహాద్ అంటే లౌకికం| *చివరిగా భారత్ అంటే చాంధసం, ఇటలి అంటే లౌకికం* | ♦️ఏ క్యా హై భాయీ? మేరా సమజ్ మే నహీ ఆరై!

13) క్రైస్తవులు , ముస్లింలు పాఠశాలల్లో బైబిలు, ఖురాన్ భోధించినపుడు, *హిందువులు ఎందుకు రామాయణం, భగవద్గీత భోధించకూడదు*?
 
14) అబ్దుల్ రెహ్మాన్ అంతులే అనే అతను ముంబాయిలోని ప్రసిద్ధి గాంచిన - సిద్ధి వినాయక్ గుడికి ఒక ట్రస్టీ (Trustee)! అదే -  ఒక ములాయం సింగ్ యాదవ్ కానీ , లాలూ ప్రసాద్ యాదవ్ కానీ - *ఒక మసీదులో/మదరసాలో ట్రస్టీ (Trustee) అవ్వగలరా*? ఏమి బుజ్జగింపులా ఇవి? - *మాయింటికి వస్తూ నాకేమి తెస్తావ్, మీ ఇంటికి వస్తే నాకేమి యిస్తావ్*? గిదేం పద్ధతి భాయ్?

15)హాజ్ కి వెళ్ళే ముస్లిం యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు, హిందు యాత్రికులకు అమర్నాథ్, కైలాస మానస సరోవరం, శబరిమలై వంటి పున్యక్షేత్రాలు దర్శించుటకు పన్ను ఎందుకు విధిస్తున్నారు? *అడిగే వాళ్ళు లేరా*?

16) గోద్రా అల్లర్లు జరిగిన తరువాత దాన్ని చాల ఎక్కువ చేసి చూపించారు, *అదే 4 లక్షల కాశ్మీరి పండితులను ఉగ్రవాదులు అక్కడ నుంచి తరిమి వేస్తే - ఒక్కరు కూడా మాట్లాడలేదు*?- ఇదెక్కడి న్యాయం? ఏ మత గ్రంధం లో యిలా వ్రాసి వుందో చెప్పండి భాయ్!

17) కేరళాలో మంత్రులు అల్లహ్, యేసు మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. *అది రాజ్యాంగ విరుద్ధం* ! అదే ఒక హిందూ మంత్రి -రాముడు, కృష్ణుడు పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయగలరా?

18) అరబిక్ బాషను భారత్లో ( ఇండియా లో ) భోధించడానికి ప్రభుత్వం ఖర్చులు బరిస్తుంది. *కాని సంస్కృతం కోసం ఎందుకు చేయట్లెదు*? అరబిక్ జాతీయ భాషా?  లేక - సంస్కృతం జాతీయ భాష కాదనా? ఏ కారణం చేత ఈ దేశం లో ఇటువంటి వివక్ష చూపిస్తున్నారు?

19) ఒకవేళ

ముస్లింలు మెజారిటీ అయితే భారత్ లౌకిక, ప్రజాస్వామ్యక దేశంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారా?

20) దీపావళిని, కృష్ణ జన్మాష్టమిని వైట్ హౌస్ లో,హౌస్ ఆఫ్ కామన్స్ లో, ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరుపుకుంటున్నపుదు, మనమెందుకు మన పార్లమెంట్ లో జరుపుకోవట్లేదు? వాళ్ళ కంటే మనం లౌకికవాదులం అని నిరూపించుకోవడానికా?

21)ఇస్లాం మతం, క్రైస్తవ మతం "సర్వ ధర్మ సంభవ్" అని భావిస్తాయా? అలా అయితే వాళ్ళు మత మార్పిడులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

22)ఇస్లాం, క్రైస్తవం అనేవి దేశాలను ఆక్రమించడానికి రెండు రాజకీయ సిద్ధాంతాలని,అవి- ముల్లాలు, మరియు ఫాధర్స్ ద్వారా ప్రజలను మత మార్పిడి చేసి, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మీరు నమ్మట్లేదా?

23)ఈశ్వర్ అల్లాహ్ తేరే నాం- దీన్ని అంగీకరించే ఒక్క ముస్లిం, క్రైస్తవుడిని చూపించడి?

24)10% కంటే తక్కువ ఉంటే మైనారిటీగా పరిగణించాలని(UN Charter) చార్టర్ చెబుతోంది ! మరి మన దేశంలో 14% పైగా ఉండే ముస్లిం జనాభా మైనరిటీ ఎలా అవుతారు? అలా హిందువులు కొన్ని రాష్ట్రాల్లో ఉంటున్నప్పటికీ - వాళ్ళకు మైనారిటీ హక్కులు ఎందుకు కల్పించడం లేదు?
 
♦️25)ఒక ముస్లిం కుటుంబం హిందూ ఆధిక్య ప్రాంతంలో ప్రసాంతంగా ఎలా ఉండగలుగు తోంది? *అదే ఒక హిందూ కుటుంబం ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఎందుకు ఉండలేక పోతుంది*?

26) హిందు ఆధిక్యత/హిందు మెజారిటీ అయిన భారతదేశం కొన్ని వందల, వేల యేళ్ళ నుంచి లౌకిక దేశం గా ఉంధి, అదే ముస్లిం దేశాలు ఎందుకు కేవలం *"ఇస్లామిక్" గానే ఉన్నయి*. మరియు,  *మైనరిటీ లకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నాయి*?

27) క్రైస్తవ మిషినరీలు ముస్లిం ఆధిక్యత ఉండే ప్రాంతాలకు పోయి సేవా కార్యక్రమాలు చేసుకోవడం లేదు ఎందుకు? వారు పెట్టే పెట్టుబడులకు తగిన ఆదాయం రాదనా?

28)బాంగ్లాదేశి ముస్లిం అక్రమ చొరబాటు దారులను అనుమతించే ఎకైక దేశం భారత దేశం అన్న విషయం మీకు తెలుసా? ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు, వోటర్ కార్డు ఇచ్చి వారిని సత్కరిస్తాయని మీకు తెలుసా?

29)హిందూ మెజరిటీ రాష్ట్రాలు అన్నీ శాంతియుతంగానే ఉన్నయి ! మరి హిందు మైనరిటీ రాష్ట్రాలైన జమ్ము కాశ్మీరు, ఈశాన్య రాష్త్రాలు ఎందుకు సమస్యాత్మకంగా తయారయ్యాయి?

30)డిల్లీ జుమా మసీద్ పీఠా ధిపతి /ఇమాం అయిన బుకారి తాలిబన్ ముస్లింలకు ఆదర్శప్రాయ మని, ఒసామా బిన్ లాడెన్ ఒక హీరో అని చెప్పాడు ! వాడిని మీరు లౌకికవాది అంటారా?

31)జమ్మూ కాశ్మీరులో పార్లమెంటు ఎన్నికలకు 2 లక్షలమంది హిందూ వోటర్లు ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లేరు ! ఎందుకు?

32)భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ వ్యవధి 5 సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీరు లో మాత్రం ఆరు సంవత్సరాలు ఎందుకు?

33)ఛత్రపతి శివాజీ మహరాజు ను చంపాలని పన్నాగం పన్నిన అఫ్జల్ ఖాన్ కు మహరాష్ట్రలో స్మారక కట్టడ్డం కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?

34)అయోధ్యలోని రాం మందిరాన్ని కూల్చివేసి సంపదను దోచుకున్న బాబర్ కోసం మసీదు కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?

35)బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలు అత్యాచారానికి గురి అవ్తున్నారు. ప్రతిరోజు హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నారు. అయినా మన దేశంలోని లౌకికవాదులు(?), మానవ హక్కుల సంఘాలు ఈ అరాచకాల గురించి ఎందుకు పోరాడరు? మానవ హక్కులు కేవలం ముస్లింలకేనా?

36) భారతదేశం లో హిందువులు అల్పసంఖ్యలో(మైనారిటీగా ) ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. *ఈ రాష్ట్రాలలో మైనరిటీ హక్కులు హిందువులకు లేవు* ! కాని మెజారిటీగా ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ మైనారిటీ హక్కులను అనుభవిస్తారు? ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉందా? ఉంటుందా?

37)హిందువులకు ప్రత్యేక హక్కులను ఇచ్చే ఒక్క ముస్లిం దేశంను చూపించండి ! అలాగే హిందువులకు ప్రత్యేక హక్కులను కల్పించే ఒక్క క్రైస్తవ దేశంను చూపించండి?

38) ఇష్రాత్ జహాన్ అనే ఉగ్రవాదిని అహమ్మదాబాదు(కర్ణావతి) పోలిసులు చంపివేస్తే, ఆక్కడి ముస్లింలు బందు చేసి, ఆ ఉగ్రవాది అంత్యక్రియలలో పాల్గొన్నారు. దీన్ని లౌకికవాదం అంటారా?

39)చైనా(కమ్యూనిస్ట్ దేశం) అరుణాచల్ ప్రదేశ్ ని తమ దేశంలో భాగంగా చూపిస్తుంది. దీన్ని ఒక్క కమ్యూనిస్ట్ అయినా ఖండించాడా? వామ పక్షాలకు, కామ్రేడ్లకు దేశం కంటే వల్ల కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కువా? దీన్ని బట్టి చూస్తే కమ్యూనిస్ట్లు జాతీయవాదులు ఎలా అవుతారు?

40)కేరళలోని మల్లపురంలో డాక్టర్లు ఒకటి కనుగొన్నారు ! ముగ్గురు ముస్లిం స్త్రీలు : అమ్మమ్మ(39 మంది సంతానం), అమ్మ(26 మంది సంతానం). కూతురు(13 మంది సంతానం) !!! ముగ్గురూ ప్రసవానికి ఆసుపత్రిలో చేర్చబడిన వారే ! ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మీరు అనుకోవడం లేదా?

41) 2002 లో కర్ణాటక ప్రభుత్వానికి ఆలయాల నుండి 72 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో 50 కోట్లు మదరసాలకు , 10 కోట్లు చర్చిలకు ఇవ్వబడింది. మిగిలిన 10 కోట్లు ఆలయాలకు ఇచ్చారు? మదరసాల కోసం, చర్చిల కోసం ఎందుకు హిందువుల సొమ్ము ఉపయోగిస్తున్నారు?

42) అఫ్ఘనిస్తాన్ లో ఉండే బుద్ధుని విగ్రహాన్ని తాలిబన్ల

ు పగలగొట్టి నపుదు, టైంస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక "ఇది బాబ్రి మసీదు కూల్చివేసినందుకు ప్రతిక్రియ" అని వ్రాసింది. ఆ పత్రిక వ్రాసిన ఈ పిచ్చి వ్రాతలను మెరు ఒప్పుకుంటారా? అంటే తాలిబన్లు చేసింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఆ పత్రిక వ్రాసింది. అయితే దీన్నే ఎందుకు గోద్రా అల్లర్ల విషయంలో కూడా అనుకోరు? ముందు హిందు కర్ సేవకులు ఉన్న రైలు భోగిని తగలబెట్టింది ఎవరు? ముస్లిం మూకలు !!! వాళ్ళు చేసినదానికి ప్రతి క్రియ గా గోద్రా అల్లర్లు జరిగాయి. కాని అప్పుడు కేవలం హిందువులనె దోషులుగా చూపించారు ఎందుకు?

43) గోద్రా అల్లర్లను "Genocide/holocaust" అని మీడియా వర్ణిస్తుంది. కాని మీకు ఒకటి తెలుసా? బయట దేశాల నుండి వచ్చిన యూదులు, పార్శీయులు మన దేశంలో ఎంతో స్వేచ్చగా, హయిగా ఉన్నారు. దీన్ని బట్టి మన దేశంలో మత కలహాలు ముందు ఎవరు సృష్టిస్తారో మీరే అర్థం చేసుకోండి.

44) పుదుచ్చేరిలో ఒక ముస్లిం వ్యక్తిని పాతిపెట్టుటకు తిరస్కరించారు. ఎందుకంటే ఆయన మురుగన్/సుబ్రహ్మణ్యేస్వర స్వామి కోసం గుడి కట్టించాడట. దీన్ని బట్టి చూస్తే మతాలు ద్వేషాన్ని భోదిస్తున్నా యని మీకు అనిపించడం లేదా?

45)బాంగ్లాదేశి అక్రమ చొరబాటుదారులు హిందువులు కొంచెం అటు ఇటు గా గెలిచే స్థానాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ వారి జనాభా ఎక్కువ అయితే హిందువులు గెలిచే అవకాసం ఉండదు మరియు వేర్పాటు వాదం ఎక్కువ అవ్తుంది !!!

46)1989 ఎన్నికల మ్యానిఫెస్టో లో రాజీవ్ గాంధి మిజోరాం రాష్ట్ర(క్రైస్తవ ఆధిక్య రాష్ట్రం) ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తే "బైబిలు" గ్రంథం ఆధారంగా పరిపాలన ఉంటుంది అని చెప్పాడు. ఇది లౌకికవాదామా? దీన్ని మత ఛాందసవాదం అనక ఇంకేమి అంటారు?

47)షేక్ అల్ సయీద్ యుసఫ్ సయిద్ హషీం అల రిఫాయ్ (వరల్డ్ ముస్లిం మైనరిటీ కమ్మునిటి చైర్మాన్) కువైట్ నుంచి కేరళ రాష్ట్రానికి వీసా లేకుండా వచ్చాడు తెలుసా? అతన్ని అరెస్టు చేయకుండా రాచ మర్యాదలు చేసింది కేరళా ప్రభుత్వం!!! అంతే కాకుండా అతనికి ప్రచారం చేస్కొడానికి ప్రభుత్వ వాహనాలను కూడా కల్పించింది. దీన్ని జాతీయవాదం అంటారా?

♦️48) *బ్రిటన్, అమెరికా(లౌకిక దేశాలు) దేశాలలో ఒక ముస్లిం ఒక్కరిని తప్ప ఇంకొకరిని చేసుకోకూడదు. కాని భారతదేశం లో మాత్రం షరియా చట్టం ఎందుకు*?

49) పొప్(క్రైస్తవ మత పెద్ద) ని భారతదేశానికి ఆహ్వానించారు కాని నేపాల్ రాజు అని మహేంద్ర ని మాత్రం 1965లో నాగపూర్ లో మకర సంక్రాంతి ఉత్సవాలకి అనుమతించలేదు. దీన్ని లౌకికవాదం అంటారా?

50)టిప్పు సుల్తాన్ దక్షిణ భారత దేశాన్ని మొత్తం ఇస్లామీకరణం చేద్దాం అని అనుకున్నాడు. కాని అతనికి బ్రిటీషు వాల్లు అడ్డువచ్చారు. ఎందుకంటే బ్రిటీష్ వాళ్ళు కూడా మనల్ని పాలించి దోచుకోవాలని అనుకున్నారు కాబట్టి. అందుకని మొదత టిప్పు సుల్తాన్ బ్రిటీషు వాళ్ళని ఎదిరించాడు. అలా ఎదిరించినంత మాత్రాన అతగాడు స్వాతంత్ర్య సమరయోదుడు అయిపోతాడా? అలా అయితే ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్, బాబర్ వీల్లందరు జాతీయవాదులు మన కుహానా లౌకికవాదుల చెదలు పట్టిన అలోచనా విధానం ప్రకారం !!!

♦️ప్రియాత్మ బంధువులారా! హిందువులు అంతా ఏకమై ఈ అన్యాయాల్ని ప్రశ్నించండి.

జై భారత్, జై హింద్, మేరా భారత్ మహాన్

Friday, December 27, 2024

 🙏 जय श्री राम🌷 सुप्रभातम् 🙏

यस्य स्नेहो भयं तस्य स्नेहो दुःखस्य भाजनम् ।
स्नेह-मूलानि दुःखानि तानि त्यक्त्वा वासेत् सुखम् ।

యస్య స్నేహో భయం తస్య
 స్నేహో దుఃఖస్య భాజనమ్ ।
స్నేహమూలాని దుఃఖాని 
తాని త్యక్త్వా వసేత్ సుఖం ॥

Excessive attachment to something or somebody is always associated with fear. Attachment is the root cause of all suffering. Therefore, one should live happily by giving up attachment.

जिस को भी किसी व्यक्ति या वस्तु के प्रति स्नेह  (लगाव) होता है वहीं उस का  अनिष्ट होने की आशंका से भय भी होता है |  अतः स्नेह ही दुःखों का भाजन और मूल कारण होता है | इस लिये अत्यधिक स्नेह का परित्याग कर सुखपूर्वक अपना जीवनयापन करना चाहिये 

ఏదైనా లేదా ఎవరితోనైనా అధిక అనుబంధం ఎల్లప్పుడూ భయంతో ముడిపడి ఉంటుంది. అనుబంధమే అన్ని బాధలకు మూలకారణం. అందుకే అనుబంధాన్ని వదులుకుని ఆనందంగా జీవించాలి.👏
 *🌹🌿చిన్ననాటి పాఠ్య పుస్తకంలోని…📖* 
 *"క్షణిక ఆవేశం"😠*
🕉️🌞🌎🏵️🦢🔱🚩             

 *🍁భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు.* 

 *ఒకసారి పక్కఊరి పని మీద భాస్కరశర్మ అడవి మార్గం గుండా పోతుంటే ఒక ముంగీస ఆయన తోటే వచ్చింది! సరే అని ఆ ముంగీసను సంచిలో వేసుకొని ఇంటికి తెచ్చాడు. కమలమ్మకి ముంగీసను చూపి ఇది మనతోనే వుంటుంది. మనచిన్నబిడ్డకి తోడుగా వుంటుంది అని ఆహారం పెట్టి సాకుతూ వున్నారు.* 

 *ఒకనాడు కమలమ్మ బావిదగ్గరకు నీళ్ళ కోసం పోతూ ఉయ్యాలలో బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని ముంగీసకు చెప్పి వెళ్లింది.* 

 *ఇంతలో ఒక నల్లత్రాచు ఉయ్యాల దగ్గరికి రావడం ముంగీస చూసి దానితో పోరాటం చేసి చంపివేసింది.* 

 *ఇంతలో కమలమ్మ బిందె నీళ్ళతో ఇంట్లోకి వచ్చింది ముంగీస మూతికి అంటిన రక్తం చూసి తన బిడ్డను తినేసింది, ఇంకేముంది అని నీళ్ళ బిందెని దాని మీదకి వేసి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తింది. ఉయ్యాలలో బాబు క్షేమంగా నిద్రిస్తున్నాడు. పక్కన నల్లత్రాచు పాము చచ్చిపడి వుంది.* 

 *‘అరె!’ ఆవేశం లో అనాలోచితంగా పాపం ముంగీసను చంపివేసానే అని బాధపడింది.* 

 *ఇది జస్ట్ మనకు పెద్దలు చెప్పేకధ!ఆవేశంతో తీసుకొనే నిర్ణయాలు బాధని మిగులుస్తాయి.*

*మనిషి ఆవేశంతో క్షణంలో చేసే హాని అది ఇతరుల జీవితాన్ని బలి తీసుకుంటుంది.* 

 *క్షణిక కోపంతో ఆవేశంతో అనాలోచిత నిర్ణయం వలన ఎంతోమంది జీవితం జైలుశిక్ష పడి ఎందుకు ఆవేశపడ్డామా అని కుమిలిపోతుంటారు!* 

 *మార్కులు తగ్గినాయి అని, ప్రేమ విఫలమైందనీ..* 

 *ప్రేమ నిరాకరించింది అని..* 
 *క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలు వలన ఎంతోమంది జీవితం ముగిసిపోతుంది!!* 

 *“మనిషికి ధనం,సంపదలు, లగ్జరీలు, విలువైన దుస్తులు ఆభరణాలు కాదు కావలిసినది.. మనిషికి కావలిసింది.. ఆత్మధైర్యం ఆత్మవిశ్వాసం, సముద్రం కంటే విలువైన సహనం, ఓర్పు!!* 

 *ఇవి లేనప్పుడు ఎంత ధనమున్నా క్షణికంలో తీసుకునే ఆవేశంతో జీవితం నిరర్దకం అవుతుంది!* 

 *మనిషి ఎంతసేపటికి భగవంతుని ముందు కోరికలు అడుగుతాడు కాని కోరికలు నేరవేరిన తరువాత వచ్చే అనర్దాలకి, క్షణిక కోపం,ఆవేశం వలన జీవితం కోల్పోతాము.* 

 *ఆపద సమయంలో క్రిటికల్ సమయం ఎదుర్కొనే ఆత్మ స్తైర్యం ధైర్యాన్ని ప్రసాదించమనీ దైవాన్ని ప్రార్ధించాలి…ప్రతిరోజూ!* 

 *మనఃశాంతి లేని జీవితం వ్యర్దం కదా! అందుకే శాంతి కావాలనీ, ప్రశాంతంగా జీవితం సాగాలనీ ఆ పరమేశ్వరుని వేడుకోవాలి.* 

 *ఒక మంత్రం వుంది “ఓం ఐం హ్రీం శ్రీం శాంతిమతినే నమః!” అనే మంత్రం వేల వేల సార్లు అ జగన్మాత మంత్రాన్ని జపించడం వలన మనసు శాంతినిపొందుతుంది! శాంతి తో వున్న మనసు విజయం సాధిస్తుంది!!* 

 *ఎప్పుడైనా సరే జీవితంలో సహనానికి శాంతికి ఓర్పుకి శక్తి వుంది.* 

 *అవేశానికి కోపానికి ఎప్పుడైనా ఆనర్దమే వుంటుంది!!*  
 
  *-సేకరణ.⛳* 

🕉️🦚🌻🌹💎🔱🚩