Saturday, December 28, 2024

 *మానవుని యొక్క నడవడిక.....*

శాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనేవాడు మనిషి..
శాస్త్రాన్ని అనుసరించకుండా స్వేచ్ఛగా నడుచుకొనేవాడు పశువు...

అందుకే పెద్దలంటారు.....

శ్లో॥  శ్రుతయో యత్ర వర్తంతే - తత్ర తిష్టంతి వైనరాః । 
మతయో యత్రవర్తంతే - తత్ర తిష్టంతి వానరాః ॥

శ్రుతిని అనుసరించేవాడు నరుడు..
మతిని అనుసరించేవాడు వానరుడు...

౧. శ్రుతి తప్పి పాడరాదు.
౨. తాళం తప్పి ఆడరాదు. 
౩. శాస్త్రం తప్పి నడవరాదు. 

శాస్త్రం తప్పినడిచే వాడికి ఇహంలేదు - పరం లేదు. 

అందుకే నసిద్ధిం, నసుఖం, నపరాంగతిం అవాప్నోతి:.....

కార్యసిద్ధి లేదు, సుఖం లేదు. మోక్షం లేదు, అని చెబుతున్నారు. 

ఎవరైతే శాస్త్ర విధిని తప్పి నడుస్తున్నారో అట్టి వారికి లక్ష్యం సిద్ధించదు, సుఖం కలగదు, పరమగతిని పొందలేరు అని స్పష్టం చేస్తున్నారు. 

శాస్త్రం చెప్పినట్లు నడుచుకోక పోవటానికి కారణం ఏమిటి? కామమే. కోరికలే, ఆశలే, స్వార్థమే.

No comments:

Post a Comment