Tuesday, December 24, 2024

 *మనసు లేని మనుషులు (మంచి నీతికథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*************************** 
ఒక రైతు దగ్గర ఒక కుక్క వుండేది. అది చానా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్ర పోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో "ఏమే... ఈ కుక్క చానా ముసలిదై పోయింది. కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండగ. కాబట్టి తీసుకపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా" అన్నాడు. ఆమె 'సరే' అని తలూపింది.
ఆ మాటలు ఆ కుక్క వినింది. దానికి చానా బాధ వేసింది. అది చిన్న పిల్లగా వున్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొచ్చి, బైటికి పోకుండా ఇంట్లో కట్టేశారు. అమ్మ కనపడక, ఎక్కడ వుందో తెలియక కొద్ది రోజులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నా... చివరికి ఇక వీళ్ళనే అమ్మానాన్నలనుకొని వాళ్లు పెట్టింది తింటూ, రాత్రింబవళ్ళూ ఇంటికి కాపలా కాసింది. మాంసం మొత్తం వాళ్ళు తిని ఉత్త ఎముకలు వేసినా ఏమీ అనుకోలేదు. ఉడుకుడుకు అన్నం వాళ్లు తిని చద్దన్నం, పాసిపోయిన అన్నం పెట్టినా బాధ పడలేదు. చల్లని చలికాలం వాళ్లంతా ఇండ్లలో తలుపులు మూసుకొని రగ్గుల మీద రగ్గులు కప్పుకొని పడుకున్నా... వణుకుతూనే ఇంటికి కాపలా కాసింది గానీ ఒక్కమాటా తిట్టుకోలేదు. పొలంలోకి పశువులు రాకుండా, పంటను దొంగలు ఎత్తుకుపోకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాసింది. అలాంటిదాన్ని పట్టుకొని అంత మాట అనడంతో దాని మనసు కలుక్కుమంది.
"ఛ... ఛ... ఇలాంటి యజమాని దగ్గర ఉండడం కన్నా ఏ పాడుబడిన బావిలోనో పడి చావడం మేలు. నన్ను వీళ్లు వదిలేయడమేంది నేనే వీళ్లను వదిలేసి వెళ్ళిపోతా" అనుకుంటా అది పక్కనే వున్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ తనలాగే ఇంటిలోంచి గెంటివేయబడ్డ ఇంకో ముసలికుక్క తోడైంది. రెండూ కలసి దొరికినప్పుడు తింటూ, దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతూ... ఎప్పుడు ఏ క్రూర జంతువు మీదపడి చంపుతుందో అని బెదపడుతూ భయంభయంగా బతకసాగాయి.
ఆ రైతుకు ఒక పాప వుంది. ఆ పాప పెళ్లి వయసుకు వచ్చింది. దాంతో ఈడు జోడు సరిపోయే ప్రాయం పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతా వుంటే ఒక మంచి సంబంధం ఎదురుపడింది. అబ్బాయి చానా మంచోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేనోడు. పెద్దలంటే భయభక్తులు వున్నోడు. బాగా చదువుకున్నోడు. ఎలాంటి గలాటాలకు పోనోడు. ఎవ్వరిని అనవసరంగా నోరెత్తి ఒక్క మాట అననోడు. 'అలాంటి వాని చేతిలో కూతురిని పెడితే కలకాలం పిల్లాపాపలతో చల్లగా పెదాలపై చిరునవ్వు తొలగిపోకుండా బ్రతుకుతుంది కదా' అని ఆశపడ్డాడు. ఇద్దరినీ కిందికి మీదికి ఒకటికి పదిసార్లు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు "ఈ జంట చేతికి వచ్చిన పచ్చని పంటలా వుంది. నుదిటికి తిలకంలా, ముక్కుకు ముక్కెరలా ముచ్చటగా ఉన్నారు. సంబంధం వదులుకోకండి" అన్నారు. పెళ్ళికొడుకు వాళ్లు కూడా ఆ పాపను చూసి "అబ్బ... ఇంటి ముందేసిన చక్కని చుక్కల ముగ్గులా ఎంత పొందిగ్గా వుందీ పిళ్ళ" అని సంబరపడ్డారు. రైతుతో "మేమేమీ కోటలు కోరం. వాటాలు అడగం. పాపకు పది తులాల బంగారు పెట్టి పంపించండి చాలు. పెళ్లి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుని చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లలో వున్న బంధువులనంతా పిలుచుకొని బ్రహ్మాండంగా అరవయ్యారు వంటలతో పెళ్ళి చేస్తాం" అన్నారు.
రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక 'సరే' అన్నాడు. కానీ పది తులాలు అంటే మాటలు కాదు కదా. అలా అని చెప్పి కన్న కూతురి పెదాలపై చిరునవ్వు కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఎవరికీ ఏదీ లేదు కదా... అందుకని తనకున్న పది ఎకరాల్లో సగం అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని కూతురిని పిలుచుకొని నగలు కొందామని అడవికి పక్కనుండే నగరానికి చేరుకున్నాడు.
ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి వచ్చీపోయే వాళ్ళని గమనించసాగాడు. వాని కన్ను వీళ్ళ పైన పడింది. రైతుకు ఇది తెలియదు కదా... దాంతో వున్న సొమ్మంతా ఇచ్చి, కూతురికి నచ్చిన నగలు కొనుక్కొన్నాడు. వాటిని శుభ్రంగా ఒక పాత సంచీలో చుట్టి, ఎవరికీ కనపడకుండా అంగీ లోపలి జేబులో భద్రంగా దాచిపెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దొంగ అది గమనించాడు. దూరం నుంచే వాళ్లను వెంటాడుతా అదను కోసం ఎదురు చూడసాగాడు.
అట్లా ఒక గంట గడిచాక దారిలో జనం బాగా పలుచనయ్యారు. ముందూ వెనుక కనుచూపుమేరలో ఎవరూ కనబడ్డం లేదు. ఇదే సమయం అనుకోని కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ ముందుకు దూకాడు. "నీ లోపలి జేబులో వున్న బంగారు నగలు వెంటనే తీసివ్వు. లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను కసుక్కున పొడిచి పాడేస్తా" అంటూ గట్టిగా అరిచాడు. దొంగను చూస్తానే రైతు కూతురు భయపడి "కాపాడండి... కాపాడండి..." అంటూ గట్టిగా అరిచింది. అది చూసి దొంగ కోపంతో కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు. రైతు అదిరిపడి చేయి అడ్డం పెట్టాడు. కత్తి చేతికి గుచ్చుకొని రక్తం కారసాగింది. "బాబూ... నీకు కావాల్సింది నగలే కదా. తీసుకో. చిన్నపిల్ల దానినేమీ చేయకు" అంటూ నగలు తీసి వాని ముందు పెట్టాడు.
ఆ పాప గట్టిగా 'కాపాడండి... కాపాడండి...' అంటూ అరిచింది కదా. ఆ అరుపు అడవిలో దూరంగా ఒక చెట్టు కింద పడుకున్న ముసలి కుక్కకు వినిపించింది. అదిరిపడి లేచి కూర్చుంది. ఆ గొంతు తన యజమాని కూతురుది. వెంటనే మిత్రునితో "అడవిలో రైతు కూతురికి ఏదో ఆపద కలిగినట్లుంది దా పోదాం" అంది. దానికి ఆ రెండవ కుక్క "నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో అప్పుడే నీకూ వానికీ బంధం తెగిపోయింది. ఎవరు ఎట్లా చస్తే మనకేమి. హాయిగా పడుకో. అసలే ముసలిదానివి. ఎందుకొచ్చిన గొడవ. వాళ్ళ సంగతేదో వాళ్లే చూసుకుంటారులే" అంది.
కానీ ఆ ముసలి కుక్కకి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుంచి తన ముందు తిరిగి పెరిగిన పిల్ల... తనతో పాటు ఆడుకుంటూ అన్నం తిన్న పిల్ల... అది గుర్తుకు వచ్చి రెండవ కుక్కతో "తిట్టినా కొట్టినా వెళ్ళగొట్టినా బంధం బంధమే. అది ఎప్పటికీ తెగిపోదు. మనుషులకు బుద్ధీ జ్ఞానం లేకపోయినా కనీసం జంతువులం మనకన్నా వుండాల కదా. ఆపదలు వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. పద పద" అంటూ లేచి అరుపులు వినబడిన వైపు ఉరికింది.
అప్పటికే దొంగ రైతు దగ్గర నగలు తీసుకొని ఆ అమ్మాయి మెడలోని గొలుసు కూడా లాక్కుంటున్నాడు. వాని చేతిలో కత్తి తళతళ మెరుస్తా వుంది. కుక్క అదేమీ పట్టించుకోలేదు. రైతు చేతినుండి కారుతున్న రక్తం, అమ్మాయి కళ్ళలోంచి కారుతున్న కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది. ఆవేశంతో ఎగిరి ఆ దొంగ మీదికి దుంకింది. వాడు తిరిగి చూసేలోగా కాలిపిక్క పట్టుకొని కండ వూడి వచ్చేలా గట్టిగా ఒక పెరుకు పెరికింది. దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో దాని కడుపులో కసుక్కున పొడిచాడు. రక్తం సర్రున ఎగజిమ్మింది. అయినా అది వెనుకడుగు వేయలేదు. ఆగలేదు. వాన్ని కొరికినచోట కొరకకుండా ఎక్కడబడితే అక్కడ పెరకసాగింది.
రెండవ కుక్క తన స్నేహితుని కడుపులో రక్తం కారుతుంటే చూడలేకపోయింది. ఒక్కసారిగా ఎగిరి కత్తి పట్టుకున్న ఆ దొంగ చేయి పట్టుకొని గట్టిగా కొరికింది. దాంతో వాని చేతిలోని కత్తి జారి కింద పడిపోయింది. అది చూసి రైతుకు ధైర్యం వచ్చింది. వెంటనే పక్కనే వున్న కట్టె తీసుకొని ఎగిరి వాని తల మీద ఒక్కటి వేశాడు. ఒక వైపు కుక్కలు మరొకవైపు రైతు దాడి చేసేసరికి దొంగకు దిక్కు తోచలేదు. ఎక్కడి నగలు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా పారిపోయాడు.
కుక్క కొద్ది రోజులుగా సరైన తిండి లేక చానా బలహీనంగా వుంది. అదీగాక శరీరంలో అప్పటికే రక్తం చానా కారిపోయింది. దాంతో అడుగు ముందుకు వేయలేక ఒకవైపుకు తూలి పడిపోయింది. దాన్ని చూడగానే రైతు కళ్ళల్లో నీరు కారాయి. ఒక్కుదుటన వచ్చి దాన్ని పైకి ఎత్తుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వైద్యుని కోసం పరుగులాంటి నడకతో ఊరి వైపుకు బయలుదేరాడు. కానీ కొంచెం దూరం పోయాడో లేదో పాపం అది అతని ఒడిలోనే ప్రాణాలను కోల్పోయింది. రైతు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. "ముసలిదానివి అయిపోయావు. నీకు తిండి దండగ అని వదిలించుకోవాలనుకున్నాను. కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసమే బ్రతికావు. విశ్వాసం లేనిది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది నాలాంటి మనుషులే గాని మీలాంటి జంతువులు కాదు. నీ పట్ల జాలీ దయా చూపకపోయినా ఈరోజు నా కూతురి జీవితం నిలబెట్టావు" అనుకుంటూ దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. కన్న కొడుకులాగా దానికి గౌరవంగా అంత్యక్రియలు చేసి తన ఇంటి ముందే సమాధి నిర్మించాడు. అడవిలోని రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకువచ్చి సొంత మనిషిలా చివరి వరకూ చూసుకున్నాడు.
***************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
***************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 🦚🌻🌹💎🦢💜🌈

 *🍁మనకు ఏనుగు,మొసలి  గురించి తెలుసు కదా!భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు.పెద్ద పేద్ద చెట్లనూ నేలకూల్చ గలదూ.అది దాని స్థాన బలిమి.మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా?అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతూంది.మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా?ఆలోచించండి.ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన,నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు.ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు.అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు.మూర్ఖుడు మంచి వినడు.పైపెచ్చు అవమానిస్తాడు.ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు.* 

 *కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది..అంత మాత్రాన అది చిన్నదై పోతుందా ?అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు..ఒకరికి చాలా ఉంది.మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు.మనం తినేదే.. ఏదైనా ఆకలి తీరడానికే..నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే.అంతే.అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు.సంతోషం ప్రధానం.అది ఉంటే ఇంద్రుడే..అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే.నీవు దిగులు గడుస్తూ ఉండాల్సిందే..కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు..* 

 *🌄శుభోదయం 🌞*

🦚🌻🪷🌹🦢💎🌈

****ఎవడ్రా హీరో...

 ఎవడ్రా హీరో..
జన్మనిచ్చిన మా అమ్మ హీరో
జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో
కడుపు నింపే రైతన్న హీరో
రక్షణనిచ్చే జవాన్ హీరో
పాఠాలు చెప్పే గురువు హీరో
బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో
ధర్మం కోసం పోరాడే వారు
హీరోస్🫡
వీళ్ళు నిజమైన హీరోస్ 🫡
ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా 
ప్రాణాలను తెగించి పోరాడే 
నిస్వార్థ సేవకులు హీరోస్🫡

మేకప్ వేసుకొని
డమ్మీ గన్నులు పట్టుకొని
ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని
బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు.
జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!!
మాట వాళ్ళది కాదు,
ఫైట్ వాళ్ళది కాదు,
జుట్టు వారిది కాదు.
పాట వాళ్ళది కాదు.
జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి
డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు.
పదవులు,డబ్బు కోసం కులమతాలను అడ్డుపెట్టుకొని
రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హీరోస్ కాదు!!

వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!?
వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!?
వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!?
వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!?

దేశం కోసం, ధర్మం  కోసం ఛ స్తే 
హీరోస్ అంటారు!
హీరోలు,రాజకీయ నాయకుల కోసం ఛస్తే 
జీరోస్ అంటారు!!

ఇకనైనా మారండి..
సినిమాని సినిమాలాగా చూడండి.......
 *🌷శుభోదయం*
    
🌻 *మహానీయుని మాట*🌸
       
*🌷కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి పరుగులు తీస్తూ ఉంటాం...*
*కానీ గుండెకు నచ్చే విషయం గురించి వెతకండి......*
*నయనానందం క్షణికం...*
*హృదయానందం శాశ్వతం...*
       
🌹 *నేటీ మంచి మాట* 🌼
     
*🌷పోరాటాలు లేని జీవితం అసలు జీవితమే కాదు.* *జీవితంలో నవరసాలు ఉంటాయి. బాధలే కీలకం. ఏ విజయచరిత్రలోనూ అపజయం పాత్ర లేకుండా పోదు. అపజయాల స్తంభాలమీదనే విజయభవనం నిలిచి ఉంటుంది.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

****పాకిస్థాన్...రాహుల్

 పాకిస్థాన్...రాహుల్

పాకిస్తాన్ దివాళా తీసింది అనుకోవడం...రాహుల్ ను పప్పూ అనుకోవడం రెండూ అత్యంత తీవ్రమైన తెలివి తక్కువ అంచనాలు...

రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక అబ్రహాం భూతం తన సర్వైవల్ కోసం  సృష్టించుకున్న రెండు విధ్వంస కారి ముఠాలు...

ఒకటి ఇబ్రహీం మతం...దాన్ని ఉపయోగించి కొంత ప్రపంచాన్ని దున్నితే....ఇంకొకటి మార్క్స్మతం...దాంతో మరికొంత ప్రపంచాన్ని తవ్వడం...

ఒక్కోసారి ఈ కొత్త ప్రేతం అంటే....సృష్టించిన ఆ అబ్రహాం మరో రూపం చూస్తే అమెరికాకే భయం వేస్తూ ఉంటుంది...

అమెరికా లేక యూరోప్ ల్యాబ్లో తయారైన ఈ వైరస్ లను తిరిగి సీసాలో పెట్టి మూత వేసే క్రమంలోనే...

ఒక ఇరాక్ ధ్వంసం...ఆఫ్ఘన్ విధ్వంసం...ఒక వియత్నాం..మరో క్యూబాల డిస్ట్రక్షన్....ఇప్పుడు సిరియా...రేపు బంగ్లా...పాక్...

అలా అమెరికా లేదా బ్రిటన్ తమ కోసం మరో ప్రేతాన్ని సీసాలో పెట్టే టైము కోసం ఎదురు చూస్తోంది...పాక్ ప్రేతం....

అయితే అది అంత సులభం కాదు...

అది తన స్వీయధ్వంసానికి వేసుకున్న విష బీజం...పాక్ ప్రేతం...

జోక్ అనిపిస్తోందా....

నిజం...

పాకిస్తాన్ అమెరికా యొక్క తీవ్రవాద మాన్యుఫాక్చరింగ్ యూనిట్...

నిజానికి పాకిస్తాన్ ఒక దేశం కాదు...

అది త్వరలో  డీప్ స్టేట్ ఆదేశాలతో తనను తాను పేల్చుకోబోతున్న సూసైడ్ బాంబర్...

అమెరికా ఎక్కడ ఏ దేశానికి పొగబెట్టాలని అనుకున్నా... ఈ బాంబర్స్ నే ఉపయోగించుకుంది.. 

ఐసిస్ హమాస్ హిజ్బుల్లా లాంటి చిన్న చిన్న వైరస్ లు పాకిస్తాన్ ముందు తూచ్...

పాకిస్తాన్ అణు కర్మాగారాలన్నీ అమెరికానే కాపలా కాస్తూ ఉంటుంది...

అమెరికా తన బాంబులు ఆ యూనిట్ల లో దాచుకుని...ఆసియా దేశాలను బెదిరిస్తూ ఉంటుంది...

పాకిస్తాన్ నుంచి ఎగుమతులన్నీ ఉత్తుత్తివే...ముఖ్యంగా సాఫ్టు వేర్ ఎగుమతులు 320 కోట్లట...ఆ తరువాత అండర్వేర్ ల ఎక్సపోర్ట్ పెద్దది...

అవ్వన్నీ కాగితాల మీద చూపించేవే...

అందుకే పాకిస్తాన్ లోని ముప్పాతిక  ప్రాంతాలకు వెళ్లవద్దని తన పౌరులకు అమెరికా హెచ్చరిస్తుంది...

అంతా రెడ్ జోనే...చూపిస్తుంది...

ఎక్కడికైనా పాకిస్తాన్లో ప్రయాణం చెయ్యాలంటే.... యూ ఎస్ ను వ్యక్తీకరించే స్టిక్కర్లు పెట్టుకోవద్దని చెబుతుంది...

అమెరికా తన పౌరులకు ట్రావెల్ హెచ్చరికలు ఎందుకు చేస్తుందో అమెరికాకు బాగా తెలుసు...

యూరోప్ అమెరికా ఇంకో పక్క చైనా...పాకిస్తాన్ యొక్క కృత్రిమ రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి...

ప్రపంచాన్ని బెదిరించడానికి అవసరం అయిన మానవ విధ్వంస కారులను తయారు చేసే కర్మాగారంగా దాన్ని ఉపయోగిస్తున్నారు...

ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ రకమైన ఘోరం జరిగినా...అక్కడ పాకీ ఉండే ఉంటాడు...

ఇప్పుడు ఆ పెద్ద భూతం కన్ను మణిపూర్ మీద పడింది...అంటే ఈశాన్యం...

ఇప్పుడు డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకోండి...

రాహుల్....చైనా...కమ్యూనిస్టులు...ఒవైసీ...కేరళ ఫాదర్...అందరూ కట్టగట్టి అడిగేది...మన ప్రధానిని మణిపూర్ వెళ్ళమని...

ఆ మూడింటికి అంటే ...అబ్రహాం..ఇబ్రహీం...మార్క్స్లకు  మూడించే శక్తి కేవలం ప్రపంచంలో భారత్ కి మాత్రమే ఉంది...

ఆ శక్తి వెయ్యింతలు అయ్యేది మాత్రం...మనల్ని మనం హిందువులుగా గుర్తించినప్పుడు...

ఇరాన్ సరిహద్దుల వరకూ ఉన్న అఖండ సాంస్కృతిక భారత్ ను ఉపాసించి... ఆరాధించినపుడు...

అర్థం చేసుకుందాం...!
 *🙏ఆంజనేయస్వామి వారి "తోకకు" ఎందుకు నమస్కారం...!!*

🌸ఆంజనేయస్వామి వారి "తోకకు" ఎందుకు నమస్కారం చేయాలంటే ఆయన రుద్ర వీర్య సంభవుడు. 

🌿రుద్రాంశ సంభూతుడు. 
సాక్షాత్తు పరమేశ్వరుడే. 
పరమేశ్వర స్వరూపం అర్థనారీశ్వర తత్త్వంతో కూడుకొని ఉన్నది. 

🌹"నశివేన వినా దేవి"🌹

🌸 అంటే "ఈశ్వరుడు" లేకుండా ఈశ్వరి ఉండదు. 

🌿"దేవ్యాచ  వినా శివః" శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండలేడు. 

🌸కాబట్టి అర్థనారీశ్వర తత్త్వాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆంజనేయస్వామిగా అవతరించినప్పుడు ఆ జగదంబ "పార్వతీ" దేవి ఆంజనేయ స్వామివారి యొక్క తోకలో తన శక్తిని నిక్షిప్తం చేసింది. 

🌿అందుకే హనుమదుపాసకులు వాలపూజ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన సాధనా విశేషాలను కూడా అభివృద్ధి చేశారు.

🌸ఆంజనేయస్వామి వారి చిత్ర పటాలను సేకరించి ఆ చిత్రంలో తోకభాగానికి మాత్రమే 24 రోజులపాటు ప్రతిరోజూ ఒక్కొక్క బొట్టు పెడుతూ దానికి సంబంధించిన మహామంత్రం జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటూ హనుమదుపాసకులు చెప్తారు. 

🌿దీనికి హనుమత్ వాల పూజ అని పేరు. దీనిని ఒక నియమంతో , ఒక సంకల్పంతో, ఒక సాధనతో చేయవలసిన విశేష పరిశ్రమ. 
కనుక శక్తి ఆయన వాలంలో ఆశ్రయించి ఉంటుంది. 

🌸వాలమునకూ, స్వామి వారికీ నమస్కరించాలి ... 
జై ఈశ్వరాంజనేయ ...🚩🌞🙏


*గురుబోధ:*
స్నానం చేయకుండా వంట వండకూడదు.  ఒకవేళ అలా వండినా   ఆ పదార్థాలను తినరాదని శాస్త్రం.  ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, తాకడం, వంట చేయడం వంటివి కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే  మడి ఆచారం విలువలు తెలిసినవారు ఎక్కువ బయట లేదా హోటళ్లలో తినడానికి ఇష్టపడరు. అనారోగ్యం తో ఉన్నవారికి లేదా  అత్యవసరం గా పొయ్యి తాకాల్సి వచ్చినప్పుడు  పసుపునీళ్ళు చల్లి పొయ్యి వెలిగించవచ్చు. 

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

గుర్తు పెట్టుకోండి.. ఆ మూడు మన జీవితాంతం ఉండవు: పూరి జగన్నాథ్‌

 గుర్తు పెట్టుకోండి.. ఆ మూడు మన జీవితాంతం ఉండవు: పూరి జగన్నాథ్‌
""""""""""""""""""""""""""""

పవర్‌.. మనీ.. సక్సెస్‌ మన జీవితాంతం ఉండవని, అవి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలి                 

పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా 'రీప్లేసబుల్‌' అనే అంశంపై మాట్లాడుతూ...

''ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 'నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో' అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు''

''ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే''

''ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. 'నేనే లేకపోతే' అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది''

''ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. 'నేనే లేకపోతే..' అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు''.      
 *గురుబోధ:*

ఎప్పుడైతే భ్రమ తొలగి, భగవంతుడు సర్వాంతర్యామి అన్న భావన కలుగుతుందో తన్మయత్వం పొందుతామో, 

భగవంతుడు సర్వాంతర్యామియైనా అంతర్యామి అని గ్రహిస్తామో అప్పుడు తన్మయత్వములో, తాదాత్మ్యము చెంది కన్నులు మూసుకుంటాము. ఇది మనలో అంతర్లీనంగా ఉండే ఉపాసనాశక్తి వల్ల జరుగుతుంది. ఆ స్థితిలో భగవంతుడి అనుగ్రహం కలిగి, శీఘ్రముగా దర్శనం కలుగుతుంది. కనుకనే జ్ఞానులు సమాధిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తన్మయత్వములో కన్నులు మూసుకుంటారు. ఉదా: హాథీరాం బాబాజీ (భగవంతుడు ఏనుగురూపం లో వచ్చి చెరకుగడలు తిని అతడిని రక్షించడం వలన అప్పటినుంచి ఆయనని హాథీరాంబాబాజీ అని పిలుస్తున్నారు) కృష్ణుడు ఎదురుగా దర్శనమిచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి తన్మయత్వం తో కన్నులు మూసేసేవాడు. అప్పుడు కృష్ణుడు నన్ను చూడడానికి పిలిచి, నేను వచ్చినప్పుడు కన్నులు మూసుకుని ఉంటావేమిటి? అని అడిగేవాడు.  ఏమి చెప్పమంటావు కృష్ణా! కన్నులు తెరిచి చూచినట్లైతే నీ చిన్నరూపమే కనిపిస్తుంది. కానీ కన్నులు మూసి చూచినప్పుడు కోటిసూర్యులకాంతితో దివ్యమంగళరూపముతో మనోదర్శనమిస్తావు. అందుకే కళ్ళు మూసుకున్నాను, కానీ నా ఎదురుగా నువ్వు లేకపోయినట్లైతే అంతటి గొప్ప దర్శనము కలుగదు, కాబట్టి నా ఎదురుగా ఉండమని ప్రార్థించేవాడు.

*బ్రహ్మ రాతా..?* *కర్మ ఫలమా..?*

 *బ్రహ్మ రాతా..?*

                 *కర్మ ఫలమా..?*
                 
బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణశర్మగారి సౌజన్యంతో 


ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని‘తలరాత’ఆ పుర్రె మీద ఇంకా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూహలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చదివాడట. పొడి పొడి మాటలలో..
*‘జన్మ ప్రభృతి దారిద్య్రం, దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’*

(పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదేళ్ళు  కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది.

నారదుడికి ఆశ్చర్యం వేసింది... ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారాగార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్రతీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమిటి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు...
“ఇతగాడు నిష్ఠదరిద్రుడే!దిక్కులేకుండా మరణించిన మాటా నిజమే...  కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?”అన్నాడట బ్రహ్మ.

బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పించుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఓనమ్మకం!
*‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’*
(విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) 
అని చెప్పాడు భర్తృహరి.

మరి అంతా బ్రహ్మరాతే అయితే ఇక మనిషి కర్మలకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా?
బోలెడంత ఉంది....!

’ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది!’ అని కదా కర్మ సిద్ధాంతం!

అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే..!

బ్రహ్మరాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే..!

దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది..!

మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు..!

బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే..!

ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు..!

మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే..!

బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించుకోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే..!              

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

53. త్వం కామ సహసాసి ప్రతిష్ఠితో విభుః

పరమేశ్వరా! నీవు
'కామ’స్వరూపానివి. ప్రతిష్ఠితుడవైన విభుడవు (అథర్వవేదం)

'కామం' అంటే కోరిక. ఆధ్యాత్మికమైన ఈ దేశంలో 'కామం' వంటి భౌతికాంశాలను అలక్ష్యపరచారని భావిస్తాం. కానీ ఈ దేశంలోనే ఈ విషయమై అద్భుతశాస్త్రాలు
పుట్టాయి. అయితే వ్యాపార విష సంస్కృతిని ప్రపంచమంతా ప్రసరించిన విదేశీ దృష్టిని మన నేత్రాల్లోకి అరువుతెచ్చుకుని అద్భుతమైన మన ఆవిష్కరణల్ని అతి తక్కువ భావంతో చులకన చేస్తున్నాం.

(కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల
మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.)

కామం భగవద్భావనగా గ్రహించమనీ, పురుషార్థాలలో ఒకటిగా స్థాపించాం.
మహాభారతంలో 'కామగీతలు' చెప్పబడ్డాయి. అంటే కామం పట్ల దార్శనిక దృష్టితో తాత్త్విక చింతన ఈ దేశంలో ప్రాచీన కాలంలోనే జరిగిందన్న మాట. వాత్సాయనాదుల
గ్రంథాలను స్పష్టంగా పరిశీలిస్తే ఒక ఆరోగ్యవంతమైన కుటుంబవ్యవస్థకు మూలాలను ఎలా ప్రతిష్ఠ చేశారో అర్థమౌతుంది.

ధర్మపు పునాదిపై అర్థకామాలను సంపాదించడమనే మౌళిక సామాజిక సూత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించిన సంస్కృతి మనది.

“ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభోధర్మమునకు విరుద్ధం కాని కామము నా స్వరూపము' - అని సాక్షాత్తు భగవానుడే గీతాబోధ చేశాడు. సహజ స్వభావాన్ని సవ్యధోరణిలో సాగనిస్తే వ్యక్తికీ, సమాజానికీ క్షేమమని గ్రహించి, ధర్మపు హద్దులనే పాదుగా వేసి మానవజీవన వృక్షాన్ని పదిలంగా ఎదగనిచ్చిన పటిష్ట సంస్కారం
ఇక్కడ అనాది సిద్ధాంతం.
-
పరమాత్మయే 'స అకామయత ఏకోహం బహుస్యాం ప్రజాయాయేతి' అనే 'కోరిక'తో ఏకుడే అనేకుడై పరమేశ్వరుడయ్యాడనీ, అందుకే ఆయన కామేశ్వరునిగా
కొలువబడుతున్నాడనీ, ఆయన శక్తియే కామేశ్వరీదేవి అనీ విశ్వంలో ప్రతి అణువులోనూ
ఆ శక్తి విలసనమే దాగి ఉందనీ అద్భుత దర్శనం ఇక్కడ ఉపాసనా
సంప్రదాయమయ్యింది.

భౌతిక కామనలను ధర్మబద్ధం చేసే ప్రవృత్తి మార్గానికి ప్రాధాన్యమిస్తూనే
అంతర్ముఖమైన భగవత్కామన (బ్రహ్మకామన వేదాంతవిద్యగా పరిఢవిల్లిన మోక్షసామ్రాజ్య ఆవిష్కరణ(నివృత్తిమార్గం) ఈ నేలపై విలసిల్లింది.

అసలు సృష్టి, స్థితి, లయలు ప్రతిక్షణం జరుగుతుంటాయి. ఒకటి సృష్టింపబడి,ఎదిగి, తిరిగి లయించడం ప్రతిక్షణం, ప్రతిచోటా జరిగే ప్రక్రియ. ఈ మూడు చేసే
శక్తులను బ్రహ్మవిష్ణురుద్రులన్నాం. నిజానికి ఒకే శక్తి ఈ మూడుగా పని చేస్తోంది.ఆ ఒక్క శక్తిని 'కామ' శక్తి అన్నారు. అక్షర నిర్మాణంలో కూడా హేతుబద్ధమైన సూక్ష్మవిజ్ఞానాన్ని అవలంబించిన మనశాస్త్రం 'కామ' అనే నామంలో మూడు శక్తులున్నాయని వివరించింది.

కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.

దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.    
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
                  *ఎది సత్యం?*

*అందరూ నిజాన్ని, నిజాయతీని ఇష్టపడతారు. కాని, అది ఇతరుల్లో చూడాలనుకొంటారు. తమకు వర్తించదనుకొంటారు కొందరు. ‘సత్యమేవ జయతే’ సూత్రం పాటిస్తున్నామంటూ అబద్ధం తప్ప పొరపాటునైనా నిజం చెప్పరు కొంతమంది. అపనమ్మకానికి పునాది అబద్ధమే. అబద్ధాలు చెప్పడం కూడా అపరాధమే. ఆధ్యాత్మిక దృష్టిలో అసత్యం మహా పాపం. ఎందుకంటే, అసత్యానికి, మోసానికి ఆట్టే తేడా లేదు. మోసానికి పెట్టుబడి అబద్ధాలే. సత్యహరిశ్చంద్రుడు సత్యదీక్ష కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు కాని, ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇప్పటి కాలంలో కొందరు ఒక్క నిజం కూడా చెప్పరు. దొంగ సాక్ష్యాలన్నీ అబద్ధాల సంపుటులే.* 

*ఆధ్యాత్మిక రంగంలో ‘ఏది సత్యం?’ అనే ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దానికి అనుబంధ ప్రశ్న ‘ఏది నిత్యం?’. ఏది సత్యమో అది నిత్యం అంటారు వేదాంతులు. భగవంతుడే సత్యస్వరూపుడంటారు. ‘సత్యమేవ జయతే’- అంటాయి ఉపనిషత్తులు. అంటే, దైవ సంకల్పానికి విజయం నిశ్చయం!వాక్కులతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆత్మకు అసలు నిజం తెలుసు. మనోవేగం కన్నా దైవజ్ఞాన వేగమే చాలా ఎక్కువంటారు. జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే మనిషికి తెలుసు. జరగబోయేదీ భగవంతుడికి తెలుసంటారు. దీనినే త్రికాల జ్ఞానంగా చెబుతారు.*

*మహర్షులు త్రికాల వేదులు. అందుకే వారు దైవ సమానులు. భగవంతుడితో మహర్షులు, దేవర్షులు పూజలందు కొంటారని పురాణ ఇతిహాసాల్లో చదువు తుంటాం. లోకకల్యాణం తప్ప వారికి ఇతర స్వార్థాలు ఉండవు. వసిష్ఠ, కశ్యప, నారద మునీంద్రులు ఈ కోవకు చెందినవారు. ‘సత్యం’ అనే ఇరుసు మీదనే లోకాలు పరిభ్రమిస్తున్నాయి. సుదర్శనమే లోకచక్రం. స్థితి కారకుడైన విష్ణువు సుదర్శనంతోనే లోకకంటకులను సంహరిస్తాడంటారు.*

*ఆగ్రహంలోనూ నిగ్రహం చూపగలవారే మహర్షులు. విశ్వా మిత్రుడు ఆగ్రహంతో తన నూరుగురు కుమారులను అంతం చేసినా, వసిష్ఠుడు విశేషమైన నిగ్రహం చూపాడు. అందుకే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు. ప్రకాశవంతంగా సూర్యుడు వెలిగే వేళ మబ్బు కప్పినంతలో సూర్యుడు లేడనుకోగలమా? మనం మాయ ప్రభావంలో ఉన్నామని గ్రహించగలిగితే మనం చూసేది సత్యం కాదని తెలుస్తుంది. ‘ఏది సత్యం’ అనే ప్రశ్నతో శోధన చేస్తే, మన కృషి తీవ్రతను బట్టి సమాధానం దొరుకుతుంది. మమకారమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుగోడ. అభిమన్యుడి మరణంతో కుంగిపోతున్న అర్జునుడికి సత్యబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. చంద్రుడి కుమారుడిగా అభిమన్యుణ్ని చెబుతాడు. మరణానంతరం అభిమన్యుడితో అర్జునుడు సంభాషించే సన్నివేశాన్ని కృష్ణుడు కల్పించినప్పుడు- ‘నీవెవరో నాకు తెలియదన్నా’డంటారు.* 

*అర్జునుడి భ్రమ తొలగిపోవడం అక్కడ ప్రధానాంశం. కేవలం పరమాత్మ ఒక్కడే సత్యం, నిత్యం. అందుకే గీతాకృష్ణుడు ‘మరే ఆలోచనలూ లేకుండా నన్ను మాత్రమే ఆశ్రయించు. నిన్ను రక్షిస్తాను’ అంటాడు. దేని నుంచి రక్షణ?అసాధ్యమైన అష్టవిధ మాయల ప్రభావం నుంచి అని మనం గ్రహించాలి. గీతాబోధ అర్జునుడి కొరకే అనుకోకూడదు. మనందరికీ అని అర్థం చేసుకుంటే గీతా ప్రయోజనం సిద్ధిస్తుంది.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴⛳🌴 ⛳🌴⛳ 🌴⛳🌴
 *దేవాలయలు.....*

*మనదేశంలో ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయమైన ఉంటుంది. దేవాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.*

*ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది... అలా ప్రతి గ్రామంలోనూ దేవాలయాన్ని నిర్మించు కోవలసిన అవసరమేమిటి... ఒక వేళ దేవాలయంలేని గ్రామమున్నట్లయితే ఏమవుతుంది...*

*ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. ప్రతియొక్కరికీ మానసిక ప్రశాంతత స్థిరచిత్తంతో జీవించాలని ఉంటుంది. దేవుని కటాక్షం లేకుండా అటువంటి జీవితం లభ్యమవటం అసాధ్యం. దేవుని కటాక్షం లభించాలంటే దేవాలయాలు అవసరం.*

*సనాతన ధర్మంలో వాస్తవానికి దేవుడు లేని చోటు లేదు. భగవంతుడు సర్వాంతర్యామి. మరి దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే దేవాలయాలెందుకు... ఒక దేవాలయంలో దేవుని బందించి, ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా...*

*ఇటువంటి సందేహాలను లేవనెత్తే వారు పూర్తిగా ఏమి తెలియను వారు కాదు. అయితే వాళ్లు సత్యాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోలేదు. అందువలనే ఇటువంటి సందేహాలు తలెత్తుతుంటాయి. పరమాత్మా సర్వాంతర్యామి అనటంలో ఇటువంటి సందేహం లేదు. అయితే తగు అవగాహన, సంస్కారం లేని కారణంగా సామాన్యులు పరమాత్మ సర్వాంతర్యామి అనే విషయాన్ని హృద్గతం చేసుకోలేక పోతున్నారు.*

*అయితే అటువంటి అవగాహన సంస్కారం ప్రహ్లాదుని వంటి మహాపురుషులకే ఉంటుంది. మహాభక్తుడైన ప్రహ్లాదునికి ప్రతిచోటా దైవదర్శనం భాగ్యం లభించేదని శ్రీమద్భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే సామాన్యులు ప్రహ్లాదునికున్న సంస్కారాన్ని, అధికారాన్ని కలిగి ఉండరుకదా.*

*అయుతే దైవ భక్తిని పెంపొందించుకోవడానికి సామాన్యులు ఏమిచేయాలి... మన పూర్వీకులు మనకి చాల మార్గాలను సూచించారు. శాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం ప్రాణప్రతిష్ట చేయబడిన దేవత విగ్రహాలను పూజిస్తే తప్పకుండా దైవకటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. పామరులు కూడా సులభమైన ఈ మార్గాన్ని అవలంబించి దైవ కటాక్షాన్ని పొందవచ్చు.*

*ఒక దేవాలయంలో దేవుని బందించి ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా అనే సందేహం అడగవచ్చు. దీనికి శ్రీ శంకరాభగవత్పాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు...*

*"యధా సకల భూమండలాధిపతి రపి అయోధ్యాపతిః ఇతి వ్యవహ్రియతే"*

*భూమండలాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యాధిపతిగా అభివర్ణిస్తున్నాము. అంతమాత్రాన ఆయన అధికారం తగ్గిపోతుందా... ఆయన అయోధ్యాపతి మాత్రమే కాదు, లోకాధిపతి కూడాను.*

*అలాగే పరమాత్మా ఇతరచోట్ల ఉన్నట్లే దేవాలయంలో కూడా ఉంటాడు. అయితే దేవుడిని అన్వేషించే వారి సౌలభ్యం కోసం ఒక స్థానాన్ని చూపించాలని దేవాలయాన్ని దైవస్థానంగా చూపిస్తాం. దేవాలయంలో దేవుని ఆరాధన ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందవచ్చు.*

*ప్రహ్లాదుని వంటి శ్రద్ధా భక్తులు అధికారికత మీకు కనక ఉన్నట్లయితే, అటువంటి సంస్కారాలను మీరు కూడా పొందగలిగినట్లైతే భగవంతుడిని అన్నిచోట్లా మీరు కూడా దర్శించవచ్చు. అప్పుడు మీరు దేవాలయానికే వెళ్లి దేవుడిని పూజించాల్సిన పనిలేదు, ప్రతిచోటు మీకు దేవాలయమే అవుతుంది. అయితే ప్రహ్లాదుని స్థాయి మనం చేరుకునే దాకా దేవాలయానికి వెళ్లి పూజించక తప్పదు. అందువలన దేవాలయాలు అవసరమవుతున్నాయి.*

*మరి మన విన్నపాలను భగవంతుడు పట్టించుకుంటాడా అనే అనుమానానికి ఆస్కారం లేదు. భగవంతుడు అనంతమైన కరుణామూర్తి. శృతి ఇలా వివరించింది...*

*"అపాణిపాదో జవనో గ్రహీతా*
*వశ్యత్య చక్షు: స శృణోత్య కర్ణ: |*
*సవేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా*
*తమాహురగ్య్రo పురుషం మహన్తం ||"*

*భగవంతుడు మనవంటివాడు కాదు, మనకు చేతులున్నాయి కాబట్టి వస్తువులను పట్టుకుని పైకెత్త గలుగుతున్నాము. కాళ్ళున్నాయి కాబట్టి నడవగలం. చేతులు లేకపోయినా భగవంతుడు పైకెత్తగలడు నడవగలడు. మనం భక్తితో ఏది సమర్పించినా... ఫలం, పుష్పం, పత్రం, తోయం... భగవంతుడు స్వీకరిస్తాడు.*

*మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వచ్చాము... గ్రామాలలో దేవాలయం లేకపోతే ఏమవుతుంది... అంటే మనం ఎవరి ముందు మన కష్టాలను చెప్పుకుంటాము... అయితే సామాన్యులు భగవంతుడిని ఎక్కడ దర్శించగలరు... దేవాలయాలలో మాత్రమే దర్శించగలరు.*

*ఈ అవసరాలను తీర్చటానికి మన పూర్వీకులు ప్రతి గ్రామంలో కనీసం ఒక్క దేవాలయాన్నైనా నిర్మింపచేశారు. సనాతన ధర్మం సుస్థిరంగా చైతన్యవంతంగా ఉండటంలో దేవాలయాలు ప్రముఖమైన పాత్రలు నిర్వహిస్తాయి. దేవాలయాలు లేకపోతే సనాతన ధర్మం దయనీయస్థితిలో ఉండేది. సనాతన ధర్మ సంరక్షణకు దేవాలయాలే ఆశాజ్యోతులు. అందువలన దేవాలయాలు అత్యంతావశ్యకం...*

          *ఆధ్యాత్మికం ఆనందం*

🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

***గోమాత గొప్పదనం

 *🙏🌺గోమాత గొప్పదనం🌺🙏*  

*🌺ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం. పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది.*  

*🌺 ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.  మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి. ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.  వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచినా రోగాలు రావు.*  

*🌺 ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే. . ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.*   

*🌺ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు.*
🐄🐂🐄 🐂🐄🐂 🐄🐂🐄
 *ధ్యానమార్గ*
శ్రేయాన్ స్వధర్మో విగుణ!' నా ధర్మం చెప్పుకోతగ్గంత గొప్పదనాన్ని కలిగి ఉండకపోయినా, “పరధర్మార్స్వనుష్ఠితాల్' ఇతరుల ధర్మాన్ని పోల్చి చూసినప్పుడు, అయినా కూడా ఎవరి ధర్మం వారే ఆచరించాలి. ఇక్కడ వ్యక్తిత్వాలను 
గురించి తెలియజేస్తున్నాడు. ఎవరి వేలుముద్రలు వారివే ఉంటాయి. అలాగే ఎవరి ధర్మం వారిదే. కొన్ని మానసిక ఉద్వేగాలు, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలు అన్నీ
కలసి మానసిక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడింది నీస్వభావం ఏదైతే
దానిలోనే ఉండు. సిగ్గు పడకు, ముడుచుకుపోకు. ఇతరుల నుంచి మంచిని
నేర్చుకోవచ్చు కానీ, వారినే అనుకరించడానికి ప్రయత్నించడం తప్పు. నీవు నీవుగానే ఉండు అని చెప్పడం వల్ల, నీ మీద నీకు నమ్మకం, దృఢ సంకల్పం, కలుగుతుంది. ఆ స్థితి నుంచే నిన్ను నీవు అభివృద్ధి చేసుకో. ఎవరో నిన్ను మూసపోసి తయారుచెయ్యడం లేదు. నీకు నీవే నిన్ను తయారు చేసుకుంటున్నావు. 'స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః! నీ ధర్మం నీకు
సౌకర్యంగా ఉంటుంది. వేరే వారి ధర్మం నీకు సరిపడదు. పరధర్మం భయాన్ని
కా' నీ ధర్మం
కలిగిస్తుంది.
❤️🕉️❤️
'పరతస్తు సః పర' సూక్ష్మమైంది. పర అనబడుతుంది,
ఘనీభవించిన వాటిని తాకి చూడవచ్చు. ఘన పదార్థంగా ఉన్న శరీరంకన్నా ఇంద్రియాలు కొంతవరకు సూక్ష్మమయినవి. ఘనీభవించిన దానిలో ఉన్న శక్తికన్నా, సూక్ష్మంలో ఉన్న శక్తి చాలా విలువయిందిగా ఉంటుంది. 'సూక్ష్మం మహాంతశ్చ' సూక్ష్మమయిన శక్తి అనంతంగా, విశాలంగా, శక్తిమంతంగా విస్తరించి ఉంది. • ప్రత్యగాత్మ భూతాశ్చ' నీలోని ఆత్మస్థితికి దగ్గరగా ఉంది. శరీరం భౌతికంగా నీకు కనబడుతుంది. ఇంద్రియాల జ్ఞానం కొద్ది సూక్ష్మంగా, మనస్సు ఇంకా సూక్ష్మంగా, బుద్ధి దానికి మించిన సూక్ష్మంగా, ఆత్మ వాటికి చాలా దూరంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది.
❤️🕉️❤️
ద్వైతం ఇంద్రియాల అవగాహన, అద్వైతం ఆత్మతత్త్వం, ముండకోపనిషత్తులో 'బ్రహ్మైవేదమ్ అమృతం' ఈ సృష్టి అంతా కూడా అనంత బ్రహ్మమయం, ముండకోపనిషత్తు పురస్తాత్ బ్రహ్మ' ముందు బ్రహ్మమే, 'పశ్చాత్ బ్రహ్మ' వెనుక బ్రహ్మమే 'దక్షిణస్తత్ ఉత్తరేణ బ్రహ్మైవేదం విశ్వం ఇదం వరిష్ఠం' కుడి, ఎడమవైపులన్ని వైపులా బ్రహ్మం తప్ప మరేమీ లేదు అని చెప్పింది. పూజింప తగిన బ్రహ్మ తప్ప మరేమీ కానరాదు. ద్వంద్వం మరేమీ కానరాదు. ద్వంద్వం లేని ప్రతిచోటకూడా పరిశుద్ధ చైతన్యస్థితే ఉంటుంది.