Saturday, September 27, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(229వ రోజు):--
      మొదటిసారి వచ్చినపుడు విద్యా ర్థులు రోజూ గంగస్తోత్రం గానంచేసే వారు. కాని, రెండవసారి ఎందుచేత నో అది జరగలేదు. దీన్నిగమనించిన స్వామీజీ ఒక ఉదయాన్నే వారితో, "మీరు రోజూ గంగాస్తోత్రం ఎందుకు చేయట్లేదు? ఈరోజంతా అందరూ ఉపవాసం చెయ్యాలి" అన్నారు . మధ్యాహ్నం భోజనం తీసుకువచ్చి నపుడు, దానినిముట్టుకోలేదు."నేను  'అందరూ'అంటే దాని అర్థం 'అంద రూ'అనే. నా విద్యార్థులు తినరు కనుక, నేనూతినను." మరుసటిరోజు న వాళ్లందరినీ రసహీనులైన జ్ఞాను లని విమర్శించి, నాలుగురోజుల పాటు తరగతులు లేకుండా నిర్విరా మంగా భజనచేయించారు. "బుద్ధి లో మెదిలే ఆధ్యాత్మిక భావాలు హృదయాన్ని భక్తితో ముంచెత్తాలి" అని చీవాట్లు పెట్టారందరికీ. 
        దైనందినజీవితంలో కూడా చేసే ప్రతిచిన్న పనినీ పరిపూర్ణమైన శ్రద్ధతో చేయటమే ఆయన సాంగ త్యంలో విద్యార్థులు నేర్చుకున్న అతి పెద్దపాఠం. రోజూ ఆచరించాల్సిన ఆధ్యాత్మిక నియమాలను ఒకచిన్న పుస్తక రూపంలో ప్రచురించి, ఒక సేవాకార్యక్రమంగా వాటిని చుట్టు ప్రక్కల గ్రామాల్లో పంచిపెట్టమన్నారు ఒక కట్టంతా పంచిపెట్టిన బ్రహ్మచారి ణి శారద కొన్ని కాగితాలు తలక్రిందు లుగా ఉన్నాయంటూ రెండు ప్రతుల ను వెనక్కితెచ్చి, "ఈరెండూ సరిగ్గా లేవు ; మిగిలిన వాటన్నిటినీ పంచి పెట్టాను" అంటూ వాటిని స్వామీజీ చేతికిచ్చింది. స్వామీజీ ఆ పుస్తకాల ను తీసుకొని పిన్నులను జాగ్రత్తగా తొలగించి, కాగితాలు సరిచేసి, మళ్ళీ పిన్నులు గుచ్చారు. బ్రహ్మచారిణికి వాటినందిస్తూ, "ఇప్పుడు వీటిని కూడా పంచవచ్చు" అన్నారు. 
     సాందీపనికి తిరిగివచ్చిన ఒకరోజు   తర్వాత, "ఇక బయటికి వెళ్లి కష్టించి పనిచేయండి. ఇక్కడ చాలాకాలమే ఉన్నారు. ఈబద్దకస్తులంతా బయటి  కి వెళ్లి ఏం చేస్తారో చూడాలి" అని ఆజ్ఞాపించారు. 
        బయటి ప్రపంచంలో పనులు విద్యార్థులందరికీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. బయటికి వెళ్లి జనం తో వ్యవహరించడం, చిన్మయమిష నుకు తరగతులు నిర్వహించడం వంటివాటితో పోలిస్తే, ఆశ్రమపు క్రమశిక్షణ చాలా సులువనిపించింది బ్రహ్మచారి హరిదాసు తను బోధిస్తూ గడిపిన ఐదు సంవత్సరాల అనుభ వాన్ని ఈవిధంగా వర్ణించారు:
       మా ఉపన్యాసాలు వినటానికి చాలినంతమంది జనం రావట్లేదని మాలోకొందరం ఫిర్యాదుచేసేవాళ్ళం  స్వామీజీ నవ్వుతూ అనేవారు, "ఏం ఊహించారు మీరు ? ఓ వెయ్యి మంది వచ్చి మీరు చెప్పేది వింటార నుకున్నారా?" అని. మా ఉపన్యాసా లకు ఆయన ప్రారంభోత్సవం చేస్తే ఎక్కువమంది వచ్చే అవకాశం ఉంది కనుక, ఆయనను రమ్మని ప్రార్థించే వాళ్ళం. కాని, దానికి అంగీకరించే వారు కాదు ; మా కాళ్ళమీద మేం నిలబడాల్సిందేననేవారు. ఆయన మొదటిసారి యజ్ఞంచేసినపుడు శ్రోతలు 900 వరకూ ఎలా పెరిగారో ఆలోచించినప్పుడు, ఈపనిలో దేవు ని ప్రమేయం ఉందనిపిస్తుంది. వందలకొద్దీ చిన్మయమిషన్ సభ్యు లు మాకు నిర్వహణతోనూ, ప్రకటన లతోనూ సహకరిస్తున్నా, మేం చెప్పే ది వినటానికి చాలా తక్కువమందే వస్తున్నారు. కలకత్తాలో నాప్రసంగా నికి పదిమంది వచ్చినా సంతోషించాల్సిందే. 
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺

No comments:

Post a Comment