Sunday, September 28, 2025

 🙏🕉️ హరిఃఓం  🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(230వ రోజు):--
        స్వామీజీ ఆదర్శాల ప్రకారం జీవించాలని ప్రయత్నించిన సాందీపని విద్యార్థినీ విద్యార్థులకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. బహుశా ఆశ్రమవాతావరణంలో నిర్బంధంగా అమలుచేసిన క్రమ శిక్షణ బాగా అలవాటై, అటువంటి ఆధారమే తదుపరి ఆధ్యాత్మికసాధ నకు కూడా వారికి కావలసివచ్చిందే మో ; లేదా, సంరక్షించే వారుండటం చాలా అలవాటై, ఇప్పుడు ఆ సంరక్ష ణను చిన్మయమిషన్ సభ్యులనుంచి కోరుకుంటున్నారేమో. వారిలో ఎవ రూ ఇంతకుముందు స్వతంత్రంగా జీవించలేదు. ఆశ్రమంనుంచీ, తమ కుటుంబంనుంచీ కూడా విడివడటం కొందరి సామర్థ్యానికి పెద్ద పరీక్షగా పరిణమించింది. తరుచూ ఫిర్యాదు లు వస్తూండేవి; కాని, స్వామీజీ బ్రహ్మచారులను తన సంతానంగా భావించి, ఎప్పుడూ వారి పక్షానే ఉండేవారు. ఒక పట్టణంలో బోధిస్తు న్న బ్రహ్మచారి తన బోధనలకు తగి నట్లుగా జీవించటంలేదని ఒక మిషన్ సభ్యుని అభియోగం. "అది నిజమే, అతను అలా జీవించకపోవ టం సహజమే!" స్వామీజీ బదులి చ్చారు, "ఎవ్వరూ అలా నడుచుకోలే రు తెలుసా! మనమందరం లక్ష్యం గా పెట్టుకున్న గమ్యాన్నే అతడు బోధి స్తున్నాడు. వీళ్ళను మెరుగుపరచ డానికే బయటి ప్రపంచంలోకి పంపా న్నేను; వాళ్ళు నేర్చుకుంటున్నారు ; ఇంకా పిన్నవయసే వాళ్ళది. మీరు పెద్దవారూ, అనుభవజ్ఞులూ కదా, మీరైనావారికి ఉదాహరణగా నిలువ గలుగుతున్నారా ?" 
       సాందీపనిలో శిక్షణ పూర్తిచేశాక చిన్మయమిషన్ కోసం పనిచేయటం లేదనీ, వేరేపని చేపట్టారనీ మరొకరి పై ఫిర్యాదు వచ్చింది. ఈపరిస్థితిని గమనించినస్వామీజీచిన్మయమిషన్  తో పనిచేయకపోయినా అట్టివారు తాము చేపట్టిన కార్యక్రమాల్లో సఫలీ కృతులౌతున్నారని గ్రహించారు. "మనసంస్థకే అంటిపెట్టుకొని ఉండా  లనే నియమమేదీ లేదు. జీవితాన్ని ఎదుర్కోటానికి కావలసిన వివేకాన్నీ, ధైర్యాన్నీ వారికీయటమే మన ఉద్దేశం; అది ఆధ్యాత్మిక విషయాల్లో నైనా సరే, వ్యావహారిక విషయాల్లో నైనా సరే. వ్యక్తి తనను పవిత్రంచేసు కోటానికి ఉన్న అవకాశాల్లో చిన్మయ మిషన్ ఒకటి. దానికి బదులు వేరే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పే మీ లేదు" అనిస్వామీజీ వివరించారు. 
     మరొకరు బ్రహ్మచారుల పని ఎలా సాగుతోందని అడుగుతూ, తనకు వారిగురించి మంచిమాటలేవీ విన బడటం లేదని వ్రాశారు. స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు:
       అందరూ బాగానే చేస్తున్నారు. అందరూ బాగుపడుతున్నారు; ఒక్కొ క్కరూ వికాసానికి ఒక్కొక్కదశలో ఉన్నారు. అహాన్ని వర్జించడానికి కొందరికి ఎక్కువకాలం పడుతుంది. అట్టివారు అంతరంగంలోనే ఉన్న బంధాలలోనూ, సంకోచాలలోనూ కొంతకాలంపాటు చిక్కుకొని ఉంటా రు. కొందరు మాత్రం తమ అహాన్ని త్వరగా భగవంతునికి అప్పగించి కనులుమిరుమిట్లు గొలిపే తేజస్సుతో ప్రకాశిస్తారు. కాని, తమకు చేకూరిన విజయంతోపాటు మళ్ళీ అహం మరొకరూపంలో వారిచెంతచేరే అవ కాశం ఉంది. దానిని విడగొట్టడానికి మన సహాయం అవసరమౌతుంది, బహుశా కొన్నేళ్లపాటు. 
        ప్రాచీనకాలపు ఋషులు చెప్పి నట్లు శిష్యులు మూడు విధాలుగా ఉంటారు. 1) వేదాంతశాస్త్ర జ్ఞానాన్ని సామర్థ్యంతోనూ, మంచి వాక్పటుత్వంతోనూ ఇతరులకు అందించేవారు, 2) సంస్థకుచెందిన వివిధాకార్యక్రమాలను అమలుచేసే వారు, 3) ఏమీ చెయ్యలేని బియ్యం మూటలు, గుడ్డలు తగిలించే కొక్కా లు.మనక్కూడా ఈమూడవ తరగతి కి చెందినవారు కొందరున్నారు. ప్రపంచంలోని అన్ని సంస్థల్లోనూ అటువంటివారుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థల్లోనూ, మతసంస్థ ల్లోనూ అది తరుచూ జరుగుతుంద ని నేను ఒప్పుకొనితీరాలి. దాన్ని తప్పించుకోలేం. అటువంటి కలుపు మొక్కలను పెరికిపారవేయాలి ; వీలై నంతవరకూ సంస్థలో అటువంటివా రు లేకుండా చూసుకోవాలి.
        🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment