. *39వ సర్గ 2 వ భాగం*
*꧁❀❀━❀🐿️🌏🐿️❀━❀❀꧂*
*సీతా! ఇది సామాన్యంగా ఉండే లోకం తీరు. వాళ్ళల్లో పతివ్రతలైన వాళ్ళుకూడా కొందరుంటారు. వాళ్ళంతా సత్యవ్రతులై ఉంటారు. సదాచారాలను ఎన్నటికీ వదలరు. పెద్దల పట్ల వినయవిధేయతలతో మెలగుతారు. వాళ్ళు భర్తనే ఆరాధ్యదైవంగా భావిస్తారు. భర్తే వాళ్ళకు సర్వస్వం. భర్తకన్నా అధికుడు లోకంలో వాళ్ళకు కనిపించడు. భర్తనే దైవంగా భావిస్తారు.*
*తల్లీ! ఓ సీతా! నా కుమారుడు దరిద్రుడు అయినా, ధనవంతుడు అయినా నీకు భర్త. నీకు సర్వస్వం నీ భర్తే. ధనమంతా పోయింది, అడవుల పాలయ్యాడని నీవు వాణ్ణి అలక్ష్యంగా చూడవద్దు. అతణ్ణి దేవతమల్లే చూసుకోవాలి. నువ్వు ఎప్పుడూ రాముణ్ణే అనుసరించి ఉండు.*
*సీత: అత్తా! పూజ్యురాలా! నీకు నమస్కరించి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీవు ఆజ్ఞాపించినల్లే నడచుకొంటాను. భర్త విషయంలో ఎట్లా ప్రవర్తించాలో నా తల్లితండ్రులు నాకు నేర్చి* *పంపించారు. అత్తా! చంద్రుణ్ణి వెన్నెల ఎన్నడూ వదలిపెట్టని విధంగా, నెనూ ధర్మాన్ని విడువను. నా భర్త ఉన్న చోటనే నేనూ ఉంటాను. తీగలు లేకుండా వీణ మోగదు. చక్రాలు లేకుండా రథం నడువదు. అట్లాగే వెయ్యిమంది కొడుకులున్నా భర్తలేని స్త్రీ సుఖపడలేదు. ఆడపిల్లలకు తల్లితండ్రులు ఏది ఇచ్చినా అది మితంగానే ఉంటుంది. కానీ భర్త మాత్రం తన భార్యకు అపరిమితంగా ఇస్తాడు. అందువల్ల భర్తను పూజించకుండా ఎట్లా ఉండగలను? నేను మహాపతివ్రతలైన వారివల్ల అనేక విషయాలు విన్నాను. నేనూ వారి అడుగు జాడల్లోనే నడచుకుంటాను. నా భర్తను ఎన్నటికీ అలక్ష్యం చెయ్యను. ఆయనే నాకు దేవుడు, సర్వస్వమూ.*
*సీతమ్మ పలుకులకు కౌసల్యాదేవి పులకించిపోయింది. రాముడు తల్లి కౌసల్యాదేవికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు.*
*రాముడు: అమ్మా! నువ్వు దుఃఖీంచవద్దు. తండ్రికి జాగ్రత్తగా సేవలు చెయ్యి. కళ్ళుమూసి కళ్ళుతెరిచే లోపల నా వనవాసం పూర్తి అయిపోతుంది. వనవాసం పూర్తిచేసుకొని నీ పాదాలపై వాలతాను. (మిగిలిన తల్లులతో) ఓ తల్లులారా! మీ దగ్గర చనువు వల్లగాని అజ్ఞానం చేతగాని, మీకు ఏమైనా కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించండి. తల్లులారా! ఈ రోజు మిమ్మల్నందరినీ వదలి అడవులకు పోతున్నాను. రాముడు ఆ విధంగా వారి వద్ద వీడ్కోలు పలుకుతూ ఉంటే వాళ్ళంతా ఘౌల్లున ఏడ్చారు.*
*┈┉┅━❀꧁హరే రామ్꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁
No comments:
Post a Comment