True Love Philosophy || Telugu Yahoo #truelove
https://youtube.com/shorts/ovVfTcTs4Kw?si=Ao__LoZ9Ky-osYBb
ప్రేమ అంటే మనం అంతగా గొప్పగా చెప్పుకునే విషయం ఏమి కాదు నిజంగా ప్రేమ ఉంది అని అడిగితే చాలా మందికి ఉన్నది ప్రేమ కాదని నా ఒపీనియన్ వాళ్ళు ప్రేమ అనుకుంటున్నది వేరే ఏదో కొన్నిసార్లు ఒంటరితనం ఉంటే ప్రేమ అనే మాయ దాటి వచ్చేస్తుంది. కొన్నిసార్లు భయం, లోపం, అలవాటు కూడా ప్రేమలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇలా అంటుంది. అతడు నా మీద ప్రేమగా ఉన్నాడు అందుకే నా ఫోన్లు ఎప్పుడూ మిస్ అవ్వడు అని. నిజంగా అది ప్రేమేనా లేదా అలవాటా లేదా కంట్రోల్ చేయాలని ఫీలింగా సో మనం ప్రేమ పేరుతో ఎవరి మీదైనా ఒక హక్కు వేసుకుంటే అది ప్రేమ అవ్వదు. ప్రేమల హక్కు కూడా ఉండదు. ప్రేమ అంటే నువ్వు నాకోసం బ్రతకాలి అన్న ఫీలింగ్ కూడా కాదు నిజమైన ప్రేమ అంటే నువ్వు ఎక్కడున్నా నీకు మంచి జరగాలి అన్న భావన ఉండాలి. ప్రేమలో భయం ఉండకూడదు అసూయ ఉండకూడదు ఒత్తిడి అసలే ఉండకూడదు. అలాంటివి ఉన్నాయంటే అది ప్రేమే కాదన్నమాట. నిజమైన ప్రేమ ఓ పక్షిలా ఉంటుంది. బంధించకుండా ఎగిరిపోతే కూడా దానికోసం మనసులో నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాం. అది నిజమైన ప్రేమ. మనకు చిన్నప్పటి నుంచి సినిమాలు పాటలు పెద్దల మాటలు ప్రేమ గురించి తప్పుడు భావనలు నింపేసాయి. ప్రేమ అంటే తప్పకుండా ఒకరిపై ఒకరు పడిపోవడం అనుకున్నాం. కానీ ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే మనలో ఉండే ఒక మౌన స్థితి ఎవరినైనా బాధ లేకుండా చూస్తూ వాళ్ళ స్వేచ్ఛకు మనం జై కొడుతూ ఉండటం.
No comments:
Post a Comment