*రామునికై రథాన్ని ఏర్పాటు చేయడం*
*꧁❀❀━❀🧜♂️🌏🧜♀️❀━❀❀꧂*
*నారబట్టలు ధరించి మునివేషంలో ఉన్న రాముణ్ణి, దశరథుడు చూశాడు. దుఃఖంతో వాళ్ళ కడుపులన్నీ తరుక్కుపోయాయి. దశరథుడు రాముడి ముఖంలో ముఖంపెట్టి చూడలేక నేలచూపులు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు.*
*"పూర్వం నేను ఎందరో పిల్లల్ని, తల్లితండ్రుల నుండి వేరుచేసి ఉంటాను, లేదా చంపి ఉంటాను. అందువల్లనే నేడు ఇంత దుఃఖం అనుభవిస్తున్నాను. కాలం చెల్లకపోతే మరణం కూడా దగ్గరకు రాదు. అందువల్లనే కైకేయి చేత పీడించబడుతున్నాను. అగ్నిలా ప్రకాశవంతంగా ఉండే రాముడు పట్టువస్తాలన్నీ వదలివేసి మునులు ధరించే నారచీరలు కట్టుకొని ఎదురుగా నిలబడి ఉంటే చూడాల్సిన దుర్గతి పట్టింది. ఇంత అనుభవం అయినా, మరణానికి కూడా నాపై దయకలగటం లేదు. కైకేయి తన స్వార్థం కోసం నన్ను వంచన చేసింది. ఇంతమంది మహామహుల్నీ దుః ఖసముద్రంలో ముంచింది” అంటూ దశరథమహారాజు లోలోపలే విలపించసాగాడు.*
*దశరథుడు: సుమంత్రా! సత్పురుషుడు, వీరుడు అయిన కుమారుణ్ణి తల్లిదండ్రులే అడవులకు పంపుతున్నారు. గుణవంతులైన వారి మంచి నడవడికకు లభించే ప్రతిఫలం ఇంతేనా? ఇదేనా సుగుణాలకు కలిగే ఫలం! నువ్వు వెళ్ళి విలాసానికి, విహారాలకు వెళ్ళే రథాన్ని ఒకదానిని పూన్చి పట్టుకొనిరా. ఆ మహానుభావుణ్ణి అందులో ఎక్కించుకొని దేశానికి దూరంగా ఉండే వనాల్లో వదిలిరా. రాజాజ్జను శిరసావహించి సుమంత్రుడు వెళ్ళి చక్కగా అలంకరించిన రథాన్ని తీసుకొని వచ్చాడు. రామునికి నమస్కరించి ఇలా అన్నాడు.*
*సుమంత్రుడు: రామా! బంగారంతో తాపడం చేయబడి ఉత్తమమైన అశ్వాలను పూన్చిన రథం సిద్ధంగా ఉంది. అప్పుడు దశరథ మహారాజు కోశాధ్యక్షుణ్ణి పిలిపించి, పద్నాలుగు సంవత్సరాలకు సరిపోయే విలువైన వస్తాలను, అలంకారాలను సీతకోసం తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు వెంటనే ఆ వస్తువులన్నీ సమకూర్చి సీతకిచ్చాడు. సీత వాటన్నింటినీ చక్కగా అలంకరించుకొంది. అంతటి కష్టంలో కూడా ముఖంలో ఏమాత్రమూ దైన్యంలేని సీతను కౌసల్యాదేవి కౌగలించుకొంది.*
*కౌసల్యాదేవి: సీతా! లోకంలో స్త్రీలు తమకు కావలసినవన్నీ సమకూర్చి సంతోషపెట్టేంతవరకు భర్తలను గౌరవిస్తారు. భర్తకు కష్టకాలం రాగానే అంతవరకూ చేసిన మంచినంతా మరచిపోతారు. భర్తను లెక్క చేయరు. ఏ కొంచెం ఆపదవచ్చినా, లేక దరిద్రం వాటిల్లినా వాళ్ళకు చెడుబుద్దులు పుట్టుకొస్తాయి. భర్తలను చీదరించుకుంటారు. లేక వదలి వేస్తారు. సామాన్యంగా వాళ్ళు భర్తతో అబద్దాలాడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలనే పెద్దవిగాచేసి పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కులం, గౌరవాలతో పని ఉండదు. చేసిన మేలు అంతా మరచిపోతారు. లోకమర్యాద పాటించరు. వాళ్ళు చదువుకున్న చదువు ఎందుకూ కొరగాకుండా పోతుంది. అయ్యో! అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నామే, భర్తకు చేదోడువాదోడుగా ఉందామనే జ్ఞానమే ఉండదు. వాళ్ళిప్పుడూ చంచల మనస్కులై ఉంటారు. వికృతంగా ప్రవర్తిస్తారు. అటువంటి స్త్రీని నమ్మలేము.*
{ఇంకా ఉంది}
*┈┉┅━❀꧁హరే రామ్꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment