Friday, September 26, 2025

 *విష్ణుశక్తి మహాలక్ష్మి.....*

*ఏకదేశస్థితస్యాగ్నేః జ్యోత్స్నా విస్తారిణీయథాI*
*పరస్య బ్రహ్మణోశక్తిః తథేదమఖిలం జగత్॥*

*ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ప్రకాశం చాలా దూరం వరకు ప్రసరిస్తున్నట్టే పరమాత్మ శక్తి సకల ప్రపంచంలో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోక భావం. ఇలా పరమాత్మకు ఉండే అనంత శక్తులలో ఒకటైన అహంతాశక్తియే ‘మహాలక్ష్మి'గా వ్యవహరించబడుతుంది.*

*త్రిమూర్తుల శక్తిని ఇతిహాసపురాణాలు మూడు విధాలుగా అభివర్ణిస్తున్నాయి. వాటి ఆధారంగా శ్రీమహావిష్ణువుకు ఉండే శక్తిని మహాలక్ష్మిగాను, శంకరునిలోని శక్తిని మహాకాళిగా, బ్రహ్మలోని శక్తిని మహా సరస్వతిగా వ్యవహరిస్తున్నాం. శ్రీమహావిష్ణువు రక్షించేవాడు, రుద్రుడు సంహరించేవాడు. బ్రహ్మ సృష్టించేవాడు. పరమాత్మ ఎలాగైతే ఒక్కడో అలాగే పరమాత్మలో ఉండే శక్తి కూడా ఒక్కటే. గుణాలు, పనులను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ మూడు శక్తులలో విశిష్టమైనది* *విష్ణుశక్తే.*

*ఏకదేశస్థితస్యాగ్నేః జ్యోత్స్నా విస్తారిణీ యథాI*
*పరస్య బ్రహ్మణోశక్తిః తథేదమఖిలం జగత్॥*

*ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ప్రకాశం చాలా దూరం వరకు ప్రసరిస్తున్నట్టే పరమాత్మ శక్తి సకల ప్రపంచంలో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోక భావం. ఇలా పరమాత్మకు ఉండే అనంత శక్తులలో ఒకటైన అహంతాశక్తియే 'మహాలక్ష్మి'గా వ్యవహరించబడుతుంది.*

*తస్య యా పరమా శక్తి: జ్యోత్స్యే వ హిమ దీధతేః సర్వావస్థాగతా దేవీ స్వాత్మభూతానపాయినీ అహన్తా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతనీ అని లక్ష్మీతంత్రములో ఇంద్రునికి, చంద్రునికి వెన్నెల వలె తాను ఆ శ్రీమన్నారాయణునికి పరమశక్తినని, సకలావస్థలలో విడిచి ఉండని దానినని లక్ష్మీదేవి పేర్కొంది. తానే అహంతాశక్తినని సనాతన శక్తినని ఈ శక్తియే నారాయణి అని కూడా తెలిపింది.*

*విత్యనిర్దోషనిస్సీమ* *కల్యాణగుణశాలినీ*
*అహం నారాయణీ నామ సాసత్తా వైష్ణవీమాతా*

*ఈవిధంగా నారాయణుని శక్తియే నారాయణిగాను, వైష్ణవిగాను, మహాలక్ష్మిగాను వ్యవహరించబడుతుంది. ఈ మహాలక్ష్మి స్వయంగా పరమాత్మకు విశేషణమై, ధర్మమై అనేక గుణాలు, ధర్మాలు, శక్తి, శక్తిమలు కలదని గ్రహించాలి. విష్ణుశక్తిగా చెప్పబడిన అహంతా శక్తియే ఆదిలక్ష్మి, అందులోనివే ఆ పరాశక్తి, విద్యాశక్తి అని స్పష్టపరచబడింది.*

*పరమాత్మగా చెప్పబడే శ్రీమన్నారాయణునికి అన్నివేళలా అన్ని కార్యాలను సమకూర్చేది శక్తే. ఈ జగత్తునంతా ఆమె లక్షిస్తుంది. అనగా చూస్తుంది. కటాక్షిస్తుంది, లక్ష్యంగా చేసుకుంటుంది కావున లక్ష్మీ అయింది. శ్రీమహావిష్ణువు భావాన్ని ఆశ్రయించేది అయినందున 'శ్రీ' అని వ్యవహరిస్తారు. అందరికీ కోరికలను తీరుస్తుంది కనుక 'కమల' అయింది. అలాగే పద్మ, పద్మమాలిని అని కూడా లక్ష్మిని వ్యవహరిస్తారు. పరమాత్మ సృష్టిలో ఉన్న తార తమ్యాలకు అమ్మవారి కనుబొమల కదలికే కారణం. కనుబొమలు ఎగురవేసినట్లయితే దేవతలుగాను, తక్కువగా ఎగురవేస్తే మానవులుగాను, కిందకి చేసినట్లయితే దానవులగాను, అసలు కదల్చకుంటే పశువులుగాను పరమాత్మ సృష్టిస్తాడు. స్వామి రక్షణలో అమ్మ పురుషకార రూపంగా, సంహారంలో మహాకాళిగా సహకరిస్తుంది. పరమాత్మ మోక్షం ఇచ్చేటట్లు చేసేది పురుషకార రూపం. జీవుల కర్మలను లక్ష్యంగా చేసుకొని సృష్టికార్యంలో సహకరిస్తుంది కనుక అమ్మ శ్రీమహా లక్ష్మిగా, రక్షణలో శ్రీదేవిగా పేర్కొన బడుతుంది. అమ్మ దయ లేనిదే స్వామి అను గ్రహం పొందలేము. అమ్మవారి చూపులు, స్పర్శ అమృతం చిలకరి స్తాయి, అందువల్ల లక్ష్మీదేవిని అమృత దృక్, అమృతా అని కూడా వ్యవహరిస్తారు.*

*┈┉━❀꧁మాత్రేనమః ꧂❀━┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🚩🦚 🙏🕉️🙏 🦚🚩🦚

No comments:

Post a Comment