*🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🌺🙏🏻*
🌷Message of the day
*_🌴 పంటకు అవసరమయ్యే వర్షం కురిసే ముందు పెద్ద గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులు తో భయంకరంగా ఉంటుంది. కానీ కొద్ది సమయం పోయాక నిశ్శబ్దంగా విస్తారమైన వర్షం కురుస్తుంది.
అలానే భగవంతుడు తన అనుగ్రహం చూపే ముందు బలంగానే పరీక్ష పెడతాడు. కావాలనే మనకు కోపం తెప్పించే, విసుగు పుట్టించే, ఇబ్బంది కలిగించే పరిస్థితులను కల్పిస్తాడు..
ఇవి పట్టుమని పది నిమిషాలు కూడా ఉండవు. కానీ ఆ సమయములోనే మన పరీక్ష పూర్తి అయిపోయి ఫలితాలు తెలిసిపోతాయి! సహనముతో ఉండాలి. భయము గానీ, విసుగు గానీ చెందకూడదు.
భగవంతుడు ఆడే నాటకం ఇది అని గ్రహించి మౌనంగా ఉండాలి. మన ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి కనుక " వీడు లొంగడు రా బాబూ!" అనుకుని ఆయనే ఆ పరిస్థితుల్ని చెల్లా చెదురు చేసేస్తాడు.
తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక నిత్యం స్పృహతో ఉండండి!.🌴_*
కొండూరు సుజాత యశస్వి సనాతన
No comments:
Post a Comment