Friday, April 3, 2020

శాకాహార జగత్తు గురించి నాడు నేడు ఒకే మాట

శాకాహార జగత్తు గురించి నాడు నేడు ఒకే మాట

మీకొ వింత విషయం తెలియచేస్తాం.... మీరు నమ్మరు ఈ విషయాలను.. కాని ఇవన్నీనిజాలే. " అన్ని మతాలూ మానవులకు మంసాహారాన్ని నిషేధించాయి."

ప్రపంచంలోని అన్ని గ్రంథాలు ప్రతిజీవి లోను భగవంతుని ప్రతిరూపాన్ని వీక్షించమనీ, అహింస పరమోత్తమైనదని ఉద్భోదించాయి. సర్వ మతాలు అమయక జీవులకు హాని కలిగించడం మరియు చంపడం లాంటివి నిషేధించాయి.
హిందూ మతం:—

భగవద్గీతలో శ్రీకృష్ణుదు 6-32 శ్లోకంలో
"ఓ అర్జునా! ఎవడు సమస్త భూతముల ( ప్రాణుల) యొక్క సుఖ దుఖాలు, తన సుఖ దుఖాలుగా చూస్తాడో అట్టివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. "

భీష్మ:—
"మాంసం తినేవారు, మాంసాన్ని విక్రయించేవారు, మరియు మాంసం కోసం జంతువులను వధించేవారు పాపాత్ములు. "

వీరబ్రహ్మేంద్రస్వామి:—

" జీవులను వధించి జీవికి వేసినా
జీవ దోషములను జిక్కువడును;
జీవహింస చేత చిక్కునా మోక్షంబు !"

ఇస్లాం మతం:—

" భగవంతుడు మీరు సమర్పించే మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. ఆయన పట్ల మీ విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటాడు " - ఖురాన్ 22:37
ఇస్లాం యొక్క సమస్త సూఫి యోగులు సద్గుణవంతులుగా జీవించడం, త్యాగ నిరతితో మరియు కరుణాంత రంగంతో జీవించడం, సాధారణ ఆహారం భుజించడం మరియు మాంసం వదలటం ప్రముఖంగా పేర్కొన్నారు. వారు స్వయంగా మాంసాన్ని త్యజించారు.
షేక్ ఇస్మాయిల్, ఖాజా మొయినుద్దీన్ చిస్తీ, హజ్రత్ నిజాబుద్దీన్ ఔలియా, ఖలందర్, షా ఇనాయత్, మీర్ దాద్, షా అబ్దుల్ కరీం మున్నగు సూఫీ భక్తులు ధర్మబద్ధంగా జీ వించతం, సకల జనులపై ప్రేమ మరియు ఆదరణ, మరియు శాకాహారం గురించి చెప్పారు.

కబీర్ :—

" ఉపవాసాన్ని ( రోజా ) పాటించే ఉపాసకుడు మాంసం రుచిని ఆస్వాదించేందుకు, జీవుల్ని వధిస్తే, అతని ఉపవాస వ్రతం నిష్ప్రయోజనమవుతుంది, అల్లా ఈ ప్రవర్తనను అంగీకరించడు. "

క్రైస్తవ మతం:—

చంపబడిన జంతువుల మాంసం శరీరంలో ఉంటే ఆ శరీరం సమాధి లాంటిది. ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమనే చంపుకుంటున్నారు. చంపబడిన వాటి మాంసం తినేవారు మృ త శరీరాలను తింటున్నట్లే
" ఏ జీవినీ చంపే హక్కు ఎవరికీ లేదు " - జీసస్ క్రైస్ట్

జీసస్ కు సన్నిహిత శిష్యుడైన సెయింట్ మాథ్యు మాంసాహారాన్ని ఆధ్యాత్మిక పతనాననికి సూచనగా భావించేవారు. వారు మాంసం తినేవారు కాదు.

ఇక
జైన మతం మరి బౌద్ధ మతాల్లొ మాంసాహారాన్ని భుజించడమన్న ప్రసక్తేలేదు.

ఇక చివరిగా కొందరు మహాత్ముల అభిప్రాయాలను చూద్దాం:

"సాత్విక ఆహారమే మనిషికి సరి అయినది " - రమణమహర్షి, చాణక్య, తిరువల్లువార్

"మానవుడు ఎలాంటి పరిస్థితిల్లోనూ మాంసం తినడం సరికాదు. మనం పశువుల కన్నా ఉన్నతులం, మాంసం తిని నిమ్న శ్రేణికి చెందిన జీవుల వలె ప్రవర్తించడం మనకు యుక్తంకాదు" - మహాత్మాగాంధీ

"జంతువుల పట్ల క్రూరత్వం చూపటం మూర్ఖత్వమే కాక పరమాత్మను అవమానిచడమే అవుతుంది. మాంసం భుజించదం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది " - స్వామి దయానంద, రజనీష్.

" ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు ఉంటాయి " - జార్జి బెర్నాడ్ షా

" మన కడుపేమీ ' స్మశానం' కాదు, జంతుకళేబరాలను దాచుకోవడానికి ! " - జార్జి బెర్నాడ్ షా

" పక్షులను చంపి వండుకుని తినేవాడు వసుధ చండాలుడు " ! యోగి వేమన, స్వామి దయానంద
ఇల ఎంతోమంది మహానుభావులు శాకాహారముగురుంచి ఇలా తెలియపరిచారు . వీటి గురించి తెలుసుకోవాలి అంటే వారి పుస్తాకాలు చదివి నట్లైతే వారి మనో భావాలు ఇంకా వివరంగ తెలుసుకోవచ్టు.
శాకాహారజగత్ కి జై
జైజై శాకాహారజగత్
జై పత్రీజీ ! జై ధ్యాన జగత్ !

No comments:

Post a Comment