భగవంతుడు నవ్వుతాడు!
భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యంచేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీ అబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను“ అన్నప్పుడు.
మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని “ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటువైపు వున్నది నా తమ్మునిది.” అన్నప్పుడు.
వీడి తండ్రి, తాత, ఇదే మాట అన్నారు పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు. రేపు వీడూ పోతాడు. అయినా “ఇది నాది” అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట.
నిజమే...ఏదీ శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇళ్ళు, భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవీ మనవెంట రావు.
ఈ విషయం మనకందరికీ తెలుసు. అయినా “నాది, నావి “ అనే మాయలోనే ఉండిపోతున్నాము. ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళునిద్రపోవడం ఎన్నాళ్ళిలా? ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. తాగిందే తాగుతున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం.
అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు. ఏమాత్రం అర్ధంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.
ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా మనకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం?
డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి అని.
ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.!
ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి.
ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను' అన్న ఎరుక కలిగిననాడు ఆత్మజ్ఞానం మనలో వుద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం, దాని తరువాత భక్తి , భక్తికి పరాకాష్ట భగవంతుని దర్శనభాగ్యం, చివరిగా ముక్తి.
ముక్తి పొందడానికే దైవం మనకు మానవజన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తరవాత సాధన చెయ్యాలి.
మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు మన మనస్సులోనే ఉంది.
మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు-
"అనాయాసేన మరణం - బాధలేని సుఖమరణం
వినా దైన్యేన జీవనం - ఒకరిపై ఆధారపడని జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం - పోయేముందు నీ దర్శనం
దేహిమాం పరమేశ్వర - ప్రసాదించు పరమాత్మా! "
అని కోరుకోవాలి..
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment