Monday, June 7, 2021

భోజనము చేసాక ఏమి చేయకూడదు ?

భోజనము చేసాక ఏమి చేయకూడదు ?
భోజనము అయ్యాక చేయకూడని ఏడు ప్రమాదకర చర్యలు

1 . భోజనము చేయగానే నడక వద్దు :: తినగానే వంద అడుగులు నడుస్తే 99 ఏండ్లు జీవిస్తారు అని నానుడి, కాని అది నిజమా ? నిజము ఏమిటంటే జీర్ణక్రియ (ప్రక్రియ) లో మనము తిన్న ఆహారములోని పోషకాలను మన నడకతో ప్రతికూల చర్య వలన శరీరము గ్రహించలేకపోతుంది,

2 . భోంచేయగానే పడుకోవడము వద్దు :: ఆంగ్లం లో ఒకసారి చదివాను After lunch sleep a while-After suppers walk a mile అని, కాని భోంచేయగానే పడుకోవడము వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగదు,ఇందువలన జీర్ణకోశ వ్యాధులు ( గ్యాస్ట్రిక్‌ మరియు ఉదరకోశ సమస్యలు) ఏర్పడుతుంది కాబట్టి కొద్ది సమయం తర్వాత పడుకోవాలి,

3 . భోంచేయగానే పళ్లు తినవద్దు :: భోజనం చేయగానే పళ్లు తినటం వల్ల కడుపు ఉబ్బరం ఔతుంది ! కాబట్టి పళ్లను భోజనానికి గంట ముందు లేదా ఒకటిరెండు గంటల తర్వాత నైనా తినొచ్చు,

4 . టీ త్రాగరాదు :: ఛాయ్‌పత్తా (Tea leaves 🍃)లో ఆమ్ల గుణాలు ఎక్కువ కావున మనం తిన్న ఫ్రొటీన్‌ కలిగిన ఆహారము ఆమ్లాలతో చర్య జరిగి జీర్ణక్రియలో సమస్యలు రావచ్చును/వచ్చును ,

5 . నడుము బెల్టు వదులు చేయరాదు :: తినంగనే నడుము బెల్టు వదులు చేయటం కారణంగా తిన్న ఆహారం సులువుగా ఒక్కసారిగా క్రిందకు జాఱి ప్రేగులు మడతబడటం లేదా మూసుకొని పోవడం కావచ్చు/ సంభవిస్తుంది ,

6 . స్నానము చేయరాదు :: భోజనము తర్వాత స్నానం చేయటం వల్ల శరీరానికి, కాళ్లకు చేతులకు అధిక రక్త ప్రసరణ జరుగుతుంది, అందువల్ల కడుపుకు తక్కువ రక్తప్రసరణ జరగడం వలన జీర్ణక్రియ మందంగా జరుగుతుంది/జీర్ణకోశ వ్యాధి బారిన పడవచ్చును,

7. పొగ త్రాగరాదు :: వైద్య నిపుణుల సలహాలే కాకుండా వైద్య నిపుణుల ప్రయోగాలలో కూడ గమనించినది ఏమిటంటే భోజనము చేసిన తర్వాత పొగత్రాగడం వల్ల కాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఋజువైనది,

( తెలిసినవి, పెద్దలు చెప్పినవి, చదివినవి , సేకరించినవి క్రోఢీకరించి రాసినది)

Source - Whatsapp Message

No comments:

Post a Comment