Monday, June 7, 2021

తేనె ఎన్ని రోజులైన చెడిపోదు, కారణం?

తేనె ఎన్ని రోజులైన చెడిపోదు అని నేను చదివాను.దానికి కారణం తెలియజేయగలరు?
స్వచ్ఛమైన తేనే గాలి సోకని డబ్బాలో ఉంచితే ఎన్నిరోజుల అయినా చెడిపోదు.

ముఖ్య కారణాలు:

1. తేనే గాలిలో వున్న తేమను ఆకర్షిస్తుంది. బాక్టీరియా తేనే ని తగిలినపుడు దానిలోవున్న తేమను బలవంతంగా బయటకు తెస్తుంది అందువలన బాక్టీరియా అద్దమువలె పగిలి చనిపోతుంది. మనం వాడే ఆల్కహాల్ sanitzers కూడా ఈ సూత్రము ద్వారానే పనిచేస్తుంది.

2. తేనె ఆసిడ్ లాగా ఉంటుంది (ప్ హెచ్ 3. 26 --4.48). చాలా రకాల బాక్టీరియా లు అందులో బతకలేవు .

ఐతేయ్ ఇలాంటిస్వభావం కలిగిన పదార్దాలు చాలా వున్నాయి కానీ తేనె మాత్రమే పాడవదు

3. పువ్వు యొక్క మకరందం నుండి ఫీనోలిక్ ఆసిడ్స్ తేనెటీగల ద్వారా తేనెలోకి వస్తాయి. అవి మైక్రోబ్స్, ఫంగస్ ని నాశనం చేస్తుంది

4. తేనెలో వున్న emzymes వలన కొంచం hydrogenperoxide ఉత్పత్తి అవుతుంది

ఈ కారణాలవలన బాక్టీరియా, ఫంగస్ లాంటివి తేనె లో బతకలేవు, అందువలన తేనె చెడిపోదు. ఈ కారణాలవలన తేనె ని గాయలమీద, పుండ్లమీద natural ఆయింట్మెంట్ లాగా వాడుతారు

ఐతేయ్ మార్కెట్లో వున్న కొన్ని కంపెనీస్ తేనెని వేడిచేసి, ఇండస్ట్రియల్ ప్రాసెస్ చేయటంవల్ల అది సహజ స్వభావం కోల్పోయి పాడవుతుంది. ఇలాంటి తేనె వలన ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం ఉండదు.

తేనెటీగలు seal చేసిన పచ్చి తేనె చెడిపోదు ఆరోగ్యానికి ఉపయోగం. నమ్మకమైన రైతు ద్వారా తేనె కొనండి. మీకు రైతులు అందుబాటులో లేకపోతె నాకు మెసేజ్ పంపండి(9392009104).

ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి

Source - Whatsapp Message

No comments:

Post a Comment