Sunday, June 6, 2021

ఆలోచనే ఆయుధం

🌸ఆలోచనే ఆయుధం🌸

మనిషి ఆలోచనా జీవి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు నిద్రలోనూ
వదిలిపెట్టవు. రోజూ మనకు అరవైవేల ఆలోచనలు వస్తుంటాయి. అందులో తొంభైశాతం
నెగెటివ్‌ ఆలోచనలే. చాలా సందర్భాల్లో, ఒకే ఆలోచన పదేపదే బుర్రను తొలిచేస్తూ
ఉంటుంది. ఒక్కటీ పనికొచ్చేది ఉండదు. మన మనసుకు ఓ పరిమితి ఉంది. ఒకసారి ఒక
విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచనా గాలివాటంగా వచ్చేదే
ఎందుక్కావాలి? మనం ఎంచుకున్నదే కావచ్చుగా! మనం ఏం ఆలోచించాలన్నది మనమే
నిర్ణయించుకోవచ్చుగా. అదేం అసాధ్యం కాదు. సాధనతో సమకూరుతుంది. ప్రాణాయామంలో,
ధ్యానంలో జరిగేది అదే.

నోబెల్‌ సాధించాలి, శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకోవాలి, ...ఇలా ఓ పట్టాన
నిద్రపోనివ్వని పాజిటివ్‌ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే, అదే లక్ష్యం. ఈ
దశలోనే 'ఎలా' అన్న ప్రశ్న తలెత్తేది. ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు.
సాధించాలనుకుంటాం. ఎలా సాధించాలో తేల్చుకోలేం. ఈ సమయంలో ఎటెళ్ళాలో తెలిపే
దిక్సూచి కావాలి. ఏ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్‌మ్యాప్‌
కావాలి. ఎంత సమయంలో ఎంతదూరం వెళ్ళలగలవో లెక్కగట్టడానికి కత్తిలాంటి
కాలిక్యులేటర్‌ కావాలి. ప్రతినిమిషం, ప్రతిగంటా గంటకొట్టి వెన్నుతట్టడానికి
గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి మరీ గుర్తుచేయడానికి
క్యాలెండరు కావాలి. పరిపూర్ణమైన ప్రణాళికలో ఈ సాధన సంపత్తి అంతా ఉంటుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment