Saturday, June 5, 2021

మంచి మాటలు.....

అబద్దం అప్పు వంటిది,

అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే

ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరీ కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు.......


నిజం నిప్పు వంటిది,

అది చెప్పే వాడి నాలుకకు చేదుగా,

వినేవాడి చెవులకు మంటగా ఉన్న కూడా మంచే చేస్తుంది......


తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు......

తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి వుండడు....


తప్పు చెయ్యడానికి ఎవ్వరు భయ పడడం లేదు.....

చేసిన తప్పు బయట పడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు.......


గెలవటం గొప్ప కాదు..

ఓడిపోవడం తప్పు కాదు..

మళ్లీ ప్రయత్నించకపోవడం అతి పెద్ద తప్పు....


గెలిచి చూపించు నీ కోసం కాదు...

నిన్ను అవమాన పరిచిన వారి కోసము కాదు....

నిన్ను నమ్ముకున్న వారి కోసం....

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది......

అలాగే

మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి...


" పుట్టడం, పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్ని బాధలే......

ఇవి లేకుంటే జీవితం లేదు.. "

" మనకి సహాయం చేసినవాడిని,

అవమానించిన వాడిని ఎప్పుడు మరవకూడదు

ఎందుకంటే వారిద్దరూ మన అభివృద్ధికి సోపానాలే...... "


జీవితంలో విలువలు ముఖ్యం

ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, అహింస ముఖ్యమైన విలువలు

ఒకరు గొప్పవారు అవ్వచ్చు. కాలేక పోవచ్చు.

అనుకున్నంతగా పేరు ప్రఖ్యాతులు, అధికారం, ధనం పొందవచ్చు.

పొందలేకపోవచ్చు.

కానీ,

మంచివారు అవ్వటానికి మాత్రం తప్పకుండా కృషి చేయాలి..

నిజాయితీతో, నిబద్ధతతో ప్రయత్నించాలి.

పది మందికి ఉపయోగపడే పనులు, పరమాత్మ మెచ్చే పనులని గమనించాలి.

హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి.

ఆలోచనల్లో స్పష్టత కలిగి ఉండాలి.

మాటల్లో ఆత్మీయత, సూటి దనం, పొందికను సాధించాలి..

మన చేతలు ఇతరులపైనే కాకుండా మన ఆలోచనలపై కూడా ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

విలువల గురించిన ధ్యాస మన శ్వాస కావాలి.

జీవితం ఆనందమయం కావాలి.

అందరి ఆనందానికి, అందరూ కృషి చేసి

చక్కని వాతావరణాన్ని సృష్టించటంలో మన పాత్ర మనం మనస్ఫూర్తిగాపోషించాలి.


పానకంలో మునిగినా గరిటకు తీపి తెలియనట్లే

జ్ఞానుల మధ్య ఉన్నా మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు.

శుభోదయం

Source - Whatsapp Message

No comments:

Post a Comment