Saturday, October 2, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అందరు(అందరం )బాగుండాలి అని కోరుకుందాం..
గురువారం --: 30-09-2021 :--
ఈ రోజు "AVB"మంచి మాట.. లు


మనల్ని పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది తలచే మనస్సు మనకు ఎంత దూరంలో ఉన్న మనల్ని నిరంతరం అభిమానిస్తూనే ఉంటుంది .

ప్రశ్నించే వ్యక్తిని చంపగలరు ప్రశ్నను మాత్రం చంపలేరు . నువ్వు ఎక్కడ చనిపోతావో ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు కానీ ! నువ్వు ఎలా బతకాలని నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది .

ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్ట0బాధ లను అర్దం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్బుతంగా ఉంటుంది .

అభిప్రాయం దేముంది రోజుకో రకంగా మారుతుంది మొన్న మంచివారు అని అభిప్రొయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారోచ్చు నిన్న చెడ్డవారు అని అభిప్రాయం ఉంటే ఈ రోజు మంచివారు కావచ్చు,కానీ ఆభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ ఉంటుంది .👍

సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు 🌷🤝🌹

సేకరణ

No comments:

Post a Comment