నేటి జీవిత సత్యం.
మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో మనకే తెలియని ఒక చిత్రమైన విషయం. అయితే మనం తెలుసుకో వలసిన అంశం ఏమిటంటే దీని వెనుక ఉండి మనల్ని నడిపించేవాడు ఆ నటన సూత్రధారి అయిన పరమ శివుడు అనేది చాలామందికి తెలియని విషయం..
నా చిన్నతనంలో నేను సైకిల్ నేర్చుకుంటూ కిందపడి మోకాలికి దెబ్బతగిలి నొప్పితో బాధపడుతుంటే మా నాన్నమ్మ ‘ఒరే మనవడా! బాధపడకురా ఇది నీ కర్మఫలం బాధపడకు!’ అన్నది.
అవును ఆమాట నిజమే కదా ఎందుకంటే మనం మన కళ్ళముందే జరుగుతున్న ఎన్నో సంఘటనలను చూస్తున్నాం.. ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తులను మన జీవితంలో బంధం, సంబంధం, స్నేహం, ప్రేమ వంటి పేర్లతో మన కర్మఫలం ద్వారా ఆ భగవంతుడు ఇంకో మనిషిని మనతో కలుపుతూ ఉంటాడు.
మన జీవితంలో ఒక వస్తువు కాని, ఒక మనిషి కాని, ఒక జంతువు కాని వాటితో మనకు పూర్వ జన్మ ఋణబంధము వుంటేనే తప్ప ఏవీ కూడా మనదరికి చేరవు. పూర్వ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, ఋణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కాని, భర్త కాని వివాహ బంధంతో ఏకం అవుతారు.
అలాగే బంధు బంధంతో బంధుత్వాలు, మిత్రబంధంతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా పూర్వ జన్మలోని ఋణాను బంధాలే అని తెలుసుకోవాలి.
అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గతజన్మలో వారి ఋణము మనకు వుండాలి. ఇక మన ఇంట తిరిగే పశుపక్ష్యాదులు వేరే ఏ ఇతరాలైనా కూడా మనకు ఋణము వుంటేనే తప్ప మనదరికి చేరవు. ఆ బుణం తీర్చుకోవడానికే వారు మనకు చేరువవుతారు. అలాగే ఋణము వుంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహాలు, బంధువులనే బాంధవ్యాలు కలుస్తాయి. అలాగే మనకు ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, పరిచయం ఏర్పడినా, లేక మాట కలిపినా కూడా ఇవన్నీ కూడా గతజన్మ ఋణాను బంధాలే సుమా!
అలాగే గతజన్మ ఋణానుబంధం అనేది లేకుంటే ఎవరినీ మన కలలో కూడా మనం వారిని చూడలేము. అయితే ఇక ఈ ఋణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో నిలవదు. స్నేహితులే కాదు బంధువులు కూడా ఏదో ఒక కారణంతో మనతో శాశ్వతంగా విడిపోతూ ఉంటారు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఋణాను బంధం విలువ తెలుసుకుని మసులు కోవాలి. ఈ ఋణబంధం అనేది కేవలం ధన ఋణం వరకు మాత్రమే కాదు, బాంధవ్యబంధం కూడా ఉంటుంది. అందుకే ధన బంధం కంటే ఈ ఋణ బంధానికి మనం ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాలి. 'మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి '.
కాబట్టి మిత్రులారా ! 'ఋణం లేనిదే త్రుణం కూడా మనకు ముట్టదు ' అని మన పెద్దలు చెప్పారు కదా ! అది నిజం. ఎందుకంటే ఆ ఋణం లేనిదే మనం ఎంత యత్నించినా కూడా ఏది కూడా మనతో కలిసిరాదు. అలాగే మీ జీవితంలో ఏ బంధం కూడా నిలువదు. కాబట్టి మీ నుండి ఏ బంధమైనా తెగిపోయినా, లేదా ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ విరహ భావన వల్ల మీకు బాధ కలుగవచ్చు. ఒకవేళ మీకు అలా బాధా కలిగినా మీరు బాధపడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యం బోధపడిందికదా..
అంతే కాదు అలా జరిగినందుకు ఎదుటి వారిని నిందించకండి. మన జీవితంలో ఆ బంధం కొనసాగేది అంత వరకే అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఎవ్వరిపైన ఎప్పటికీ ఎటువంటి కోపం రాదు. వాళ్ళు మీ నుండి విడిపోయి మీకు దూరమై దూరంగా ఉన్నా, ఒకప్పుడు వారు మన వాళ్లేగా, అది ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా అనుకుంటూ, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి. వాళ్ల సంతోషాన్ని కోరుకోండి. మీరూ సుఖంగా ఉండండి, ఎదుటి వారిని సుఖంగా జీవించ నివ్వండి..
బంధాలను కల్పించేదీ, కాలగర్భంలో కలిపేసేదీ మన కర్మ ఫలాలు అనేది మాత్రం గుర్తించుకొని జీవించండి.. అప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడే అవకాశమే రాదు.
ఈ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంతో, మోహ బంధంతో ఒక వ్యక్తి పైన గానీ, ఒక వస్తువు పైన గానీ, ఒక జంతువు పైన కానీ విపరీతమైన ప్రేమానురాగాలను పెంచుకొని విధి వశాత్తూ అవి మన నుండి దూరం అయితే ఆ వ్యక్తి ఆ బాధను భరించలేక మానసిక వేదనతో వత్తిడికి గురౌతున్నాడు. చివరికి ఆ మానసిక ఒత్తిడి అతడిని శారీరకంగా, మానసికంగా వేదనకు గురిచేస్తుంది. చివరికి అతడిని దీర్ఘకాలిక రోగగ్రస్తున్ని చేస్తుంది. అది భార్యా భర్తల బంధం కావోచ్చు, ప్రేమగా పెంచుకున్న కొడుకు బంధం కావోచ్చు, మంచి స్నేహితుడితో స్నేహబంధం కావచ్చు. ఇలా ఈ బంధాలన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మన నుండి దూరమైనప్పుడు ఇదంతా మన మంచికే జరిగింది అనుకొని అంతటితో వాటిని వదిలి వేయాలి. బంధాలను పట్టుకుంటే రోగం వదిలేస్తే యోగం. ఇదే అందరూ తెలుసుకో వలసిన సత్యం.
మన జీవితంలో ఏది జరిగినా 'అంతా నా మంచికే జరిగింది' అనే భావనతో జీవించాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అంటారు. అలాంటి పాజిటీవ్ థింకింగ్ తో జీవించే వారికి ఎలాంటి శారీరక మానసిక జబ్బులు రానే రావు. కానీ కొంతమంది అయిన దానికి, కాని దానికి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఎందుకు ఇలా జరిగిందే, ఇలా కాకుండా మరోలా జరిగింటే బావుండేదేమో అనుకుంటూ నెగిటివ్ గా ఆలోచిస్తూ అనునిత్యం దాన్నే తలుచుకుంటూ కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తనే మనిషిని రోగిగా తయారు చేస్తాయి. చివరికి బిపి, షుగర్, హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులకు గురిచేస్తాయి. కాబట్టి మిత్రులారా! థింక్ పాజిటివ్, డూ పాజిటివ్, లివ్ పాజిటివ్ అనే సూత్రాన్ని పాటించండి. అలా పాటిస్తూ మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్ళు జీవించాలని మనసా వాచా కర్మణా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.*✍️
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment