Saturday, February 5, 2022

వెంట రాని ఆస్తులు చూసి-* *విర్రవీగకోయి.!!*

🌻 వెంట రాని ఆస్తులు చూసి-
విర్రవీగకోయి.!!

🌻 కృశించుకు పోయే శరీరాన్ని చూసి-
మురిసిపోకోయి.!!

🌻 కడవరకు కలిసినడవని బంధాలకు-
బానిసవ్వకోయి.!!

🌻 పదవీ, హోదా ఉన్నాయని-
ఎగిరెగిరి పడకోయి.!!

🌻 తరిగి పోయే అందాన్ని చూసుకొని-
పొంగిపోకోయి.!!

🌻 మంచి తనమే శాశ్వతమనే సత్యాన్ని-
మరచిపోకోయి.!!

🌻 కదిలిపోయే కాలంలో ఏది శాశ్వతం కాదని-
తెలుసుకోవోయి.!!

🌻 మరణం అనివార్యమనే నిజాన్ని గ్రహించి-
మసలుకోవోయి.!!
🌻 డబ్బులు ఉన్నాయని విర్రవీగి-
గబ్బు పనులు చేయకోయి-!!
🌻 విలువైన జీవితం గడపాలని విలువలు దిగజారి-
బతకకోయి..!!!
🙏🙏🌹❤‍🔥🌻❤‍🔥🌹🙏🙏

సేకరణ

No comments:

Post a Comment