Monday, March 14, 2022

మంచి మాట...లు

శివ స్తోత్రం
త్ర్యం॑బకం యజామహే సుగ॒ంధిం పు॑ష్టి॒వర్ధ॑నం ।
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్-మృత్యో॑ర్-ముక్షీయ॒ మాఽమృతా᳚త్

ఆత్మీయ బంధు మిత్రులకు సోమవారపు శుభోదయం శుభాకాంక్షలు ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
14-03-2022:- సోమవారం

ఈరోజు AVB మంచి మాట...లు

మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకూ ఎదుటి వారు ఎంత పెద్ద మనిషి అయినా మనం భయపడవల్సిన అవసరం లేదు , బాధ ఎంత గొప్పది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది .

లోపాలున్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోరాదు
ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది ఏ మనిషి సంపూర్ణంగా ఉండరు.. ఉండలేరు ఎంతో అందంగా ఉన్నాడు అనుకునే చంద్రుడిలో కూడా మచ్చ అనే లోపం ఉంటుంది .

ప్రతి బాధకి సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధనం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు,అలవాట్లే మనిషిని దేవునిగానైనా దుర్మార్గుడుగానైనా మారుస్తాయి మన అలవాట్లే మన జీవన విధాతలు.

సేకరణ ✒️మీ ..ఆత్మీయ బంధువు.. AVB* సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment