Friday, July 8, 2022

మంచి మాటలు(01-07-2022)

ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥
[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥]

ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥

సరస్వతీ శ్లోకః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।


లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥

దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం ॥

దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి, సరస్వతి, దుర్గ, గాయత్రి అమ్మవర్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని అమ్మవార్లను ప్రాదిస్తూ 🙏

01-07-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాటలు

వంద బిందెలు నీళ్లు పోయగానే చెట్టు అమాంతం ఒక్కసారే పెరగదు..నీరు ఎక్కువైతే మొక్క పాడవుతుంది..అలానే మనం కూడా చిన్నగా ఎదగాలి కానీ అమాంతం ఒక్కసారి గా ఎదగటానికి చూడకూడదు

చెడిపోయిన పండ్ల మధ్య మంచి పండ్లు ఉంచింతే అవి కూడా చెడిపోతాయి.. అలానే చెడ్డ వ్యక్తుల మధ్య మంచి వారు ఉంటెకూడా అలానే తయారుకావటానికి అవకాశం ఎక్కువ

అవకాశాలు,అదృష్టం
సూర్యోదయం లాంటివి.. సమయానికి మేలుకోకపోతే ఎప్పటికి అందకుండా పోతాయి

మనం
ఓడిపోయినా మరలా గెలవచ్చు... కానీ ఓటమికి సాకులు ఏతుకుతూ కూర్చుంటే జీవితంలో మరెప్పుడు గెలవలేవు

జీవితంలో
ఎవరు లేకపోయినా అమ్మ ఉంటే బతకవచ్చు.. కానీ ఎంతమంది ఉన్నా అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు.. ఆ లోటు ఎప్పటికి తీరదు.. అందుకే తల్లితండ్రులను* జాగర్తగా చూసుకోండి

సేకరణ ✍️AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment