Saturday, July 30, 2022

నిరంతర దైవ చింతన - సత్కర్మ ఆచరణ - వల్ల లాభమేమిటి?

 *నిరంతర దైవ చింతన - సత్కర్మ ఆచరణ - వల్ల లాభమేమిటి?*

ఈరోజు ఈ ప్రశ్న అందరికీ, అర్థం కానిదనే చెప్పాలి, కొంతమంది, ఇలాంటివి, ఇప్పుడెందుకు అని, మరి కొంతమంది, రిటైర్డ్ అయ్యాక చేయొచ్చు కదా అని, వాదిస్తుంటారు...

     పవిత్ర సంస్కారములవైపే మానవుని మనస్సులో సంచలనము తీవ్ర ముగా కలుగు చుండవలెను...

ఎలా...!!!

రాతిపైన 20 సుత్తి దెబ్బలు కొట్టి నను, అది పగులక ఉండును...

21 వ దెబ్బకు అది పగిలి పోవును, మరి ముందు కొట్టిన 20 దెబ్బలు వ్యర్ధమైనట్లా?...

కాదు, కాదు, చివరి దెబ్బ యొక్క సఫలతకు మిగిలిన దెబ్బలు తోడ్పడినవి, అని అర్థం...

నిరంతరమూ, లోపలా బైటా అనంతమైన సృష్టి వ్యాపించి యున్నది...

ఈ సృష్టి లో మనస్సు పోరాటము సాగిస్తూనే ఉన్నది, ఎప్పుడూ జయము  కలుగుతుందని చెప్పలేము,

కానీ నిరంతర సత్కర్మలనాచరిస్తూ ఉన్నప్పుడు, సదా ఈశ్వర ప్రేమతో హృదయమునిండి, ఆ ప్రేమ జీవితమున అనుభవించి నపుడు నిత్యానందము పొందగలము...

సదా ఈశ్వర స్మరణ వలన సత్కర్మలు, అప్రయత్నంగా జరుగుచుండును...

ఆ నిరంతర ప్రయత్నములో ఏదో ఒక  సత్కర్మ అను దెబ్బ తోనే మనో నాశనమగును, అంతకు ముందు చేసిన సత్కర్మలేవియూ వృధాకావు, దీనికి పరమేశ్వరుడే మన రక్షకుడని విశ్వాసము ఉండవలెను...

బిడ్డలో ధైర్యమును పెంచుటకు, తల్లి బిడ్డను వదిలినా, పడనీయదు...

వెంటనే వచ్చి ఎత్తుకొనును, అలానే ఈశ్వరుడు కూడా నిరంతరము జీవునిపైనే దృష్టి ఉంచి, గాలి పఠం యొక్క దారము వలె తన చేతిలో ఉంచుకొనును...

నిరనిరంతర చింతన అనే ప్రేమ పాశము భగవంతుని, ఎడబాయక దైవమును జ్ఞప్తికి తెచ్చుచుండును...

*🍀🙏సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు🙏🍀*

No comments:

Post a Comment