🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"285"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"జ్ఞాపకాలతో పనిలేకుండా మనసు అన్ని పనులు చేయగలుగుతుందా ?"*
*************************
*"మనసుకు బాగా అలవాటైన పనికి జ్ఞాపకంతో పనిలేదు. మన ఆచార వ్యవహారాలన్నీ మనసుకు మంచి విషయాలను అలవాటుగా మార్చేందుకు ఏర్పడినవే. తెల్లవారుఝామున నిద్రలేవటం నేర్పితే మనసుకు అదే అలవాటుగా మారుతుంది. ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రమేల్కొంటే మనసుకు అదే అలవాటు అవుతుంది. విద్యార్థులు తెల్లవారుఝామున నిద్రలేస్తే మంచిదంటారు. అలా లేవాలని చెప్పే మన ఆచారాలను మాత్రం వద్దని విమర్శిస్తారు. దైవం అంటే భక్తి ఉందని చెపుతూనే పూజలు, భజనలు ఎందుకని ఆక్షేపించేవారు పని దొంగలతో సమానం. తన ముందుకు వచ్చిన పనిని శ్రద్ధగా చేయటంలో సంపూర్ణత ఉన్నదిగాని, తనకిష్టమైనవే చేస్తాననటంలో అసంపూర్ణతే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మన దైనందిన జీవితంలో చాలా విషయాలు జ్ఞాపకాలతో సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉🌼
No comments:
Post a Comment