Saturday, July 30, 2022

నిజమైన భక్తుని లక్షణం ఎలావుంటుంది

 నిజమైన భక్తుని లక్షణం ఎలావుంటుంది


నిజ భక్తులకు తన ఊహలు ఎప్పుడూ భగవంతుని పైనే ఉండును...

తన సౌఖ్యము, తన కష్టముల విషయమై తెలుసుకొనుటకు భక్తులకు సావకాశము ఉండదు...

వారికి భగవత్సాక్షాత్కారము తప్ప ఇంకొక విషయము స్ఫురించదు, అందుకు అవకాశము కూడా ఉండదు...


ఉదా:-

ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కనపడక " అమ్మా, అమ్మా", అని ఏడ్చుచు ఆమె కోసం వెతుకును...

ఆమె కనిపించి వానిని యెత్తు కొనును, అప్పుడు ఆ పిల్లవాడు ఏడ్పు మాని విచారము లేకుండా ఉండును,

కానీ పిల్లవాడు, పూర్వము ఉన్న స్థితిని, అమ్మ ఒడిలో ఉన్న స్థితిని, తేడా గమనించవలసిన అవసరమే లేదు... ఆ ఊహే తనకింక అవసరముండదు...


అట్లే భగవంతుని సేవ, భగవంతుని చింతన, అనే మహాద్భాగ్యం దొరికిన తరువాత, వేరు చింతలు కష్టములు తాను తలంచడు...


ఇవన్నియూ దొరకనంత వరకే! దొరికిన తరువాత, అనుభవించుటకు చూచునే కానీ, పూర్వపు ఊహలను యోచించడు...


వారు ఎప్పుడూ, ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏమి చేసినా భగవద్ విషయాలే వుంటాయి, భగవద్ కథలే మాట్లాడుతారు, చేసే పనులు భగవద్ సంభదితమై వుంటాయి..,అలాంటివారికి భగవంతుఁడు చిరస్థాయిగా నిలిచి వుండే వరాలను ఇస్తూ అద్భుతమైన మహిమలను  వారి జీవితంలో చూపిస్తూ ఉంటాడు అలాంటి వారిని నిందించడం కానీ, హేళన చేయడం కానీ మహా పాపం, దానికి ప్రక్షాళన అనేది కూడా లేదు... తన భక్తుల రక్షణ స్వయంగా ఆ దేవదేవుడే చూస్తాడు. 

No comments:

Post a Comment