Sunday, July 31, 2022

శరీరం, సంసారం అవసరాలు తీర్చాలని కోరుతోంది, మనసు ఆధ్యాత్మిక సాధనపై నిలువటంలేదు, శాంతి రావట్లేదు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*


                 💖💖💖

        💖💖 *"294"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

    

*"శరీరం, సంసారం అవసరాలు తీర్చాలని కోరుతోంది, మనసు ఆధ్యాత్మిక సాధనపై నిలువటంలేదు, శాంతి రావట్లేదు ?"*

******


*"ఆధ్యాత్మిక సాధన ఏదీ శాంతి, తృప్తిని ఇవ్వదు ! ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే. ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది. కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించటంలేదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక. ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరంచేసే విషయం. ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం. అశాంతి కారకాలైన కోరికల ఉద్ధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. సుఖ-సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోనిదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది. అలాగే పవిత్రమైన జీవనవిధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది. ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు" !*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼 

No comments:

Post a Comment