🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"291"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"భావన, ఆలోచన, స్పందలతో మనసు మనసు నిరంతరం ఏదోక దానితో మమేకమై పోతుంటే, దాన్ని అదే ఎలా అదుపులో పెట్టుకుంటుంది ?"*
**************************
*"మనసు శరీరభావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకా కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించటం, ఏసీ గదిలో ఉంటే హాయిగా ఉండటం వంటివి మనసు పొందే దేహానుభవాలు. మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తంలేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకు రావటంతోనే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మన అనుభవంలోనివే. మనసు శరీరభావం, ఆలోచనలతో కాకుండా తన సహజస్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది. అంటే ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. క్రియలో శరీరానికి కష్టసుఖాలు, భావనతో సంతోష దుఃఖాలు, కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళలో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు. మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మగుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవదర్శనం" !*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼
No comments:
Post a Comment