Wednesday, July 20, 2022

మంచి మాటలు(20-07-2022)

 20-07-2022:-బుధవారం

ఈ రోజు AVB మంచి మాటలు

మనం ఇవ్వటం నేర్చుకుంటే మన చెయ్యి మన ఆలోచనలు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటాయి..అదే తీసుకోవటం అలవాటైతే మన ఆలోచనలు ఎప్పుడు ఎవరో ఒకరి సహాయం కోసం ఎదురుచూస్తూ పోవటమే.. ఎదుగుదల అనే ఆలోచన మన దరికి కూడా చేరదు


మనం ఎక్కువగా నమ్మిన మనుషులే వారి అవసరం తిరేకొద్ది మనలోని తప్పులు వెదకడం మొదలు పెడతారు, ఒక్కటి గుర్తుంచుకో మళ్ళీ వారి అవసరానికి మనదగ్గరకు వస్తే సరిగా బుద్ధి చెప్పాలి,,


వరదల్లో కొట్టుకుపోయే ఆస్తులు కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది, సునామీ వచ్చినా తోడుండే మంచి స్నేహాన్ని సంపాదించుకో,


జీవితంలో ఆనందం ఉండాలంటే ఆస్తులు ఉండవలసిన అవసరం లేదు మనమే ఒక ఆస్తిగా భావించే ఓ తోడు ఉంటే చాలు,,


ఈ జీవితం అనే ప్రయాణంలో భయపడి ఆగిపోయిన వాడు కాదు, ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు గొప్పవాడు,,

సేకరణ ✍️AVB సుబ్బారావు 🤝


No comments:

Post a Comment