Wednesday, July 20, 2022

మంచి మాట...లు(17-07-2022)

 అదివారం --: 17-07-2022 :-- ఈరోజు మంచి మాట...లు


నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం..అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు .

మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి .

కష్టపడుతు పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది . ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది .

అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది
కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 💐🤝🕉️🙏

No comments:

Post a Comment