Sunday, July 24, 2022

భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను.... అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం.

 భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను.... అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం.
        🌼🌼🌼🌼🌼
ఎక్కడ భగవంతుని అన్వేషిస్తున్నావు ?,
బయట వున్నాడా భగవంతుడు ?
 లేక లోపల వున్నాడా భగవంతుడు .?
 ఎక్కడవున్నాడు అని వెతుకుతున్నావు ?
ఉన్నది అంతా ఒక శక్తిమాత్రమే .ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే.
 దానిని కను గొనడము ,
అన్వేషించడము ఎవ్వరితరము కాదు .
సాక్షాత్ ఆ పరమేశ్వరుని 
తరము కూడా కాదు .
ఎందుకంటే ....
ఆది ,
అంతమూ ,
చావు ,
పుట్టుక ,
అందము ,
వికారము ,
స్వార్ధము ,
నిస్వార్ధము ,
కోరిక ,
కోరిక లేకపోవడము ,
సుఖము ,
దుఃఖము ,
ఆనందం ,
విచారం - ....
ఇలా చెప్పుకుంటూ పోతే చాలావున్నాయి గుణాలు .
ఈ గుణాలులో ఎదో ఒక గుణము ఆ భగవంతునికి వున్నా ఆ భగవంతుని 
కోసం సాధకుడు అన్వేషించవచ్చును.
కాని ఏగుణాలు లేని ,ఏ ఆకారము లేని ఆ భగవంతుని కోసం ఎక్కడ ఉన్నాడని వెతుకుతావు ?
ఉన్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు .
ఆ శక్తి నీవు 
ఈ భౌతిక కనులతో చూడలేవు .
నీయొక్క దివ్య చక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు .
భగవంతుడు కాంతి స్వరూపుడూ ఆ కాంతి ఇలావుంటుంది అనిచెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి , ఆ భగవంతుని అనుభూతి పొందిన సాధకుడు చెప్పలేడు .
ఎందుకంటే చెపితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు .
ఎందుకంటే నీవు భగవంతుడిని 
నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో ,
లేక నీ ఇంటిలో ఉన్న దేవుని మందిరంలోనో ,
లేక బయట ఉన్న గుడిలోనో ,
లేక కొండల్లోనో ,
లేక కోనల్లోనో వున్నాడని వెతుకుతున్నవు ?
ఎక్కడ వున్నాడని వెతుకుతావు ?
ఎక్కడా నీకు కనబడడు నీ సమయం వృదా !
వెతక వలసినది నీలోపల ! 
 వేసుకోవాల్సినది ప్రశ్న నీలోపల .
నేనెవరు ?
 భగవంతుడెవరు ?
 ఎలా వుంటాడు ?
 ఎక్కడ వుంటాడు ?
అసలు ఉంటే ఎలావుంటాడు ?
 అసలు నేను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాను ?
 ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చెయ్యడానికి వచ్చానా ? 
ధనము సంపాదించడానికి ,
పేరుప్రతిష్టలు ,
ఆస్తి ,
అంతస్తులు ,
హోదా ,
సంపాదించడానికి వచ్చానా ? 
అసలు దేనికోసం వచ్చాను ?
ఇవేమి నిర్దారించు కోకుండా ,
నీకు నీవు ప్రశ్నించుకోకుండా ,
నీప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా ,
భగవంతుని 
కోసం అన్వేషణ చేస్తున్నాను......
అంటావేమిటి ?
అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నవా?  
నేను ఎవరు ?
నేను ఎక్కడనుండి వచ్చాను ?
ఏపని నిమిత్తమై వచ్చాను ?
అసలు నా నిజమయిన లక్ష్యం ఏమిటి ?
నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికీ గల సంబందం ఏమిటి ?
 ప్రశ్నించుకో ?
 సమాధానాలు పొందు .అప్పుడు అన్వేషించు భగవంతునికోసం....
నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికేంతవరకు భగవంతుని జోలికి వెళ్ళమాకు ,
 నీకు తెలియదు
భగవంతుని గురించి.
మరల ,నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం గురించి పురోహితుల వద్దకు ,
జోతిష్య సిద్ధాంతుల వద్దకు ,
గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహంవద్దకు వెళ్ళకు అక్కడ సమాధానం దొరకదు .
అక్కడ దొరికేది నీ యెక్క భౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారము ,లేక మనసు ప్రశాంతత దొరుకుతుంది .
అంతే కానీ నీ ప్రశ్నకు సమాధానము దొరికేది నీలోపలే ,
నీ అంతరంలోనే ,
అన్వేషించు,
శోధించు ,
ప్రశ్నించు ,
నిరంతరం కనుల మూసినా ,
తెరచిన ,
కూర్చున్న ,
నిలబడిన ,
పడుకున్నా ,
నడుస్తున్నా ,
ఏమిచేస్తున్న 
ఇదే ఆలోచన -
నేను ఎవరు ? 
అని ప్రశ్నించుకో 
అదే సాధన....
ముందు నీకోసం అన్వేషించు ,
తరువాత భగవంతునికోసం 
నీకే అర్థమవుతుంది .
సమయము వృధా పోని యకు,సమయము చాలా తక్కువ ఉంది .
సమయము మించి పోనియ్యకు... ప్రశ్నించు ,
శోధించు..... 
నేను ఎవరు ?????అని...

No comments:

Post a Comment