🙏🕉🙏 *"శ్రీ"*
💖💖 *"213"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మనలోనే తృప్తి, శాంతి సహజంగా ఉన్నప్పుడు మరి వెంపర్లాడటం ఏమిటి ?"*
*""జ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియటం. జీవితంలో మనం కోరుకునే తృప్తి, శాంతి మనలోనే సిద్ధంగా ఉన్నప్పటికీ అజ్ఞానం వలన వెంపర్లాడటం జరుగుతుంది. మెలకువలో నిజమనిపిస్తున్న వరకూ అనేక భావాలతో ఉండే మనసుకి సుషుప్తిలో ఉనికి ఉండటంలేదు. మనకు ఇప్పుడు అనుభవంలో లేని ఆత్మ గురించి విచారణ చేయలేము. కనుక మనకి అనుభవంలో ఉన్న దేహం గురించి, ఆ అనుభవాలను పొందే మనసును గురించి విచారించి సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. అజ్ఞానం వీడేవరకు వెంపర్లాట ఉంటుంది !*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment