Wednesday, July 20, 2022

పూజలతో దైవం అనుగ్రహిస్తుందా ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

        💖💖 *"284"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     🌼💖🌼💖🌼💖🌼

           🌼💖🕉💖🌼

                 🌼💖🌼

                       🌼


*"పూజలతో దైవం అనుగ్రహిస్తుందా ?"*

**************************


*"పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమేగానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నంకాదు. ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరు అంటుంటారు. అంటే ఇరవై ఏళ్ళ అశ్రద్ధ వారిలో ఉందని అర్థం. భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు. పిల్లవాడికి జబ్బుచేస్తే ఏడుకొండల వాడిని ఒకక్షణంపాటు మొక్కుకుంటాం. అక్కడ దేవుని రూపంతోగాని, స్మరించే కాలంతోగానీ పనిలేకుండానే కోరిక నెరవేరుతుంది. పిల్లవానికి జబ్బు తగ్గిన తర్వాత కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాం కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోరిక తీరుస్తానని దేవుడు చెప్పటంలేదు. క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటలకొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది ! ఒక రూపంపై మనసు నిలిపే శిక్షణకోసం విగ్రహం ఎలా అవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ కూడా అంత అవసరమైంది. అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణ, ఎక్కువసేపు నిలిపేందుకే పూజ అవసరం ! పూజ మనసు బాగుచేసుకొనే సాధన !!"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

          

No comments:

Post a Comment