*దైవ భక్తి!*
*అమ్మను అమ్మ అని పిలిచేందుకు అర్హత అవసరం లేదు.
అమ్మ వడిలో తలపెట్టుకుని పడుకోవడానికి యోగ్యతతో పనిలేదు.
*అలాగే భగవంతుని నామ మాధుర్యంలో అంతర్దానం చెందడానికి నియమనిష్టలు అవసరం లేదు, అర్హతయోగ్యతలతో పనిలేదు. కావలసిందల్లా ప్రేమతో, నిబద్దతతో భగవంతుని సాన్నిధ్యమును హృదయంతో ఆలింగనపరుచుకోవడమే.
*"భక్తి సంఘపరమైనది కాదు భక్తి హృదయపూర్వకమైనది".
*భక్తి విషయంలో స్వేచ్చలేకపోవడానికి, అసహనం కలగడానికి కారణం దైవంను అన్యంగా చూడటం. భగవంతునియందు పూర్ణప్రేమ లేకపోవడం.
*అయితే ప్రేమ అధ్యయనం వలన, ఆలోచనలన వలన, సాధనల వలన లభించేది కాదు.
*"భక్తి సాధారణ ఇష్టంతో చిగురించి,
అమీతమైనఆరాధనతో ముగుస్తుంది.
తుదకు శుద్దసత్వమై, సత్యమై పూర్ణమౌతుంది".
*దైవమంటే హృదయమే.
హృదయపు ఆవరణను అంతరంగప్రేమతో తాదాత్మ్యత చెందిచడమనేది చాలా సున్నితమైన విషయం.
దీని విషయంలో స్వీయజ్ఞానమే తప్ప ఇతరం నుండి అందే సహకారం పూర్తి ఫలాన్ని ఇవ్వదు.
దైవంతో నేరుగా అనుసంధానమవ్వడం అత్యంత విలువైన సంపద.
*ఈవిషయంలో గురువు కూడా నీకు అవగాహన కలిగించడంలో తగు సహాయం చేయగలడు తప్ప మరి ఏఇతరమైన సహాయం పనిచేయదు.
*దైవంతో లేదా దైవనామంతో అనుసంధానమనేది మనందరి స్వేచ్చకు పరాకాష్టస్దితి.
ఎట్టి అభిప్రాయములకూ సంబంధం లేకుండా, స్వయం స్వేచ్చతో అంతరంగంలోనికి ఒదిగి ఉండటం, దేశకాలములను పరిగణలోనికి తీసుకురాకుండా నిరంతర తదేక దృష్టి కలిగి పారవస్యంతో అంతరంగ మమేకత్వలో వసమవ్వడమే నిజమైన స్వయం భక్తి.
అట్టి భక్తి శుద్దమైన ప్రేమను అమరమైన ఆనందమునూ ప్రసాదించగలదు.
*కనుక పరిధిలేని ప్రేమను స్వయంగా అధ్యయనం చేయండి. ఇతరం లేని పరస్పర్శతెలియని తనమును ఇతరంతో లేదా సలహా సూచనలతో పొందుదామని ఎన్నడూ ప్రయత్నించకు.
ఇప్పుడే ఇక్కడే అంతరంగ సౌందర్యంతో మమేకమవ్వు.
No comments:
Post a Comment