భక్తుడు :
స్వామి! లోకమంతా "ఈశ్వర లీల" అని, అంతా "బ్రహ్మమే" అని అంటారు కదా! అయితే ఈ చెడుగుణాలు, చెడుఅలవాట్లు కూడా పోగోట్టుకోవాలి అని అంటారు ఎందుకు ?
మహర్షి :
ఎందుకా! చెప్తాను విను. శరీరం ఉంది కదా! దానికి ఎక్కడో ఒక వ్రణం ( పుండు ) పుడుతుంది అని అనుకో! అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే, బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోలేదంటే వైద్యుడు వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడు రక్తం తీసివేసి మంచి రక్తం బయటకి పోకుండా రక్షణగా ఒక కట్టు కట్టడం లేదా?
అట్లాగే ఇది కూడా.
ఆ వ్రణం కోయకుండా వదిలితే, లోపలంతా కుళ్లుతుంది. కోసిన తరువాత కట్టు కట్టలేదంటే, చీము పడుతుంది. మానవుని విషయంలోనూ అంతే.
చెడుగుణాలు, చెడుఅలవాట్లు మానవుల విషయంలో పుండు లాంటివి. కోసి వేయకుంటే క్రిందకు దిగజారిపోతారు. ఎలాంటి వ్యాధో, అలాంటి చికిత్స చేయాలి.
No comments:
Post a Comment