గురువారం :-21.07.2022
ఈ రోజు AVB మంచి మాట.. లుఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు . దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది . !
అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు..అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి .
అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో . ! ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం .అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం
ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో పూలవనం కాదు.. అందరివీ పడిలేచే బతుకులే..మన ఒక్కరికే కాదు అసలు భూమిపైన సమస్యలు లేని మనిషే లేడు అందుకే రేపటి రోజు సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .
మన స్నేహం చివరిదాకా పయనం సాగిస్తుందో లేదో కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది..
ఎదుటివారు మనకు ఏమి చేసారూ,ఏమిచ్చారు అనే దాన్ని బట్టి కాదు,, మనం ఎదుటివారికి ఏమిచ్చాం ఏమి చేసాం అనే దాన్ని బట్టి మన విలువ మారుతుంది,, పెరుగుతుంది కదా !
ఎదుటి వాళ్ళు మనకు నచ్చిన పనులు చేస్తే..వారు మంచోళ్ళు అదే మనకు నచ్చని పనులు చేస్తూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే చెడ్డోళ్ళు,,మన ఇష్టాయిష్టాలే ఎదుటివారి వ్యక్తిత్వం..ఇదే నేటి మనిషి తత్వం .
ఒకరిని అపార్థం చేసుకోడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు కానీ అర్థం చేసుకోడానికి రోజులు పడుతుంది.. అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు సమయం అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి బంధాలు బలపడతాయి . కలకాలం నిలబడతాయి .
సేకరణ ✒️*మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
No comments:
Post a Comment