కాణిపాకం
ఒక గ్రామంలో అంగవైకల్యంతో ముగ్గురు సోదరులు ఉండేవారు. వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు.
ఒక బావిలో నీరు వ్యవసాయ పనులకు వాడుకునే వారు. బావి క్రమంగా ఎండిపోవడంతో దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్ల నిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది.
ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలిచేవారు.
ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు.
సేకరణ.
No comments:
Post a Comment