Monday, July 18, 2022

అంగవైకల్యానికి కారణం,రోగం కర్మ ఫలం ,కర్మని బట్టి రోగం

 🪷🪷  "42"  🪷🪷

🪷🪷  "కర్మ - జన్మ"  🪷🪷🪷    

  అంగవైకల్యానికి కారణం  

-------------------------------

  "ఇంద్రియాలు చేసే మంచి కర్మ గాని, చెడు కర్మ గాని వాటి యొక్క ఫలాలని ఆయా ఇంద్రియాలే అనుభవించాల్సి ఉంటుంది. కామంతో స్త్రీని చూస్తే గుడ్డివాడిగా పుట్టచ్చు." 


 "చెడు వినడంలో ఉత్సాహం ఉంటే, లేదా అధికారిగా ఉండి ప్రజల ఫిర్యాదులని విని కూడా పట్టించుకోకపోతే చెవిటివాడిగా పుట్టచ్చు." 


 "తిరుగుబోతు లేదా స్త్రీలని తార్చేవాడు నపుంసకుడి జన్మని పొందచ్చు. ఎదుటి వాడి ఓ అవయవానికి నష్టం కలిగిస్తే ఈ జన్మలో ఆ అవయవ నష్టంతో పుట్టచ్చు. ఇవి అవకరానికి కొన్ని కారణాలు మాత్రమే. ఇంకా అనేక ఇతర కారణాల వల్ల కూడా అవకరం రావచ్చు." 


  రోగం కర్మ ఫలం  

  --------------------                

  "మనం చేసే దుష్కృతాల ఫలాలని శారీరకంగా కాని, మానసికంగా కాని అనుభవిస్తాం అని చెప్పుకున్నాం. ఈ జన్మలో మనకి వచ్చే రోగాలన్నీ పూర్వ జన్మార్జిత కర్మ ఫలాలే. అనేక రోగాల నివారణకి, రుగ్మతలు తగ్గడానికి రోగులు వైద్యశాలలకి వెళ్తున్నారు. వేలకి వేలు ఖర్చుచేస్తున్నారు." 


 "అసలు నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది?” అని వాపోతున్నారు. 'ఇంత దరిద్రమైన రోగం ఇంకోటి ఉండదు' అనుకుంటున్నారు. రోగం ఎందుకు వస్తుందో, ఎలా పోతాయో ఆయుర్వేద శాస్త్రంలో ఇలా చెప్పారు." 


 "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే  

 తచ్చాంతి రౌషధై ర్ధానై ర్జవ హోమ సురార్చనైః"  


 భావం:-  

        

  "పూర్వ జన్మల్లో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలుగా పట్టి పీడిస్తాయి. ఔషధులు, దానాలు, నవగ్రహ జపాలు, హోమాలు, దేవతా పూజ వాటిని ఉపశమింపచేస్తాయి." 


  "పూర్వ జన్మ కర్మ ఫలితాలని రోగాల రూపంలో అనుభవించడం మీద మహాత్ములు చెప్పిన అనేక విషయాలు వారి జీవిత చరిత్రల్లో వస్తాయి." 


  "గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరకి వచ్చిన ఓ సన్న్యాసి పక్షిలా గిరగిరా తిరుగుతూ పడిపోయేవాడు. మళ్ళీ కొద్దిసేపటికి లేచి తిరిగి అలా పడిపోయేవాడు. అతని  గురించి చెప్తూ స్వామి ఇలా అన్నారు." 


  “పూర్వం ఇతను పక్షులని వేటాడుతూండేవాడు. ఆ పాపం ఊరికే పోతుందా? అనుభవించవద్దా?” 


  "మరో సందర్భంలో ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని స్వామి దగ్గరకి తీసుకువచ్చాడు. ఆ అబ్బాయికి కాళ్ళు, చేతులు పటుత్వం కోల్పోయి అతని స్వాధీనంలో లేవవి. అతన్ని చూసి స్వామి ఇలా అన్నారు." 


  “మనమేం చేయగలం? ఇతను పూర్వ జన్మలో గుర్రాలు తోలేవాడు. గుర్రాలని కొట్టిన పాపం ఇప్పుడు అనుభవించాలి కదా.” 


  "మరోసారి నాగులవెల్లటూరు అనే ఊరికి చెందిన ఓ అబ్బాయికి రెండు బొటన వేళ్ళ స్పర్శ తెలీకపోవడం గురించి స్వామి దగ్గరకి వచ్చాడతను. స్వామి ఇలా చెప్పారు." 


  "అయ్యా! ఇతను తమాషాకి క్రితం జన్మలో పిట్టలని కొడుతూండేవాడు. ఇది అనుభవించక తప్పదు." 


  కర్మని బట్టి రోగం  

  -------------------               

 దేవానా మసురాణాంచ అమరత్వా తపమోబలాత్!ఏకేనైవ శరీరేణ భుజ్యతే కర్మణాం ఫలమ్!"!  


 భావం:-   

          

  "మనం గతంలో చేసుకున్నది నేడు పొందుతున్నాం. నేడు చేస్తున్నది రేపు పొందుతాం." 


 "కర్మని బట్టి కొన్ని విచిత్రమైన రోగాలు కూడా వస్తుంటాయి. పుట్టిన ఏడాదికి మొదలై, పదేళ్ళకే బాలుడుకి ఎనభై ఏళ్ళ వాళ్ళకి వచ్చే శారీరక మార్పులు కలిగి, ముసలివాడై మరణించే కొందరు వింత రోగులని అమెరికన్ డాక్టర్లు కనుగొన్నారు." 


 "చిన్నతనంలోనే వచ్చే ఓ వ్యాధి వల్ల పిల్లల్లో ఎముకల దృఢత్వం తగ్గి, వాళ్ళని గట్టిగా ఎత్తుకుంటేనే ఎముకలు విరిగే ప్రమాదం గల వ్యాధిగ్రస్థులు కూడా అమెరికాలో ఉన్నారు. చిరునవ్వు నవ్వడానికి ఉపయోగించే కండరాలు పనిచేయక నవ్వని రోగం గలవారి గురించి అమెరికన్ పత్రికల్లో వచ్చింది." 


  "హైద్రాబాద్ సమీపంలో మెదక్ జిల్లా, తొగుట మండలంలోని రామాపురంలో గల గురు మదనానంద సరస్వతి ఆశ్రమానికి చెందిన శ్రీ కృష్ణానంద స్వామి అనే సన్న్యాసి మరణానికి కొద్ది రోజుల ముందు ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చాయి." 


 "గిడుతూరి సూర్యం అనే ఓ సినిమా దర్శకుడి సమీప బంధువుకి కనురెప్పలకి పక్షవాతం వచ్చి, అవి సదా తెరచుకునే ఉండటంతో ఆమె నిద్రకి మొహం వాచి బాధపడేది. పసితనం నించే జుట్టు మొలవక బట్ట తల వచ్చే మరో వింత జబ్బు కూడా అలోపేషియా అమెరికాలో విస్తారంగా ఉంది." 


  "(ఇలాంటి వారికి జుట్టుని దానం చేస్తే దాంతో విగ్స్ ని తయారు చేసి అందించే 'లాక్స్ ఆఫ్ లవ్' అనే ధార్మిక సంస్థ ఒకటి ఫ్లోరిడాలో పని చేస్తోంది) జీడిపప్పు, బాదం పప్పు, వేరుశెనగ పప్పులు తింటే ఎలర్జీతో బాధపడేవారు అమెరికాలో చాలా మంది ఉన్నారు. ఇంకా ఇలాంటి అనేక వింత రోగాలు ఆమెరికన్ మెడికల్ జర్నల్స్ లో చదవచ్చు. ఇవన్నీ దుష్కర్మలకి కాసిన ఫలాలే." 


 "ఏ దుష్కర్మకి ఏ రకం వ్యాధి వస్తుందో ఋషికేశ్ కి చెందిన శ్రీ శివానంద స్వామి తయారుచేసారు." 

           🌼🪷🌼🪷🌼

                 🌼🕉🌼

  

No comments:

Post a Comment