🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"431"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మనసులో వ్యక్తమయ్యే దుర్గుణాలను అధిగమించాలంటే ఏమి చెయ్యాలి ?"*
*"స్వామి వివేకానంద సూచన ప్రకారం మనసులో వ్యక్తమయ్యే దుర్గుణాలను అధిగమించాలంటే అందుకు వ్యతిరేక గుణాన్ని ఆశ్రయించాలి. అంటే పిల్లాడిపై కోపం వచ్చినప్పుడు అందుకు విరుద్ధంగా ముద్దుచేయాలని గుర్తు చేసుకుంటే కోపం ఉపశమిస్తుంది. అలా పదిసార్లు చేస్తే ఆ గుణమే పోతుంది. ఎవరిపై మనకు ద్వేషం ఉందో వారితో మాట్లాడనంత కాలం ఆ ద్వేషంపోదు. వారితో మాట్లాడితే అదీ పోతుంది. మనలోని గుణాలన్నీ అద్దంలోని ప్రతిబింబం లాంటిది. వాటిని మార్చాలంటే ఎదురుగా ఉన్న వాటిని మార్చ వలసి ఉంది. అనవసరమైన విషయాలు గుర్తుకు వస్తూ ఉండటం అనే గుణం మనని ఎక్కువగా బాధిస్తుంది. దీన్ని అధిగమించి గలిగితే అప్పటి పనికి అవసరమైన ఆలోచనలు మాత్రమే ఉండటం వలన సంతోషం, దుఃఖం అనేవి లేని ఆనందకర పరిస్థితి ఉంటుంది దీనినే రాజయోగం అంటారు !"*
చదువు లేదు,సంపదలు లేవు కాని సవాలక్ష సమస్యలతో సతమతం... అందరి లాగే పుట్టి అందరికీ ఉన్నట్లే ఒక ముక్కు, దాని ద్వారా శ్వాసను తీసుకోవడం ఉంది.... ఉన్న శ్వాస అనే గురువును పట్టుకొని గమనిస్తూ అంతరంగం లోకి ప్రవేశిస్తే అనంతమైన జ్ఞానం విజ్ఞానం ఆత్మ జ్ఞానంతో పాటు భౌతిక సంపదలు అనగా ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ఆనందాలు కీర్తి ప్రతిష్టలు ఆత్మజ్ఞానంతో చిరంజీవత్వం, ప్రేమ తత్వం కృతజ్ఞత భావం క్షమాగుణం సేవా భావాన్ని కలిగి యుండి దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు మనవంతు భాగస్వామ్యం కల్గి యుంటారు.
సేకరణ
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment