Tuesday, January 10, 2023

::::::: లోపలి జడ్జి ::::::

 *:::::::::::::: లోపలి జడ్జి ::::::::::::*
     మనందరికి తెలుసు కోర్టుల్లో జడ్జిలు వుంటారని ,వారు విచారించి, తప్పు ఎవరు చేసారో తేల్చి,తగిన శిక్ష విధిస్తారని, తెలుసు.
*లోపలి జడ్జి అంటే ఎవరు?*
        మన మనస్సు లోపల జడ్జి వుంటాడు. వీరు మనలను తప్పు చేయ నివ్వరు,
*సిగ్గు* మనలో సిగ్గు అనే జడ్జి వుంటాడు. మనం తప్పు చేయటాని కన్నా ముందే వుండి   తప్పు చేయ నివ్వడు. అశ్లీలం ఈ జడ్జి ప్రత్యేకత.
*భయం* దొంగతనం, దౌర్జన్యం లాంటి పనులు చేయడాన్ని నిరోధిస్తాడు.
   *విచక్షణ* మంచి చెడుల గురించి ఎల్ల వేళల మనకు మంచి సలహా ఇచ్చే జడ్జి.
*శీలం* మన ప్రవర్తనను ఎల్లవేళలా మంచిగా వుండేటట్లు చేసి మన వల్ల ఇతరులకు ఎలాంటి హాని , కష్టం ,  దుఃఖం జరగ నివ్వడు.
,*పాశ్చాత్తాపం* మనం తప్పు చేసినచో అంగీకరించే లాగా చేసి పరివర్తన కలిగిస్తుంది.
*జంకు* తప్పు చేయ నివ్వదు
 *ప్రాయశ్చిత్తం* తప్పు చేసినచో స్వీయ విచారణ చేసి స్వీయ శిక్ష కు గురిచేస్తుంది.
*ధ్యానం మనలోని పై జడ్జీలను బలోపేతం చేస్తుంది*
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment