*మంచివాడి అర్హత*
ఒక గ్రామంలో ఒక శ్రీమంతుడుండేవాడు. అతను ఆ గ్రామంలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. నిత్యపూజలు చేయడానికి ఒక పూజారిని కూడా నియమించాడు. అక్కడితో ఆగక మందిరంలో జరి గే పండుగలు, ఊరేగింపులు మొదలైన వాటిక య్యే ఖర్చు నిమిత్తం కొంత పొలాన్ని, ఒక మంచి పళ్ళ తోటను ఏర్పాటు చేశాడు. మందిరం పరిసరాలలో తిరిగే నిరుపేదలకు, ఆకలిగొన్నవారికి అన్నదానం ఏర్పాట్లు కూడా చేశాడు. సాధుసంతులు వస్తే వారు కొన్ని రోజులు ఉండేలా సౌకర్యాల్ని కూడా కల్గించాడు.
ఇన్ని చేసిన తర్వాత ఈ పనులన్నింటినీ పర్యవేక్షించే వ్యక్తి ఒకడు అవసరమయ్యాడు. మందిరానికి సమకూరిన సాధన సంపత్తి చూసి, తాము అక్కడ పర్యవేక్షకులుగా చేరడానికి అనేకమంది పోటీ పడే వారు. కాని శ్రీమంతుడు వారందరినీ ఏదో ఒక వంక బెట్టి తిప్పిపంపేవాడు. యోగ్యుడైన మంచి వ్యక్తిని తానే ఎంపిక చేసుకుంటానని చెప్పేవాడు. వచ్చిన వారంతా తిట్టుకునేవారు. మూర్ఖుడనే వారు. ప్రతి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక మంది మందిరానికి వచ్చి దైవదర్శనం చేసుకొని వె ళ్తుండేవారు.
ఆ శ్రీమంతుడు మందిరానికి ఎదురుగానున్న తన ఇంటి మేడపై కూర్చుని వచ్చిపోయే వారిని చూస్తుం డేవాడు. ఒక రోజున ఒక నిరుపేద యువకుడు దైవదర్శనం కోసం వచ్చాడు.. అతను తిరిగి వెళ్తుండగా శ్రీమంతుడు ఆ యువకుని దగ్గరకు రమ్మన్నా డు. అతని దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆ యువకుడు రాగానే 'ఈ మందిరానికి ఒక పర్యవేక్షణ అధికారి కావాలి. నీవు పనిచేస్తావా?' అని అడి గాడు.
యువకుడు ఎంతో ఆశ్చర్యంతో 'నాకా! అంత గొప్ప పనిని అప్పగిస్తారా? ' అని అడిగాడు.
అందుకా శ్రీ మంతుడు. 'ఆ... నిన్నే అడుగుతున్నాను. నీలాంటి ఉత్తములే ఆ పనిని నిజాయితీగా నిర్వహించగలరన్నాడు. అందర్నీ వదిలిపెట్టి నన్నే ఎందుకు ఆ పనికి ఎంపిక చేశారని ఆ యువకుడు మళ్ళీ ప్రశ్నించాడు. అందుకా శ్రీమంతుడు 'నేను ఎన్నో రోజుల బట్టి చూస్తున్నాను... గుడికెళ్ళే దారిలో ఒక ఇటుక బెడ్డ మొనదేలి ఉంది. అనేకమంది ఆ మొనకు కొట్టుకొని క్రింద పడుతున్నారు. కొందరికి గాయమైంది. అయినా అందరూ దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇందాకా నిన్ను చూశాను. నీకు అక్కడ దెబ్బతగలలేదు. అసలు తాకనే లేదు. అయినా ఆ ఇటుక మొనవల్ల అందరికీ ఇబ్బంది క ల్గుతుందని, దాన్ని సమూలంగా కొట్టి బయట పార వేశావు. తర్వాత అక్కడ ఏర్పడ్డ గొయ్యని పూడ్చే శావు. ఈ గుణమే నాకు కావాల్సింది' అని చెప్పా డు.
'నేను చేసిన పనిలో పెద్ద గొప్పేముంది. దానినే మంచితనమంటారా?' అని ఆ యువకుడు మళ్ళీ అడి గాడు.
"ఈ దేవాలయంతో నీకు సంబంధంలేకున్నా, పరిశీ లనగా చూశావు. ఆ ఇటుకమొన వల్ల అందరికీ ఇబ్బంది కల్గుతుందని గుర్తించి ఎవ్వరూ చెప్పకుండానే దాన్ని నీవు సరిచేశావు. పదిమందికి ఉపయోగపడే ఏ పనినైనా తనదిగా భావించి ఎవరు చేస్తారో వారే మంచివారు. అందుకే ఈ దేవాలయం నిర్వహణ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను' అన్నాడు.మిత్రులారా !మనం చేసే పనుల ద్వారానే మన మంచితనం నిర్ణయించబడుతుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment